English | Telugu
సమంత కండిషన్ గురించి చెప్పిన రోహిత్!
Updated : Jul 15, 2023
సమంత రూత్ ప్రభు పేరు రీసెంట్ టైమ్స్‌లో సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అవుతోంది. సిటాడెల్ షూటింగ్ కూడా ఇటీవలే కంప్లీట్ చేశారు సమంత. ఇప్పుడు ఆమె చిన్న బ్రేక్ తీసుకుంటారనే వార్త కూడా వైరల్ అవుతోంది. ఆటో ఇమ్యూన్ కండిషన్ మయోసైటిస్‌కి సంబంధించి చికిత్స తీసుకోవడానికే ఈ బ్రేక్ తీసుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. సమంత హెయిర్ స్టైలిస్ట్, క్లోజ్ ఫ్రెండ్ రోహిత్ భట్కర్ ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేశారు.
``రెండేళ్లు, ఒక సెన్సేషనల్ మ్యూజిక్ వీడియో, 3 సినిమాలు, ఏడు బ్రాండ్ కాంపెయిన్స్, 2 ఎడిటోరియల్స్, లైఫ్ టైమ్ మెమరీస్, ఎండా కాలం నుంచి వర్షాకాలం వరకు అన్నీ చూశాం. నవ్వుల నుంచి బాధ వరకు అన్నీ పంచుకున్నాం. ఆత్మవిశ్వాసంతో, కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితుల్లో, గెలుపుల నుంచి ఓటముల వరకు చాలా విషయాల్లో కలిసి ప్రయాణం చేశాం. అద్భుతమైన ప్రయాణం అది. గుండెల్లో పదిలంగా దాచుకోవాల్సింది. మీరిప్పుడు హీలింగ్ జర్నీ వైపు అడుగులు వేస్తున్నారు. మీకు మరింత శక్తి సమకూరాలి. మీరింకా పవర్‌ఫుల్‌గా మారాలి. మీరింకా ఎన్నెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. ఆరని అగ్ని దహిస్తూనే ఉన్నా, చిరునవ్వుతో మళ్లీ విరబూసే పువ్వు మీరు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు మరింత శక్తిమంతులై తిరిగి వచ్చే సమయం కోసం మేమంతా ఎదురుచూస్తూ ఉంటాం`` అని రాశారు. తనతో పనిచేసేవారిని సమంత ఎంత బాగా ట్రీట్ చేస్తారో ఈ పోస్టులను చూస్తే అర్థమైపోతుందని అంటున్నారు సమంత ఫ్యాన్స్. గతేడాది సమంతకు మయోసైటిస్ ఉందన్న విషయం తెలిసింది. అయినా ఆమె అలాగే యశోద మూవీకి డబ్బింగ్ చెప్పారు. కాస్త కోలుకుని శాకుంతలం సినిమా పనులను పూర్తి చేసి, ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇటీవల సిటాడెల్ కూడా చేశారు. కానీ మయోసైటిస్ ఇబ్బంది పెడుతుండటంతో కొన్నాళ్ల పాటు షూటింగ్ కి పూర్తిగా విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు సమంత. ఫారిన్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటారనే విషయం అర్థమవుతోంది. ఈ కేరవ్యాన్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, జులై 13ని జీవితంలో మర్చిపోలేనని, సమంత తన యాక్టింగ్ కెరీర్ పట్ల ఎమోషన్ అయిన తీరు పలువురిని కలచివేస్తోంది. త్వరలోనే కోలుకుని తిరిగి రమ్మంటూ ఆమెకు మనోధైర్యం చెబుతున్నారు ఫ్యాన్స్.