Read more!

English | Telugu

జనసేనాని కోసం రంగంలోకి దిగిన నాని!

పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి సినీ పరిశ్రమ నుంచి రోజురోజుకి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు వెండితెర, బుల్లితెరకు చెందిన ఎందరో ఆర్టిస్ట్ లు పవన్ కళ్యాణ్ కి తమ మద్దతు తెలుపగా.. తాజాగా న్యాచురల్ స్టార్ నాని (Nani) రంగంలోకి దిగాడు.

సోషల్ మీడియా వేదికగా జనసేనాని కి తన మద్దతు తెలిపాడు నాని. "పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారు. సినిమా కుటుంబ సభ్యుడిగా.. మీరు కోరుకున్నది సాధించి, మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్." అని ట్వీట్ చేశాడు.

పవన్ కళ్యాణ్, నాని మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలను బాగా తగ్గించిన జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా నాని అప్పట్లో తన స్వరం వినిపించాడు. రాజకీయాల్లో లేనప్పటికీ ధైర్యంగా టికెట్ ధరల అంశంపై స్పందించిన నానికి.. ఆ సమయంలో పవన్ అండగా నిలిచాడు. ఇప్పుడు ఎన్నికల వేళ జనసేనాని కి సపోర్ట్ గా నాని ట్వీట్ చేయడంతో.. పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.