మేనిఫెస్టోలో హామీల సునామీ

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. షెడ్యూల్ విడుదలకు ముందే  రాష్ట్రంలోని 119 స్థానాలలో 115 స్థానాలలో పార్టీ అభ్యర్థులను ప్రకటంచి దూకుడు ప్రదర్శించిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఆ తరువాత ఎందుకో నెమ్మదించారు. అయితే తాజాగా  ఆదివారం (అక్టోబర్ 15) బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తలదన్నేలా ఈ మేనెఫెస్టోను రూపొందించారు.  హ్యాట్రికగ్ గెలుపే లక్ష్యంగా  కేసీఆర్  ఈ మేనిఫెస్టోలో కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఇవే.. # హైదరాబాదులో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు   # అనాథ బాలల కోసం   అర్బన్ పాలసీ # అసైన్డ్ భూములపై ఆంక్షల ఎత్తివేత # ఆహాక భద్రత కార్డు హోల్డర్లందరికీ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి.. రూ.5 లక్షలతో బీమా సౌకర్యం...  # సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ # తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకం # అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ # పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ # జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు # ఆరోగ్యశ్రీ బీమా మొత్తం రూ.15 లక్షలకు పెంపు # దివ్యాంగులకు పెన్షన్ రూ.6 వేలకు పెంపు # సాధారణ మరణానికి కూడా కేసీఆర్ బీమా వర్తింపు # తెలంగాణ అన్నపూర్ణ' పథకం తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్న బియ్యం... # ఆసరా పింఛన్ల మొత్తం దశలవారీగా పెంపు # పింఛన్లు ఏడాదికి రూ.500 చొప్పున రూ.5 వేల వరకు పెంపు # రైతు బంధు దశలవారీగా రూ.16 వేల వరకు పెంపు # కౌలు రైతులకు ఆర్థిక సహాయం # వ్యవసాయ స్థిరీకరణ కొనసాగింపు  

కులగణన.. ఎన్నికల ముందు కులాల చిచ్చుకేనా?

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఏ కులంలో ఎంత మంది ఉన్నారు? అందులో మగవారు ఎంతమంది.. ఆడవారు ఎంతమంది?, మళ్ళీ అందులో పిల్లలు ఎంతమంది? వారి వయస్సు, వారి ఆర్ధిక పరిస్థితి, ఇల్లూ వాకిలీ, ఉద్యోగం సజ్జోగం, వ్యాపారం ఉపాధీ, కూలీ నాలీ, సెల్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు ఇలా సమస్త సమాచారం సేకరించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఈ వివరాలతో కూడిన కుల గణన 2024 ఎన్నిక సమయానికి పూర్తి చేయాలని భావిస్తున్నది. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో పిల్లా జెల్లా ప్రతి ఒక్కరి సమస్త సమాచారం ఎన్నికల సమయానికి ప్రభుత్వం చేతిలో ఉండేలా ఈ కులగణన చేపట్టేందుకు కసరత్తులు చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 14 వేల 5 వందల గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మంది ఉద్యోగులు, మరో నాలుగు లక్షల మంది గ్రామ వాలంటీర్లు ఉండగా వీరి ద్వారానే ఈ సమస్త డేటాను సేకరించనున్నట్లు తెలుస్తున్నది. నవంబరు 14 నుంచి ఈ కులగణన మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.  అయితే, ఏపీ సర్కార్ ఇప్పటికిపుడు ఇలా కులగణన చేయాలని ఎందుకు నిర్ణయించుకుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ గణన వలన వైసీపీ ప్రభుత్వానికి వచ్చే లాభమేంటి? ఈ గణనలో తీసుకున్న డేటా ఆధారంగా వైసీపీ ప్రభుత్వం ఏం చేయబోతున్నది? అసలు ఎన్నికలకు ముందు కులగణన చేయడం వెనక ఆంతర్యం ఏంటి? ఈ గణనలో తీసుకున్న డేటా భద్రంగానే ఉంటుందా? సచివాలయ ఉద్యోగులు ఈ డేటాను ప్రభుత్వానికి సక్రమంగా అందిస్తారా? ఫక్తు వైసీపీ కార్యకర్తలైన గ్రామ, వార్డు వాలంటీర్లు ఈ డేటా సేకరణలో విధులు నిర్వర్తించడం సమంజసమేనా? కోట్ల మంది ప్రజల ఆధార్, బ్యాంకు వివరాలు ఎలాంటి అర్హతతో నియమించని సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల చేతికి అందించడం న్యాయబద్దమేనా వంటి పలు అనుమానాలు ఇప్పుడు ప్రజలను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఈ కులగణనపై సందేహాలు ముప్పిరిగొంటున్నాయి. నిజానికి, ఒకప్పుడు కేవలం కుల సంఘాలు మాత్రమే ఈ కుల గణన చేపట్టేవి. వారి కులంలో ఆర్ధిక, కుటుంబ స్థితిగతులను తెలుసుకున్న కుల పెద్దలు.. వారి కుల అభివృద్ధికి కొన్ని పాలసీలు తీసుకొచ్చేవారు. కానీ, ఇపుడు ఆ పని నేరుగా ప్రభుత్వమే చేపట్టనుంది. ఈ కులగణన ద్వారా ఆయా కులాలకు ఏర్పాటు చేసిన కార్పోరేషన్ల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వ వర్గాలు చెప్పుకొనే అవకాశం ఉంది. అయితే  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కులాలకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. బడ్జెట్ లో కేటాయించిన నిధులను కూడా వివిధ సమయాల్లో తిరిగి ప్రభుత్వ ఖజానాకు మళ్ళించుకొని బటన్ నొక్కుడుకు వినియోగించేసింది. ఇదే కార్పొరేషన్లను అడ్డం పెట్టుకొని కూడా అప్పు చేసి వాటినీ మళ్ళీ అదే పనికి ఉపయోగించింది. కానీ, ఇప్పుడు ఇలా కులగణనతో మరోసారి లెక్కలు తేలుస్తామని చెప్తుతున్నది.  అయితే, ఈ కులగణన రాజకీయం, ఓటు బ్యాంకులో భాగంగానే చేపడుతున్నట్లు రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. కేవలం రేపు ఎన్నికలలో తెలుగుదేశం ఓటర్లను ఏరివేసేందుకు మాత్రమే ఈ   డేటా పనిచేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎంతమంది జనాభా ఉన్నారు? ఏ కులం ఆధారంగా రాజకీయం చేస్తే ఓట్లు రాలతాయి? ఏ కులానికి గాలమేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయి? ఏ కులానికి హామీలిస్తే ఓట్లు పడతాయి అనే దాని కోసమే ఈ కులగణన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.   సరిగ్గా ఎన్నికల ముందు ఈ కులగణన రాష్ట్రంలో మరోసారి చిచ్చుపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే పలు సామజిక వర్గాలలో అసంతృప్తి నెలకొన్న తరుణంలో ఇలా ఇప్పుడు ఈ కులాల కుంపటిని రగిలించి చిచ్చు పెట్టి  లబ్ది పొందేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టనుందని అంటున్నారు.  

జగన్ విశాఖ మకాం ముహూర్తం మళ్లీ మారింది!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహన్ రెడ్డి విశాఖ నుండి పాలన ఎప్పుడు అంటే వచ్చే నెలలోనే అనే మాట వినిపిస్తుంది. కానీ  నాలుగేళ్లుగా ఇదే మాట వినిపిస్తుంది. కాకపోతే అప్పుడేమో విశాఖ రాజధాని, ఇప్పుడేమో విశాఖ నుండి సీఎం పాలన అని కాస్త మాట తేడా వచ్చింది.  కానీ సీఎం మకాం మార్చేది ఎప్పుడంటే రేపే అన్నట్లే ఉంది. సరే నాలుగేళ్ల ముచ్చట అంతా పక్కన పెట్టేయండి.. ఈసారి గ్యారంటీ.. ఈ దసరాకే జగన్ విశాఖకు మారిపోతారని ఈ మధ్య ప్రభుత్వ వర్గాలు, మంత్రులు.. జగన్ జగన్ అంటూ నిత్యం భజన పనిలో ఉండే ఎమ్మెల్యేలు బల్ల గుద్ది చెప్పారు. ఇప్పటికే విశాఖలో రుషికొండపై సీఎం నివాసం, సీఎం క్యాంపు కార్యాలయం కూడా సిద్దమవుతున్నాయని, ఫైనల్ ఫినిషింగ్ పనులు మాత్రమే ఉన్నాయని అవి కూడా దసరాకి ముందే పూర్తి అవుతాయని  వైసీపీ  నేత కన్నబాబు అక్కడే ఉండి ఈ పనులన్నీ ఒంటి చేత్తో చక్కబెడుతున్నారని చెప్పుకొచ్చారు. సీఎం విశాఖ రాక‌ కోసం వికేంద్రీక‌ర‌ణ జేఏసీ కూడా విశాఖ‌ప‌ట్నంలో భారీ స్వాగ‌త ఏర్పాట్లు చేయాల‌ని స‌మావేశం కూడా పెట్టుకుని నిర్ణయించుకుంది. అధికారులతో పాటు వైవీ సుబ్బారెడ్డి వంటి ముఖ్య నేత‌లు కూడా సీఎంకు తోడుగా విశాఖ‌కు షిఫ్ట్ అవుతున్నార‌ని చెప్పారు.  కానీ, ఈ దసరాకి కూడా జగన్ విశాఖలో అడుగు పెట్టే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. తాజాగా జగన్ సర్కార్ ఓ జీవో విడుదల చేసింది.  విశాఖలో సీఎంకు, ఇతర అధికారులకు వసతి చూసేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్లుగా జీవో జారీ అయ్యింది. మరోవైపు, వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి ఇదే విషయంపై కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ అక్టోబర్ లేదా నవంబర్ లో విశాఖకు వస్తారని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. సీఎంతో పాటుగా వచ్చే అధికారులకు విశాఖలో వసతులు సమకూర్చాల్సి ఉందని.. వీటి కోసం ఒక కమిటీని ఏర్పాటు అయ్యిందని చెప్పారు. దీంతో ఇప్పట్లో జగన్ విశాఖ మార్పు కలే అంటూ చర్చ మొదలైంది. ఎందుకంటే, ఇప్పటికే విశాఖలో జగన్ కోసం ఇల్లు, క్యాంపు ఆఫీసు సిద్ధం అయ్యాయని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. మరోవైపు జగన్ ఏమో వసతి చూడాలని జీవోలు ఇస్తారు. విశాఖ నగరంలో అధికారుల కోసం కూడా ఇళ్ల వేట ఏడాది నుండే జరుగుతుంది. కానీ, జీవోలు మాత్రం ఇప్పుడు ఇచ్చారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీఎంకు దగ్గరి బంధువైన సుబ్బారెడ్డి ఈ నెలలో లేదా వచ్చే నెలలలో అంటున్నారు. కానీ, వచ్చే నెలలో కూడా అనుమానమే. ఎందుకంటే ఈ కమిటీ సీఎం కోసం వసతిని ఖరారు చేసి.. కమిటీ ముందుగా సిద్ధం చేసిన సిఫారసు కాగితాల్ని సీఎస్‌కు సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ వర్గాలు అక్కడ ప్రభుత్వం నడిచేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి, ఇతర అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి వసతులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఒక రాష్ట్ర పరిపాలన యంత్రాంగం మొత్తం తరలించాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. అవన్నీ సిద్ధం అయ్యాకే అక్కడ నుండి పరిపాలన సాగించాల్సి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే సీఎం జగన్ ఈ నెలలో విశాఖకు మకాం మార్చే విషయంలో వెనకడుగు వేశారని చెప్తుతున్నారు. నిజానికి దసరాకు ముందే జగన్ విశాఖ ఇంట్లో గృహప్రవేశం చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టేందుకు మరికాస్త సమయం పట్టేలా ఉండడంతో వెనక్కు తగ్గినట్లు తెలుస్తుంది.  అయితే, వచ్చే నెలకు అయినా విశాఖలో పనులు పూర్తి అవుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నవంబర్ లో   మంచి రోజులు లేకపోవడం వంటి కారణాలతో అసలు వచ్చే నెలలో అయినా జగన్ విశాఖకు వెళ్తారా అన్న అనుమానాలు వ్వ్యక్తమవుతుండగానే.. డిసెంబర్ లో జగన్ తన పుట్టిన రోజు సందర్భంగా వెళ్తారన్న మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. అంతేకాదు, డిసెంబర్ లో అమరావతి కేసుల విచారణ ఉందని, కోర్టులంటే జగన్ కు అపారమైన గౌరవం ఉందని, అందుకే డిసెంబర్ లో విచారణ తర్వాతే విశాఖకు వెళ్తారకథనాలు కూడా వెలువడుతున్నాయి. అయితే ఎన్నికలకు ఒకటి రెండు నెలల ముందు హావుడిగా విశాఖకు మకాం మారుస్తారంటే అంత నమ్మశక్యంగా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా జగన్ అసలు విశాఖ ముచ్చటా నెరవేరేనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

