Read more!

English | Telugu

Krishna Mukunda Murari : కృష్ణ కంగారు...ఆ ఒక్క మాటతో గుండె పట్టుకున్న అతను!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి' . ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -455 లో... ఉదయం జాగింగ్‌కు ముకుందను తీసుకెళ్లి తన మనసులో మాట చెప్పాలిన ఆదర్శ్‌ అనుకుంటాడు. అందుకు ముకుందను పిలవడానికి తన గది దగ్గరకు వెళ్తాడు. ముకుంద ఆదర్శ్‌ని చూసి తలుపు వేసేస్తుంది. ఆదర్శ్ డోర్ కొడతాడు.  జిడ్డులా తగులుకున్నావ్ ఏంట్రా బాబు. ఇప్పుడు బయటకు వెళ్తే కచ్చితంగా ప్రపోజ్ చేస్తాడు. అవును అంటే ఒక సమస్య కాదు అంటే ఒక సమస్య. ఎలా తప్పించుకోవాలి అనుకుంటు మీరా డోర్ తీస్తుంది.

డోర్ తీయకపోతే ఇంకా నిద్ర లేవలేదు అనుకున్నా. ఇంకా శారీలో ఉన్నావ్ ఏంటి. ట్రాక్ సూట్ వేసుకొని రా నేను వెయిట్ చేస్తా జాగింగ్‌కుముకుంద అలాగే అని కాలు బెనికినట్లు నటిస్తుంది. అదర్శ్ ముకుందకు నిజంగానే కాలు బెనికిందేమో అని తెగ టెన్షన్‌ పడిపోతాడు. బామ్ రాస్తున్న అని కాలు పట్టుకోబోతే ముకుంద కాలు వెనక్కి తీసుకుంటుంది. కాలు పట్టుకోవడం ఇంట్లో ఎవరైనా చూస్తే బాగోదు అని ఆదర్శ్‌తో చెప్తుంది. ఇక తాను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది. ఆదర్శ్‌ హెల్ప్ చేస్తాను అంటే ముకుంద వద్దు అనేస్తుంది. ఇక ఆదర్శ్‌కి తానేం చెప్పాలి అనుకుంటున్నాడో చెప్పమని అంటే ఆదర్శ్‌ తర్వాత చెప్తా అంటాడు. ఈసారికి కూడా తప్పించుకున్నాను అని ముకుంద అనుకుంటుంది.  వెళ్దామని ఆదర్శ్ అంటాడు.

మరోవైపు కృష్ణ ఒక్కతే తనలో  తానే ఆలోచిస్తుంటుంది. ఈయన కచ్చితంగా ఏదో విషయంలో బాధ పడుతున్నారు. ఎందుకో నాతో చెప్పుకోలేకపోతున్నారు. పరిమళ మేడంకి తెలిసే ఉంటుంది. ఆవిడనే అడిగి తెలుసుకుంటానని కృష్ణ అనుకుంటుంది. అప్పుడే పడుకున్న మురారి లేచి.. నన్ను లేపోచ్చు కదా అని అంటాడు. మీకు బాలేదు అని లేపలేదు. అదే మనిషి బాగానే ఉంటే సరిపోదు మనసు కూడా బాగానే ఉండాలి కదా అని కృష్ణ అంటుంది. కారణం చెప్పాను కదా.. ఎక్కడికో బయల్దేరినట్లు ఉన్నావని మురారి‌ అడుగుతాడు. గుడికి వెళ్తున్నానని మురారీతో అబద్ధం చెబుతుంది.  అప్పుడే మీరా వచ్చి..‌నేను కూడా రావొచ్చా అని అంటుంది. ఎవరికీ తెలీకుండా వెళ్దాం అంటే ఈవిడ బయల్దేరింది ఏంటి. సారీ మీరా నేను ఒక్కదాన్నే వెళ్లాలి ఎందుకంటే దేవుడితో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలని కృష్ణ అంటుంది. ఇక ఇద్దరికి ఏదో ఒకటి చెప్పి కృష్ణ హాస్పిటల్ కి వెళ్తుంటుంది.‌

మరోవైపు సంగీతకి మురారి లైన్ వేస్తుంటాడు. తనకి ఆదర్శ్ తో పెళ్లి జరిగేలా చేయమని సంగీత అనగానే ఒక్కసారిగా మధు గుండె పట్టుకుంటాడు‌ . ఇక సంగీత తనకు ఆదర్శ్‌ అంటే ఇష్టం లేదు కానీ ఆస్తి కోసమే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్తుంది. ఇక మధు అమ్మ చెప్పింది అని ఆస్తి కోసం పెళ్లి చేసుకోవద్దని చెప్తే ఇంతలో రజిని వచ్చి  మధు చెంప పగలగొడుతుంది. మధుతో సవాలు చేస్తుంది. మధు పెళ్లి జరగకుండా చేస్తాను అని అంటాడు. ఇక కృష్ణకు వేరే డాక్టర్ పరిమళ యూఎస్ వెళ్లిపోయిందని చెప్తాడు. దీంతో కృష్ణ కంగారు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.