తెలుగుదేశం విజయానికి రెడ్ కార్పెట్!

రానున్న ఎన్నికలలో టీడీపీ విజయం ఖరారైంది. ఇప్పటికే వెలువడిన ముందస్తు సర్వేలు, రాష్ట్ర ప్రజల మూడ్ (మూడ్ ఆఫ్ ఏపీ)ను బట్టి రాజకీయ పరిశీలకులు ప్రభుత్వం మారడం ఖాయమని తేల్చేశారు. ఈ విషయం వైసీపీ నేతలకు కూడా తెలుసు. వైసీపీ సొంత సర్వేలలో ప్రజల అసంతృప్తి స్పష్టంగా వెలువడింది. గడప గడపకు కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ అసంతృప్తి సెగ కు మాడిపోయారు. ప్రజాగ్రహాన్ని స్వయంగా చవి చూశారు.   దానికి తోడు ఇప్పుడు పసలేని అక్రమ కేసులలో అలవి గాని సెక్షన్లను బనాయించి తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం కూడా వైసీపీ పట్ల ప్రజలలో మరింత ఆగ్రహాన్ని పెంచింది. నెరవేరని హామీలు, పడకేసిన అభివృద్ధి, ఊసే లేని ఉపాధి, ఏ రంగానికి దక్కని ప్రోత్సాహం, స్పష్టత లేని మంత్రులు,   దిశా నిర్ధేశం లేని ప్రభుత్వం,  ప్రణాళిక అంటూ ఏదీ లేకుండా కేవలం బటన్ నొక్కుడు ఒక్కటే పనిగా పెట్టుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఏపీ ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు. ఫలితంగా ఈ అసంతృప్తి  రేపు ఎన్నికలలో ప్రతిపక్షాలకు ఓట్లుగా మారనుందన్నది పరిశీలకుల విశ్లేషణ. . వైసీపీ మీద అసంతృప్తి  ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమికి ఓటు బ్యాంకు కానుందా అంటే ఖచ్చితంగా ఔననే సమాధానమే వస్తున్నది.  ఏపీలో ఇప్పుడు బలమైన పార్టీలు టీడీపీ, వైసీపీలే కాగా.. మూడవ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ జనసేన కనిపిస్తున్నది. అయితే, పవన్ జనసేన ఇప్పుడు టీడీపీలో ఉంది. మిగతా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నా రెండూ కలిపినా రెండు శాతం ఓటింగ్ కూడా లేని పార్టీలు. ఇక కమ్యూనిస్టులు కూడా టీడీపీ, జనసేనతో కలిసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న రాష్ట్ర   ప్రజలంతా టీడీపీ, జనసేన కూటమివైపే మొగ్గు చూపుతున్నారు.   ప్రజా వ్యతిరేకత, ప్రధాన ప్రత్యామ్నాయంతో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి తప్పిదాలు కూడా టీడీపీ విజయానికి రెడ్ కార్పెట్ పరిచాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నాలుగేళ్ల జగన్ పాలనలో సామాజిక వర్గాల మధ్య తీవ్ర అగాధం పెరిగింది. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో మీడియా మైకుల ముందుకొచ్చిన ప్రతి వైసీపీ నాయకుడు చంద్రబాబు సామాజికవర్గాన్ని కలవరించే వారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు సొంత సామజిక వర్గానికి దోచి పెట్టారనే కోణంలోనే విమర్శలు సాగేవి. చివరికి రాజధాని కూడా చంద్రబాబు సామాజికవర్గం కోసమే అమరావతిలో పెట్టారనే ఆరోపణలు చేశారు. కొన్నాళ్ల పాటు ఈ తరహా విమర్శలు సాగగా ఆ తర్వాత వైసీపీ నేతలు ఆ పాఠాలను వదిలేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంశంలో కూడా అదే జరిగింది. వైసీపీలో పవన్ సామాజిక వర్గ నేతలను ఉసిగొల్పి విమర్శలు చేయించారు. కానీ, అది కూడా వర్క్ అవుట్ కాలేదు. దీంతో వైసీపీ నేతలు రూట్ మార్చి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశాలతో పాటు చంద్రబాబు దత్తపుత్రుడు అనే నినాదం అందుకున్నారు. ఫైనల్ గా వైసీపీ నేతలు తెలుగుదేశం, జనసేనలపై ఈ తరహా విమర్శలతో రెండు సామాజికవర్గాలకు జగన్   వ్యతిరేకి అనే ముద్ర బలంగా వేసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు వైసీపీ క్యాడర్ లోని ఈ రెండు సామజిక వర్గాలు కూడా వైసీపీకి దూరమయ్యాయి.  