తిరుమ‌లలో శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

తిరుమ‌ల శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు అక్టోబ‌రు 15 నుండి 23వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. ఇందు కోసం  శనివారం (అక్టోబ‌రు 14) అంకురార్ప‌ణ నిర్వహించారు.   బ్ర‌హ్మోత్స‌వాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి. గ రుడవాహన సేవ రాత్రి 6.30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతుంది. అక్టోబ‌రు 14న శ‌నివారం రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.  వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్స‌వం నిర్వ‌హించే ముందు అది విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ స్వామి వారిని ప్రార్థించేందుకు అంకురార్ప‌ణం నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుడు తిరుమల నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌ మన్నులో న‌వ‌ధాన్యాలు నాటుతారు. నవధాన్యాలకు  మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. బ్ర‌హ్మోత్స‌వాల తొలిరోజు అక్టోబ‌రు 15న ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు బంగారు తిరుచ్చి ఉత్స‌వం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు పెద్ద‌శేష వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తారు. 

జగన్ హామీల్లో అమలైనవి పది శాతం కూడా లేవుగా.. 99శాతం అంటారేం?!

తాజాగా విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డే 99 శాతం హామీలను అమలు చేశామని.. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని ఆదేశించారు. ఇక ఇదే విషయంలో వైసీపీ నేతల ప్రకటనలు అన్నీ ఇన్నీ కావు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పేటెంట్ హక్కు కేవలం సీఎం జగన్ కి మాత్రమే ఉందని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరి గౌతమ్ రెడ్డి గతంలో ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు ఎంత గుడ్డిగా జగన్ మాయలో ఉన్నారో ఇలాంటి ప్రకటనలు చూస్తే తెలిసిపోతుంది. మాట తప్పడు మడమ తిప్పడు అంటూ గతంలో ప్రచారం చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఆ మాటను పక్కన పెట్టేశారు. రాజధాని మార్పు, శాసన మండలి రద్దు లాంటి అంశాల తర్వాత    జగన్  మాట తప్పడు అంటే ప్రజలు నవ్వుతున్నారని వైసీపీ నేతలు గ్రహించి ఆ నినాదాన్ని పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో 99 శాతం హామీల అమలు అనే నినాదాన్ని అందుకున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు, జనం మాత్రం జగన్ ప్రభుత్వం అమలు చేసింది కేవలం పది శాతం మాత్రమేనని కౌంటర్లు వేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడం ఒక్కటే లక్ష్యంగా పాదయాత్రలో ఆగిన ప్రతిచోటా ఒక హామీని ఇచ్చుకుంటూ వెళ్లారు. అలా తన పాదయాత్ర నుండి ఎన్నికల సమయంలో సభల వరకూ మొత్తం జగన్ 650కి పైగా హామీలను ఇచ్చినట్లు పరిశీలకులు లెక్కతేల్చారు. అందులో చిన్నా చితకా ఏమైనా ఉండనీ కానీ.. జగన్ ఇచ్చిన హామీలను చూస్తే గుండె గుభేల్ అనాల్సిందే. ఇక హామీల అమలు విషయానికి వస్తే ఆయన ఇచ్చిన 650కి పైగా హామీలలో కేవలం పది శాతం మాత్రమే, అంటే 65 నుండి 100 లోపు మాత్రమే ఏదో మేరకు అమలుకు నోచుకున్నాయని  ఉదాహరణలు, గణాంకాలతో సహా చెబుతున్నారు.   జగన్ తన నోటి నుండి చెప్పి మరచిన వాటిని ఆధారాలతో సహా బయట పెడుతూ ఇది హామీ కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ చెప్పుకుంటున్న ఆ 99 శాతం హామీలు ఏంటి అనేది ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ గత ఎన్నికల సమయంలో చెప్పిన వాటిలో ప్రధానమైనవి సీపీఎస్ రద్దు, మద్యనిషేధం, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, 45 ఏళ్లకు పెన్షన్..అలా చెప్పుకుంటూపొతే  కొండవీటి చాంతాడంత లిస్ట్ కనిపిస్తుంది. రాష్ట్రంలో మద్యం అంటే  స్టార్ హోటళ్లలో దొరికే వస్తువుగా పరిమితం చేస్తానని, ఆ తర్వాతనే ఓట్లు అడుగుతామని ఘనంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ఊసే లేకపోగా మద్యం ఆదాయాన్ని కూడా వచ్చే పాతికేళ్ల పాటు తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చారు. ఇక మెగా డీఎస్సీ,  ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ సంగతి ఎంత చెప్పుకున్నా దండగే. ఉద్యోగమంటే వాలంటీర్, సచివాలయాలనే చూపిస్తున్నారు.  మరో కీలకమైన హామీ సీపీఎస్ రద్దు. దీని గురించి వెళ్లిన ప్రతి చోటా చెప్పిన జగన్.. ఇప్పుడు డొంక తిరుగుడు సమాధానాలు చెపున్నారు. సీపీఎస్ రద్దు చేస్తే అప్పులు దొరకవని ఈ హామీని అటకెక్కించారు. 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రూ.3 వేలు పెన్షన్ అన్నారు. కానీ, రియాలిటీలో 63 దాటిన వాళ్ళకే సవాలక్ష కొర్రీలు పెట్టి ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు. అదీ ఇప్పటికీ చెప్పిన రూ.3 వేలు కాలేదు. ఇలా, జగన్ మ్యానిఫెస్టోలో పెట్టి, బహిరంగ సభలలో ఇచ్చిన హామీలే వందలలో ఉండగా.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి, ఏ జిల్లాకి ఆ జిల్లాలో జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఇంకా వేలల్లో ఉన్నాయి. ఈ హామీలతో పాటు గత ప్రభుత్వాలు తెచ్చిన ఫీజ్ రీఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, పావలా వడ్డీ రుణాలు, వ్యవసాయ ప్రోత్సాహకాలు లాంటి ఉపయోగకరమైన పథకాలకు నిధులు లేకుండా చేసి వాటిని నీరుగార్చేశారు. మరి ఇవన్నీ ప్రజలు మర్చిపోయి వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారులే అనుకున్నారో ఏమో కానీ వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా అబద్దాల ప్రచారాన్ని మొదలు పెట్టారు. 

చంద్రబాబును ఏం చేయాలనుకుంటున్నారు.. కుటుంబ సభ్యుల ఆందోళన!

*నెల రోజుల్లో ఐదు కిలోల బరువు తగ్గారు *ఇదే పరిస్థితి కిడ్నీలపై ప్రభావం చూపే ప్రమాదం *భువనేశ్వరి ఆందోళన * చంద్రబాబును ఆస్పత్రికి తరలించాలి * న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం * ప్రతి రోజూ అన్ని వివరాలతో బాబు హెల్త్ బులిటిన్ విడుదల చేయాలి * తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభి డిమాండ్ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? ముందు డీహైడ్రేషన్, తర్వాత స్కిన్ అలర్జీతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలులో  వైద్యులు గురువారం జైలుకు  చంద్రబాబును గురువారం పరీక్షించారు.    అక్కడే ఆయనకు కేటాయించిన బ్యారక్ లోనే చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ఆందోళన అవసరం లేదనీ వెల్లడించారు.  అయితే చంద్రబాబు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆయనకు అందించే చికిత్సపై కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  చంద్రబాబు డీహైడ్రేషన్, స్కిన్ అలర్జీ బాధపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై అనుమానాలు లేవనెత్తుతున్నారు. చంద్రబాబుకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఆయనకు హాని తలపెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులలోనూ తెలుగుదేశం శ్రేణులలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.  జైలులో ఉక్కపోత, అపరిశుభ్రమైన వాతావరణంలో చంద్రబాబును ఉంచారని ఆరోపించిన లోకేష్.. దీని వల్ల ఆయన తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. జైల్లో పరిస్థితులు, ఆయన ఆరోగ్య సమస్యలతో ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, చంద్రబాబుకు చికిత్స పేరుతో స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏదో దాస్తోందని అనుమానం వ్యక్తం చేసిన లోకేష్.. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే దానికి పూర్తి బాధ్యత జగన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. లోకేష్  ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక, చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన భార్య భువనేశ్వరి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వ విఫలం అయ్యిందని ఆరోపించారు.   జైలులో తన భర్తకు సకాలంలో వైద్యం అందించలేదని.. ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఆరోపించారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ఇతర అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారన్నారు.  జైలులో ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని.. జైలులో పరిస్థితులు తన భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయన్నారు.   మామ చంద్రబాబు ఆరోగ్యంపై బ్రాహ్మణి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు గారి పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. ఏ విధంగాను అనుకూలంగా లేని, అపరిశుభ్రమైన జైలు వాతావరణంలో ఆయనను నిర్బంధించారని పేర్కొన్నారు.   ఆయన ఆరోగ్యం  ప్రమాదంలో ఉందని  వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న కారణంగా చంద్రబాబుకు తక్షణ వైద్య సహాయం అవసరమని పేర్కొన్నారు. జైల్లో సకాలంలో చంద్రబాబుకు వైద్యం అందడం లేదని, తాము ఆయన ఆరోగ్యం గురించి  తీవ్ర ఆందోళనలో ఉన్నామని ట్విట్టర్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు. అత్యవసరంగా అయనకు మెరుగైన చికిత్స అందించాలని బ్రాహ్మణి కోరారు. ఇక, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అయితే ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టారనీ.. హెల్త్ బులిటెన్‌లో ముఖ్యమైన టెస్ట్‌లకు సంబంధించిన రిపోర్టులు లేవని ఆయన అంటున్నారు. బ్లడ్ టెస్ట్ వివరాలు లేవని అంటున్నారు. చంద్రబాబు ఐదు కిలోలు బరువు తగ్గారని మాకు సమాచారం ఉంది. ఆయనకు ఏదైనా అయితే సీఎం జగనే బాధ్యత వహించాలని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.  వాతావరణ మార్పుల రీత్యా, చంద్రబాబుకి ఏసీ ఏర్పాటు చెయ్యాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు మాత్రం అందుకు రూల్స్ లేవంటున్నారు. ప్రస్తుతానికి స్కిల్ స్కాం వ్యవహారంలో ఆయనపై అసలు కేసు ఉంచాలా లేదా అన్నది న్యాయస్థానాలకే స్పష్టత లేకపోగా.. ఆయనను మాత్రం జైల్లో పెట్టి వేధిస్తున్నారన్న ఆగ్రహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇలా ఉండగా చంద్రబాబును తక్షణమే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కానీ, అన్ని వైద్య సౌకర్యాలూ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి కానీ తరలించాలని తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభి డిమాండ్ చేశారు. శుక్రవారం (అక్టోబర్ 13) మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయంలో తాము న్యాయస్థాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం, జైలు అధికారులు వాస్తవ సమాచారాన్ని అందించడం లేదని ఆరోపించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటిన్ లో ఎలాంటి వివరాలూ లేవన్నారు. సుగర్, బీపీ కంట్రోల్ లో ఉన్నాయన్న సమాచారం మాత్రమే ఉందన్నారు. ములాఖత్ తరువాత చంద్రబాబు భార్య భువనేశ్వరి తన భర్త 5 కిలోల బరువు తగ్గారని చెప్పారనీ, నెల రోజులలో ఐదు కిలోల బరువు తగ్గడమంటే చాలా సీరియస్ విషయమనీ పట్టాభి పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలూ లేని కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి నెలరోజులుగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.  అదే వేల కోట్ల అవినీతి, అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లిన సమయంలో జగన్ కు చంచల్ గూడ జైల్లో సకల సౌకర్యాలూ కల్పించారని పట్టాభి ఈ సందర్భంగా ఆరోపించారు. అప్పట్లో జగన్ కు జైల్లో తన సిబ్బందితో ప్రత్యేక కిచెన్ కు కూడా అనుమతించిన విషయాన్ని గుర్తు చేశారు.  అలాగే జగన్ కు ప్రైవేటు వైద్యులు వైద్యల సౌకర్యం కూడా కల్పించినట్లు గుర్తు చేసిన ఆయన ఏం అప్పుడు జగన్ కు ఆ సౌకర్యాలు అందినప్పుడు ఏ నేరమూ చేయకుండా అక్రమంగా అరెస్టు అయిన చంద్రబాబుకు ఎందుకు సౌకర్యాలు కల్పించరని ప్రశ్నించారు. 

