Read more!

English | Telugu

సైలెంట్ గా చెన్నైలో.. 'దేవర' గురించి దిమ్మతిరిగే న్యూస్!

'దేవర' సాంగ్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులతో పాటు, సంగీత ప్రియులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, మాస్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ కి.. మాస్ ని తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించే అనిరుధ్ తోడయ్యాడు. ఈ ఇద్దరూ కలిస్తే మాస్ జాతర ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందుకే 'దేవర' మొదటి సాంగ్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న 'దేవర' ఫస్ట్ సింగిల్ (Devara First Single) ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రస్తుతం చెన్నైలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పై ఓ స్పెషల్ మ్యూజిక్ వీడియోను షూట్ చేస్తున్నారట. ఎన్టీఆర్ గత చిత్రం 'ఆర్ఆర్ఆర్'లోని 'దోస్తీ' సాంగ్ కోసం కూడా ఇలాగే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్స్ పై మ్యూజిక్ వీడియోను షూట్ చేశారు. 'దేవర' కోసం కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నట్లు సమాచారం. పైగా తాను మ్యూజిక్ అందిస్తున్న సినిమాల కోసం ఇలా మ్యూజిక్ వీడియోలు చేయడం అనిరుధ్ కి కూడా అలవాటే.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.