English | Telugu
బాక్సాఫీస్ దగ్గర తొలిరోజు 'బేబీ' సంచలనం.. రికవరీ శాతం 47!
Updated : Jul 15, 2023
సాయి రాజేష్ దర్శకత్వంలో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కె ఎన్ నిర్మించిన 'బేబీ' మూవీ విడుదలైన మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధించి వార్తల్లో నిలిచింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా అంచనాలను మించి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా ఓవర్సీస్ లోనూ సత్తా చాటింది.
శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.6౦ కోట్ల షేర్ రాబట్టడం ఒక చిన్న సినిమాకు సంబంధించి సంచలనమే. తెలంగాణా రీజియన్ లో రూ. 1.20కోట్లు, ఆంధ్రా ఏరియాలో రూ. 1.09కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ రాయలసీమలో రూ. 31 లక్షల షేర్ వసూలు చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా రూ. 3. 48కోట్ల షేర్ సాధించింది 'బేబీ'.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ రూ. 7.40కోట్లని అంచనా. అంటే తొలిరోజే అందులో 47 శాతం రికవరీ అయ్యిందన్న మాట. ఏ రకంగా చూసిన ఇది గొప్ప విషయం. ఇంకో నాలుగున్నర కోట్ల షేర్ వస్తే చాలు ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెడినట్లే. ఆదివారం నాటికే సినిమాబ్రేకీవెన్ మార్కును అందుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిర్మాతకు, బయ్యర్లకు 'బేబీ' మూవీ లాభాల పంటను పండించడం ఖాయం.
బస్తీ నుంచి ఇంజనీరింగ్ చదవడానికి కాలేజీలో చేరిన వైష్ణవి అనే అమ్మాయి స్కూల్ రోజుల్లో ప్రేమించిన ఆనంద్ అనే అబ్బాయి ప్రేమకు, కాలేజీ లో విరాజ్ అనే తోటి స్టూడెంట్ కామానికీ మధ్య చిక్కుకొని, సహ విద్యార్థినుల ప్రలోభాలకు గురై ఎలా తన జీవితాన్ని కష్టాల్లోకి నెట్టుకుందనే కథ యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తోందని తెలుస్తోంది.