English | Telugu

రాత్రి 12 నుంచి న్యూ జర్నీ.. రిషిని హగ్ చేసుకున్న వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -722 లో... రిషి, వసుధారలు కాలేజీలో తమ ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. "నాకు పాత రోజులు కావాలి.. నీలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ, దాపరికాలు లేని ప్రేమ కావాలి" అని వసుధారతో రిషి అంటాడు. "మనం పాత రిషి సర్, వసుధారలు అయిపోదామా.. మన ప్రేమ, మన పరిచయం మళ్ళీ మొదలుపెడదాం. అప్పుడైనా మనం సంతోషంగా ఉంటామేమో" అని వసు అంటుంది. "బాగానే ఉంది కాని మన చుట్టూ మనల్ని చూసేవాళ్ళు ఏమనుకుంటారు.. మనల్ని అంగీకరిస్తారా" అని రిషి అంటాడు. మనం మన జర్నీని మళ్ళీ మనకోసం మొదలు పెడదాం అనుకున్నాం.. వేరే వాళ్ళ కోసం కాదని వసుధార అంటుంది. మీరు నా పాత ఎండీలాగా మారాలి అని చెప్తుంది. మన జర్నీ ఈ రాత్రి 12 గంటల నుండి మొదలు పెట్టాలని రిషి, వసుధారలు ఒక ఒప్పందానికి వస్తారు.

అగ్రిమెంట్ మ్యారేజే అయినా మన మధ్యలో ఏ బంధం లేదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -115 లో.. కృష్ణ నువ్వు వెళ్ళొద్దని మురారి అంటాడు. ఈ ఇంట్లో నిబంధనలు అన్ని కూడా ఇంట్లో వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే ఎవరి వ్యక్తిత్వాన్ని తక్కువ చెయ్యడానికి కాదని మురారి అంటాడు. నేను ఇంట్లో వాళ్ళ గురించి అనట్లేదు.. నీ గురించి అంటున్నాను. నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడావ్ నువ్వు. నీది నాది ఒక అగ్రిమెంట్ మ్యారేజ్ మాత్రమే అని  కృష్ణ అంటుంది. అగ్రిమెంట్ మ్యారేజే కానీ నాకు బాధ కలిగితే నువ్వు బాధపడ్డావ్.. నీకు బాధ కలిగితే నేను బాధపడ్డాను. మన మధ్యలో ఏ బంధం లేదా కృష్ణ అని మురారి అంటాడు. అగ్రిమెంట్ పూర్తికాకుండానే వెళ్తున్నాను అని కృష్ణ కిందకి వస్తుంది.