రుషికొండ ప్యాలెస్ జగన్ బినామీలకు రాసిచ్చేశారా?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ రాజధాని కల నెరవేరుతుందో లేదో కానీ ఆయన విశాఖ రాజధాని పేరుతో చేస్తున్న హడావుడి మాత్రం అంతా ఇంతా కాదు. సాగర తీరాన అందంగా ఆకుపచ్చగా  చూడ ముచ్చటగా కనిపిస్తూ.. విశాఖ నగరాన్ని సముద్రుడి ఆగ్రహం నుండి కాపాడుతూ వచ్చిన రుషికొండకు ఇప్పుడు బోడి గుండు చేశారు. గత ఏడాదిగా ఈ కొండను తవ్వేసిన బకాసురులు.. గత ఆరు నెలలుగా యథేచ్ఛగా అక్కడ కట్టడాలను కూడా మొదలు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓపెన్ అయిపొయింది. ఔను నిజమే రుషికొండపై నిర్మాణాలు జరుగుతున్నాయని.. అవన్నీ ప్రభుత్వ భవనాలేనని ఒకసారి,  రాజధాని భవనాలని కాసేపు, కాదు కాదు పర్యాటక రంగానికి చెందిన భవనాలను మరొకసారి చెప్పుకొచ్చారు. కాగా  ఇక్కడే సీఎం నివాసం, క్యాంపు కార్యాలయాలు నిర్మిస్తున్నామని ఈ మధ్యనే ప్రభుత్వ వర్గాలు బాహాటకంగా చెప్పుకొచ్చాయి. ఈ దసరా నాటికే ఈ భవనాలన్నీ నిర్మాణం పూర్తయి.. సీఎం జగన్ మోహన్ రెడ్డి గృహ ప్రవేశం చేయనున్నారని కూడా ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతున్నది.  అయితే తాజాగా ఈ రుషికొండ నిర్మాణాలపై మరొక షాకింగ్ వార్త ప్రచారంలోకి వచ్చింది. రుషికొండపై కట్టే సీఎం నివాసం అధికారంలో ఉన్నా లేకపోయినా జగనే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారని.. రేపు జగన్ అధికారం కోల్పోయినా ఆ నివాసం మరో ముఖ్యమంత్రికి చెందకుండా.. కేవలం జగన్ కోసమే కేటాయించేలా కుట్రలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇందు కోసం ఏకంగా ఆ నివాసాన్ని జగన్ బినామీల పేరుపై కొన్ని దశాబ్దాల పాటు ప్రభుత్వం లీజు అగ్రిమెంట్ చేసుకోనుందని కథనాలు వస్తున్నాయి. నిజానికి విశాఖ రుషికొండ ప్యాలెస్ నిర్మాణం వార్తలు రాగానే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిండా ఏడాది కూడా లేని ప్రభుత్వానికి జగన్ ఎందుకు కొత్తగా సీఎం నివాసాలు, క్యాంపు కార్యాలయాలు కడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నివాసంలో జగన్‌ ఎన్నాళ్లు కాపురం ఉంటారు. మహా అయితే మూడు నాలుగు నెలలే కదా.. సీఎంగా ఉన్నన్ని రోజులే కదా ఆ తర్వాత అవి ఖాళీ చేయాల్సిందే కదా అనుకున్నారు. ఎంత జగన్ ప్రభుత్వంలో కట్టినా అవి ప్రభుత్వ భవనాలు కదా ప్రభుత్వం మారితే ఖాళీ చేయాల్సిందే కదా అనుకున్నారు.  కానీ  ప్రభుత్వాలు మారినా అది జగనుకే చెందేలా ఇప్పుడు ప్రణాళికలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలే పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రుషికొండలో కట్టడాలను పర్యాటక శాఖ పేరిట నిర్మిస్తుంది. దాని నుండి ప్రభుత్వం సీఎం నివాసం, కార్యాలయం కోసం తీసుకోనుంది. సరిగ్గా ఇక్కడే జగన్ అండ్ కో ఒక స్కెచ్ వేసినట్లు తెలుస్తున్నది. పర్యాటక శాఖ నుంచి లీజు పేరిట జగన్ బినామీలకు 33 ఏళ్ల పాటు దారాదత్తం చేసి.. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వాళ్లకి తిరిగి అద్దె చెల్లించి ఎన్ని సంవత్సరాలకు కావాలంటే అన్ని సంవత్సరాలకు వాళ్ళ నుండి లీజ్ అగ్రిమెంట్ చేసుకొనే ప్రణాళిక అమలవుతున్నట్లు తెలుస్తుంది. ఉదాహరణకు ఏడాదికి మాత్రమే వాళ్ళు ప్రభుత్వానికి లీజుకి ఇచ్చినట్లు చూపిస్తే ఏడాది తర్వాత అక్కడ నుండి సీఎం ఖాళీ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి లీజుకి ఇచ్చుకోవచ్చు. ఇలా 33 ఏళ్ల పాటు అది జగన్ బినామీలపై అద్దె అగ్రిమెంట్ చేసుకొని.. జగన్ కోసమే అక్కడ ప్యాలెస్ నిర్మించుకున్నట్లు చెబుతున్నారు.   నిజానికి   2021 నుంచే ఇందుకు సంబంధించి తెరవెనుక తతంగం నడుస్తోందని కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. టూరిజం భవనాల  రీడెవల్‌పమెంట్‌ పై 2021 మార్చిలో కేబినెట్‌ ఒక తీర్మానం చేసింది. అయితే, ఈ తీర్మానం ప్రకారం రాష్ట్రమంతా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ఇలాగే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాల్సి ఉంది. కానీ, రుషికొండ మినహా రాష్ట్రంలో ఎక్కడా ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఎక్కడా ఇలాంటి లీజ్ అగ్రిమెంట్లు జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పర్యాటక భవనాల కోసం చేయాల్సిన ఖర్చంతా రుషికొండపైనే గుమ్మరించి ఇప్పుడు దాన్నే సొంతం చేసుకొనేలా అగ్రిమెంట్లు సిద్ధం చేసుకుంటున్నారు. కేవలం ఈ రుషికొండ భవనాల కోసమే అప్పుడు క్యాబినెట్ తీర్మానం చేసిందని.. రుషికొండలో ప్రభుత్వం డబ్బుతో జగన్ ప్యాలెస్ కట్టుకోవడం కోసమే ఆ తీర్మానం తెచ్చారని ఇప్ప్పుడిప్పుడే అందరికీ అర్ధమవుతున్నది.

