సైంటిస్ట్ అవ్వాలనుకున్నాడు.. డైరెక్టర్‌గా దుమ్ము రేపుతున్నాడు!
‘మనుషుల్లో మంచివాడు, చెడ్డవాడు అనే రెండు క్వాలిటీలు ఉండవు. అవసరం కోసం మంచి, అవకాశాన్ని బట్టి చెడు బయటికి వస్తుంటాయి. మనుషులకు మంచివాడు, చెడ్డవాడు అనే బోర్డులు తగిలించలేం. ఎందుకంటే ఏ మనిషీ పూర్తిగా మంచివాడు కాదు, పూర్తిగా చెడ్డవాడు కాదు. అందుకే సమాజంలో ఎన్నో ఇన్సిడెంట్స్ మనల్ని ఇన్స్పైర్ చేస్తుంటాయి. నేను వాటిని ప్రత్యేకంగా చూస్తాను కాబట్టి ఆ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని సినిమాలు తీస్తున్నాను’ అంటున్నారు డైరెక్టర్ సుకుమార్...