అనాది నుండి బీసీ సామజిక వర్గాలు టీడీపీకి పెట్టని కోట. ఎన్టీఆర్ హయం నుండి ఇప్పటి వరకూ టీడీపీలో పెత్తనంతో పాటు పదవులలో కూడా బీసీలకు ప్రధాన వాటా ఉంటుంది. అయితే, 2019లో కొద్ది శాతం బీసీలను రకరకాల మార్గాల ద్వారా వైసీపీ ఆకర్షించింది. కానీ  ఈ నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలకు కూడా జగన్ దూరమయ్యారు. బీసీలలో ఎక్కువ శాతం ప్రజలకు ప్రధాన జీవనోపాధి వ్యవసాయం. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి ఏం చేద్దాం అనే మాటే వినిపించకుండా చేశారు. వ్యవసాయం అంటే రైతు భరోసా బటన్ నొక్కడమే అనుకున్న సీఎం పట్ల సీఎం సొంత సామాజికవర్గ రైతులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. అటు కులాల మధ్య చిచ్చు పెట్టడం.. తమ వృత్తిని నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ఈ సామజిక వర్గాలన్నీ వైసీపీకి దూరమై టీడీపీ, జనసేన కూటమికి చేరువయ్యారు. ప్రజల పోలరైజేషన్ మధ్య వ్యత్యాసం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుండగా.. ఇది జగన్ తప్పిదాల వలనే ప్రజలకు తెలిసొచ్చిందని పరిశీలకులు అంటున్నారు.

వైసీపీలో అసమ్మతి.. జగన్ చేతులెత్తేశారా?

కాంగ్రెస్ పార్టీ అంటే కుమ్ములాటకి పెట్టింది పేరు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేకుండా దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఈ సమస్య ఎదుర్కొంటూనే ఉంటుంది. అయితే, కాంగ్రెస్ జాతీయ పార్టీ కనుక ఎన్ని కుమ్మలాటలు ఉన్నా చెల్లిపోతుంది. కానీ, ప్రాంతీయ పార్టీలలో అలా అంతర్గత కుమ్ములాటలు ఉంటే ఆ పార్టీ ఎందుకు పనికి రాకుండా పోతుంది. సింగిల్ కార్డ్ సిద్ధాంతం మీద పనిచేసే ప్రాంతీయ పార్టీలలో కర్త, కర్మ, క్రియ అన్నీ పార్టీ అధ్యక్షుడే కాగా.. అధ్యక్షుడి మాటకి మొత్తం పార్టీ కట్టుబడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలలో అధ్యక్షులు కనుసైగతో పార్టీని కట్టడి చేస్తారు. కానీ, ఏపీలో అధికార పార్టీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరగా.. నేతలు అధిష్టానికి కూడా కొరకురాని కొయ్యలుగా తయారయ్యారు. గట్టిగా మాట్లాడితే ఓడిపోయే పార్టీలో మేం ఉండేదే లేదంటూ అలకపాన్పు ఎక్కుతున్నారు. మళ్ళీ వాళ్ళని బుజ్జగించడం.. ఆశ పెట్టడం ఎందుకులే అనుకున్నారో ఏమో కానీ జగన్ కూడా చేతులెత్తేశారు.  నేతల మధ్య సమన్వయం కుదిర్చే బాధ్యతను కోఆర్డినేటర్లకు అప్పగించేసి.. నా పని బటన్ నొక్కుడు మాత్రమేనని చెబుతున్నారు.  