చంద్రబాబుపై కేటీఆర్ సానుభూతి మొసలి కన్నీరేనా?!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. చంద్రబాబు ఆరోగ్యంపై ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నేడో రేపో అయనను ఆసుపత్రికి తరలించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన కోసం ఆసుపత్రిలో స్పెషల్ వీఐపీ వార్డ్ కూడా సిద్దమైనట్లు తెలుస్తున్నది. మరో వైపు జైల్లో కూడా తక్షణమే ఆయన ఉండే బ్యారక్ కు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. కాగా, ఆయన ఆరోగ్యంపై ఇప్పుడు తెలుగుదేశం నేతలతో పాటు మిగతా పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణ నేతలు కూడా చంద్రబాబు ఆరోగ్యంపై కలవరపాటుకు గురవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ నుండి పలువురు నేతలు చంద్రబాబు ఆరోగ్యంపై స్పందించగా.. మంత్రి కేటీఆర్ స్పందన మాత్రం వివాదాస్పదంగా మారుతుంది.  చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అయన కుమారుడు నారా లోకేష్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రి జైలులో తీవ్రమైన ఎండవేడిమితో ఆయన అస్వస్థతకు గురికాగా.. స్కిన్ అలర్జీ కూడా తలెత్తి ఆయన పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఈ నేపథ్యంలో నారా లోకేష్.. జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే వైఎస్ జగన్‌దే బాధ్యతన్న లోకేష్.. చంద్రబాబుపై దురుద్దేశంతో కుట్రలు పన్నారన్నారు. తగినంత భద్రత లేక చంద్రబాబు ఎంతో ప్రమాదంలో ఉన్నారు. జైలులో దోమలు, కలుషిత నీటితో ఇబ్బంది పడుతున్నారు. ఇన్‌ఫెక్షన్, అలర్జీతో బాధపడుతున్నారని లోకేష్ ట్వీట్ చేశారు. లోకేష్ ట్వీట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. “చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేష్‌ ట్వీట్ నాకు చాలా బాధ కలిగించింది. ఓ కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై నారా లోకేష్‌ ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నేనూ ఇలాగే నా తండ్రి ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళన చెందాను,”అని పేర్కొన్నారు. అయితే, కేటీఆర్ పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం నేత దేవినేని ఉమ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక సైకో కోసం తెలంగాణలో పోలీసులు ఎందుకంత అత్యుత్సాహం చూపిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ గతంలో చంద్రబాబు వద్ద మంత్రిగా పనిచేసిన వారేనని గుర్తు చేశారు, వివిధ దేశాల్లో చంద్రబాబు కోసం సంఘీభావ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కానీ హైదరాబాద్‌లో అడ్డుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‍లో ఐటీ ప్రొఫెషనల్స్  'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' కార్యక్రమం చేపడితే వారిని అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ చర్యలను తాము ఖండిస్తున్నామన్నారు. నిజానికి తెలుగుదేశం నేతల ఆగ్రహంలో  అర్ధం ఉంది. చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంత వరకూ స్పందించలేదు. ఇక మంత్రి కేటీఆర్ అయితే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో మాకేం పని. ఇక్కడ ఆందోళనలను అనుమతించం అని వ్యాఖ్యానించారు.   మొన్నేమో చంద్రబాబు అరెస్టుపై నిరసనలు వ్యక్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులను విద్యార్థులను ఎక్కడిక్కడ నిర్బంధించేందుకు ప్రయత్నించారు. ఏపీలో రాజకీయ పంచాయితీలను ఏపీలోనే తేల్చుకోండి.. ఇక్కడేం పని అంటూ కేటీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పటికీ టీడీపీ శ్రేణులలో ఆగ్రహం తెప్పిస్తూనే ఉన్నాయి. ఇది చాలదన్నట్లు శనివారం లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ విజయవంతమైంది. కేటీఆర్ ట్వీట్ చేసి ఒక్క రోజు కూడా గడవక ముందే చంద్రబాబుకు మద్దతుగా లెట్స్ మెట్రో ఫర్ హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించారు. నిరసనకారులపై హైదరాబాద్ పోలీసులు దౌర్జన్యాలకు దిగారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలు, ట్వీట్లను బేరీజు వేస్తూ టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

బాలా త్రిపుర సుందరిగా దుర్గమ్మ

బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా నవరాత్రులలో తొలి రోజు దుర్గాదేవి బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.ఆదివారం తెల్లవారు జామున అమ్మవారికి స్నపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేసి ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం దేవస్థానం నిరంతరం ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసింది. అలాగే   శనివారం (అక్టోబర్ 14) నాటికి ప్రసాదాల కోసం మూడు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేసింది. దసరా ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శనం త్వరితగతిన అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఒంగోలు వెళ్లి మరీ జ్యోతిష్యుడితో విజయమ్మ భేటీ.. మతలబేంటి?

మాజీ సీఎం రాజశేఖరరెడ్డి సతీమణి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ టీపీ అధినేత్రి  ష‌ర్మిల మాతృమూర్తి వైఎస్ విజ‌య‌మ్మ తాజాగా ఓ జ్యోతిస్యుడిని కలిశారు. దీంతో ఇప్పుడు ఈ విషయం  రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒంగోలు స‌మీపంలో ప్ర‌ముఖ సిద్ధాంతిగా పేరున్న అద్దేపల్లి హనుమంతరావుని విజయమ్మ క‌లిసి చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.  అయితే, ఈ సిద్ధాంతి వద్ద సీఎం జగన్ మోహన్ రెడ్డి భవితవ్యం చెప్పించారా? లేక షర్మిల రాజకీయ భవిష్యత్ గురించి అడిగానా అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇక, వైఎస్ఆర్ కుటుంబంలోనే క్రిస్టియానిటీని బలంగా నమ్మే వారిలో విజయమ్మ ముందుటారు. ఎప్పుడు, ఎక్కడకి వెళ్లినా బైబిల్ చేతిలోనే ఉంచుకొనే విజయమ్మ ఒక్కసారిగా ఇలా జ్యోతిస్యులు, సిద్ధాంతుల వద్దకు వెళ్లడం ఆసక్తికర పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంపై రాజకీయవర్గాలలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.  విజయమ్మ ప్రస్తుతం కుమార్తె షర్మిల వద్దనే ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా, అల్లుడు అనిల్ కుమార్ ప్రఖ్యాత పాస్టర్ అనే సంగతి కూడా తెలిసిందే. అరచేతితో వర్షాన్ని ఆపడం, దీర్ఘకాలిక రోగాలను కూడా చిటికెలో నయం అయ్యేలా ప్రార్ధనలు చేసే అల్లుడు అనిల్ ఉండగా.. విజయమ్మ ఓ సిద్ధాంతి కోసం ఒంగోలు వరకూ వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది. విజయమ్మ ఎందుకు వెళ్లారు?.. హిందూ సిద్ధాంతాలు, జాతకాలను కూడా ఆమె నమ్ముతారా అన్న విషయాలను అలా ఉంచితే.. ఆమె ఎవరు కోసం వెళ్లారంటే రాజకీయ వర్గాలు మాత్రం షర్మిల కోసమే అంటున్నాయి. షర్మిల వైఎస్సార్ టీపీ  భ‌విత‌వ్యం, అభ్య‌ర్థుల‌కు బీఫాంలు ఇచ్చే అంశాలపై విజయమ్మ జాత‌కాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్తున్నారు. శుభ ఘడియలపై సిద్ధాంతితో చర్చించినట్లు తెలుస్తున్నది. సుమారు మూడు గంట‌ల‌పాటు ఆమె స‌ద‌రు సిద్ధాంతితో చ‌ర్చ‌లు జరపగా అనంతరం ఆమె తిరిగి మళ్ళీ హైద‌రాబాద్  చేరుకున్నారు. విజయమ్మ హైదరాబాద్ నుండి 350 కిమీ దూరం ఉన్న ఒంగోలుకు వచ్చి.. మళ్ళీ 350 కిమీ హైదరాబాద్ వెళ్లారు. కానీ, ఒంగోలు నుండి జగన్ నివాసం తాడేపల్లి గూడెం 250 కిలోమీటర్లు మాత్రమే. అయినా విజయమ్మ తాడేపల్లి వెళ్లకుండానే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.  దీంతో వైఎస్ కుటుంబంలో గొడవలు, సొంత తల్లే సీఎం జగన్ కు దూరంగా ఉండడంపై మరోసారి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాగా, విజయమ్మ ఒంగోలు పర్యటన రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య‌ ఆస‌క్తికర చ‌ర్చకు దారి తీస్తుంది. రాజ‌కీయాల్లో ఉన్న వైఎస్ కుటుంబం తమ తాతల కాలం నుండే క్రిస్టియానిటీని బలంగా నమ్ముతారు. కుటుంబం అంతా జెరూసలేం వరకూ వెళ్లి ప్రార్ధనలు చేసి వస్తారు. అయితే, ఈ మధ్య కాలంలో వైఎస్ కుటుంబం కూడా సిద్ధాంతులు, మఠాల‌ను న‌మ్ముకుని ముందుకు సాగుతోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్ జ‌గ‌న్ కూడా విశాఖ శార‌దా పీఠాన్ని న‌మ్ముకున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నిక‌ల‌కు ముందు జగన్ శారదా పీఠాన్ని సంద‌ర్శించి.. అక్క‌డే అభ్య‌ర్థుల విష‌యాన్ని పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామితో చ‌ర్చించారు. అప్పట్లో ఈ పర్యటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దుమారం రేపింది. జగన్ శారదా పీఠం పర్యటన అనంతరం మాత్రమే వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు.   అలాగే ఇప్పుడు తొలిసారి సొంత పార్టీతో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్తున్న ష‌ర్మిల కూడా స్వాములు, మంత్రుల‌ను న‌మ్ముకున్నార‌నే ప్రచారం మొదలైంది. అయితే, ఇప్పుడు షర్మిల రాకుండా విజయమ్మను పంపించడం ఆసక్తిగా కనిపిస్తుంది. విజయమ్మ ఈ ఒంగోలు పర్యటనలోనే వైసీపీ కీలక నేతలను కొందరిని కలిసినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. విజయమ్మ ఒంగోలు వెళ్ళగానే ముందుగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లగా.. ఆ తర్వాత మరో ముఖ్యనేత బాలినేని శ్రీనివాసరెడ్డి, కర్నూలు వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డిని కూడా కలిసినట్లు తెలుస్తున్నది. అయితే, జగన్ కు దూరంగా ఉంటున్న విజయమ్మ వైసీపీ ముఖ్య నేతలను కలవడంపై కూడా ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. 

రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి చంద్రబాబు తరలింపు?

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తీవ్ర అస్వస్థతకు గురైన చంద్రబాబును రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే యత్రాలు జరుగుతున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. చంద్రబాబు అలర్జీతో బాధపడుతున్న సంగతి విదితమే. ఆయనను ప్రభుత్వాసుపత్రి నుంచి వచ్చిన వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. అయితే ఆయనకు నిర్వహించిన పరీక్షలు, ఇచ్చిన మందులపై అనుమానాలు వ్యక్తం కావడం, ఆయన వాస్తవ ఆరోగ్య పరిస్థితిని గోప్యంగా ఉంచుతున్నారన్న విమర్శల నేపథ్యంలో ఆయనను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. జైలులో చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షలు, అనంతరం విడుదల చేసిన హెల్త్ బులిటిన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. డయాబెటిక్ పేషెంట్ అయినా చంద్రబాబు సుగర్ లెవెల్స్ పరీక్షించకపోవడం, అలాగే ఆయనకు అందించిన చికిత్స, ఇచ్చిన మందులపై వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి సమగ్ర నివేదికను సీల్డ్ కవర్ లో జైలు అధికారులకు సమర్పించినట్లు  వైద్యవర్గాలు తెలిపాయి.  ఇలా ఉండగా ఇప్పటికే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో  వీఐపీ   గదిని అధికారులు అత్యవసరంగా సిద్ధం చేయించారని చెబుతున్నారు. వైద్యుల సూచనలతో చంద్రబాబును ఆసుపత్రికి తరలించాల్సి వస్తే, ముందు జాగ్రత్త చర్యగా వీఐపీ  గదిని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ గదితో ఎమెర్జెన్సీ డాక్టర్, ఇద్దరు క్యాజువాలిటీ డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులను బాబు చికిత్స కోసం కేటాయించారని తెలుస్తోంది. విఐపీ గదిలో రెండు ఆక్సిజన్‌ బెడ్లు, ఒక ఈసీజీ మిషన్‌, వెంటిలేటర్‌, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచారు. అయితే, ప్రభుత్వాసుపత్రిలో ఈ వీఐపీ గదిని ఆగమేఘాలపై సిద్ధం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చంద్రబాబు ఉన్న ఓపెన్‌ ఎయిర్‌ జైల్‌ ప్రాంగణంలోకి ఓ డ్రోన్‌ వచ్చినట్లు గుర్తించామని జైలు అధికారులే తెలిపారు. అయితే, దీనిపై విచారణ జరిపినా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. దీంతో అసలు జైల్లో ఏం జరుగుతుంది? చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అన్న దానిపై అనుమానాలు ముప్పిరిగొన్నాయి.