టికెట్ దక్కినా.. బీ ఫారం డౌటే!

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. సీఈసీ విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నవంబర్  30న  ఒకే విడతలో 119 ఆసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి జోరందుకుంది. అయితే, ఎన్నికల షెడ్యూలుతో సంబంధం లేకుండా చాలా కాలంగా ఎన్నికల అగ్నిగుండలో  రగులుతున్న రాష్ట్ర రాజకీయం,షెడ్యూలు విడుదలతో మరింత వేడెక్కింది. అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన  పార్టీలు మూడూ వ్యూహలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా, ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్  సాధించాలనే లక్ష్యంతో, వ్యూహాత్మకంగా, ముందుగానే, అభ్యర్ధులను ప్రకటించి, ప్రత్యర్ధులకు సవాలు విసిరారు. మొత్తం 119 నియోజక వర్గాలకు గాను, 115 నియోజక వర్గాలకు గతంలోనే అభ్యర్ధులను ప్రకటించారు. అందులోనూ ఎవరూ ఉహించని విధంగా, కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన డజను మంది ఎమ్మెల్యేలతో పాటుగా,  108 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్ ఇచ్చారు. అయితే, ఇప్పడు  మరో రెండు మూడు రోజులలో (అక్టోబర్ 15) బీఆర్ఎస్  అభ్యర్ధులకు బీ ఫారం ఇస్తారని  వార్తలు వస్తున్న నేపధ్యంలో  కొత్త చర్చ తెరపై కొచ్చింది. టికెట్లు ఇచ్చిన వారందరికీ, బీ ఫారం ఇస్తారా? లేదా ..? అనే చర్చ  బీఆర్ఎస్ వర్గాల్లోనే బలంగా సాగుతోంది. అభ్యర్ధుల ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఒక్క సారిగా సైలెంటై పోయారు. సైలెంట్ గా ఇంటర్నల్ వ్యవహారాలు చక్క బెడుతున్నారు. అందులో భాగంగా ఏ రోజుకా రోజు  వార్ రూమ్  కు వస్తున్న సమాచారం, ఫ్రెష్   సర్వే  రిపోర్టుల ఆధారంగా, ఇతర అంశాలతో పాటుగా అభ్యర్ధులను మార్చే విషయంలోనూ సీరియస్  కసరత్తు జరుగుతోందని, అంటున్నారు.  ఈ నేపద్యంలో   ఆదివారం (అక్టోబర్ 15) టికెట్ ఇచ్చిన వారందరికీ బీ ఫారం ఇస్తారా, లేక ..కొందరికి మొండి చేయి చూపుతారా అనే విషయంలో పార్టీ వర్గాల్లో  తెగ టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా  ఇప్పటికే ఎన్నికల పనుల్లో తలముకలైన అభ్యర్ధులకు బీ ఫారం బెంగ పట్టుకుందని అంటున్నారు. నిజానికి  ముఖ్యమంత్రి కేసీఆర్  అనూహ్యంగా  ఒకేసారి సారి 115 నియోజక వర్గాలకు అభ్యర్ధులను ప్రకటించడంతో పాటుగా, కొద్ది మంది మినహా మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికట్  ఇచ్చి రైట్  చెప్పినప్పుడే చాలా మంది అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పటికే టికెట్  వస్తుందో రాదో అన్న అనుమానంతో పక్క చూపులు చూస్తున్న వారిని కట్టడి చేసేందుకే  కేసీఆర్ గంపగుత్తగా ఆల్మోస్ట్ అందరికీ టికెట్  ఇచారు కానీ . టికెట్ ఇచ్చిన అందరికీ బీ  ఫారం గ్యారెంటీ లేదనే ప్రచారం అప్పట్లోనే జరిగింది. అయితే  అప్పట్లో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఒకటి అరా మినహా పెద్దగా మార్పులు ఉండవని చెప్పారు. అయితే తాజా సర్వేలు, ముఖ్యమంత్రి కేసేఅర్ నెల రోజులకు పైగా సాగిస్తున్న అంతర్గత మథనం నేపధ్యంలో పునరాలోచనలో పడ్డారని అంటున్నారు.  ప్రభుత వ్యతిరేకత ఉండనే ఉంది.  అంతకంటే ఎక్కువగా సగం మందికి పైగా సిట్టింగుల పట్ల తీవ్ర వ్యతిరేకత ఆయా నియోజకవర్గాలలో ఉందని తేలడంతో  అలా వ్యతిరేకత ఎదుర్కొంటున్న సగం మంది సిట్టిగిలకు బీ ఫారం ఇవ్వక పోవచ్చని  ప్రచారం జరుగుతోంది. అయితే  ఈ సమయంలో కేసీఆర్ అంత సాహసం చేస్తారా?  అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఆదివారం (అక్టోబర్ 15) బీఫాంలు ఇచ్చిన తరువాత బీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు మరోసారి భగ్గుమనడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక నిఘా

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ ఎన్నికల అధికారులు ఎన్నికలలో అక్రమాలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై దృష్టి పెట్టారు. నిబంధనల మేరకు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.  పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ, ప్రతి ఓటరూ నిర్భయంగా, స్వేచ్ఛగా తన ఓటు హక్కు  వినియోగించుకునేందుకునేలా అన్ని  చర్యలూ  తీసుకుంటున్నారు. ఇందు కోసం ఇప్పటికే వివిధ రకాల కమిటీలను నియమించారు.  అందులో భాగంగానే.. వార్త ప్రతికలు, టీవీ చానెళ్లలో ప్రసారమయ్యే వార్తలు, ప్రకటనలపై గట్టి నిఘా కోసం ఒక స్పెషల్ వింగ్‌ను కూడా ఏర్పాటు చేసింది. అడ్వర్‌టైజ్ మెంట్లు, ప్రింట్, ఎల‌క్ట్రానిక్‌, సోష‌ల్ మీడియా, ఆడియో, వీడియో డిస్‌ప్లే, సినిమా థియేటర్లు. రేడియో ఛానల్‌లో బల్క్ ఎస్ఎంఎస్‌లు సెబ్‌సైట్‌లో ప్రసారమయ్యే ప్రతి వార్త, ప్రకటనను రికార్డ్ చేస్తారు. ఆడియో, వీడియో అడ్వర్‌టైజ్‌మెంట్లతో పాటు గోడమీద రాతలు, పోస్టర్లు, వాహనాల ద్వారా ప్రచారం సహా  అన్నిటికీ  ఎన్నికల సంఘం సంబంధిత అధికారి నుంచి అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు.  అలాగే పెయిడ్ న్యూస్ గుర్తింపునకు ప్రత్యేకంగా మీడియా స‌ర్టిఫికేష‌న్‌, మానిట‌రింగ్ క‌మిటీ (ఎంసీఎంసీ)ని   ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి జిల్లా ఎన్నిక‌ల అధికారి   చైర్మన్‌గా వ్యవహరిస్తారు.  ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో, డిప్యూటి డైరెక్టర్, సీనియ‌ర్ జ‌ర్నలిస్టు, జీహెచ్ఎంసీ సీపీఆర్ఓతో పాటు హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.  ఎన్నిక‌ల సంద‌ర్భంగా  మీడియా అతిక్రమణలను ఈ క‌మిటీ ప‌ర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ఎల‌క్ట్రానిక్ మీడియాలో  ప్రసారమయ్యే అన్నిర‌కాల రాజ‌కీయ ప్రకటనలకు అనుమతి తప్పని సరి ఎన్నికల అధికారులు తెలిపారు.   ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి పెయిడ్ న్యూస్, ప్రకటనలకు సంబంధించి వ్యయాన్ని అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపనున్నట్టు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. 

 కాంగ్రెస్ కు  పొన్నాల లక్ష్మయ్య రాజీనామా, చేరేది ఏ గూటికో ?