ఇటీవల సీఎం జగన్ లండన్ నుండి ఏపీకి రాగానే విజయవాడలో వైసీపీ కన్వీనర్ల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఎన్నికలకు సమాయత్తం కావాలని.. ఎక్కడికక్కడ నేతలు, ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు కోఆర్డినేటర్లతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. దీంతో అప్పటి నుండి వైసీపీ రీజనల్ కోర్డినేటర్లు విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిజానికి ఎన్నికల ముంగిట ఈ సమావేశాలు చాలా కీలకం. పార్టీలోని లోటుపాట్లు, అసంతృప్తులను చల్లార్చి, ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేయడమే కోఆర్డినేటర్లసమావేశాల ప్రధాన ఎజెండా. కానీ, వైసీపీలో ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ల సమావేశాలే కొంప ముంచుతున్నాయి. ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాలలో అంతర్గత విభేదాలు సమసిపోవడం దేవుడెరుగు.. మరింతగా పెంచేలా చేస్తున్నాయి. కోఆర్డినేటర్ల ఎదుటే నేతలు యుద్దానికి దిగుతూ రెచ్చిపోతున్నారు. గట్టిగా మాట్లాడితే మీరేంటి చెప్పేది అంటూ కోఆర్డినేటర్లను కూడా లెక్క చేయకుండా రెచ్చిపోతున్నారు.  ఇందుకు ఉదాహరణే నెల్లూరు నియోజకవర్గ సమావేశం. వైసీపీ కోఆర్డినేటర్  విజయసాయిరెడ్డి నెల్లూరులో సమావేశాలు నిర్వహించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ ను మిగతా నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. విజయసాయి రెడ్డి అనిల్ కుమార్ పేరును ప్రకటించగానే జిల్లాలోని మిగతా నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నుడా చైర్మన్ ముక్కామల ద్వారకనాథ్, చివరికి అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ రూప్‌ కుమార్ యాదవ్‌ కూడా అనిల్‌ కు వ్యతిరేకంగా గళం విప్పారు. వీరిలో వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి లేదా ఆయన సతీమణి ప్రశాంతి నెల్లూరు ఎంపీ బరిలో ఉండగా.. రేపు అనిల్ ఆయనతో కలిసి పనిచేయాల్సి ఉంది. ఇప్పటికే పేరున్న నేతలంతా గుడ్ బై చెప్పేయగా.. ఉన్న వారిలో మంత్రి కాకాణితో పాటు మిగతా వాళ్ళు కూడా కలిస్తేనే ఇక్కడ పార్టీ బ్రతికి బట్టకట్టేది. కానీ, ఏ ఒక్కరూ పార్టీ ప్రకటించిన అభ్యర్థిని ఒప్పుకోవడం లేదు. కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయి రెడ్డి ఎంత చెప్పినా వినేవారు లేరు.  ఇది ఒక్క నెల్లూరు సిటీ పరిస్థితి మాత్రమే కాదు. దాదాపుగా రాష్ట్రమంతా వైసీపీది ఇదే పరిస్థితి. ఒకరికి ఒకరు అనే మాట లేకుండా ఎవరికి వారే అన్నట్లుగా మారిపోయారు. అసలే రాష్ట్ర ప్రజలకు పీకల వరకూ అసంతృప్తి ఉండగా.. గట్టేక్కేది ఎలారా భగవంతుడా అని పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. కానీ, నేతలేమో ఎలాగూ గెలిచే అవకాశం లేనప్పుడు తమ ఈగో  చంపుకోని ఎందుకు పనిచేయాలన్నట్లుగా ఎవరినీ లెక్కచేయడం లేదు. ఒకవైపు ప్రతిపక్షాలు ఐక్యతా రాగం అందుకొని బలపడి సవాళ్లు విసురుతుంటే వైసీపీ అసంతృప్తి మంటలతో తగలబడిపోతుంది. నా బటన్ నొక్కుడే నన్ను గెలిపిస్తాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారేమో ఏమో కానీ.. అన్ని బాధ్యతలను నేతల నెత్తిన పెట్టేసి ఆయన మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో రిలాక్స్ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మారిన సమీకరణాలతో పాటు ఇలా కుమ్ములాటలతో వెళ్తే వైసీపీకి కనీసం డిపాజిట్లు కూడా కష్టమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

కోడికత్తి కేసు విచారణపై స్టే.. శీను జైల్లో మగ్గిపోవాల్సిందే!

జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శీను నేరం ఇప్పటికీ రుజువు కాలేదు. కానీ, అప్పటి నుండి ఇప్పటి వరకూ ఇంకా జైల్లోనే మగ్గిపోతున్నాడు. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కోర్టు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరు కాలేదు. బాధితుడు జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన మాత్రం కోర్టుకు వెళ్లడం లేదు. జగన్ కోర్టుకు వెళ్తే ఈ కేసు కొలిక్కి వస్తుంది. కోడికత్తి శీనుకు బెయిల్ దక్కుతుంది. కానీ  జగన్ మాత్రం కోర్టుకు వెళ్లడం లేదు. ఆ మాట కొస్తే ఈ మధ్యనే ఎన్ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ హై కోర్టుకు వెళ్లారు. తాజాగా ఈ  కేసు విచారణపై  ఏపీ హైకోర్టు  మంగళవారం నాడు స్టే విధించింది.  ఈ కేసుపై విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. లోతుగా దర్యాప్తు కావాలని సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఎన్ఐఏను కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఏపీ హైకోర్టు ఆదేశించింది. ముందుగా జగన్ లోతైన దర్యాప్తు కావాలని జగన్ ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించగా కోర్టు  తోసిపుచ్చింది.  దీంతో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారించిన కోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.  ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్‌పై విశాఖ ఎయిర్‌ పోర్టులో కోడి కత్తి దాడి జరిగిన సంగతి జరిగింది. 2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌  హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయంకు రాగా.. అదే విమానాశ్రయం క్యాంటీన్ లో పనిచేస్తున్న వెయిటర్‌ సెల్ఫీ తీసుకుంటానని వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్‌పై కోళ్ల పందేలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్‌ జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వైఎస్‌ జగన్‌ భుజానికి కత్తి తగిలింది. అది చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ, అక్కడ నుండే అసలు సినిమా మొదలైంది. జగన్ హైదరాబాద్ చేరుకున్న తరవాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. దీంతో అదే పెద్ద సంచలనం అయింది. అక్కడ సీన్ కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిది. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. కానీ, ఈ కేసు ఎటూ తేలక నిందితుడు శ్రీనివాస్ ఐదు సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నాడు.  పలు మార్లు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్లు వెళ్లినా ఎక్కడా పనికాలేదు. వైఎస్ జగన్ ఈ కేసులో కోర్టుకు హాజరు కాకపోగా ఆయన తరపు లాయర్లు ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నారు. ఇటు కేసు తేలక.. బెయిల్ రాక నిందితుడు జైలుకు పరిమితమయ్యాడు. తాజాగా, ఈ కేసులో శ్రీనివాస్ తరపున పిచ్చుకల శ్రీనివాసరావు అనే కొత్త లాయర్ వాదనలు వినిపిస్తున్నారు. మొన్నటి వరకూ సలీం అనే లాయర్ ఈ కేసులో శ్రీనివాస్ తరపున వాదనలు వినిపించగా ఇప్పుడు శ్రీనివాస్ వాదిస్తున్నారు. కాగా  కోర్టుకు వచ్చి తన బాధను చెప్పుకోవాల్సిన బాధితుడు జగన్ అసలు కోర్టుకే వెళ్లకుండా.. ఇప్పుడు ఈ కోడికత్తి కేసులో లోతైన దర్యాప్తు కావాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు రెండు నెలల క్రితమే తిరస్కరించగా ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు.  అయితే, విమానాశ్రయంలో దాడి జరిగినపుడు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని ఎన్ఐఏ దర్యాప్తు కోరింది కూడా జగనే కాగా.. ఇప్పుడు ఆ ఎన్ఐఏ దర్యాప్తు కూడా సరిపోలేదని.. ఇంకా లోతైన దర్యాప్తు కావాలని మళ్ళీ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసింది కూడా జగనే కావడం విశేషం.  కాగా, ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో ఇప్పటికే రాష్ట్ర పోలీసులు కూడా జోక్యం పెరిగింది. జైలు నుండి కోర్టుకు.. కోర్టు నుండి జైలు తరలించే సమయంలోనూ, జైల్లో కూడా నిందితుడు శ్రీనివాస్ పై క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. కోర్టు ఆవరణలోనే పోలీసులు శ్రీనివాస్ ను ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  తనను హింస పెడుతున్నారని శ్రీనివాస్ కోర్టులోనే మొరపెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలను చూస్తుంటే జగన్ కావాలనే శ్రీనివాస్ ను జైలు నుండి బయటకురాకుండా మేనేజ్ చేస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

