English | Telugu

విజనరీ మ్యాన్, తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

అత‌ని పేరులో సూర్యుడుంటాడు! అందుకే, ఆయ‌న కార‌ణంగా ఎంద‌రి జీవితాల్లోనో... చీక‌ట్లు తొలిగి వెలుగులు విర‌జిమ్మాయి! ఎంద‌రెంద‌రో చిన్నారుల గుండెలు నేటికీ ఆగ‌కుండా, అలిసిపోకుండా కొట్టుకుంటున్నాయి అంటే... ఆ సూరీడీ క‌రుణ కిర‌ణాలే కార‌ణం! అంతే కాదు, ఆయ‌న ర‌వియే కాక శంక‌రుడు కూడా! శంక‌ర అంటే... సంతోష‌మూ, ఆనంద‌మ‌ని అర్థం! అందుకేనేమో... ఆయ‌న‌తో అనుబంధం పొందిన ఎవ్వ‌రూ ఆనందం పొంద‌కుండా ఉండ‌లేరు! అందుకు సాక్ష్యం... ఎన్నెన్నో కుటుంబాల్లో నిత్యం త‌డుస్తోన్న గొంతుక‌లు! మ‌న ర‌విశంక‌ర్ స‌ర్ అందించిన త్రాగునీరే వాళ్ల క‌ళ్ల‌లోని ఆనంద‌పు క‌న్నీరు!

పవిత్ర పిలుస్తోంది... చంద్రకాంత్‌కి ఫోన్ చేసిన జిమ్ కోచ్!

నిన్నగాక మొన్న బుల్లితెర నటి పవిత్ర జయరామ్ రోడ్ ఆక్సిడెంట్ లో మరణించిన విషయం తెలిసిందే. పవిత్ర చనిపోయిన ఐదు రోజులకే తన ప్రియుడు, సీరియల్ నటుడు చంద్రకాంత్ అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.  పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రకాంత్ కి  భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ఆరేళ్లుగా త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్‌తో సహజీవనం చేస్తున్నాడు . ఆదివారం  తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో  పవిత్ర జయరామ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన కారులో చంద్రకాంత్  కూడా ఉన్నాడు. ఐతే అతను గాయాలతో బయటపడ్డాడు.