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్షయ్య షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయిన ఆయన అన్నారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. కొందరు నాయకుల వైఖరితో పార్టీ పరువు పోతోందని చెప్పారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పదేళ్లలో తనకు ఒక్క పదవి కూడా ఇ్వలేదని చెప్పారు. సర్వేల పేరుతో బీసీలకు సీట్లు ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కనిపిస్తే నమస్తే పెట్టినా స్పందించరని అన్నారు. సొంత పార్టీలోనే పరాయి వ్యక్తులమయ్యామని చెప్పారు.  జనగామ టికెట్ ను పొన్నాలకు కాకుండా కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పొన్నాల చాలా అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల సమయంలో కూడా పొన్నాలకు చివరి నిమిషంలో టికెట్ దక్కింది. పొత్తులో భాగంగా కోదండరామ్ కు జనగామ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. అయితే పార్టీ నాయకత్వంతో మాట్లాడి చివరకు ఆయన టికెట్ దక్కించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో పొన్నాల ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పని చేసిన పొన్నాల... తెలంగాణ రాష్ట్ర తొలి పీసీసీ చీఫ్ గా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. జనగామ టిక్కెట్టు విషయంలో బలమైన బీసీ నేతకు బదులుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు టిక్కెట్టు ఇవ్వాలనే నిర్ణయం సరైంది కాదని  పొన్నాల లక్ష్మయ్య  వాదిస్తున్నారు.  కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకత్వంతో టచ్ లోకి వెళ్లినట్టుగా కూడ ప్రచారం సాగుతుంది.    ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేసే పరిస్థితి లేదని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ మూల సిద్దాంతానికి భిన్నంగా వ్యక్తిస్వామ్యం సాగుతుందని చెప్పారు.కొత్తగా వచ్చినవారికి పెద్దపీట, పాతవారి ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆ లేఖలో  పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.  పార్టీ టిక్కెట్లను అమ్ముకుంటున్నారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తికి పగ్గాలిస్తే బజార్లో గొడ్డును అమ్మినట్టుగా టిక్కెట్లు అమ్ముకుంటున్నారని పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ఆరోపణలు చేశారు.

తెలంగాణ తెలుగుదేశంకు బాలయ్య దిశా నిర్దేశం!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దిశా నిర్దేశం కరవైందా? తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్  పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయడంలో విఫలం అయ్యారా? చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చినా.. పార్టీ పరంగా వారిని  ముందుండి నడిపించడంలో తెలంగాణ తెలుగుదేశం విఫలమైందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం నిస్సందేహంగా బలీయమైన శక్తి అనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో అన్ని పార్టీలూ కూడా తెలుగుదేశం బలం, బలగంపై స్పష్టమైన అవగాహనతోనే ఉన్నారు. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత కాసాని జ్ణానేశ్వర్ మొదట్లో చాలా క్రియాశీలంగా వ్యవహరించారు. పార్టీ శ్రేణుల్లో జవసత్వాలు నింపడంలో సఫలమయ్యారు. ఖమ్మంలో జరిగిన తెలుగుదేశం సభ బ్రహ్మాండమైన విజయం సాధించడం వెనుక జ్ణానేశ్వర్ పాత్ర విస్మరించలేనిది. అయితే ఆ తరువాత ఆ చురుకుదనం ఆయనలో కొరవడింది. పార్టీ కార్యక్రమాలు రూపొందించడంలో, వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు. దాంతో చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తినా, తెలంగాణలో మాత్రం ప్రజలు, ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు కానీ పార్టీ పరంగా ఆయన అరెస్టును నిరసిస్తూ పెద్దగా కార్యక్రమాలేవీ జరగలేదు. పార్టీ పరంగా దిశా నిర్దేశం లేకపోవడంతో శ్రేణులు కూడా దిగాలు పడ్డాయి. సరిగ్గా ఈ సమయంలో  రాష్ట్రంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడానికి, వారిలో ధైర్యం నింపడానికీ నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారు. పార్టీ నేతలతో ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తాను నడుంబిగించానని బాలయ్య ప్రకటించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి బాలయ్య ఆశాకిరణంగా మారారు.  హైదరాబాద్‌లోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరచూ వస్తూ, పార్టీ సమన్వయకమిటీతో భేటీలు నిర్వహిస్తూ పార్టీకి దిశా నిర్దేశం చేస్తున్నారు. అంతే కాదు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కోసం తాను ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాననీ, రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామనీ ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను ముందుంటానని బాలకృష్ణ పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. రాష్ట్రం మొత్తం బస్సు యాత్రతో చుట్టేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన పార్టీ సమన్వయ కమిటీ భేటీలో చెప్పారు.  రాష్ట్రంలో పార్టీ బలంగా  ఉన్న హైదరాబాద్-రంగారెడ్డి-నిజామాబాద్- ఖమ్మం నియోజకవర్గాలతోపాటు, వరంగల్-నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై దృష్టి సారించాలని బాలయ్య చెబుతున్నారు. టీడీపీ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో, స్తబ్దుగా ఉన్న పార్టీ క్యాడర్‌లో తిరిగి చైతన్యం తీసుకురావడమే పార్టీ ఉనికిని వచ్చే ఎన్నికలలో బలంగా చాటడమే ధ్యేయంగా బాలయ్య అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.  తెలంగాణలో టీడీపీ నేతలకు కొరత ఉన్నప్పటికీ..  30 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు  పార్టీల జయాపజయాలను నిర్దేదిస్తుంది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం సత్తా చాటుతుందన్న భావన పార్టీ వర్గాల్లో  శ్రేణుల్లో బలంగా వ్యక్తం అవుతోంది. ముందుండి నడిపించే నేతగా బాలయ్య నిలిస్తే పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొనడం  తథ్యమని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు.  

బాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యుల ఆందోళన

చంద్రబాబుకి జ్వరం లేదు, బీపీ సాధారణ స్థాయిలోనే ఉంది, పల్స్ రేటు బాగుంది, లంగ్స్ క్లియర్ గానే ఉన్నాయి, హార్ట్ ఓకే, ఫిజికల్ యాక్టివిటి గుడ్. రాజమండ్రి జైలు అధికారులు విడుదల చేసిన చంద్రబాబు హెల్త్ బులిటెన్ తాజా విశేషాలివి. అంతా బాగానే ఉంది, మరి చంద్రబాబుకి వచ్చిన సమస్య ఏంటనేది తేలాల్సి ఉంది. ఇంత ఆరోగ్యంగా ఆయన లోపల ఉంటే, బయట ఉన్న కుటుంబ సభ్యులు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారనేది వైసీపీ నేతల ప్రశ్న. కేవలం సింపతీ కోసమే చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తున్నాయని అంటున్నారు. కానీ వాస్తవానికి చంద్రబాబు ఆరోగ్యం రోజు రోజుకు దిగ జారుతోంది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరిస్తున్నారు. తాజాగా నారా బ్రాహ్మణి, నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా సుహాసిని ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడు చంద్రబాబు బరువు తగ్గిపోయారని, అది ఇతర సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని అంటున్నారు. జైలులో వసతులు కల్పించకుండా శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. తన భర్త చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన బరువు తగ్గితే అది కిడ్నీలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, ఈ భయంకరమైన పరిస్థితులు తన భర్త జీవితానికి తక్షణ ముప్పు సృష్టించేలా ఉన్నాయని భువనేశ్వరి ఎక్స్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందంటూ లోకేష్ భార్య బ్రాహ్మణి ట్వీట్ చేశారు. చంద్రబాబును అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించటం హృదయవిదారమని ఆవేదన చెందారు. ఇది చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు.  రాజకీయ కుట్రలో చంద్రబాబుని బాధితుడిగా మార్చారని నందమూరి సుహాసిని మండిపడ్డారు.  చట్టవిరుద్ధంగా నిర్భంధించారని, ఈ కష్టకాలంలో అంతా చేతులు కలిసి సంఘీభావం తెలియజేద్దామని ఆమె కోరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని ఈ సందర్భంగా నందమూరి సుహాసిని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గిన చంద్రబాబుకు కిడ్నీలపై ప్రభావం పడవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతింటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యత వహించాలని ఆమె హెచ్చరించారు. చంద్రబాబు కుటుంబ సభ్యురాలిగా తాను  ఆవేదన చెందుతున్నాను అని సుహాసిని ట్వీట్ చేశారు.  రాజమండ్రి జైల్లో తన తండ్రికి దోమలు కుడుతున్నాయని, కలుషిత నీరు, ఇన్ ఫెక్షన్స్, ఎలర్జీలు బాధిస్తున్నాయని, దీనికి తోడు బరువు కూడా తగ్గినట్లు నారా లోకేష్ ట్వీట్ చేశారు. 

ఏపీ సీఐడీ చేతికి నారా భువనేశ్వరి ఐటీ రిటర్న్స్.. లోకేష్ సీరియస్!

వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు ఇప్పటికే ఏపీలో నిర్వీర్యమైపోయాయి. ప్రభుత్వం తలుచుకుంటే ఎవరినైనా అరెస్టు చేసేయవచ్చు. ఆ తరువాత ఎందుకు అరెస్టు చేయాల్సిందో దర్యాప్తు చేసి తేలుస్తామంటూ కోర్టుల ముందు చెప్పవచ్చు. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన ఏపీ సీఐడీ అలాగే వ్యవహరించింది. అంతే కాదు.. ఇఆర్ఆర్ కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఏ 14గా చేర్చి విచారించింది. ఆ సందర్భంగా  ఏపీ సీఐడీ నారా లోకేష్ తల్లి భువనేశ్వరికి సంబంధించిన ఐటీ రిటర్న్స్  గురించి లోకేష్ ను ప్రశ్నించింది. ఆమె ఐటీ శాఖకు సబ్ మిట్ చేసిన ఐటీ రిటర్న్స్ ను లోకేష్ ముందు ఉంచింది. ఇక్కడే ఏపీ సీఐడీకి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ ఎలా వచ్చాయా అన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది. కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర ఆర్ధిక సంస్థలకు మాత్రమే తెలియాల్సిన వ్యక్తులు, సంస్థల ఆదాయ  వివరాలు.. రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థ ఏపీ సీఐడీ చేతికి ఎలా వచ్చాయి. ఆదాయపన్ను శాఖకు సమర్పించిన  ఐటీ రిటర్న్సు వివరాలు ఏపీసీఐడీ వద్దకు ఎలా చేరాయి?  ఎలా చూసినా ఇది నేరం. ఒక రాష్ట్ర దర్యాప్తు సంస్థే ఇలాంటి నేరానికి పాల్పడిందంటే అంత కంటే దారుణం మరేమైనా ఉంటుంది. తాను చేసిన నేరాన్ని తానే ఘనంగా మరో కేసులో  మరో నిందితుడి నేరానికి ఆధారంగా చూపడమంటే.. ఏపీ సీఐడీ ఎంతగా బరితెగించేసిందో అర్ధమౌతుంది.  ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను రెండు రోజుల పాటు విచారించిన సీఐడీ.. ఆ విచారణ సందర్భంగా.. లోకేష్‌ తల్లి భువనేశ్వరికి సంబంధించిన ఐటీ రిటర్న్సు వివరాలను సీఐడీ అధికారులు, లోకేష్‌ ముందు పెట్టి విచారించారు. అదే ఇప్పడు పెను వివాదంగా మారింది.   తన తల్లి ఐటీ రిటర్న్స్ వివరాలు  సీఐడీకి ఎలా చేరాయి?  అని లోకేష్ ప్రశ్నించారు. ఆ విషయం తేలాల్సిందే అని నిలదీశారు.  దీనితో సీఐడీకి భువనేశ్వరి ఐటీ వివరాలు ఎలా వచ్చాయి? ఎవరు ఇచ్చారు?  ఆ వివరాలకు కోరుతూ ఏపీ సీఐడీ ఏమైనా కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాసిందా?  అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కేసు దర్యాప్తులో భాగంగా ఆ వివరాలు కావాలని సీఐడీ కనుక లేఖ రాస్తే.. ఆ లేఖకు ఏ శాఖ స్పందించి వివరాలు వెల్లడించింది అన్న వివరాలు వెల్లడించాల్సిందేనని లోకేష్ డిమాండ్ చేశారు. అసలు సీఐడీకి ఆ వివరాలు ఎలా అందాయి అన్న విషయంపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.  ఆ దిశగా దర్యాప్తు జరిగితే  సీఐడీకి ఆ వివరాలు ఎలా, ఎక్కడ నుంచి అందాయన్న విషయం వెల్లడౌతుందని అంటున్నారు. అయినా వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన ఐటీ రిట్నర్స్ ఎవరికి పడితే వారికి అందబాటులోకి రావనీ, ఒక వేళ దర్యాప్తులో భాగంగా వాటి అవసరం ఉన్నా.. అందుకు సంబంధించిన దర్యాప్తును చేయాల్సింది కూడా కేంద్రానికి చెందిన సంస్థలేనని నిపుణులు చెబుతున్నారు.  సీబీఐ, ఈడీ, డైరక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటలిజన్స్‌, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌, డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజన్స్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఎన్‌ఐఏ వంటి ఏజెన్సీలకు ఐటీ రిటర్న్స్ వివరాలు అధికారికంగా తీసుకునే అధికారం ఉంటుంది. అది కూడా దర్యాప్తునకు సంబంధించి, సాక్షాధారాల కోసమే తీసుకుంటారు. ఈ వివరాలన్నీ ఈ దర్యాప్తు సంస్థలు అధికారికంగానే తీసుకుని, కోర్టులో వాటిని ఆధారాలుగా సమర్పిస్తాయి.  కానీ  రాష్ట్ర దర్యాప్తు సంస్థ అయిన సీఐడీ, ఆ పద్దతులేవీ పాటించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  వైసీపీ సర్కార్ వ్యవస్థలను మేనేజ్ చేసి ఈ వివరాలను సీఐడీకి  దొడ్డిదారిన చేరవేసిందని అంటున్నారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఒకరు వైసీపీ ఎంపీల బంధువుల్లో ఉన్న ఐఆర్ఎస్ అధికారులు  వివిధ హోదాల్లో పలు దర్యాప్తు సంస్థల్లో పని చేస్తున్నారనీ, వారిలో ఎవరి ద్వారానే ఈ వివరాలు అక్రమంగా భువనేశ్వరి ఐటీ వివరాలను లీక్ చేసి సీఐడీకి అందజేసి ఉంటారని ఆరోపించారు.   కాగా తన తల్లి ఐటీ రిటర్ను వివరాలు సీఐడీకి లభించడాన్ని యువనేత లోకేష్‌ సీరియస్‌గా తీసుకోవడంతో సీఐడీ చిక్కుల్లో పడిందనే చెప్పాలి. ఆయన దీనిపై సీబీడీటికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అదే జరిగి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ వివరాలు సీఐడీకి ఎలా చేరాయన్నదానిపై దర్యాప్తు జరిగితే.. అన్ని వివరాలూ బయటపడతాయనడంలో సందేహం లేదు.  

      అంగళ్ళు కేసులో  చంద్రబాబుకు హైకోర్టులో ఊరట 

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక్కొక్కటిగా కేసుల్లో ఊరట లభిస్తోంది. అంగళ్ళు కేసులో చంద్రబాబుకు నేడు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. లక్షరూపాయలు పూచీ కత్తుతో బెయిల్ మంజూరు చేసింది.  ఇటీవలె  రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలికంగా స్వల్ప ఉపశమనం లభించింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంటుపై విచారణ ప్రక్రియను న్యాయస్థానం ఈ నెల 16 వరకూ నిలుపుదల చేసింది. పీటీ వారెంటు విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. పీటీ వారెంటు విధానంలో తప్ప జ్యుడీషియల్‌ కస్టడీలోఉన్న పిటిషనర్‌ను నేరుగా అరెస్టు చేసే ఉద్దేశం లేదని సీఐడీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ లిఖితపూర్వకంగా సమర్పించిన హామీని న్యాయస్థానం రికార్డుచేసింది. విచారణను16వ తేదీకి వాయిదా వేసింది. ఇక నేడు అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభించడంలో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. వరుస కేసులు, వరుస పిటిషిన్లు, వాటికి ఏమాత్రం తగ్గకుండా వరుస షాకులు... లోపల చంద్రబాబుకు, బయట టీడీపీ శ్రేణులకు ఉక్కబోత తప్పడం లేదని... ఈ ఉక్కబోతముందు రోహిణీకార్తి ఎండలు అసలు పరిగణలోకే రావనే కామెంట్లు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చం‍ద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ స్కాం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. చంద్రబాబుకు అడుగడుగునా చుక్కెదురవతూ వస్తోంది. చంద్రబాబు లాయర్లు ఎంతో వ్యూహాత్మకం కథను నడుపుతున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో బలంగా ఈ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును పూర్తిగా బయటపడేయాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రముఖ జర్నలిస్ట్‌ సాయి కూడా వెల్లడించారు. చంద్రబాబు లాయర్లు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

లోకేష్, అమిత్ షా భేటీ తెలంగాణలో బీజేపీకి కలిసివస్తుందా?

తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం క్లారిటీ వచ్చేసింది. ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత  కాలం రాష్ట్రంలో తమదే అధికారం అంటూ బిల్డప్ ఇచ్చిన బీజేపీ సైలెంట్ అయిపోయింది. పార్టీ జాతీయ స్థాయి నేతలు వరుస పర్యటనలతో రాష్ట్ర నాయకత్వంలోనూ, క్యాడర్ లోనూ జోష్ నింపడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. దీంతో కమలనాథుల్లో అంతర్మథనం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలలో ఇంత కాలం రాష్ట్ర నాయకత్వాన్ని విస్మరించి అనుసరించిన విధానం ఫలితమే ఈ పరిస్థితి అన్న అవగాహనకు వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఆలస్యమైనా, సమయం మించి పోలేదని భావిస్తున్న బీజేపీ హై కమాండ్ నష్ట నవారణకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రాష్ట్రంలో సెటిలర్స్ మద్దతు చూరగొనే ప్రయత్నాలలో భాగంగా లోకేష్ తో అమిత్ షా భేటీ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. చంద్రబాబును ఏపీ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన క్షణం నుంచీ తెలంగాణలో జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. మరీ ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనూ, ఐటీ కారిడార్ లలోనూ ఎవరి ప్రమేయం లేకుండా జనం, ఉద్యోగులే స్వచ్ఛందంగా ప్రజా ఉద్యమాలు చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో తెలంగాణలో చంద్రబాబు, తెలుగుదేశం పట్ల ఒక్క సారిగా సానుభూతి పెల్లుబుకింది. తెలంగాణ ప్రగతి, హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు పునాది వేశారనీ, ఆ విషయాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పలు సందర్భాలలో చెప్పారు. అయితే ఏపీ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తరువాత మాత్రం ఏపీలో ఏదో జరిగితే.. తెలంగాణలో ఆందోళనలేమిటి? కావాలంటే అక్కడకు పోయి చేసుకోండంటూ వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు అక్రమ అరెస్టు ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై కూడా గట్టిగా పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో 32 నుంచి 35 నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగేంత సంఖ్యలో సెటిలర్ల ఉన్నారన్నది అంచనా. కేటీఆర్ వ్యాఖ్యల తరువాత బీఆర్ఎస్ లో అనూహ్యమైన కుదుపు వచ్చింది. అనివార్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ, నాయకులూ కూడా చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొనాల్సి వచ్చింది. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉండి.. ఆ తరువాత బీఆర్ఎస్ గూటికి చేరిన నేతలు, ఎమ్మెల్యేలూ వారి వారి నియోజకవర్గాలలో బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. ఐయామ్ విత్ బాబు అంటూ నినదించారు. అప్పుడు గానీ కేటీఆర్ కు తన వ్యాఖ్యల వల్ల పార్టీకి జరిగిన నష్టం ఏమిటో అర్ధం కాలేదు. వెంటనే గొంతు సవరించుకున్నారు. మరో కీలక మంత్రి హరీష్ రావు అయితే బాబు అరెస్టును ఖండించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదే విధంగా బీజేపీ కూడా చంద్రబాబు అరెస్టు విషయంలో వ్యవహరించిన తీరుతో తెలంగాణలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. అది గ్రహించిన రాష్ట్ర నాయకత్వం విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో మోడీ లోకేష్ తో మాట్లాడాల్సిందిగా అమిత్ షాను ఆదేశించారని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. మోడీ ఆదేశాల మేరకే అమిత్ షా స్వయంగా లోకేష్ ను పిలిపించుకుని మాట్లాడారనీ, దాదాపు గంటన్నరకు పైగా చర్చించారనీ చెబుతున్నారు. బాబు అరెస్టు విషయంలో బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదనీ, జగన్ చెబుతున్నట్లుగా తమ పాత్ర లేదనీ అమిత్ షా లోకేష్ కు వివరణ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు.   ఈ భేటీ కారణంగా కనీసం తెలంగాణ వరకైనా బాబు అరెస్టు కారణంగా బీజేపీపై వచ్చిన వ్యతిరేకత ఏదో మేరకు తగ్గుతుందని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తదితరులు చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీ నాయకత్వం వ్యవహరించిన తీరు తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి తీరని నష్టం వాటిల్లేలా చేసిందనీ, ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి ఈ నాలుగున్నరేళ్లలో వచ్చిన సానుకూల వాతావరణాన్ని ప్రతికూలంగా మార్చేశాయనీ సోదాహరణంగా వివరించడంతోనే బీజేపీ హై కమాండ్ పునరాలోచనలో పడి నష్ట నివారణ చర్యలకు నడుంబిగించిందనీ, అందులో భాగమే లోకేష్ తో అమిత్ షా భేటీ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ భేటీతో తెలంగాణలో సెటిలర్స్, తటస్థులు, తెలుగుదేశం అభిమానులు బీజేపీ పట్ల సానుకూలంగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు వెళ్లకుండా నిరోధించేందుకు దోహదం చేస్తుందని చెబుతున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయా?