ఎవరీ మురళీ చెముటూరి

భారతీయ ప్రముఖ సాఫ్ట్‌వేర్ నిపుణుడు మురళీకృష్ణ  చెముటూరి  జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందుకొన్నారు. అక్టోబర్12వ తేదీ అంటే గురువారం దుబాయిలో నిర్వహించిన 23వ వార్షిక ఏషియన్ లీడర్ షిప్ సదస్సులో.. ఆయన  స్థానిక రాజకుటుంబానికి చెందిన రాజకుమారిల చేతుల మీదగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. 73 ఏళ్ల వయస్సులో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోవడం పట్ల.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఇంతకీ ఎవరీ మురళీ చెముటూరు అంటే.. పక్కా తెలుగు వారు. భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచడమే కాకుండా.. ఆధ్యాత్మిక రంగంలోకి సైతం ఆయన విశేషమైన కృషి చేశారు. 1950, జున్ 28వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని చిట్యాలలో అప్పారావు, విజయలక్ష్మీ దంపతులకు మురళీ కృష్ణా చిముటూరు జన్మించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఎస్‌ఎమ్‌విఎమ్ పాలిటెక్నిక్ కాళశాలలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లామా అందుకొన్న ఆయన.. ఆ తర్వాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ నుంచి ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి.. అనంతరం కంప్యూటర్ మెథడ్స్ అండ్ ప్రోగ్రామింగ్‌లో పీజీ డిప్లమో పూర్తి చేశారు. వీటితోపాటు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టాను సైతం మురళీ చిముటూరి అందుకొన్నారు.  ఆ తర్వాత ఈసీఐఎల్‌లో ఉద్యోగంలో చేరిన ఆయన.. టాటా కన్సల్‌టెంట్ సర్వీసెస్, హైదరాబాద్‌లోని మెటమార్ గ్లోబల్  సోల్యూషన్స్ తోపాటు ముంబైలోని విస్తార్ ఇ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పని చేశారు. అనంతరం 2001లో చెముటూరి కన్సల్‌టెన్స్‌ను ప్రారంభించి... సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఆర్జనైజేషన్ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు.  ఆ క్రమంలో ఆయన రాసిన వివిధ ఆర్టికల్స్ ప్రముఖ జనరల్స్‌.. కంప్యూటర్ సోసైటి ఆఫ్ ఇండియా జనరల్, ఇండస్ట్రీయల్ ఇంజినీర్, ది జనరల్ ఆఫ్ అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్, అమెరికన్ వెబ్‌సైట్స్‌లో సైతం ప్రచురితమైనాయి. ఆయన రాసిన దాదాపు అన్ని జనరల్స్ చెముటూరి డాట్ కామ్‌లో లభ్యమవుతున్నాయి.  అలాగే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌తోపాటు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా ప్రాసెసింగ్, ట్రైనింగ్, అలాగే ఫ్యాకల్టీ మేనేజ్‌మెంట్‌లోని పని చేసిన ఆయన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఎఫర్ట్ ఎస్టిమేషన్, సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వంటి అమూల్యమైన గ్రంధాలను సైతం ఆయన ప్రపంచానికి అందించారు.  ఆటోమోటివ్ పరిశ్రమకు రాల్ప్ నాడర్ ఎలాంటి వారో... అలాగే సాఫ్ట్‌వేర్ అభివృద్ధి పరిశ్రమకు మురళీ చిముటూరి అంతటి వారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో అనుపానులను ఆయన గుర్తించడమే కాదు.. ఆ రంగం అభివృద్ధికి కృషి చేస్తూ.. అందుకోసం ఆయన రాసిన వ్యాసాలు.. అన్ని రంగాల వారిని ఆకట్టుకొవడం విశేషం. ఆయన ఇన్పర్మేషన్ టెక్నాలజీ రంగానికి చేసిన కృషికి గాను ముంబైలోని కంప్యూటర్ సొసైటి ఆప్ ఐటీ ఇన్నోవేషన్ మరియు ఎక్సలెన్స్ అవార్డును కూడా మురళీ చిముటూరు అందుకొన్నారు.  ఇక మురళీ చిముటూరి.. ఆధ్యాత్మిక రంగంలో సైతం విశేష కృషి చేశారు. అందులోభాగంగా రామయణం, ఉత్తర రామాయణం, గరుడ పురాణం పుస్తకాలను ఆయన రచించి, ప్రచురించారు. అలాగే.. రామాయణంలోని 537 సర్గల్లోని ప్రతీ శ్లోకాన్ని వివరణ ఇస్తూ ఆయన పఠించారు. అదే విధంగా ఉత్తర రామాయణాన్ని, గరుడు పురాణం, మను స్మృతి, గురు గీత, అను గీత, రహస్య గీత, బ్రాహ్మణ గీత, యదిష్టుర గీత, ధర్మవ్యాదుడు ఉపాఖ్యానం, భగవద్గీత, ఉమా మహేశ్వర సంవాదంకు సంబంధించి.. ఆయన ఫఠించిన వీడియోలు.. ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. అటు ఐటీ పరిశ్రమ అభివృద్ధితోపాటు ఇటు ఆద్యాత్మిక రంగానికి సేవ చేస్తున్న ఆయన కృషిని మెచ్చి.. ఎన్నో అవార్డులు అందుకొన్నారీ మురళీ చిముటూరి.

న్యాయానికి సంకెళ్లు.. టీడీపీ మరో వినూత్న నిరసన!

తెలుగుదేశంఅధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్ట్ చేసి  నెల రోజులు దాటింది. ఈ నెల రోజులుగా తెలుగుదేశం శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. పార్టీ పరంగా  అధిష్టానం పిలుపు ఇచ్చినా.. ఇవ్వకపోయినా  కార్యకర్తలు పలు విధాలుగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమాలకు పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు ఇస్తూనే ఉన్నారు. ప్రజలూ స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ సహా దేశవ్యాప్తంగా, అలాగే దేశం సరిహద్దులు దాటి కూడా  తెలుగు జాతి ఉన్న ప్రతి చోటా ఈ నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో పలుచోట్ల రిలే నిరాహార దీక్షలు, నల్ల వస్త్రాలు ధరించి నిరసనలు, మహాత్ముని విగ్రహానికి వినతిపత్రాలు అందించడం, కాంతితో క్రాంతి పేరుతో లైట్ల వెలుతురులో, సత్యమేవ జయతే దీక్ష పేర సత్యాగ్రహ దీక్షలు ఇలా వినూత్న కార్యక్రమాలను కూడా చేపట్టి చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.  వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు అరెస్టు చేసిన తొలి రోజు నుండి ఈ దీక్షలు, నిరసన కార్యక్రమాలను అణిచి వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమౌతూనే ఉన్నాయి. ఎంత అణచివేద్దామని ప్రయత్నిస్తే అంతకు రెట్టింపుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  తాజాగా తెలుగుదేశం ‘న్యాయానికి సంకెళ్లు’ పేరిట మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.  చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి, న్యాయానికి సంకెళ్లు వేసిన సీఎం జగన్‌ నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా ఆదివారం (15న) రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్యలో చేతులకు తాడు లేదా రిబ్బను కట్టుకొని నిరసన తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లంటూ నినదించాలని కోరారు. ఆ వీడియోలు ఫొటోలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి చంద్రబాబు ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని పార్టీ శ్రేణులను, అభిమానులను లోకేశ్‌ కోరారు. 5 నిమిషాల పాటు.. 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా చంద్రబాబుకి సంఘీభావం తెలుపుతూ ఇళ్లు, వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి పిచ్చి జగన్‌కి చూపించాలని పేర్కొన్నారు. చంద్రబాబు   ప్రజలకు మంచి చేయడం ఒక సైకోకు నచ్చలేదు. నిజాయితీపై కక్షగట్టి న్యాయానికి సంకెళ్లు వేసాడు. నువ్వు చేసింది తప్పు అని ఆ సైకోకి చెబుదాం. చేతులకు సంకెళ్లు వేసుకుని ప్యాలెస్ లోని నేరగాడికి చూపిద్దాం అంటూ టీడీపీ కోరింది. ఈ మేరకు లోకేష్ విడుదల చేసిన ఓ పోస్టర్ కూడా ఆసక్తిగా మారింది. కాగా చంద్రబాబునాయుడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, తెలుగుదేశం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇటీవల డీహైడ్రేషన్‌, అలర్జీలతో బాధపడుతుండటతో జైలులో చంద్రబాబు ఆరోగ్యానికి ముప్పు ఉందని పలువురు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో చంద్రబాబును ఆసుపత్రికి తరలించేలా న్యాయపోరాటానికి కూడా తెలుగుదేశం సిద్ధమౌతున్నట్లు చెబుతున్నారు. గురువారం ప్రభుత్వాసుపత్రి నుంచి ఇద్దరు చర్మ సంబంధిత వైద్య నిపుణులు ఆయన్ను పరీక్షించి వైద్యం అందించినా ఆ అనుమానాలు నివృత్తి కాలేదు. ఆయనకు అందించిన చికిత్స, చేసిన పరీక్షల వివరాలు గోప్యంగా ఉంచడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలోనే సీల్డ్‌ కవర్‌లో చంద్రబాబు ఆరోగ్యానికి  సంబంధించిన సమగ్ర నివేదికను  ఉన్నతాధికారులకు ఇచ్చినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా చంద్రబాబును  రాజమండ్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.  ఇప్పటికే రాజమండ్రి జీజీహెచ్‌లో ఉన్న వీఐపీ చికిత్స గదిని అధికారులు అత్యవసరంగా రెడీ చేయించారు. వైద్యుల సూచనలతో చంద్రబాబును ఆసుపత్రికి తరలించాల్సి వస్తే, ముందు జాగ్రత్త చర్యగా వీఐపీ చికిత్స గదిని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ గదితో పాటు ఎమెర్జెన్సీ డాక్టర్, ఇద్దరు క్యాజువాలిటీ డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులను ఈ విఐపీ గదికి కేటాయించారు. విఐపీ గదిలో రెండు ఆక్సిజన్‌ బెడ్లు, ఒక ఈసీజీ మిషన్‌, వెంటిలేటర్‌, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచారు. అయితే, ప్రభుత్వాసుపత్రిలో ఈ వీఐపీ గదిని ఆగమేఘాలపై సిద్ధం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చంద్రబాబు ఉన్న ఓపెన్‌ ఎయిర్‌ జైల్‌ ప్రాంగణంలోకి ఓ డ్రోన్‌ వచ్చినట్లు గుర్తించామని జైలు అధికారులే తెలిపారు. అయితే, దీనిపై విచారణ జరిపినా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. దీంతో అసలు జైల్లో ఏం జరుగుతుంది? చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అన్న దానిపై ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి.

