English | Telugu
'ఫ్యామిలీ స్టార్'గా విజయ్ దేవరకొండ!
Updated : Jun 16, 2023
'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ పెట్ల రెండోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ కెరీర్ లో 13వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి 'ఫ్యామిలీ స్టార్' అనే ఆసక్తికర టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
విజయ్-పరశురామ్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. వీరి కలయికలో వచ్చిన 'గీత గోవిందం' విజయ్ కెరీర్ లో మాత్రమే కాకుండా.. మీడియం రేంజ్ సినిమాల లిస్ట్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విజయ్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసిన చిత్రమిది. ఇక ఇప్పుడు రెండో సినిమాతో విజయ్ ని 'ఫ్యామిలీ స్టార్'గా మార్చబోతున్నారట పరశురామ్. అసలే 'గీత గోవిందం' కాంబోలో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి 'ఫ్యామిలీ స్టార్' అనే టైటిల్ ని ఎంపిక చేశారనే న్యూస్ మరింత ఆసక్తికరంగా మారింది. టైటిల్ ని బట్టి చూస్తుంటే 'గీత గోవిందం' తరహాలో మరో క్లీన్ ఎంటర్టైనర్ అందించబోతున్నారు అనిపిస్తోంది.
కాగా ప్రస్తుతం విజయ్ మరో రెండు సినిమాలు చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో సమంత హీరోయిన్. ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్నారు విజయ్. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. ఈరోజు నుంచి ఈ మూవీ షూటింగ్ జరగనుంది.