Read more!

English | Telugu

పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నాడు.. అల్లు అరవింద్ మాస్ స్పీచ్!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. మే 13న పోలింగ్ జరగనుంది. పోలింగ్ కి ఇంకా వారం కూడా సమయం లేదు. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. పిఠాపురం (Pithapuram) నుంచి ఎమ్మెల్యే బరిలో ఉన్న ఆయన.. భారీ మెజారిటీతో గెలుస్తారనే అంచనాలు ఉన్నాయి. పవన్ కి మద్దతుగా ఇప్పటికే పలువురు మెగా హీరోలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. తాజాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) సైతం పవన్ కి తన మద్దతుని తెలిపారు.

దర్శకరత్న దాసరి నారాయణరావు 77వ జయంతిని పురస్కరించుకుని శిల్పకళావేదికలో డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అరవింద్.. పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలకి చేశారు. దాసరి గారు లేకుండా తన కెరీర్ లేదని అరవింద్ తెలిపారు. అలాగే, "ఆయనకు అత్యంత ఆప్తుడైన పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నాడు. గురువు గారి దీవెనలు పవన్ కు తప్పకుండా లభిస్తాయని ఆశిస్తున్నాను" అన్నారు అరవింద్.