కృష్ణా జలాల పంపకంతో సీమాంద్రా సాగుకు సంకెళ్లు?

[30 లక్షల ఎకరాల ఆయకట్టు ఎడారి]  రెండు తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాల పున:సమీక్షకు అంగీకారం తెలిపి బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు కొత్త నిబంధనల పరిశీలనా బాధ్యత అప్పగిస్తూ కేంద్ర క్యాబినెట్ తీర్మానించింది. కృష్ణా జలాల పంపకం బాధ్యతను బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు అప్పగిస్తూ కొత్త విధి విధానాలను ఖరారు చేస్తూ కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం సీమాంద్రా సాగుకు సంకెళ్లు వెయ్యడమే అవుతుంది. ఇది ప్రధానంగా రాయలసీమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని సాగు నీటి రంగ నిపుణులు కూడా  హెచ్చరిస్తున్నారు.  బచావత్‌, బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునళ్లు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెరి సగం పంచాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తున్న వాదనకు అనుగుణంగానే కేంద్రం నిర్ణయం తీసుకుని ఆంద్రప్రదేశ్ ప్రయోజనాలను పాతరేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్ని అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అడుగడుగునా అన్యాయం చేస్తూనే వున్నది. ఒక పక్కన విభజన హామీలు. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టగా, ఇప్పుడు తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు నీటి వాటాల పునఃసమీక్షతో ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు బీటలు బారుస్తుంది కేంద్రం. ప్రధానంగా ఇది రాయలసీమ సాగునీటి అవసరాల హక్కులను కాలరాయడమే అవుతుంది. కర్నాటక ఎన్నికలలో లబ్ధి పొందటానికి తుంగభద్ర డ్యామ్‌ పై భాగంలో నిర్మిస్తున్న ఎగువభద్రను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే కాకుండా బడ్జెట్లో రూ.5300 కోట్లు కేటాయించింది కేంద్రం . ఎగువభద్ర మొదటి రెండు దశల్లో 48 టీఎంసీల నీటిని తుంగభద్రకు రాక ముందే మళ్లిస్తున్నారు .కేంద్రప్రభుత్వ నిర్ణయం ద్వారా  రాయలసీమ ప్రయోజనాలు పూర్తిగా ప్రమాదంలో పడినట్లేనని చెప్పాలి. ఈ దురాగతాన్ని, దుచ్ఛర్యను అడ్డుకోవల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి  కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. కేసులు నుండి బయటపడడం, అప్పులు చేయడంపై చూపుతున్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై చూపడం లేదు సియం జగన్ రెడ్డి.  కృష్ణా జలాల కేటాయింపులపై రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రాన్నిఎదిరించే ధైర్యం చెయ్య లేదు. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ను కొనసాగిస్తూ రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై ప్రాజెక్టుల వారీ అధ్యయనంపై మార్గదర్శకాలనూ, నియమ నిబంధనలనూ వివరిస్తూ కేబినెట్‌ నోట్‌ను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర నిర్ణయం అమలు చేస్తే రాష్ట్రానికి జరిగే నష్ట మేమిటో  నిపుణులు అప్పటికే తమ అభిప్రాయాలను వెల్లడించారు. కేబినెట్‌ నిర్ణయం తర్వాత 48 గంటలలోపే బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ను కొనసాగిస్తూ ప్రాజెక్టుల వారీగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి కేటాయింపులు నిర్వహించేలా గెజిట్‌ను కూడా కేంద్రం విడుదల చేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీలోనే ఉన్నా కానీ  కృష్ణా జలాలపై తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికి జరిగే  తీవ్ర నష్టాన్ని కేంద్రానికి గట్టిగా వివరించి కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చెయ్యలేకపోయారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నప్పుడే  రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్నా గట్టిగా మాట్లాడకుండా మొక్కుబడిగా లేఖ రాసి జగన్ రెడ్డి చేతులు దులుపు కోవడం అంటే ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల పై ఎంత ప్రేమ వున్నదో ప్రజలే అర్ధం చేసుకోవాలి . శ్రీశైలం జలాశయంపై ఆధారపడ్డ కరువు ప్రాంతమైన రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరుతో సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామని అపెక్స్‌ కౌన్సిల్‌లో సీఎం జగన్‌ చెప్పారు. ఈ పథకం కోసం రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల పరిధిలోనే వినియోగించుకుంటామన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో సగం వాటా కావాలన్న కేసీఆర్‌ డిమాండ్‌పై జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఏపీ, తెలంగాణ మధ్య 811 టీఎంసీలలో 512, 299 టీఎంసీల వాటా మాత్రమే ఉందంటూ బచావత్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలు అమలు కావాల్సిందేనని పట్టు బట్టనూ లేదు. కృష్ణా నదీ జలాలకు సంబంధించి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలను కలిపి కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు ప్రత్యేకంగా ట్రైబ్యునల్‌ ఎలా వేస్తారంటూ జగన్‌ అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. ట్రైబ్యునల్‌ వేయడం వల్ల ఎదురయ్యే సమస్యలనూ ప్రస్తావించలేదు. నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులకే కేటాయింపులు పరిమితం చేయాలన్న కేసీఆర్‌ వాదనకూ జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ నెల 4వ తేదీన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో అపెక్స్‌ కౌన్సిల్‌లో కొత్త ట్రైబ్యునల్‌ వేయాలన్న కేసీఆర్‌ డిమాండ్‌ మేరకు బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌కు తెలుగు రాష్ట్రాల నదీ జలాల పంపకాల బాధ్యతను అప్పగించామని కేబినెట్‌ నోట్‌లో కేంద్రం స్పష్టంగా పేర్కొంది. ఆ రోజు అపెక్స్‌లో కేసీఆర్‌ను నిలువరించి.కృష్ణా జలాలపై కేంద్రం జారీ చేసిన గెజిట్‌ రాష్ట్రానికి గొడ్డలి వేటేనని కేంద్రం ఇచ్చిన గెజిట్‌ అమలైతే మొత్తంగా 30 లక్షల ఎకరాలకు శాశ్వతంగా చుక్కనీరు అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల నీటిలో ఆంధ్రప్రదేశ్‌ వాటా 512 టీఎంసీలు. అనేక ఏళ్లుగా  వాడు కుంటున్న హక్కు పున:సమీక్షకు సిద్ధం కావడం స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే. తెలంగాణలో చట్ట విరుద్ధంగా 299  టీఎంసీల నిలువతో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు చట్టబద్ధత కల్పించి, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ప్రయోజనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనివల్ల దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో సాగుకు సంకెళ్లు పడనున్నాయి. నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువల కింద మొత్తంగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లేక ఎడారిగా మారే ప్రమాదముంది. 2014 పునర్విభజన చట్టంలో ఆమోదించిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాలకు పంగనామాలు పెడుతూ తెలంగాణ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బిజెపి బరితెగించింది. దీనికి కారణం తన కేసుల కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి జగన్‌ లొంగిపోయి చివరికి కృష్ణా జలాలను కూడా కృష్ణార్పణం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మూలంగా రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలుగుతుందన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి  రాజకీయ ప్రయోజనం పొందడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రాలన్నిటినీ సమ దృష్టితో చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలన్న దుష్ట తలంపుతో వ్యవహరిస్తున్నది. కేంద్రం తీసుకొన్న నిర్ణయంతో  అనుమతు ల్లేకుండానే తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ సక్రమం కానున్నాయి. పాలమూరు-రంగారెడ్డి  ప్రాజెక్టు కొత్తదని ఇప్పటికే బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ చెప్పింది. ట్రైభ్యునల్ దానికి నీటి కేటాయింపులు జరిపితే ఆంధ్రప్రదేశ్‌కే తీవ్ర నష్టం వాటిల్లనున్నది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తన రాజకీయ ప్రయోజనాలు తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదు. విభజన చట్టాన్ని తుంగలో తొక్కి, బచావత్ ట్రిభ్యునల్ ఇచ్చిన తీర్పును దిక్కరిస్తూ ఏకపక్షంగా కృష్ణాజలాలు పంపిణీకి కేంద్రం నిర్ణయం తీసుకోవడం అసంబద్దమైనదేకాదు రాజ్యాంగ వ్యతిరేకం కూడా. కృష్ణా జలాల్లో పంపకానికి కేంద్రం నిర్ణయం తీసుకొంటే జగన్ ఎందుకు మాట్లాడరని  ప్రజలు ప్రశ్నిస్తున్నారు .జగన్ తెలంగాణలో వున్న తన ఆస్తులు కాపాడుకొనేందుకు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు.  తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి 90 టియంసిలు నీటిని తోడుకొనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం చేసినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు తెరవలేదు. కేసీఆర్ నిర్మించిన పాలమూరు  రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అమలులోనికి వస్తే తనకు రాజకీయ జన్మనిచ్చిన రాయలసీమకు ఉరి  బిగించబోతుందన్నఆలోచన చెయ్యకుండా, 2016లో జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ తీర్మానాన్ని గుర్తు చేయ్యకుండా జగన్ రెడ్డి  తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. కృష్ణా జలాల అంశంలో సీఎం జగన్ రెడ్డి బాధ్యత లేకుండా ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సారథ్యంలో 2020లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో కేసీఆర్‌ ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడే జగన్‌ అభ్యంతరం చెప్పక పోవడంతో జగన్ రెడ్డి మెతక వైఖరిని ఆసరాగా తీసుకొని కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలికంగా కేటాయించారు. తర్వాత  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  చెరి సగం నీటి వాటాను డిమాండ్‌ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నోరుమెదపలేదు. జగన్‌ సీఎం అయ్యాక తెలంగాణ ప్రభుత్వం  అనుమతు ల్లేకుండా  ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినా మౌనంగా వున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చినా ఎన్‌జీటీ స్టే ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. స్టే ఉత్తర్వుల ఎత్తివేత దిశగా జగన్‌ రెడ్డి  ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ అవార్డును ఇంతవరకు నోటిఫై చేయని ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ వ్యవహారాన్ని తేల్చే బాధ్యతను మళ్లీ అదే ట్రైబ్యునల్‌కు కేంద్రం కట్టబెట్టడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టడమే. బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పుపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తుండగా. జలాల పంపిణీ బాధ్యతను కూడా  కొత్తగా దానికెలా అప్పగిస్తారు? కేంద్ర నిర్ణయం ప్రధానంగా రాయలసీమకు శరాఘాతం కానున్నది. రాష్ట్రానికి శరాఘాతం లాంటి నిర్ణయాలను కేంద్రం తీసుకుంటున్నా ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు మౌనంగా ఉండటంలో ఆంతర్యం ఏమిటి?  ఇంత  జరుగుతున్నా, రాష్ట్ర ప్రయోజనాలకు పెనుప్రమాదం ముంచుకు వచ్చినా ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి  ఒక్క మాట మాట్లాడకపోవడం దారుణం. రాయల సీమ ప్రజల నోట్లో మట్టి కొట్టే విధంగా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చోద్యం చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాల పంపకం జరిగితే  శ్రీశైలం కుడి కాలువ ద్వారా కర్నూలు జిల్లాలో గోరుకల్లు 10 టీఎంసీలు, అవుకు3 టేఎంసీలు, వెలిగోడు జలాశయం 16 టీఎంసీలు, బ్రహ్మంగారి మఠం 17టీఎంసీలు, ఎస్ ఆర్ -11.8 టీఎంసీలు, ఎస్ ఆర్ 22.27 టీఎంసీలు. కడప జిల్లాలో గండికోట 26 టీఎంసీలు, చిత్రావతి, మైలవరం, పైడిపాలెం, వంటి రిజర్వాయర్లకు చుక్క నీరు రాదు. ఈ రిజర్వాయర్లకు నీరు రాకపోతే కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో ఆయకట్టు ఎడారిగా మారనున్నది. దీని ద్వారా జరిగే  నష్టం 8 లక్షల ఎకరాలు బీడు భూములు మారనుంది. రాయలసీమ వాసులకు గుక్కెడు మంచినీరు దొరకడం కుడా కష్టం మారనుంది.తన కేసుల కోసం కేంద్రానికి సాగిల పడి కృష్ణా జలాలను కూడా కృష్ణార్పణం చేసిన పాపాన్ని ప్రజలు ప్రశ్నించాలి.    నీరుకొండ ప్రసాద్

1000 సంవత్సరాల బతుకమ్మ కథ

బతుకమ్మలోనే తెలంగాణ అస్తిత్వం బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. బతుకమ్మ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ, తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబుల కింద మహిళల బతుకులు దుర్బరం నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక ఉండే మర్మం ఇదే. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా.. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్ర కూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కల్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యా సాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడ ( ప్రస్తుత కరీంనగర్ జిల్లా) లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళా కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాసాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతీగా వ్యవహరించి విజయం సాధించాడు. వెయ్యేళ్లుగా బతుకమ్మ పండగ ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006 లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. క్రీస్తు శకం 1010 లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రహదేశ్వరాలయంలో ప్రతిష్టించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి, బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు. బృహదమ్మ నుంచి వచ్చిన పేరే బతుకమ్మ బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే.. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు. బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారు అంతటా స్త్రీలు "బొడ్డెమ్మ" ( మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారు చేస్తారు. చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు.

లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ విజయవంతం

మాజీ ముఖ్యమంచంద్రబాబు అరెస్ట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ హస్తం ఉందా? అవుననే వ్యవహరించింది ఇవ్వాళ తెలంగాణ సర్కార్. ఐటీ ఉద్యోగులు పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమానికి  తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా అవాంతరాలు కల్గించింది. అయినప్పటికీ లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ విజయవంతం అయ్యింది. మియాపూర్ టు ఎల్బీనగర్ వరకు ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నల్ల టీ షర్ట్ లు ధరించడంతో నల్ల ప్రవాహం పారినట్లు అనిపించింది.  స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో అరెస్ట‌యి రాజమండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మద్ద‌తుగా హైద‌రాబాద్‌లోని టీడీపీ శ్రేణులు, అభిమానులు వినూత్న నిర‌స‌న‌కు పిలుపునిచ్చారు. `లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్` పేరుతో శ‌నివారం నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. హైద‌రాబాద్ మెట్రో రైల్ ఇందుకు వేదిక అయ్యింది. న‌ల్ల‌ టీష‌ర్టుల‌తో మియాపూర్ టు ఎల్బీన‌గ‌ర్‌ శ‌నివారం ఉద‌యం 10.30 నుంచి 11.30 గంట‌ల మ‌ధ్య ఎల్బీన‌గ‌ర్ వ‌ర‌కు న‌ల్ల టీష‌ర్టులు ధ‌రించి మెట్రోలో  టీడీపీ నాయ‌కులు, అభిమానులు ప్రయాణించారు. మియాపూర్ నుంచి ఎల్బీన‌గ‌ర్ వ‌ర‌కు  మెట్రో ఎక్కి తమ  నిర‌స‌న‌ తెలియజేశారు. మెట్రో ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా   ఆందోళన కారులు శాంతియుతంగా నిర‌స‌న  తెలిపారు.  అయితే హైదరాబాద్ లో ఆకస్మికంగా మెట్రో రైళ్లను పోలీసులు ఆపేశారు.  మెట్రోస్టేషన్లలో బ్లాక్ టీషర్ట్స్ ధరించిన వారిని వెనక్కి తిప్పి పంపించారు.చంద్రబాబు అరెస్టుకు నిర‌స‌న‌గా ఇవ్వాళ  ఐటీ ఉద్యోగులు  పెద్ద సంఖ్యలో  కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. శ‌నివారం సెల‌వు దినం కావ‌డంతో ఈ నిర‌స‌న‌లో ఐటీ ఉద్యోగులే ఎక్కువ మంది పాల్గొన్నారు.  హైదరాబాద్‌లో మెట్రో ఏర్పాటుకు చంద్రబాబు దార్శ‌నిక‌త కూడా కార‌ణ‌మ‌ని, అందుకే ఈ నిర‌స‌న‌ను ఎంచుకున్న‌ట్లు పార్టీ కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు.

నిందితులకు రెడ్ కార్పెట్.. నిర్దోషులకు జైలు.. జగన్ సర్కార్ విధానమా?

హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును వైసీపీ సస్పెండ్ చేసింది. అయితే అది ఉత్తుత్తి సస్పెన్షనేనని తేటతెల్లమైపోయింది. ముఖ్యమంత్రి నిర్వహించే పార్టీ సమావేశాలలో ఆయన పాల్గొంటున్నారు. సీఎం తూర్పోగోదావరి జిల్లా పర్యటనల్లో అంతా తానై ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వైసీపీ ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వడ్డించేవాడు మనవాడైతే చాలు భోజనం పంక్తిలో చివర కూర్చున్నా ఏం ఇబ్బంది లేదు అన్నట్లు ఎమ్మెల్సీ అనంతబాబు జగన్ కు అస్మదీయుడు కావడంతో ఆయన కూడా పార్టీలో ఉంటే ఏంటి? సస్పెండైతే ఏమిటి? అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ వర్గాలు, పోలీసులు కూడా ఆయనకు రెడ్ కార్పెట్ పరిచి మరీ రాచమర్యాదలు చేస్తున్నారు.   ఔను నిజమే హత్య కేసులో నేరం అంగీకరించి బెయిలుపై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పుడు జగన్ చుట్టూనే తిరుగుతున్నారు.  జగన్ రెడ్డి గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చిన సందర్భంగా  అనంతబాబుకు జగన్ రెడ్డి పక్కనే ఉంటున్నారు. అన్నిటికీ మించి గత  నెల 26న తాడేపల్లి హత్య చేశానంటూ స్వయంగా నేరాన్ని అంగీకరించిన అనంతబాబును పక్కన పెట్టుకుని జగన్ ప్రజలకు ఏం సంకేతమిస్తున్నట్లు అని చర్చ రాజకీయవర్గాలలో విస్తృతంగా జరుగుతోంది. ఇక అనంతబాబు స్వయంగా హత్య చేసినట్లు అంగీకరించినా.. ఆయనే స్వయంగా నేరాన్ని అంగీకరించారని పోలీసులే వెల్లడించినా.. దర్యాప్తు ముందుకు సాగడం లేదు. పైగా పోలీసులు ఆయనకు ఎక్కడ లేని మర్యాదా చూపుతూ అడుగులకు మడుగులొత్తుతున్నారంటేనే రాష్ట్రంలో నేరస్థులకు ఏ విధంగా ఏ స్థాయిలో అండదండలు అందుతున్నాయన్నది  అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించడానికి  జరిగిన ప్రయత్నాలూ, అవి విఫలమైన తరువాత.. ఆ కేసులో నేరారోపణలు ఏదుర్కొంటున్న వారికి ప్రభుత్వపరంగా అందిన, ఇప్పటికీ అందుతున్న అండదండలనూ ఉదహరిస్తూ.. ఏపీలో జగన్ హయాంలో భారత రాజ్యాంగం మరుగున  పడిపోయిందనీ, ప్రత్యేకంగా ఏపీ కోసం జగన్ రెడ్డి తనదైన సొంత రాజ్యాంగాన్ని రూపొందించారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం  చేస్తున్నారు. ఇక అనంతబాబు విషయానికి వస్తే..   ఔను నా మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తన వ్యక్తిగత వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్న కారణంగా తానే స్వయంగా హత్య చేశానని పోలీసుల ఎదుట అంగీకరించారు. ఈ హత్యలో మరెవరికీ ప్రమేయం లేదని అనంతబాబు తమ విచారణలో అంగీకరించిట్లు  పోలీసులు వెల్లడించారు.  దీంతో అప్పట్లో ఆయనపై అనివార్యంగా కేసు నమోదు చేసి జైలుకు పంపినా.. జైల్లో ఆయనకు రాచమర్యాదలు చేశారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.  అయితే హత్య కేసులో నేరాన్ని అంగీకరించిన అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించినా వైసీపీ ఆయనకు తెరవెనుక అండదండలను అందిస్తూనే వచ్చింది. వస్తోంది. ఇప్పుడు ఆయన బెయిలు మీద బయటకు వచ్చి  జగన్ ను అంటిపెట్టుకుని తిరుగుతున్నారు. జిల్లాలో పార్టీ ముఖ్య నేతగానే వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. దీంతో వైసీపీ అనంతబాబును సస్పెండ్ చేయడం కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకేనని తేటతెల్లమైపోయిందని అంటున్నారు.  నిందితులకు  రెడ్ కార్పెట్ పరిచి, నిర్దోషులను ఖైదులో ఉంచడం అన్నది జగన్ సర్కార్ విధానమా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

