ఘనంగా రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' మూవీ టీజర్ లాంచ్
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం 'పురుషోత్తముడు'. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలతో ఆకట్టుకున్న రామ్ భీమన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు.