Read more!

English | Telugu

Gangavva : గంగవ్వ చలివేంద్రం పెడితే.. వాళ్ళు అలా చేశారా!

 

బయట ఎండలు మాములుగా లేవు.. దాంతో ఊరి నుండి బయటకు వెళ్ళి వచ్చేవారు దప్పికతో కల్లు తిరిగి పడిపోతుంటారని, వారి దాహం తీర్చేందుకు గంగవ్వ వాళ్ళ ఊరిలో నాలుగైదు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసింది‌. అయితే ఆ చలివేంద్రాలలో నీరు లేకుండా కొందరు దుర్వినియోగం చేయడానికి చూశారు. అదంతా కలిపి.. " గంగవ్వ చలివేంద్రం పెడితే.. సమ్మర్ కష్టాలు" అంటూ ఓ వ్లాగ్ చేసింది.

తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో గంగవ్వ చేసిన వ్లాగ్స్ కనిపిస్తుంటాయి. ఆమెని ఇన్ స్పైర్ చేసుకొని కొన్ని గ్రామాలలోని వాళ్ళు కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తున్నారు. బయట వచ్చే సిచువేషన్ ని బట్టి సీన్లు చేయడం, మొబైల్ లోనే ఎడిట్ చేసి వాటిని వారి సొంత యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే గంగవ్వ బిగ్ బాస్ కి వెళ్ళి ప్రపంచమంతా తెలిసింది. ఆ తర్వాత తన రూటే సపరేట్ అయింది. దుబాయ్ కి కూడా వెళ్ళి అక్కడ ఓ ఈవెంట్ లో మాట్లాడింది. అలా గంగవ్వ ఫేమస్ అయింది. తను ఇలా అవ్వడానికి అనిల్ జీలా ప్రధాన కారణం. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్ లో తనతో మాట్లాడించి, డైలాగ్స్ చెప్పించి ఫేమస్ చేసాడు. అందుకే అనిల్ జీలాకి కూడా తెలంగాణలో ఎంతో మందికి మార్గనిర్దేశం అయ్యాడు.  అయితే విలేజ్ లో జరిగే వాటిని అంతే సహజంగా చూపిస్తూ ఎన్నో యూట్యూబ్ ఛానెల్స్ డబ్బు సంపాదించుకుంటున్నాయి. అయితే గంగవ్వ, చందు, అంజి మామ, అనిల్ జీల లాంటి కొందరు కలిసి " విలేజ్ షో - మిక్స్ " అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశారు. 

గంగవ్వ తాజాగా చేసిన ఓ వ్లాగ్ వైరల్ గా మారింది. తన ఊరి ప్రజల కోసం కార్పోరేటర్ ని అడిగి మరీ ఫిల్టర్ నీళ్ళు తెప్పించి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంది గంగవ్వ. అయితే తను చేసిన ఈ మంచిపనిని కొందరు దుర్వినియోగం చేశారు. వాళ్ళ ఊరి సర్పంచ్ గా గంగవ్వ పోటీచేసి గెలవాలని చూస్తుందని ఒకతను భావిస్తాడు. అతను తన స్నేహితుడితో కలిసి గంగవ్వ చలివేంద్రంలో లేని సమయంలో వస్తారు. అక్కడ కుండలలో ఉన్న నీళ్ళతో బట్టలు ఉతకడం, స్నానాలు చేయడం లాంటివి చేసి నీళ్ళని వృధా చేశారు. ఇక అన్ని చలివేంద్రాలు చూసుకుంటు గంగవ్వ అక్కడికి వస్తుంది. ఇక నీళ్ళని వృధా చేసిన వారిద్దరిని తిట్టేస్తుంది. ఇక ఆ ఊరి కార్పోరేటర్ వచ్చి.. గంగవ్వ పెద్ద మనసు చేసుకొని దప్పికతో ఊరిలోకి వచ్చేవాళ్ళ కోసం ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసిందని, మంచి చేయకపోయిన పర్లేదు కానీ ఇలా దుర్వినియోగం చేయకూడదని వార్నింగ్ ఇస్తాడు. దాంతో వాళ్ళు మారుతారు. సమ్మర్ లో కాసేపు ఎండలో తిరిగితేనే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఇలా ప్రతీ ఊరిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని గంగవ్వ ఈ వ్లాగ్ ద్వారా చెప్పింది. మరి యూట్యూబ్ లో ఉన్న ఈ వ్లాగ్ ను మీరు చూశారా కామెంట్ చేయండి.