Read more!

English | Telugu

హీరో సుశాంత్ పై నెటిజన్ల ట్రోల్స్.. రాత్రి నుండి ఒక్కటే  మ్యూజిక్కు!




హీరో సుశాంత్.. కరెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. అందులో సుశాంత్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమాలోని పాటలు లవర్స్ బాగా ఇష్టపడతారు. ఎందుకంటే ఈ సినిమా కేవలం ప్రేమికులని ఉద్దేశ్శించే తీసాడు డైరెక్టర్.

ఆ తర్వాత ‌సుశాంత్ కొత్తగా ఎన్ని సినిమాలు తీసిన సరైన హిట్ లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సోలోగా హిట్టు కొట్టలేకపోతోన్నాడు. అల వైకుంఠపురములో సినిమాతో మళ్లీ కమ్ బ్యాక్ వచ్చింది. ఈ సినిమా ముందు..  "చిలసౌ" మూవీతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మధ్యలో తీసిన సినిమా బెడిసి కొట్టింది. ఇక ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు గ్యాప్ తీసుకుంటున్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుశాంత్‌కు కెరీర్ ప్రారంభంలో బాగానే అవకాశాలు వచ్చాయి. కాళిదాసు, కరెంట్ అంటూ కెరీర్ స్టార్టింగ్‌లో సందడి చేశాడు. అయితే చాలా ఏళ్ల వరకు సరైన హిట్ అంటూ లేకుండా కెరీర్‌ను ముందుకు సాగింది. మధ్యలో సుశాంత్ సినిమాలు వచ్చిన విషయాలు కూడా ఎవ్వరికీ తెలియకుండాపోయాయి. అయితే సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ తీసిన చిలసౌ సినిమాతో మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చాడు. అది అతగాడికి సెకండ్ ఇన్నింగ్స్‌లా మారింది. ఆ తరువాత అల వైకుంఠపురములో బన్నీ పక్కన అలా సైడ్ రోల్ చేశాడు. ఇక అల వైకుంఠపురము సినిమాతో సుశాంత్‌కు అంతో ఇంతో క్రేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన "ఇచ్చట వాహనములు నిలుపరాదు" భారీ డిజాస్టర్‌ గా నిలిచింది. ఖాతాలో వేసుకున్నాడు. అలా సుశాంత్ క్రేజ్, డిమాండ్ అన్నదే లేకుండా పోయింది. ఇప్పుడు సుశాంత్ నెట్టింట్లో మాత్రం బాగానే అల్లరి చేస్తున్నాడు. నెటిజన్లను, అభిమానుల్ని ఆకట్టుకుంటూ సందడి చేస్తున్నాడు.

అసలే సోషల్ మీడియాలో సెలెబ్రిటీల మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంటుంది. కొందరు ఆ నెగెటివ్ కామెంట్లను పట్టించుకోరు. ఇంకొంత మంది వాటిపై ఫన్నీగా స్పందిస్తుంటారు. ఇంకొందరు కాస్త సీరియస్ అవుతుంటారు. ఇక సుశాంత్ తాజాగా ఓ ఫోటోను షేర్ చేస్తూ.. క్యాప్షన్ లేదు పర్లేదుగా? అని ట్వీట్ వేశాడు. దానికి ఓ నెటిజన్.. ఫోటో పెట్టకపోయినా కూడా పర్లేదు అంటు కౌంటర్ వేశాడు. దీంతో సుశాంత్‌కు కాలిపోయినట్టుంది. వెంటనే అతడ్ని బ్లాక్‌లో పెట్టేశాడు సుశాంత్. మరికొందరు సజెన్స్ ఇస్తున్నారు. లవ్ టుడే మూవీ రిమేక్ చేసుకోమని  సజెస్ట్ చేస్తే బ్లాక్ చేశేశాడంటు మరో నెటిజన్ కామెంట్ చేశాడు.‌ ఇక రాత్రి నుండి‌ సుశాంత్ మీద ఒకటే ట్రోల్స్..‌ ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఎక్కడ చూసినా ఒక్కటే మ్యూజిక్.. పాపం‌ సుశాంత్ అటు సినిమాలు హిట్ కావట్లేదు..‌ఇటు నెటిజన్ల ట్రోల్స్ ఆగట్లేదు. ఈ సంవత్సరం అయిన సుశాంత్ తన ఖాతాలో‌ సరైన హిట్ ని వేసుకుంటాడో లేదో‌ చూడాలి మరి.