English | Telugu

'రజాకార్' ఫస్ట్ లుక్.. కళ్ళకు కట్టినట్లున్న దృశ్యం!

రజాకార్ల దురాగతాలు.. ఇప్పటివరకు సన్నివేశాలకో లేదంటే సంభాషణలకో పరిమితమై మాత్రమే కొన్ని తెలుగు చిత్రాలు వచ్చాయి. అయితే, ఈ అంశంపై తొలిసారిగా పూర్తి స్థాయిలో ఓ సినిమా రాబోతోంది. అదీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా. ఆ చిత్రమే.. 'రజాకార్'. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి "సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్" అనే ట్యాగ్ లైన్ జోడించడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. యాట సత్యనారాయణ తనే రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గూడురు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. 'ధమాకా'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన భీమ్స్ సెసిరోలియో ఈ సినిమాకి సంగీతమందించడం విశేషం.

కాగా తాజాగా 'రజాకార్' చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఎంతో ఇంటెన్సిటీతో ఉన్న ఈ పోస్టర్ లో.. రజాకార్ల దురాగతాలను కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కరించారు. "ఒక పెద్ద మర్రి చెట్టు.. అక్కడ తెలుగు పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్ధుల మృతదేహాలు.. మరీముఖ్యంగా ఓ బ్రాహ్మణ విద్యార్ధి తుపాకీ కత్తి పోటుకి క్రూరాతిక్రూరంగా బలైన విధానం.. ఓ తండ్రి ఆవేదన.. పుస్తకాలు.. ఆయుధాలు.. ఆ దృశ్యాన్ని తిలకిస్తున్న సైన్యం.. " ఇలా ప్రతీ అంశం ఆలోచింపజేసేలా ఉంది. మరి.. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న 'రజాకార్' బృందం, సినిమాతోనూ అలరిస్తుందేమో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.