English | Telugu

ప్రముఖ హీరోయిన్ తో మెగా హీరో పెళ్ళి!

త్వరలో మెగా ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయా అంటే.. ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే మాటే వినిపిస్తోంది. మెగా మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఆయన ఓ ప్రముఖ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

హీరోయిన్ రెజీనా కసాండ్రా(Regina Cassandra)తో సాయి ధరమ్ తేజ్ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'నక్షత్రం' వంటి సినిమాల్లో కలిసి నటించారు. 'పిల్లా నువ్వు లేని జీవితం' షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించి, అది ప్రేమగా మారిందని ప్రచారం జరిగింది. అయితే కొంతకాలంగా సాయి తేజ్-రెజీనా ప్రేమకి సంబంధించి ఎటువంటి వార్తల్లేవు. ఇలాంటి సమయంలో సడెన్ గా వీరు పెళ్ళి చేసుకోబోతున్నారనే న్యూస్ రావడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని త్వరలోనే సాయి తేజ్-రెజీనా అధికారికంగా ప్రకటించనున్నారని టాక్.

కాగా, ఇటీవల మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి, పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వినిపించాయి. ఆ వార్తలపై పెద్దగా స్పందించని వరుణ్-లావణ్య.. సడెన్ గా పెళ్ళి చేసుకోబోతున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం.