English | Telugu
'ఆదిపురుష్'కి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్!
Updated : Jun 17, 2023
ఊహించినట్లుగానే 'ఆదిపురుష్' సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. దాదాపు రూ.135 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. ప్రభాస్ కెరీర్ లో 'బాహుబలి-2', 'సాహో' తర్వాత ఫస్ట్ డే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన మూడో సినిమా ఇది. ఇండియాలోనే ఈ అరుదైన ఘనత సాధించిన మొదటి హీరో ప్రభాస్ కావడం విశేషం.
అయితే తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు ఈ సినిమా రూ.60-70 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందనే అంచనాలు వ్యక్తమవ్వగా.. రూ.50 కోట్ల గ్రాస్ తోనే సరిపెట్టుకుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొదటి రోజు రూ.32.84 కోట్ల షేర్(49.90 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రూ.13.68 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.3.52 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.15.64 కోట్ల షేర్ రాబట్టింది.
ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా నైజాంలో రూ.23.35 కోట్ల షేర్ తో 'ఆర్ఆర్ఆర్' టాప్ లో ఉండగా.. 'ఆదిపురుష్' నాన్-ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ పరంగా చూస్తే మాత్రం ఆదిపురుష్ ఆరో స్థానానికి పరిమితమైంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.35-40 కోట్ల షేర్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా, రూ.32.84 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. ప్రభాస్ గత చిత్రాలు ఫస్ట్ డే తెలుగులో బాహుబలి-2 రూ.43 కోట్ల షేర్, సాహో రూ.36.52 కోట్ల షేర్, రాధేశ్యామ్ రూ.25.49 కోట్ల షేర్ రాబట్టాయి.