Read more!

English | Telugu

'దేవర' టీమ్ పై ఊహించని దాడి.. 18 మందికి గాయాలు!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'దేవర' (Devara). బాలీవుడ్ ఫిల్మ్ 'వార్ 2' షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లగా.. ఆయన లేకుండానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 'దేవర' చిత్రీకరణ జరుగుతోంది. ప్రజెంట్ ఎన్టీఆర్ లేని సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో దేవర యూనిట్ కి ఊహించని షాక్ తగిలింది.

అల్లూరి జిల్లాలో మోదకొండమ్మ పాదాల వద్ద దేవర షూటింగ్ జరుగుతుండగా.. మూవీ టీమ్ పై తేనెటీగలు దాడి చేశాయి. ఫైట్ సీన్ చిత్రీకరణ కోసం డ్రోన్ ఎగరవేయగా.. ఆ సౌండ్ కి తేనెటీగలు ఒక్కసారిగా లేచాయని తెలుస్తోంది. ఈ దాడిలో ఏకంగా 18 మందికి గాయాలవ్వగా, వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. తేనెటీగల దాడిలో పలువురికి గాయాలవ్వడంతో.. దేవర షూటింగ్ కి చిన్న బ్రేక్ వచ్చిందట.