గ్రూప్ 2 పరీక్షల వాయిదాతో విద్యార్థుల్లో నిరాశా, నిసృహలు

తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా పడటంతో విద్యార్థుల్లో నిరాశ, నిసృహలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. హైదరాబాద్ లో ప్రవళిక అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీపీఎస్ సీ చైర్మెన్ జనార్థన్ రెడ్డి గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడటం కొత్తేం కాదు. వరుసగా రెండు పర్యాయాలు వాయిదా పడటంతో విద్యార్థుల్లో అసహనం పెల్లుబికుతోంది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడానికి అసెంబ్లీ ఎన్నికలు కెసీఆర్ ప్రభుత్వానికి సాకుగా మారాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది.  అసెంబ్లీ ఎన్నికలు సాకుగా చూపించి టీపీఎస్ సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి వాయిదా వేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షలు లీక్ అయినట్టు కెసీఆర్ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంది. ఓఎంఆర్ షీట్ ఫిలప్ చేయలేని ప్రవీణ్ అనే వ్యక్తి ఏకంగా 103 మార్కులు తెచ్చుకోవడం పలు అనుమానాలకు తావించింది.  ప్రవీణ్ అనే వ్యక్తి పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఉద్యోగి. ఒఎంఆర్ షీట్ నెంబర్ రాయకుండా జవాబులు ఠక ఠకా రాయడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. నిరుడు అక్టోబర్ నెలలో గ్రూప్ వన్ పరీక్షలు జరిగాయి. రాజకీయ జోక్యంతో ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్టు చెబుతున్నారు. మంత్రి కెటీఆర్ జోక్యంతో ప్రశ్నా పత్రం లీక్ అయినట్లు ఆరోపణలున్నాయి. పోస్ట్ లు అమ్ముకోవడం వల్లే ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్లు ఆధారాలు దొరికాయి. గ్రూప్ పరీక్షలు ప్రిపేర్ కావడానికి చాలామంది చిక్కడపల్లి గ్రంధాలయానికి వచ్చి ప్రిపేర్ అవుతుంటారు. ప్రవళిక కూడా చిక్కడపల్లిలో ఉంటోంది. హైదరాబాద్‌లో గ్రూప్‌  2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి మృతి అర్థరాత్రి కలకలం రేగింది. పరీక్ష వాయిదా పడటం వల్లే ఆమె మృతి చెందిందని గ్రూప్‌ 2 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించే వరకు మృతదేహాన్ని కదలనివ్వబోమని భీష్మించారు. అయితే పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఓ హాస్టల్‌లో ఉంటూ కాంపిటేషన్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతోంది. శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా పడటంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందనితోటి అభ్యర్థులు, అక్కడే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. స్థానికులు, హాస్టల్‌ సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. భారీగా చేరుకున్న అభ్యర్థులు పోలీసులు ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అభ్యర్థులు అడ్డుకోవడంతో అర్థరాత్రి వరకు హాస్టల్‌లోనే మృతదేహం ఉండిపోయింది. విషయం తెలుసుకున్న బీజేపీ లీడర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ సీనియర్ లీడర్ లక్ష్మణ్, బండారు విజయలక్ష్మి నిరసనల్లో పాల్గొన్నారు. రాత్రి రెండు గంటల వరకు ఈ హైడ్రామా కొనసాగింది. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రూప్స్ అభ్యర్థులు నినాదాలు చేశారు. ఆమెకు న్యాయం చేసే వరకు అక్కడే ఉంటామని భీష్మించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళనకారులతో పోలీసులు మాట్లాడుతూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నిరసనకారులను చెదరగొట్టారు. ప్రతిగా ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఇలా టెన్షన్  వాతావరణంలోనే ప్రవళిక మృతదేహాన్ని పోలీసులు తరలించారు. గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.  ప్రవళిక పేరు మీద ఓ సూసైడ్ నోట్‌ సోషల్ మీడియాలో తిరుగుతోంది. అమ్మా నన్ను క్షమించండీ అంటూ మొదలు పెట్టిన లేఖలో చాలా అంశాలు ప్రస్తావించింది. తాను నష్టజాతకురాలిని అని తన వల్ల పేరెంట్స్‌కు ెప్పుడూ బాధలే అని చెప్పుకొచ్చింది. మీకు నేను చాలా అన్యాయం చేశానని ఎవరూ ఏడవొద్దని చెప్పిన ప్రవళిక..తన కాలు కిందపెట్టకుండా చూసుకున్న అమ్మకు ధన్యవాదాలు చెప్పింది. అమ్మ కోసం ఏం చేయలేకపోతున్నాననని క్షమించాలని కోరుతూ లేఖ ముగించింది.  ఉదయాన్నే ప్రవళిక బంధువులు హైదరాబాద్ వచ్చారు. గాంధీ ఆసుపత్రిలో ఆమె మృతదేహాన్ని చూసిన తల్లి కుప్పకూలిపోయారు. మెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకొని తలెత్తుకొని వస్తుందని అనుకుంటే ఇలా విగత జీవిగా పడి ఉండటం చూసి బంధువులు కూడా తట్టుకోలేకపోయారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల దృష్ట్యా డీఎస్సీ వాయిదా వేస్తున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్ శ్రీదేవ‌సేన తెలిపారు. న‌వంబ‌ర్ 20 నుంచి 30వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గాల్సిన స్కూల్ అసిస్టెంట్, ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్, భాషా పండిట్లు, ఎస్జీటీ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. న‌వంబ‌ర్ 30వ తేదీన పోలింగ్ నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో ఎస్‌జీటీ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీల భ‌ర్తీకి న‌వంబ‌ర్ 20 నుంచి 30వ తేదీ వ‌ర‌కు డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌కు ఇప్ప‌టికే షెడ్యూల్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

జగన్ రెడ్డికి ఎన్ఐఏ దర్యాప్తు మీదా నమ్మకం లేదట!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి తీరే వేరు. ఏదైనా సరే  వ్యక్తులైనా, వ్యవస్థలైనా తనకు అనుకూలంగా ఉండకపోతే సహించరు. నమ్మకం లేదంటూ కోర్టులను ఆశ్రయిస్తారు.  ఇక అక్కడ నుంచీ చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని తనకు అనుకూలంగా నిర్ణయాలు వెలువడే దాకా సాగదీత పద్ధతులను అవలంబిస్తారు. తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన కోడి కత్తి కేసు విషయంలోనూ అదే విధానాన్ని అవలంబిస్తున్నారు. వివేకా హత్య కేసులో సీబీఐకు ఎలా అడ్డంకులు సృష్టించారో, దర్యాప్తునకు వచ్చిన సీబీఐ అధికారులపైనే కడపలో దాడులు చేయడం, రివర్స్ కేసులు పెట్టడం, ఆరోపణలతో  ఆ అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. ఇక కోడి కత్తి కేసు అసలు ఎన్ఐఏ చేపట్టడమే ఆశ్చర్యం. కేవలం ఉగ్ర కేసులు, దేశ భద్రతకు భంగం వాటిల్లే కేసులనూ మాత్రమే దర్యాప్తు చేసేందుకు ఉద్దేశించిన ఎన్ఐఏను.. తనపై దాడి వెనుక మహాకుట్ర ఉందంటూ విపక్ష నేతగా నాడు నానా యాగీ చేసి, కేంద్రంలోని మోడీ సర్కార్ మద్దతు కూడా ఉండటంతో ఎన్ఐఏ దర్యాప్తు సాధించగలిగారు. సరే కోడికత్తి కేసు దర్యాప్తు ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఏళ్లూ పూళ్లూ గడిచిపోయినప్పటికీ, చివరాఖరికి నాలుగున్నరేళ్లు దాటిపోయిన తరువాత దర్యాప్తు ముగింపు దశకు వచ్చింది. ఇక కేసు తేలిపోవాలంటే బాధితుడిగా జగన్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలి. కోర్టులు ఆదేశించినా, సీఎం హోదాను అడ్డుపెట్టుకుని ఏవేవో సాకులు చెబుతూ కోర్టుకు మాత్రం రావడం లేదు. ఇక మరింత కాలం కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకునే వీలు లేకపోవడంతో నాడు తాను కోరి మరీ సాధించుకున్నఎన్ఐఏ దర్యాప్తుపైనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. కోడి కత్తి కేసులో మరింత లోతైన దర్యాప్తు  అవసరం అంటూ హైకోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు ఆయన వేసిన ఇదే పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చింది.  అసలు కోడి కత్తి కేసులో జగన్ కు  అయినా గాయం ఎంత తీవ్రమైనది, ఆయనకు అందిన చికిత్స ఏమిటి? దాడి జరిగిన వెంటనే ఆయన విశాఖ నుంచి హైదరాబాద్ కు చేరుకోవడానికి ఎలా అనుమతి ఇచ్చారు. ఇత్యాది వివరాలేవీ వెల్లడించడానికి జగన్ సిద్ధంగా లేరు. నిజంగా జగన్ కోరుకున్నట్లు ఎన్ఐఏ మరింత లోతైన దర్యాప్తు జరిగితే.. ఆయనకు ఆస్పత్రిలో అందిన చికిత్స, కోడికత్తి, ఆయన గాయం లోతెంత? నాడు విశాఖలో కోడికత్తి దాడి జరిగిన సమయంలో సీసీ కెమేరాలు ఎందుకు పని చేయలేదు. అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా వైఫల్యం వెనుక శక్తులేమిటి? వంటి వివరాలపై దృష్టి పెట్టాలి. ఇక పోతే.. బాధితుడిగా జగన్ రెడ్డి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్నది ఇప్పటి వరకూ అంతుబట్టని విషయం. అయితే జగర్ తీరు వల్ల ఈ కేసులో నిందితుడు జనుపల్లి శీను నాలుగున్నరేళ్లకు పైగా కనీసం బెయిలుకు కూడా నోచుకోకుండా జైల్లోనే మగ్గుతున్నాడు. ఈ కేసులో దర్యాప్తు చేయడానికి ఇంక ఏమీ లేదని ఇప్పటికే ఎన్ఐఏ విస్పష్టంగా తేల్చేసింది. ఇప్పుడు జగన్ హైకోర్టులో మరింత లోతైన దర్యాప్తు అంటే ఇంకా ఏం చేయాలని జగన్ రెడ్డి భావిస్తున్నారని న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు ఏ కోణంలో జరగాలో సీబీఐకి మీడియా సమావేశాలు పెట్టి మరీ అవినాష్ వివరించిన విధంగా జగన్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి దర్యాప్తు  ఎలా చేయాలో ఎన్ఐఏకి నిర్దేశించాలని భావిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద న్యాయవ్యవస్థతో జగన్ రెడ్డి ప్రమాదకరమైన క్రీడ ఆడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కోర్టులను ఆశ్రయిం చడానికి ఉన్న అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ, సీఎంను కనుక వీలుపడదు అంటూ హాజరును తప్పించుకుంటూ, వాయిదాల మీద వాయిదాలు కొరడాన్ని ఆక్షేపిస్తున్నారు. అక్రమాస్తుల కేసుల్లో దశాబ్దకాలంగా తాను బెయిలుపైనే ఉంటూ కూడా కోడికత్తి కేసులో నిందితుడికి అర్ధ దశాబ్దంగా బెయిలు అవకాశం లేకుండా వ్యవహరించడం దుర్మార్గం కాక మరేమిటని అంటున్నారు.  

