English | Telugu

"పంజా"

కథ - పదిహేనేళ్ళ జై (పవన్ కళ్యాణ్) అతని తల్లి, చెల్లితో కలసి కలకత్తా నగరానికి వస్తే అక్కడి కామాంధులు అతని చెల్లినీ, తల్లినీ రేప్ చేసి చంపేస్తారు. శవాల దగ్గర ఏడుస్తున్న జై దగ్గరికి భగవాన్ (జాకీ ష్రాఫ్) వచ్చి రేప్ చేసినోళ్ళని జై చేత చంపిస్తాడు. అప్పటి నుండీ భగవాన్ కి తోడు నీడగా ఉంటాడు జై. జైని చూసి కులకర్ణి (అతుల్ కులకర్ణి) అనే మరో గ్యాంగ్ స్టర్ భగవాన్ కి భయపడుతూంటాడు. జై అంటే క్లబ్ డ్యాన్సర్ జాహ్నవి( అంజలీ లావానియా) కి ఇష్టం. కానీ సంధ్య (సారాజేన్ దియాస్) అనే అమ్మాయిని జై ఇష్టపడతాడు. అమెరికాలో ఉండే భగవాన్ కొడుకు మున్నా ( శేష్ అడవి) ఇండియాకి తిరిగొస్తాడు. మున్నా ఒక భయంకరమైన శాడిస్టు. క్లబ్ లో జాహ్నవి అందాన్ని మెచ్చుకున్నాడని ఒకతన్ని చంపినంతపనిచేస్తాడు మున్నా. అలాగే సభాపతి (పరుచూరి వెంకటేశ్వరరావు) భగవాన్ వ్యాపార వ్యవహారాలన్నీ చూస్తుంటాడు. అతని మీద యూరిన్ పోసి అతన్ని దారుణంగా అవమానిస్తాడు మున్నా. దాంతో సభాపతి మరో గ్యాంగ్ స్టర్ కులకర్ణి పంచన చేరతాడు. సభాపతిని చంపమని జైకి భగవాన్ చెపితే, "జరిగిందేంటో కనుక్కుందాం నేను సభాపతిని తీసుకొస్తా"నని కులకర్ణి దగ్గరికి వెళుతూ, కులకర్ణి దగ్గరుండే సంపత్ కొడుకుని క్లబ్ లో గురు (తనికెళ్ళ భరణి) ఆధీనంలో ఉంచి వెళతాడు జై.  ఆ కుర్రాణ్ణి చాలా సిల్లీ రీజన్ కే చంపుతాదు మున్నా. అక్కణ్ణించి జై ఫ్లాట్ లో ఉన్న జాహ్నవి దగ్గరికి మున్నా వెళతాడు...అక్కడ ఆమెను హింసించి చంపుతాడు..అక్కడికి వచ్చిన జైతో గొడవపడటంతో జై చేతిలో మున్నా చచ్చిపోతాడు. సంధ్య వాళ్ళ ఊరు పలాసకి వెళతాడు జై. భగవాన్ జై అసిస్టెంట్ ఛోటూ (ఆలీ)ని చంపి, అతని ఫోన్ లో ఉన్న సంధ్య ఫొటో ద్వారా సంధ్య అడ్రస్ కనుక్కుని ఆమెను కిడ్నాప్ చేయిస్తాడు భగవాన్. ఆ తర్వాత ఏమయిందనేది మిగిలిన కథ.