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.  అపాయింట్‌మెంట్ కోరకుండానే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి కబురు వచ్చింది. తాను లోకేష్ తో బేటీ కావాలని భావిస్తున్నట్లు ఆయన కిషన్ రెడ్డి ద్వారా కబురు పంపించారు. దాంతో లోకేష్ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. ఈ భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు,కేంద్రమంత్రి  కిషన్‌రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఉన్నారు. ఉన్నారు అనడం కంటే ఇరువురూ లోకేష్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు లోకేష్ ను తోడ్కొని పోయారు అని చెప్పడం కరెక్ట్. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్ తాను అప్పాయింట్ మెంట్ కోరలేదనీ, స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తనకు ఫోన్ చేసి అమిత్ షా మీతో మాట్లాడాలని భావిస్తున్నారు. రండి కలిసి వెడతాం అని చెప్పడంతోనే మర్యాద పూర్వకంగా ఆయనను కలిశాననీ, ఆ భేటీలో ఏపీలో అరాచక పాలన గురించి, చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి, తనపై కేసుల గురించి ఫిర్యాదు చేశానని చెప్పారు.  సరే అది పక్కన పెడితే.. ఉభయ తెలుగు రాష్ట్రాల బీజేపీ సారథులతో పాటు అమిత్ షాతో లోకేష్ భేటీ కావడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. సహజంగానే ఆ ఊగాహాన సభలన్నీ.. తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుల చుట్టూ సాగాయి. ఔను ఇప్పటికే ఏపీలో తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారైంది. జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా పొత్తు విషయాన్ని ఖరారు చేస్తూ ప్రకటన చేశారు. ఇక తెలంగాణలో కూడా తెలుగుదేశం, జనసేన కలిసే వెడతాయనీ, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ ప్రకటించారు. త్వరలో రాజమహేంద్రవరం వెళ్లి బాబుతో ములాఖత్ అవుతాననీ, ఆ తరువాత జనసేనానితో కూడా భేటీ అవుతాననీ ఆయన ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాలలో  తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ లోకేష్, అమిత్ షా భేటీతో జోరందుకుంది. ఇప్పటికే ఏపీలో తెలుగుదేశంతో కలిసే వెడతామని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఇప్పటికీ జనసేన, బీజేపీ మైత్రి కొనసాగుతోందనీ, తెలుగుదేశం, జనసేనతో కలిసి బీజేపీ నడుస్తుందని భావిస్తున్నాననీ అన్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ తో భేటీకి అమిత్ షా తనంత తానుగా చొరవ తీసుకోవడంతో తెలుగు రాష్ట్రాలలో బీజేపీ తెలుగుదేశం, జనసేనల అండ కోరుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మామూలుగా లోకేష్ అప్పాయింట్ మెంట్ తీసుకుని అమిత్ షాతో భేటీ అయితే ఈ స్థాయిలో చర్చలు జరిగేవి కావు. కానీ అమిత్ షా స్వయంగా భేటీ కోరుకుని, తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను లోకేష్ ను తోడ్కొని రమ్మని పురమాయించడం, తెలుగు రాష్ట్రాలలో బీజేపీ తెలుగుదేశం అండ కోరుకుంటోందా? అన్న అనుమానాలు రావడానికి కారణమైంది.  అదీ కాక చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యవహారంలో వైసీపీ బీజేపీని లాగడం, కేంద్రంలోని మోడీ, షాల అండతోనే చంద్రబాబును అరెస్టు చేశామంటూ ఆ పార్టీ నేతలు బాహాటంగానే ప్రకటనలు చేయడం, అన్నిటికీ మించి ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చంద్రబాబు అరెస్టు విషయంలో తనకు ఏ మాత్రం సంబంధం లేదనీ, అంతా కేంద్రంలోని బీజేపీ సర్కారే చేయించిందన్నట్లు మాట్లాడటంతో సహజంగానే కేంద్రం డిఫెన్స్ లో పడింది. ఒక్క ఆధారం లేకుండా 32 రోజులుగా చంద్రబాబును అక్రమంగా ఖైదులో ఉంచడం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. విదేశాలలో కూడా బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇది బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. జగన్ లాగే మోడీది కూడా కక్ష పూరిత రాజకీయమేనన్న భావన మెజారిటీ ప్రజలలో వ్యక్తం అవుతుండటంతో.. బాబు అరెస్టులో తమ పాత్ర లేదని చెప్పుకోవలసిన పరిస్థితి బీజేపీకి ఎదురైంది. అందుకే అమిత్ షా స్వయంగా లోకేష్ తో భేటీకి ఆసక్తి చూపి, కిషన్ రెడ్డి ద్వారా కబురు చేశారని అంటున్నారు. అలాగే భేటీ అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్ట్ లో బీజేపీ పాత్ర లేదనడానికి అమిత్ షా స్వయంగా లోకేష్ తో భేటీ అవ్వడమే తార్కానమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ట్వీట్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

దసరాకు విశాఖకుజగన్ నిజమేనా? డిసెంబర్ అంటారేంటి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహమో, అలవాటో తెలియదు కానీ ఆయన చెప్పినదేదీ చేయరు. అన్న మాట నిలబెట్టుకోరు. నాలుగేళ్లుగా ఆయన పాలన తీరు ఇలాగే ఉంది. ప్రజలకు అరచేతిలో వైకుఠం చూపించి.. వాస్తవంలో నరకయాతన పెడుతున్నారు. బటన్ నొక్కి డబ్బులు పందేరం చేస్తున్నామంటారు కానీ.. ఆయన నొక్కిన బటన్ బాపతు సోమ్ములు ఎప్పుడు ఖాతాల్లో పడతాయా అని లబ్ధిదారులు నెలల తరబడి వేచి చూడాల్సిందే.  ఇక ఉద్యోగుల జీతాలు, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన పెన్షన్లు ఏ నెలకాల సకాలంలో పడి చాలా చాలా కాలమే అయ్యింది. ఒకే సారి జీతాల పంపిణీ అన్నది అసలు లేనే లేదు.  ఇక ఆయన మూడు రాజధానుల ముచ్చట అన్నది అంతం లేని కథలా నాలుగున్నరేళ్లుగా సాగుతూనే ఉంది. కోర్టులు కూడదంటున్నా.. ఆయన ఆ పాట పాడుతూనే ఉన్నారు. తాజాగా దసరా నుంచి తన మకాంను విశాఖకు మార్చేస్తామని గట్టిగా చెప్పారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లూ కూడా జరిగిపోతున్నాయి.  జగన్ విశాఖ మకాం గురించిన వార్తలు గత నాలుగేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. మార్చి పోతే సెప్టెంబర్ ఉందిగా అన్నట్లు ముహూర్తాలు ఖరారు అవుతూనే ఉన్నాయి. వాయిదాలు పడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్నికల గడువు వచ్చేసింది. ఈ దసరాకు కాకపోతే సంక్రాంతికి అనే చాన్స్ లేదు. ఇక తాడేపల్లి ప్యాలెస్ నుంచి కదలడమంటూ జరిగితే.. అధికారాన్ని వదులుకుని ఇంటికి వెళ్లిపోవడమే. వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలిచే చాన్స్ అస్సలు లేదన్న విశ్లేషణలు, సర్వేలను బట్టి అలాగే అనుకోవాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు.   అందుకే ఇప్పుడు దసరా నుంచి విశాఖలోనే జగన్ అంటూ గట్టిగానే చెబుతున్నారు వైసీపీ నాయకులు.  ఇక దసరా  రోజుల్లోకి వచ్చేసింది.  ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ ఓ జీవో విడుదల చేసింది. అదీ జగన్ రెడ్డి విశాఖకు మకాం మార్చే విషయంలోనే. విశాఖలో సీఎంకు వసతి చూసేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్లుగా  జీవో జారీ అయ్యింది. వైసీపీ నేతలు, శ్రేణులూ ఇప్పటికే  జగన్ వసతికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని చెప్పేశారు. మరి తాజాగా ఈ జీవో ఎందుకని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  ఇప్పుడీ జీవో జారీ చేసి.. దసరా నాటికి  అంటే రోజుల వ్యవధిలోనే విశాఖలో జగన్ కోసం నివాస భవనం, క్యాంప్ కార్యాలయం ఇలా అన్నీ ఏర్పాటు చేసేస్తారా? అంటూ నిలదీస్తున్నారు.  నిబంధనలను తుంగలో తొక్కి మరీ రుషి కొండపై భారీ వ్యయంతో నిర్మించిన భవనాన్ని ఆయనకు కేటాయిస్తూ  సిఫారసు చేయించుకునేందుకే  జీవో జారీ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే జగన్ విశాఖకు మకాం మార్చేందుకు ముహూర్తం వాయిదా పడిందంటూ పార్టీ వర్గాల  నుంచి లీకులు  వస్తున్నాయి. దసరా నాటికి జగన్ విశాఖకు మకాం  మార్చే అవకాశం లేదనీ, అయితే డిసెంబర్ లో మాత్రం పక్కాగా ఆయన అక్కడి  నుంచే పాలన సాగిస్తారని అంటున్నారు.  అయితే ఆయన విశాఖ నుంచి పాలన సాగించేందుకు దసరా ముహూర్తం వాయిదా పడటానికి అమరావతి కేసులే కారణమని అంటున్నారు. డిసెంబర్ లో సుప్రీం కోర్టులో ఈ కేసుల విచారణ జరుగుతుంది కనుక  కోర్టు  తీర్పు కోసం అప్పటి వరకూ వేచి చూడటమే మంచిదని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే నిజంగా కోర్టుల తీర్పులను గౌరవించి, ఆ ప్రకారం  నడుచుకునే పరిస్థితే ఉంటే ఊరికి ముందే విశాఖ నుంచి పాలన సాగించేందుకు ముహూర్తాలను నిర్ణయించడమెందుకు అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  ఇప్పుడు విశాఖ నుంచి పాలన కోసం సీఎం నివాసం, క్యాంపు ఆఫీసు కార్యాలయాలను ఎంపిక చేయడానికి కమిటీని నియమిస్తూ జీవో జారీ చేయడం, విశాఖ  పాలన ముహూర్తం మారిందంటూ ప్రకటనలు చేయడం వెనుక ప్రస్తుతం చంద్రబాబు అరెస్టు కారణంగా ప్రజలలో వ్యక్తమౌతున్న ఆందోళన, ఆగ్రహాలను చల్లార్చి అందరి దృష్టీ జగన్ విశాఖకు  మకాం మార్చే విషయంపైకి డైవర్ట్ చేయాలన్న వ్యూహం ఉందని అంటున్నారు. అసలు రాష్ట్రంలో పాలనే లేదనీ, అలాంటి లేని పాలన ఎక్కడ  నుంచి సాగితే ఏముంది.. పళ్లూడగొట్టుకోవడానికి ఏ రాయి  అయితే ఏమిటి? అని జనం  అనుకుంటున్నారు. అసలు జగన్ అమరావతి నుంచైనా, విశాఖ నుంచైనా చేసిది ఏముంది..విపక్షాలను వేధించడం, ప్రజలను పీడించడం తప్ప అని జనం భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

చంద్రబాబుకు అస్వస్థత.. జైలుకు వైద్యుల బృందం

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అస్వస్థతకు గురయ్యారు.   రెండు తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం.. రాజమహేంద్రవరంలో ఎండలు మరీ ఎక్కువగా ఉండటం ఉక్కపోత కారణంగా చంద్రబాబు అలర్జీకి గురయ్యారు. జైలు అధికారులకు చంద్రబాబు తన సమస్యను వివరిస్తూ సమాచారం ఇవ్వటంతో అధికారులు రాజమండ్రి ప్రధాన ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. దీంతో గురువారం సాయంత్రం ఆస్పత్రి నుంచి ప్రత్యేక వైద్యుల బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చింది. తీవ్ర ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా ఆయన అలర్జీతో ఇబ్బంది పడుతున్నట్టు ధృవీకరించిన వైద్య బృందం చంద్రబాబుకు ప్రత్యేకంగా కేటాయించిన బ్యారక్ లోనే చికిత్స అందిస్తున్నారు.  కాగా, ఇది వరకే చంద్రబాబు సతీమణి ఆయన ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రోజూ వేడినీటితో స్నానం చేస్తారని, కానీ జైల్లో చన్నీళ్లు, దోమలతో ఇబ్బంది పడుతున్నారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, గత వారం రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో చంద్రబాబు ముందుగా డీహైడ్రేషన్‌కు గురైయ్యారు. ఇప్పుడు మరోసారి ఉక్కపోతతో ఆయనకు అలర్జీ సమస్య వచ్చింది. జైలు అధికారులకు భువనేశ్వరి ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల వరకు పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య వచ్చినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు భద్రత, ఆరోగ్యంపై మొదటి నుంచి తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఈ అంశాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ప్రభుత్వం నుండి స్పందన కూడా రాలేదు. ఆ తర్వాత జైల్లో చంద్రబాబుకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపించారు. జైల్లో దోమలు విపరీతంగా స్వైర్యవిహారం చేస్తున్నాయని, కనీసం చంద్రబాబుకు నిద్ర కూడా లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు జైల్లో దోమల బెడదపై ఫిర్యాదు చేసిన ఒకటి రెండు రోజులలోనే జైల్లో ఖైదీలలో ఒకరు డెంగ్యూతో మృతి చెందారు.  . ఆ తర్వాత జైల్లో ఖైదీల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఓ ఖైదీ గాయపడ్డాడు. ఈ విషయాన్నీ జైలు అధికారులు గోప్యంగా ఉంచారు. దీనిపై స్పందించిన జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పుకొచ్చారు. కానీ, గాయపడిన ఖైదీ అప్పటికే మీడియా ముందే జైల్లో తొక్కిసలాట గురించి చెప్పారు.   ఇప్పుడు   జైల్లో వెంటిలేషన్ లేకపోవడం, విపరీతమైన ఉక్కపోతతో చంద్రబాబుకు అలర్జీ సమస్య తలెత్తింది.   గతంలో సైతం చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం, మందులు, తదితర అంశాలపై భువనేశ్వరి కోర్టుకు వెళ్లగా కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ, ఇప్పుడు జైల్లో సౌకర్యాల లేమితో చంద్రబాబుకు సమస్య తలెత్తింది. ప్రస్తుతం చంద్రబాబు విడుదల కోసం ఎదురు చూస్తూ భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. తరచూ ఆయనతో ములాఖత్ అవుతూ ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తరచుగా ఆయన సమస్యలు బయటకి వస్తున్నాయి. ఇప్పుడు తలెత్తిన అలర్జీ సమస్య కూడా అలాగే బయటకు పొక్కగా.. జైలు అధికారులు హుటాహుటిన వైద్యులను తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నారు. స్కిల్ కేసులో ఆయనను అక్రమంగా అరెస్టు చేసిన ప్రభుత్వం నెల రోజులు దాటినా ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది.  ఏ తప్పు చేసినట్లు నిరూపించలేకపోయినా ప్రభుత్వం ఆయన్ను జైల్లో పెట్టి కక్షపూరితంగా వేధిస్తున్నది. కాగా అసోసియేట్ ప్రొఫెసర్ ఆప్ డెర్మటాలజీ డాక్టర్ జి సూర్యనారాయణతోపాటు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఆప్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సిహెచ్. వి. సునీత దేవితో కూడిన నిపుణులైన వైద్య బృందం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీ సూర్య ప్రభ.. ఓ ప్రకటన విడుదల చేశారు. 

లోకేష్‌కు క్లీన్ చిట్.. జగన్ బండారం బైటపడిపోయిందిగా?

వైసీపీ ప్రభుత్వం అక్రమంగా ఇరికించిన స్కిల్  కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టై   నెల రోజులు దాటింది.   ఇదే కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా  అరెస్ట్ కాబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తున్నది. స్వయంగా సీఐడీ చీఫ్ మీడియా సమావేశంలోనే లోకేష్ ను అరెస్టు చేస్తామని ప్రకటించారు.  లోకేష్ కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు.   ఈ కేసులో నారా లోకేష్‌కు క్లీన్ చిట్ లభించింది. స్వయంగా సీఐడీయే లోకేష్ ఈ కేసులో నిందితుడు కాదని కోర్టుకు తెలిపింది. గురువారం ఉదయం నుంచి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగ్గా మధ్యాహ్నానికి లోకేష్‌పై ఉన్న స్కిల్ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది. విచారణ సందర్భంగా సీఐడీ లోకేష్‌ను స్కిల్ కేసులో నిందితుడిగా తాము చేర్చలేదని చెప్పింది. అసలు లోకేష్ ను ముద్దాయిగా చూపని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఒకవేళ ఈ కేసులో నిందితుడిగా చేరిస్తే 41-ఏ కింద నోటీసులు ఇస్తామని న్యాయస్థానానికి సీఐడీ అధికారులు వెల్లడించారు.  నిజానికి చంద్రబాబు అక్రమ అరెస్ట్ అయిన వారానికే నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారని అధికార వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తెలిసిందే.  వైసీపీ మంత్రుల నుండి సలహాదారుల వరకూ అంతా మీడియా ముందుకొచ్చి లోకేష్ కూడా అరెస్ట్ కానున్నట్లు చెప్పారు.  ఒక కేసులో బెయిల్ దక్కినా ఎన్ని కేసులైనా పెట్టి ఆయనను కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు శపథాలు కూడా చేశారు. అప్పటికి నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు.  లోకేష్ ఢిల్లీ నుండి రాగానే అరెస్ట్ చేయాలని భావించారు. కానీ లోకేష్ ఢిల్లీ నుండి వచ్చినా అరెస్ట్ చేయలేదు. మళ్ళీ లోకేష్ ఢిల్లీ వెళ్లినా వైసీపీ నేతల నుండి కానీ, సీఐడీ నుండి కానీ లోకేష్ అరెస్ట్ మీద ప్రకటనలు లేవు. ఇంకా చెప్పాలంటే అసలు ఏమైందో ఏమో కానీ తర్వాత అరెస్ట్ ఊసే లేకుండా పోయింది. కానీ, అప్పటికే లోకేష్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ పైన ఈ నెల 4న విచారణ జరగగా.. అప్పుడు  గురువారం(అక్టోబర్ 12) వరకూ అరెస్ట్ చేయవద్దని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది. నేడు మరోసారి విచారణ జరగగా సీఐడీ తరపు లాయర్లు కోర్టుకు తమ వివరణ ఇచ్చారు. అసలు స్కిల్ కేసులో లోకేష్ నిందితుడే కాదని, ఆయనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధంలేదని న్యాయస్థానం ముందే సీఐడీ క్లియర్ కట్ గా చెప్పింది. లోకేష్‌ను స్కిల్ కేసులో నిందితుడిగా తాము చేర్చలేదని, ముద్దాయిగా చూపని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తెలిపింది. దీంతో ఈ కేసులో లోకేష్ కు కంప్లీట్ రిలీఫ్ లభించింది.  గతంలో ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ నిందితుడు కాదని చెప్పగా.. ఇప్పుడు స్కిల్ కేసులో కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. స్కిల్   కేసు విషయంలో మొదట్నుంచీ అన్నీ అనుమానాలే. అసలు ఈ కేసు చంద్రబాబు, లోకేష్ పేర్లు లేవు. కానీ, ఉద్దేశ్యపూర్వకంగానే  చంద్రబాబును అరెస్టు చేసి.. ఆ తరువాత ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు చేర్చారు. ఇప్పుడు ఆధారాలు చూపలేక నానా తిప్పలూ పడుతున్నారు. నెల రోజులుగా ఈ కేసును నిరూపించుకునేందుకు న్యాయనిపుణులు, సీనియర్ న్యాయమూర్తుల సలహాలతో సీఐడీ మల్లగుల్లాలు పడుతుంది. ఇది అక్రమ కేసని ఇప్పటికే ప్రజలకు క్లియర్ కట్ గా అర్ధమైపోయింది. అలాంటిది ఇప్పుడు ఈ కేసులో లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తే సమస్య మరింత ముదురుతుందని భావించే వెనక్కు తగ్గినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో  వైసీపీ తన పతనాన్ని తనే శాశించుకుందనీ, ఇక లోకేష్ ను కూడా అరెస్టు చేస్తే ఉనికే లేకుండా పోతుందన్న తత్వం బోధపడటంతోనే జగన్ సర్కార్ వెనక్కు తగ్గిందని అంటున్నారు. స్కిల్ కేసులో లోకేష్ కు క్లీన్ చిట్ ఇస్తూ సీఐడీయే కార్టుకు తెలియజేయడంతోనే జగన్ బండారం బైటపడిపోయిందనీ, కేవలం కక్ష సాధింపు కోసమే చంద్రబాబును అరెస్టు చేశారనీ మరో  నిర్ద్వంద్వంగా తేలిపోయిందనీ అంటున్నారు. 

కాషాయ దళం.. నీతుల మాటున రోత రాజకీయం?

కాషాయ దళం నీతుల మాటున రోత రాజకీయం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కన్నా తాము విలక్షణమైన రాజకీయ పక్షంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కమలనాథులు కాంగ్రెస్ కంటే ఎక్కువగా మురికి రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. మోదీ పాలన పదేళ్లుగా ఆసాంతం అసత్యమేవ జయతే అన్న రీతిలో సాగింది.మోదీ మాటల్లో ఉన్న నీతి, నిబద్దత, నిజాయితీ చేతల్లో లేదని రుజువైంది. అవినీతి అంతం నా పంతం అని ప్రగల్భాలు పలికి ఎల్లలెరుగని అవినీతికి పాల్పడిన అవినీతిపరులతో చేతులు కలిపి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చు కొంటుంన్నారు. ఆర్ధిక నేరస్తుల  అంతుచూస్తానని బూటకపు వాగ్దానంతో దేశ ప్రజల్ని బురిడి కొట్టించారు. ఆర్దిక నేరస్తులకు, కార్పొరేట్ వర్గాలకు చౌకీదారుగా మోదీ వ్యవహరిస్తున్నారు తప్ప దేశ ప్రయోజనాలకు  మాత్రం కాదు.  తాము అధికారంలోకి వస్తే చట్టసభలకు ఎన్నికైన నేరచరితుల ప్రమాణ పత్రాలను సుప్రీం కోర్టుకు అందించి ఆయా కేసులపై సత్వర విచారణ జరిపి ఏడాదిలోగా తీర్పు వెల్లడించాలని కోరుతామని 2014ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చిన హామీ ఏమయింది?  మీ రాజకీయ అవసరాల కోసం ఎన్ని వేలకోట్లు ప్రజాధనం లూటీ చేసినా వెనుకేసుకొస్తారా? ఇదేనా అవినీతి నిర్మూలన? ఇదేనా ఆర్ధిక నేరగాళ్ల భరతం పట్టడం? ఇదేనా మోదీ సత్య సంధత? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆర్ధిక నేరగాళ్లను నిరపరాధులుగా తీర్మానించే దుష్ట రాజకీయం  మోదీ పాలనలో కొత్త కోరలు తొడుక్కుంది. దేశంలో తనకు అనుకూలమైన ఆర్ధిక నేరగాళ్ళు బోరవిరుచుకుని తిరిగే సౌలభ్యం కలిగిస్తున్నారు మోదీ. అది మరిన్ని నేరాలకు దారితీసే ప్రమాదముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు  నీతుల మాటున రోతరాజకీయాలు చేస్తూ తిరిగి అధికారంలోకి రావాలని అడ్డదారులు తొక్కుతు అనైతిక పద్దతులు అవలంబిస్తున్నారు. మోడీ పాలనలో దేశ ప్రజాస్వామ్యానికి చీకట్లు కమ్ముకొన్నాయి.14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా వున్న చంద్రబాబు పై ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసు పెట్టి జైలులో పెట్టడం వెనుక  కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉండని దేశమంతా కోడై కూస్తున్నది. చంద్రబాబు పై ఎందుకoత అక్కసు వెళ్లగక్కుతున్నారో అర్ధం కావడంలేదు. చంద్రబాబు చేసిన నేరం ఏమిటి? గతంలో  రాష్ట్ర హక్కుల కోసం, రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చమని నిలదీయడమేనా చంద్రబాబు చేసిన నేరం? బిజెపి తమ భావజాలం వదిలిపెట్టి జగన్ భావజాలం వంటపట్టించుకొని వికృతంగా వ్యవహరిస్తున్నదని ప్రజలే అంటున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు వెనుక  బిజెపి, వైసిపి ఆడుతున్న నాటకం ప్రస్పుటం అవుతున్నది. అడ్డదారిలో చంద్రబాబును  బంధించి అధికారంలోకి రావడం  కొరకు  బిజెపి, వైసిపి  లు సిద్ద పడినట్లు కనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో  చంద్రబాబు అధికారాన్ని అడ్డుకొనేందుకు మహా కుట్రల సిద్దాంతాన్ని బిజెపి-వైసిపి ప్రయోగించారు.  గతంలో ప్రజాస్వామ్య సంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం పనిచేసిన చరిత్ర బీజేపీదని, ప్రజాస్వామ్య వ్యవస్థల స్వేచ్చా స్వాతంత్ర్యంల పరిరక్షణలో తమ క్రియాశీల పాత్రను అద్వాణీ ఆ మధ్య గుర్తు చేసారు. విలక్షణ రాజకీయ పక్షంగా బీజేపీని నిలబెట్టే క్రమంలో తాము పెంచి పోషించిన విలువలకు వలువలు ఊడతీస్తున్నారని అద్వాణీ ఆవేదన చెందారు. సమకాలీన రాజకీయపక్షాల పట్ల శతృత్వ భావన పోవాలని, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించుకోవాలని, రాజ్యాంగ వ్యవస్థల ఔన్నత్యాన్ని నిలబెట్టాలని అద్వాణీ హితబోధ చేసారు. రాజకీయంగా విభేదించే వారిని శత్రువులుగా చూడరాదని అద్వాణీ అనడం మోదీ పెడ ధోరణికి, నియంత మనస్తత్వానికి అద్దం పడుతుంది. దీనిని బట్టి మోదీ ఎంత ప్రమాదకారో అడ్వాణి ప్రకటనలను బట్టి అర్ధం అవుతుంది. అధికారంలో కొనసాగడానికి అనైతిక పద్ధతులు అవలంబిస్తూ మురికి రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు కమలనాధులు.     ఎటువంటి ఆధారాలు లేకుండా నిరపరాధి, 73 ఏళ్ల  చంద్రబాబును అత్యంత దారుణాతి దారుణంగా వేధిస్తూ అరెస్టు చేసి అర్ధరాత్రి రాజమండ్రి జైలులో బంధించి 30 రోజులు దాటినా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఖండించేందుకు నోరు తెరవ లేదంటే వారి వ్యూహం ఏమిటో పక్కాగా అర్ధం అవుతున్నది. తెలంగాణా ప్రభుత్వం జగన్ చెల్లెలు షర్మిలను అరెస్టు చేస్తే తెల్లవారి పాటికి  ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోడీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 45 ఏళ్ల రాజకీయ చరిత్ర వున్నచంద్రబాబు ను అరెస్టు చేస్తే  ఖండించలేదంటే మోడీ ,షా ఎంత విద్వేషంతో వున్నారో అర్ధం అవుతున్నది. వారికి  సంబంధలేక పోతే  చంద్రబాబుని అరెస్టు పై  ఎందుకు మాట్లాడరు అని ప్రజలు  ప్రశ్నిస్తున్నారు.1999 నుండి 2004 వరకు 29 మంది ఎంపీలతో  చంద్రబాబు కేంద్రానికి  మద్దతు ఇవ్వక పొతే  కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో కొనసాగేదా? చంద్రబాబు బీజేపీకి చేసిన ద్రోహం ఏమిటి?  కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చమని చంద్రబాబు గట్టిగా అడగడమే చంద్రబాబు చేసిన నేరమా?  రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలు అయినా వుండాలి. లేకుంటే తమ కనుసన్నల్లో నడిచే, తమ అడుగులకు మడుగులోత్తే ప్రభుత్వాలు  అయినా వుండాలి ఇదీ బిజెపి లక్ష్యం గా కనిపిస్తున్నది. ప్రధాని మోడీకి అందరు అవినీతి పరులుగా కనిపిస్తారు. కానీ బిజెపికి మద్దతు ఇచ్చే వారు ఎన్ని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినా వారి అవినీతి కనిపించదు. వారి గురించి మాట్లాడరు. ప్రధాని మోడీ  దృష్టిలో వారు  అవినీతి పరులుకారు.  బిజెపికి మద్దతుగా నిలిచేవారు నీతి మంతులే.  బిజెపిని  వ్యతిరేకించే వారుఅందరూ  అవినీతి పరులే. అధికారం కోసం, రాజకీయ అవసరాల కోసం అవినీతి పరులను అక్కున చేర్చుకోవడాన్ని ఏమనాలి?  ప్రధాని మోదీ అవినీతిపరుడు కాక పోవచ్చు.. కానీ రాజకీయ  అవసరాల కోసం అవినీతి పరులను ఆదరించడం అవినీతి పరులను కాపాడటం కూడా అవినీతి కిందికే వస్తుంది. అత్యంత అవినీతి పరుల  విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రదర్శిస్తున్న ఔదార్యం దేనికి సంకేతం? రాజకీయంగా తమకు మద్దతు ఇవ్వని ప్రతిపక్ష నాయకుల పట్ల అక్రమ కేసులు పెట్టి  వేధిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఎందుకు   భయంకరమైన అవినీతి కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన  వారిపై డజన్లు కొద్ది  సీబీఐ కేసులు నమోదై పన్నెండు ఏళ్ళు దాటినా  ముందుకు పోకుండా అడ్డుకుంటున్నది.  2019 ఎన్నికల్లో అత్యంత అవినీతి పరుడు జగన్ గద్దె నెక్కడానికి మద్దతుగా నిలిచింది బిజెపి ? నేడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నా అండగా నిలిచింది బిజెపి. ప్రతిపక్షం తెలుగు దేశాన్ని  అణచివేసే భాధ్యతను వైసీపీ కి అప్పగించింది బిజెపి అధిష్టానం. అందుకే అరాచక పాలన చేస్తూ,అక్రమ కేసులు పెడుతూ, ప్రతిపక్షం సభలను,రోడ్ షోలను అడ్డుకొంటూ నిర్భందించడం అందులో భాగమే. కేంద్రం అండదండలు లేకుండా జగన్ ఇంత  నిరం కుశంగా పాలన సాగించలేరు. జగన్ భుజం పై తుపాకి పెట్టి  తెలుగుదేశాన్ని కాల్చాలని చూస్తున్నది బిజెపి అధిష్టానం.ముందు చంద్రబాబుని దెబ్బతీస్తే, జగన్ రెడ్డిని ఎప్పుడైనా దెబ్బతీయవచ్చని బిజెపి ఆలోచన. జగన్ రెడ్డి వేదింపులు,ప్రతీకారం  తట్టుకోలేక చంద్రబాబు తమ వద్దకు వచ్చి లొంగి పోవాలని బిజెపి భావిస్తున్నది. అందుకే రాష్ట్రంలో ఫాసిస్టు పాలనకు అండగా నిలుస్తున్నది బిజెపి.                              బిజెపి -వైసీపీ మధ్య క్విడ్ -ప్రోకో ఒప్పం జరిగింది. చట్టం ముందు అందరు సమానమే  అన్న సూక్తి జగన్ విషయంలో ఎందుకు అమలు కావడం లేదు? రాజకీయ అవసరాల కోసమే జగన్ పై ఈగ వాలనీయడం లేదు.కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుక లా వ్యవహరిస్తూ ప్రధాన కేసులను సీబీఐ  నీరు కారుస్తున్నది. ఈ డీ,సీబీఐ కేసులే కాదు బాబాయి వివేకా హత్య కేసులలోనూ అండగా నిలుస్తున్నది బిజెపి..వివేకానంద రెడ్డి హత్యకు కారకులు ఎంపీ అవినాష్ రెడ్డి,ఆయన తండ్రి బాస్కర్ రెడ్డి అని సీబీఐ చార్జి షీట్ లో నిర్ధారించింది.అవినాష్ రెడ్డిని అరెష్టు చేయాలని సీబీఐ అధికారులు అనుకొన్నా అది జరగ లేదంటే ఇందులో కూడా కేంద్ర పెద్దల సూచనల మేరకే సీబీఐ వ్యవహరించింది .కేంద్రం తో జగన్ అనుభంధ ఫలితమే అని చెప్పాలి . పీకల్లోతు అవినీతి కేసులు నుండి జగన్ బయట పడాలి అంటే కేంద్ర బిజెపి పెద్దల చల్లని చూపు అవసరం. రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇవ్వక పోయినా జగన్-కేంద్రప్రభుత్వంతో  పోరాడే పరిస్తితి లేక రాష్ట్ర ప్రయోజనాలే తాకట్టు పెట్టారు.కేంద్రం రాష్ట్రానికి న్యాయం చెయ్యక పోగా,రాష్ట్రాన్ని అన్నీవిధాలా నాశనం చేస్తున్న జగన్ కేంద్రానికి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు.                      ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా చంద్రబాబుని అరెస్టు చేసిన జగన్  ప్రభుత్వానికి బిజెపి అండగా నిలవడం అత్యంత దుర్మార్గం. బిజెపికి అండగా నిలిచిన వారు,మద్దతు ఇచ్చిన వారు ఎంత  అవినీతికి పాల్పడినా పర్వాలేదు. వారికి  మద్దతు ఇస్తున్న అవినీతి పరులందరు నిర్దోషులని ప్రధాని మోదీ నమ్ముతున్నారు? అలా భావిస్తే ఆ మాటే ప్రజలకు చెప్పండి, మీకు మద్దతు ఇస్తున్న జగన్ పై వున్న కేసులు ఎత్తి వెయ్యండి? ఒక పక్క అవినీతి ఆరోపణలు ఉన్నవారి పట్ల  ఉదాసీనత చూపిస్తూ,మరో పక్క ప్రతిపక్షాలు  అవినీతిపరులని చేస్తున్న ఆరోపణలకు  విలువ ఉంటుందా?బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో  మంత్రులుగా ఉన్నవారు అవినీతికి పాల్పడినా, ఆ యా రాష్ట్రాల్లో బిజెపి వారి పై  అవినీతి ఆరోపణలు వచ్చినా మంత్రులపై సీబీఐ, ఈడీ అధికారుల దాడులు జరగనే జరగవు, వారి పై ఈగ కూడా వాలదు. అదే ఇతర రాజకీయ ప్రభుత్వాల మంత్రులు పై  ఆరోపణలు రావడమే ఆలస్యం వారి ఇళ్ల పై  సీబీఐ, ఈడీ అధికారులు వాలిపోతారు.అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బిజెపిలో జాయిన్ అవగానే పవిత్రులుగాను, అవినీతి ఆరోపణలు వచ్చిన వారు బీజేపీలో చేరకుంటే  అవినీతి పరులుగా చూపిస్తున్నారు. ఇంతటి వ్యత్యాసం చూపుతున్నప్పుడు ప్రధాని మోదీ చెబుతున్న సుభాషితాలకు విలువ ఏమి ఉంటుంది?అధికారంలోకి రాగానే రాజకీయ నాయకుల పై వున్నఅవినీతి కేసుల లెక్క తేలుస్తామని,విచారణ వేగంగా పూర్తీ చేసి రాజకీయాలను ప్రక్షాలన చేస్తామని 2014 ఎన్నికల ప్రచార సభల్లో మోడీ  హామీ ఇచ్చి పదేళ్ళు కావస్తుంది. మరి పదేళ్లుగా  అవినీతి పరులు పై ఈగైనా వాలిందా?అవినీతి పరుల అంతు చూసే బలం,చేవ,ధైర్యం,సమర్ధత ఉండి కూడా చర్యలు తీసుకోక పోవడంలో ఆతర్యం ఏమిటి? 2014 ఎన్నికల్లో అధికారం ఇస్తే అచ్చే దీన్ తెస్తాను అన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక ఆర్ధిక నేరస్తులకే అచ్చే దీన్ వచ్చింది నిజం కాదా?                     ఆర్ధిక నేరగాళ్ల అంతు చూడటమే నా పంతం అని ప్రగల్భాలు పలికి ఎల్లలెరుగని అవినీతికి పాల్పడిన ఆర్ధిక నేరస్తులను  అక్కున చేర్చుకొన్నారు. జగన్ అవినీతి కేసులు ఎన్నేళ్లకు తెములుతాయో చెప్పగల నాధుడు లేడు. న్యాయస్థానాల ఆదేశాల మేరకు విచారణ జరుగుతున్న కేసుల్లో  కూడా సత్వరం దోషులకు శిక్షలు పడతాయనుకొనే వీలులేకుండా పోయింది. ఆర్ధిక నేరస్తుల పై వున్న కేసులను ఏడాదిలోగా విచారణ పూర్తి చేసి శిక్షలు పడే విధంగా చూడాలని దేశ సర్వోన్నత న్యాయ స్థానం అభిప్రాయ పడింది. ప్రభుత్వ సహకారంతో వేలకోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వారిపై విచారణ జరిగే తీరు ఇదేనా? టన్నులు కొద్దీ పత్రాలు సాక్షాధారాలు వున్న  కేసుల విచారణ నత్తనడక నడవడంలో ఔచిత్యం ఏమిటి?  వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేసిన వారి పట్ల కేంద్రప్రభుత్వం, సీబీఐ ఉదాసీనంగా వ్యవహరించడంలో ఆంతర్యం  ఏమిటి?మేం అధికారంలోకి రాగానే రాజకీయ నాయకులపై వున్న అవినీతి కేసుల లెక్క  తేలుస్తాం,విచారణ వేగంగా పూర్తిచేసి రాజకీయాలను ప్రక్షాలన చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ 2014 ఎన్నికల ప్రచార సభల్లో వల్లించిన ఘన ఆదర్శాలు గాలికి పోయాయి.మోడీ పాలనలో  ఆర్ధిక నేరస్థుల పై ఈగైనా వాలక పోగా  అపూర్వ వైభవంతో వెలిగిపోతున్నారు. అధికారంలోకి వస్తే ఆర్ధిక నేరస్థుల అంతు చూస్తానని ఇచ్చిన హామీ కూడా నేతి బీర చందమైంది..దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చెయ్యడానికి మోడీ చెయ్యని దుర్మార్గం లేదు. అవినీతిపరులను అంతుచూస్తానని బూటకపు వాగ్దానంతో బురిడి కొట్టించి అధికారంలోకి వచ్చి అవినీతి పరుల మోచేతి నీళ్ళు తాగుతున్నారు.అవినీతి పరులు బోరవిరుచుకు తీరుతుంటే,శాసన నిర్మాతలై వెలిగిపోతుంటే ప్రధానికి కనిపించడం లేదా?ఆర్దిక నేరస్తులకే చౌకీదారుగామోదీ వ్యవహరిస్తున్నారు తప్ప దేశ ప్రజలకు మాత్రం కాదు. నీతులు మాటున రోతరాజకీయాలు చేస్తూ తిరిగి అధికారంలోకి రావాలని అడ్డదారులు తొక్కుతు అనైతిక పద్దతులు అవలంభిస్తున్నారు కాషాయదళం.                                           నీరుకొండ ప్రసాద్ 

అప్పాయింట్ మెంట్ అడగలేదు.. కిషన్ రెడ్డితో కబురుపంపిస్తేనే అమిత్ షానుకలిశా.. లోకేష్ స్పష్టీకరణ

అమిత్ షాతో భేటీ నేపథ్యాన్ని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మీడియాకు వెళ్లడించారు. తాను అమిత్ షాను అప్పాయింట్ మెంట్ కోరలేదనీ, ఆయన పిలుపు మేరకే వెళ్లి కలిశాననీ స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తనకు ఫోన్ చేసి అమిత్ షా తనను కలవాలని  అనుకుంటున్నారని  చెప్పారని ఆయన వివరించారు. హస్తినలో గురువారం (అక్టోబర్ 12) మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన లోకేష్.. అమిత్ షాతో భేటీలో జగన్ సర్కార్ అరాచకాలను వివరించినట్లు తెలిపారు. అంతే కాకుండా చంద్రబాబు అక్రమ అరెస్టు, తనపై కేసుల పేరుతో వేధింపులు సహా అన్ని విషయాలనూ వివరించానని లోకేష్ అన్నారు.  చంద్రబాబుకు జైల్లో భద్రత  విషయంపై తమ ఆందోళనను అమిత్ షాకు తెలియజేసినట్లు చెప్పిన లోకేష్  ఈ సందర్భంగా తనను సీఐడీ ఎందుకు విచారణకు పిలిచిందీ, ఎన్నికేసులు పెట్టింది వంటి వివరాలు అడిగారన్నారు.