సాగునీటిపై చేతులెత్తేసిన మంత్రి అంబటి రాంబాబు

వివాదాలలో ముందుండే  ఏపీ  జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తన శాఖ వద్దకు వచ్చే సరికి తడబడతారు. మాట దాటేస్తారు. ఇంకా కావాలంటే మీడియా సమావేశాల్లో విలేకరులపై విరుచుకుపడతారు. మీ ప్రశ్నలకు జవాబివ్వాల్సిన అవసరం లేదు.. ఏం రాసుకుంటారో రాసుకోండి అని నిప్పులు చెరుగుతారు.  ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరకు పడింది. మరో ఆరేడు నెలలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టు, ఆయన ఆరోగ్యంపై విపక్షాల ఆందోళన, అధికార పక్షం విషం చిమ్మేలా చేస్తున్న వ్యాఖ్యలు వెరసి వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకతను ప్రోది చేసి పెట్టాయి.    సరిగ్గా ఈ సమయంలో తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ సర్కార్ రైతులను నట్టేట ముంచేసేందుకు రెడీ అయిపోయిందని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయానా ఆ శాఖ మంత్రి అంటే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. నాగార్జున సాగర్‌ ఆయకట్టు కింద భూములకు ఈ ఏడాది పంటలకు నీరిచ్చే పరిస్థితి లేదని తేల్చేశారు. ఆయకట్టు రైతులెవరూ సాగునీటిపై ఆశలు పెంచుకోవద్దని కుండబద్దలు కొట్టేశారు.  ఇటీవల జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరైన అంబటిని సాగర్ ఆయకట్టు రైతులు కలిసి సాగునీటి కోసం విజ్ణప్తి చేశారు. అయితే అందుకు అంబటి ఆశించిన మేర నీటి నిల్వలు లేని కారణంగా ఈ ఏడాది నాగార్జున సాగర్ ఆయకట్టు  కింద రైతులను సాగునీటి విడుదల సమస్యే లేదనీ, ఏవైనా ఆశలు ఉంటే వాటిని వదిలేసుకోవాలని రైతులకు చెప్పారు. అంతే కాకుండా నీరు అనేది సృష్టించేది కాదనీ, బజార్లో దొరికితే కొనుక్కొచ్చి ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదనీ అన్నారు. ఎలాంటి ప్రణాళికలూ లేకుండా..శాఖపై దృష్టి పెట్టకుండా నిత్యం అడ్డగోలుగా విపక్షాల మీద విరుచుకుపడటమే మంత్రిగా తన బాధ్యత అని వ్యవహరించిన అంబటి రాంబాబు.. వర్షాభావ పరిస్థితులపై ముందు నుంచీ అంచనాలు ఉన్నప్పటికీ, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ఎలాంటి  ముందస్తు జాగ్రత్తలూ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితమే సాగర్ ఆయకట్టుకు నీరందని పరిస్థితి ఏర్పడిందని రైతులు విమర్శిస్తున్నారు.    

#చంద్రబాబు లైఫ్ ఎట్ రిస్క్?

 తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ తర్వాత జరుగతున్న సంఘటనలు గమనిస్తే, అక్రమ అరెస్ట్ వెనక మరో మహా కుట్ర దాగుందనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఓ వంక చంద్రబాబు ప్రమేయమే లేని, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం అంతటితో ఆగకుండా ఇంకా ఇంకా తప్పుడు కేసులు పెట్టి పీటీ (ప్రిజన్ ట్రాన్ఫర్) వారెంట్లు సిద్దం చేస్తోంది. అందుకే చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేమని ఒక నిర్ణయానికి వచ్చిన జగన్ రెడ్డి  ఆయనకు భౌతిక హాని తలపెట్టే కుట్రలు చేస్తున్నారనే అనుమనాలు, ఆయన కుటుంబ సభ్యులలోనే కాదు, అందరిలో కలుగుతున్నాయి. అందులోనూ జగన్ రెడ్డి చరిత్ర తెలిసిన ఎవరికైనా అలాంటి అనుమానాలు కలగడం సహజం. సొంత బాబాయ్ ‘మర్డర్’ కేసులో సొంత కుటుంబ సభ్యులే ఆయన వైపు వేలెత్తి చూపుతున్నారు. కన్నతండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత, శవం కదలక ముందే ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన చేసిన ‘సంతకాల’ ప్రయత్నం, రాజకీయంగా తల్లీ, చెల్లి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు  జగన్ రెడ్డి అధికారం కోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు అనడానికి  ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. నిలుస్తున్నాయి. అందుకే జగన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టినా తలపెడతారు అనే అనుమనాలు సహజంగానే అందరిలో  వ్యక్త మవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, నెల రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్‌లో జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడి ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల రోజుల సమయంలో  చంద్రబాబు 5 కిలోలు బరువు తగ్గారని, ఆయనకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని  చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులతో పాటుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజకీయలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   చివరకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికలపై విశ్వాసం లేకనో ఏమో, చంద్రబాబు నాయుడు కుమారుడు,  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను పిలిపించుకుని చంద్రబాబు ఆరోగ్యం గురించి అడిగితెలుసు కున్నారు. అలాగే  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ను  చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసు కున్నారు. పార్లమెంట్ -20 సమావేశంలో ప్రధాని మోడీని కలిసిన కనకమేడలను జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం గురించి మోడీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కనకమేడల.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితితో పాటుగా కేసుల పూర్వాపరాలను కుడా ప్రధానికి వివరించారు.  ఇలా నెలరోజులకు పైగా జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోగ్యం గురించి ప్రధానమంత్రి మొదలు సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తుంటే, వైసీపీ నాయకులు మాత్రం, ఎవరి కళ్ళలో ఆనందం  చూసేందుకో ఏమో కానీ, మానవత్వాన్ని మరిచి వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన భర్త చంద్రబాబు ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా బరుగు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తే ,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేలిగ్గా తీసి పడేశారు.చంద్రబాబు జైల్లో బరువు తగ్గలేదు ఒక కిలో బరువు పెరిగారని ఆయన నవ్వుతూ  తన విషపు కోరలు బయట పెట్టుకున్నారు. వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆలాగే  మరింతగా దిగజారి చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే ప్రమాదం ఉందని నీచాతినీచమైన, అడ్డగోలు  వ్యాఖ్యలు చేశారు. 73 ఏళ్ల వయసున్న నాయకుడి ఆరోగ్యంపైనా అవహేళనగా మాట్లాడి తమ ధోరణి ఎలాంటిదో మరోసారి ప్రపంచానికి చాటుకున్నారు. నిజానికి  చంద్రబాబుకు వయసు రీత్యానే కాదు, 35 సంవత్సరాలకు పైగా ఆయనకు ఉన్న   ఆరోగ్య  సమస్య రీత్యా ప్రత్యేక  వైద్యం,. ప్రత్యేక సదుపాయాలు అవసరం. ఆరోగ్య అవసరాల దృష్ట్యా చల్లటి వాతావరణం (ఏసీ) లో ఉండటం అవసరం.  జైల్లో ఆ సదుపాయం లేదు.   దీంతో,35ఏళ్ల కిందటి సమస్య 30 రోజుల కారాగారంలో తిరగబెట్టింది.అదే విషయాన్ని కుటుంబ సభ్యులు ప్రస్తావించారు. రక్తబంధం, మానవ సంబంధాల విలువ తెలిసిన చంద్రబాబు కుటుంబ సభ్యులు సహజంగానే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, వైసీపీ నాయకులు చంద్రబాబు ఆరోగ్య సమస్యలను కూడా అవహేళన చేస్తున్నారు. ఏసీ ఇవ్వడానికి అత్తగారిల్లా?’ అని ప్రభుత్వ పెద్దలు వెకిలిగా మాట్లాడుతున్నారు.‘స్కిన్‌ అలర్జీతో ప్రాణాలు పోతాయా?’ అనే దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు.  అయితే  వివేకా హత్య కేసులో అరెస్టయిన వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి (ఎంపీ అవినాశ్‌ తండ్రి) తనకు నలతగా ఉందనగానే హుటాహుటిన నిమ్స్‌కు తరలించారు. ఆయనకు ఆరోగ్య కారణాలతో ‘ఎస్కార్ట్‌’ పెరోల్‌ కూడా వచ్చింది.  దానిని కోర్టు మళ్లీ మళ్లీ పొడిగిస్తోంది కూడా!  భాస్కర్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితి వల్లే కోర్టు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఆయన ఆరోగ్యంపై ఎవరూ అనుమానాలు వ్యక్తం చేయలేదు. అవహేళనగా మాట్లాడలేదు. చంద్రబాబు విషయంలో ప్రభుత్వ పెద్దలు నోరు పారేసుకోవడం గమనార్హం. అయితే  వైసేపీ నాయకులు ఒక విషయం గమనించడం లేదు. అధికార మదంతో సభ్యత, సంస్కారం మరిచి  చేసే ఇటువంటి  విపరీత వ్యాఖ్యలను ప్రజులు ఎప్పుడూ సహించరు. ఇది చరిత్ర పదే పదే చెబుతున్న సత్యం. చంద్రబాబు  హెల్త్ బులిటిన్ లో ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల వివరాలు చూస్తే.. అసలు వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారా అన్న అనుమానం కలగడం సహజం. డయాబెటిక్ అయిన చంద్రబాబు సుగర్ లెవెల్స కూడా చెక్ చేయకుండా ఆయనకు పరీక్షలు నిర్వహించామంటూ వెల్లడించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పైగా ప్రతి రోజూ హెల్త్ బులిటిన్ విడుదల చేయాలన్న డిమాండ్ పై స్పందించిన సజ్జల అలా హెల్త్ బులిటిన్ రిలీజ్ చేయరని చెబుతూ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు తీవ్రమైన హాని తలపెట్టేందుకే వైసీపీ సర్కార్ నిర్ణయించుకుందన్న అనుమానాలకు తావిస్తున్నది. అంతే కాకుండా సజ్జల ప్రెస్ మీట్ లో ఏం చెప్పారో, అవే వివరాలను జైళ్ల డీజీ రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడటం చూస్తుంటే ఏదో మహాకుట్ర జరుగుతోందన్న అనమానాలు వ్యక్తం  కావడం సహజం అని పరిశీలకులు చెబుతున్నారు.