English | Telugu

న్యూ లుక్ లో టోవినో... లూసిఫర్ కోసమేనా!

పాపులర్ మలయాళం యాక్టర్ టొవినో థామ‌స్‌ న్యూ లుక్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని షేక్ చేస్తోంది. ఆ లుక్ చూసిన వాళ్ళందరూ ఎల్‌2 ఎంపురాన్ సినిమా గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు టొవినో. ఆయన నటించిన సూపర్ హీరో ఫిలిం మిన్నల్ మురళి మాసివ్‌ సక్సెస్ అయింది. ప్యాన్ ఇండియా ఆడియన్స్ కు ఈ సినిమాతో కనెక్ట్ అయ్యారు టొవినో. ఆయన కేవలం హీరోగా మాత్రమే కాదు, కేర‌క్ట‌ర్స్, నెగటివ్ రోల్స్ కూడా చేస్తున్నారు. దాంతోపాటు లీడింగ్ రోల్స్ కూడా చేస్తున్నారు.

టొవినో ఏమి చేసినా ఆదరిస్తామ‌ని అంటున్నారు ఫ్యాన్స్. ఇటీవల ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లొచ్చిన‌ థామస్, వ‌చ్చీరాగానే నడిగర్ తిలకం సినిమా ఓపెనింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాకు లాల్ జూనియ‌ర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ థ్రిల్ల‌ర్ ఇది. ఇటీవల సోషల్ మీడియా హ్యాండిల్స్ లో టొవినో కొత్త లుక్ ని పోస్ట్ చేశారు. ఈ లుక్ లో ఆయన కొంత వెయిట్ తగ్గినట్టు కనిపిస్తున్నారు. ఈ లుక్‌ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అనిమల్ ప్రింటెడ్ క్యాజువల్ షర్ట్ లో, థిక్‌ ఫ్రేమ్ స్పెక్టికల్స్ లో ఆయన్ని చూసిన వాళ్ళందరూ ఎల్‌2 ఎంపురాన్ కోసమే రెడీ అవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2019లో విడుదలైన సినిమా లూసిఫర్.

ఈ సినిమాలో మోహ‌న్‌లాల్‌ కీలక పాత్రలో నటించారు. పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ ఈ సినిమాకు డైరెక్ట్ చేశారు. ఇందులో ఆయన కూడా ఓ చిన్న పాత్ర పోషించారు. ఇటీవల పృధ్విరాజ్ కి చిన్న యాక్సిడెంట్ అయింది. సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకుంటున్నారు. అందుకే ఎల్‌2 ఎంపురాన్ సినిమా ప్రారంభంలో కాస్త జాప్యం జరుగుతుందంటున్నారు. మలయాళం విమర్శకులు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.