English | Telugu

త్రివిక్రమ్‌కి హీరో దొరికేశాడు.. కాంబినేషన్‌ అదిరిపోతుందట?

టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్లలో త్రివిక్రమ్‌కి ఉన్న ప్రత్యేక స్థానం గురించి అందరికీ తెలిసిందే. తన మాటల గారడీతో ప్రేక్షకుల్ని ఇట్టే మెప్పించగల త్రివిక్రమ్‌ అంటే హీరోలందరూ ఎంతో ఇష్టపడతారు. అతనితో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు. ‘నువ్వే నువ్వే’ నుంచి ‘గుంటూరు కారం’ వరకు కొందరు హీరోల కాంబినేషన్‌లో రకరకాల సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేసిన త్రివిక్రమ్‌ ఈమధ్యకాలంలో కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. తీసిన సినిమాలనే మళ్లీ మళ్ళీ తీస్తున్నాడనీ, అతని దగ్గర ఇంతకుముందున్న స్టఫ్‌ లేదని.. రకరకాలుగా సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఒకప్పుడు హీరోలందరూ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అనుకునేవారు. ‘గుంటూరు కారం’ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అర్థమవుతోంది. అల్లు అర్జున్‌తో మూడు సూపర్‌హిట్‌ సినిమాలు చేసిన త్రివిక్రమ్‌ తన నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ బన్నితోనే చెయ్యాలనుకున్నాడు. కానీ, అతను వేరే ప్రాజెక్ట్స్‌ మీద కాన్‌సన్‌ట్రేట్‌ చెయ్యడంతో.. ఎన్టీఆర్‌ని రంగంలోకి దించాలనుకున్నాడు. అదీ కుదరలేదు. ఆ తర్వాత వెంకటేష్‌, నానితో ఓ మల్టీస్టారర్‌ చెయ్యాలనుకున్నాడు. ప్రస్తుతం నాని ఫుల్‌ బిజీగా ఉన్నాడు. దీంతో ఆ ప్లాన్‌ని కూడా పక్కన పెట్టేశాడు. 

‘గుంటూరు కారం’ రిలీజ్‌ అయి నాలుగు నెలలు పూర్తి కావస్తోంది. అయినా ఇప్పటివరకు త్రివిక్రమ్‌ నుంచి కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు కోలీవుడ్‌ హీరో కార్తీతో ఓ సినిమా చేసేందుకు త్రివిక్రమ్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. 8 సంవత్సరాల క్రితం వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ‘ఊపిరి’ వంటి స్ట్రెయిట్‌ సినిమా చేశాడు కార్తీ. నాగార్జునతో కలిసి చేసిన ఈ మల్టీస్టారర్‌ అతనికి మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా తర్వాత కార్తీ సోలో హీరోగా చేయదగ్గ కథ ఎవరికీ దొరకలేదు. ఇప్పుడు త్రివిక్రమ్‌ ఆ ఛాన్స్‌ తీసుకుంటున్నాడని అర్థమవుతోంది. త్రివిక్రమ్‌ లాంటి డైరెక్టర్‌ అడిగితే కార్తీ కాదు అనే అవకాశం లేదు కాబట్టి తప్పకుండా ఈ సినిమా పట్టాలెక్కేలా ఉంది. కార్తీ తమిళ్‌ హీరో అయినప్పటికీ తెలుగులో అతనికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. త్రివిక్రమ్‌కి కూడా అతను సరైన ఆప్షన్‌ అవుతాడు. ఈ కాంబినేషన్‌ ఓకే అయితే ఇద్దరికీ అది మంచి ప్రాజెక్ట్‌ అవుతుందనడంలో సందేహం లేదు.