Read more!

English | Telugu

సమంత కి ఉందా లేదా! సందీప్ కిషన్ మాత్రం చెప్పేసాడు 

సమంత రుతు ప్రభు.. షార్ట్ పీరియడ్ లోనే బడా స్టార్స్ తో జతకట్టి అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. పాత్ర ఏదైనా సరే అందులోకి పరకాయ ప్రవేశం చేయడం ఆమె నటనకి ఉన్న స్టైల్. రీసెంట్ గా ఆమె దూకుడు కొంచం తగ్గింది. ఈ క్రమంలో ఒక భారీ ప్రాజెక్ట్ లో ఆమె ఉంటుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది 

2019 లో వచ్చిన ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ సాధించిన ఘనవిజయం అందరకి తెలిసిందే.ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ మెన్ దగ్గర నుంచే ప్రేక్షకులకి వెబ్ సిరిస్ ల మీద మోజు పెరిగింది. ఇండియాలోనే అత్యంత  ఆదరణ పొందిన సిరీస్ గా కూడా  రికార్డు సృష్టించింది. దాంతో  2021 లో సీజన్ 2  వచ్చింది. సమంత ఒక  కీలక పాత్రని  పోషించింది .రాజి పాత్రలో డి గ్లామరైజ్డ్ గా నటించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. యాక్షన్ సీన్స్ లో కూడా సూపర్ గా నటించి తన యాక్టింగ్  లో దాగున్న ఒక  కొత్త కోణాన్ని ప్రేక్షకులకి పరిచయం చేసింది. దాంతో  సీజన్ 1 ని మించి సీజన్ 2  విజయాన్ని సాధించింది .  ఇక మేకర్స్ సీజన్ 3  షూటింగ్  స్టార్ట్ చేసారు. ఇప్పుడు ఇందులో సమంత చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే సీజన్ 2 లో సమంత చనిపోతుంది. మరి ఆమెని తిరిగి రప్పిస్తారో లేదో చూడాలి. ఇక  సోషల్ మీడియాలో ఈ న్యూస్ విన్న  ఫ్యాన్స్ అయితే  వేరే కొత్త క్యారక్టర్ ద్వారా సామ్ ని  చూపించవచ్చు అని అంటున్నారు

సమంత ప్రస్తుతం సిటాడెల్ హానీ బన్నీ అనే వెబ్ సిరీస్ ని కంప్లీట్ చేసింది. రాజ్ అండ్  డికె  ద్వయం  దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మెన్ సృష్టికర్తలు కూడా వీళ్ళే. అలాగే ప్రముఖ హీరో సందీప్ కిషన్ పెట్టిన ఇన్ స్టా స్టోరీ కూడా ఇప్పుడు  వైరల్ అవుతోంది. ఫ్యామిలీ మెన్ సీజన్ 3 షూటింగ్ లో పాల్గొనబోతున్నానని చెప్పాడు. సీజన్ 2 లో కూడా మెరిసిన సందీప్ త్రీ లో ఎలాంటి రోల్ చేస్తాడో చూడాలి. ఈ సారి చైనా వర్సెస్ భారత్ అనేలా కనిపిస్తోంది.