Read more!

English | Telugu

పుష్ప తో నాకు పేరు రాలేదు.. అబద్దం అంటున్న ఫ్యాన్స్  

అల్లు అర్జున్ అంటే పుష్ప..పుష్ప అంటే అల్లు అర్జున్..ఈ కనెక్షన్ ఇప్పట్లో తెగదు. బన్నీ అంతగా ప్రేక్షకులని తన వశం చేసుకున్నాడు. అదే టైం లో  పుష్ప లో ఎస్ పి భన్వర్ సింగ్ షెకావత్ క్యారక్టర్ లో అద్భుతంగా నటించి ఫాహద్ ఫాజిల్  తెలుగు నాట ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. కానీ అలాంటిదేమి లేదని ఫాహద్ అంటున్నాడు

ఫాహద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు . అందులో ఆయన  మాట్లాడుతు  పుష్ప మూవీ వల్ల నాకు ఏమి పెద్దగా ఒరిగింది లేదు. పైగా కేరళ చిత్ర సీమని  దాటి  ఎక్కువ క్రేజ్ వచ్చిందా అంటే లేదు. అలా అని నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు. ఈ విషయం నేను సుకుమార్ గారికి కూడా చెప్పాను. పుష్ప కేవలం సుకుమార్ గారి మీద ఉన్న ప్రేమ, గౌరవంతోనే చేసానని తెలిపాడు. అలాగే తన మొదటి ఇంపార్టెన్స్ ఎప్పటికీ మళయాళ సినిమానే అని కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి


 

ఇక వాస్తవం మాట్లాడుకోవాలంటే పుష్ప కి ముందు ఫాహద్ గురించి తెలుగు ప్రేక్షకులెవరకి  తెలియదు.ఈ బాష కి చెందిన నటుడిని అయినా ఆదరించే తెలుగు ప్రేక్షకులు పుష్ప లోనే ఫాహద్ నటనకి ఫిదా అయ్యారు.  దాంతో అందరు ఫాహద్ గురించి  గూగుల్ లో  సెర్చ్ చేసారు. మలయాళంలోని తన ఓల్డ్ మూవీస్ ని కూడా చూసారు. ఇదంతా కేవలం పుష్ప లో నటించబట్టే. ఇక ఫాహద్ ఇంటర్వ్యూ చూసిన బన్నీ ఫ్యాన్స్ అయితే ఫాహద్ చెప్పేది నూటికి నూరుపాళ్ళు అబద్దమని అంటున్నారు. ఏది ఏమైనా ఫాహద్  అనుకున్న ఇమేజ్ పుష్ప 2 తో వస్తుందేమో  చూడాలి. ప్రముఖ హీరోయిన్ నజ్రియా ఫాహద్ వైఫ్ నే