ఉచితాలు వర్షించినా గెలుపు గ్యారంటీ డౌటే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ విడుదలౌంది.  దాదాపు రెండు సంవత్సరాలుగా ముందస్తు, వెనకస్తూ, జమిలి,మినీ జమిలీ అంటూ షికార్లు చేసిన  వ్యూహాగానాలన్నీ గాలికి కొట్టుకు పోయాయి. కేంద్ర ఎన్నికల సంఘం, ముందు వెనకల జోలికి వెళ్ళకుండా  షెడ్యూలు ప్రకారమే ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 3 ఓట్ల లెక్కింపు ..అంతా లెక్క ప్రకారమే జరుగుతోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టీ పార్టీల గెలుపు ఓటముల మీదకు మళ్లింది.  అఫ్కోర్స్, ఈ లెక్కలు, అంచనాలు, జోస్తాలూ కూడా చాలా కాలం నుంచీ వినిపిస్తున్నాయనుకోండి, అది వేరే విషయం. అయినా  ప్రస్తుతం కాంగ్రెస్ గెలుస్తుందని కొందరు, కాదు, బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందనిఇంకొందరు, కాదు..కాదు.. బీజేపీ కోరుకుంటున్నట్లే హంగ్ వస్తుందని ఇంకొందరు లెక్కలు వేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలతో అందలం ఎక్కిన నేపధ్యలో తెలంగాణలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఇప్పటికే పోటాపోటీగా  ఉచిత  గ్యారెంటీలను అదే హామీలను ప్రకటించేశాయి. ఇక ఇహనో ఇప్పుడో  బీజేపీ కూడా  ఏడు  రంగుల  ఇంద్రధనస్సు పేరిట ఏడు గ్యారెంటీలను ప్రకటిస్తుందని అంటున్నారు. అందులోనూ ఉచితాలే ఉంటాయో లేక మహిల రిజర్వేషన్ వంటి ఎండమావులే ఉంటాయో, ఇంకేమైనా ఉంటాయో  తెలియదు కానీ అన్ని పార్టీలు  గ్యారెంటీ లనే నమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ఉచిత వరాలపైనే గెలుపు ఆశలు పెంచుకుంటున్నాయి. అయితే ప్రజలు గ్యారెంటీలకే ఓట్లేస్తారా? అంటే డౌటే అంటున్నారు విశ్లేషకులు.   కాంగ్రెస్ ముందుగానే ప్రకటించిన గ్యారంటీలకు దీటుగా ఉండేందుకు  నెలరోజులకు పైగా మౌనంగా మేథోమథనం సాగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాత పథకాలనే  సొబగులద్ది  మేనిఫెస్టో షో కేసులో పెట్టారు. మేనిఫెస్టో నిండా సంక్షేమ పథకాలే  నింపారు. అలాగే కాంగ్రెస్ ను మరింత దీటుగా ఎదుర్కునేందుకు ఇప్పటికే ఉన్న పథకాలకు తోడుగా కొత్త పథకాలను కూడా జోడించారు.  రైతుబీమా తరహాలో, తెల్లరేషన్‌ కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్‌ బీమా   పథకం అన్నారు. కేసీఆర్‌ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది. తెల్ల రేషన్‌కార్డుదారులకు అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం అందిస్తామని ప్రకటించారు.ఆసరా పెన్షన్లను ఏటా రూ.500 చొప్పున రూ.5 వేలకు పెంచుతామని మరో వాగ్దానం చేశారు. దివ్యాంగుల పెన్షన్లు ఏటా రూ.300 చొప్పున రూ.6 వేలకు,  సౌభాగ్యలక్ష్మి పథకం’ కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి, అర్హులైనవారికి రూ.400కే గ్యాస్‌ సిలిండర్లు,  జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంపు, రైతుబంధు మొత్తం దశలవారీగా రూ.16 వేలకు పెంపు, కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15 లక్షల బీమా పథకం,జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రూ.15 లక్షల వరకు వైద్య సేవలు...ఇలా ఉచిత వరాలను వడ్డించారు.  అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు తోడు.. మేనిఫెస్టోలో ఇంకెన్ని గ్యారెంటీలను వడ్డిస్తుందో చూడవలసి వుంది. అలాగే  ఉచితాల విషయంలో కొంచెం ఆచితూచి అడుగులేసే బీజేపీ కూడా ఈసారి తగ్గేదేలే ..అన్నట్లు ఉచితాలను వర్షిస్తుందని అంటున్నారు.అయితే,  ఇచ్చిన గ్యారెంటీలు ఏ పార్టీకి అయినా  గెలుపు గ్యారెంటీ ఇస్తున్నాయా.. అంటే .. డౌటే ..అంటున్నారు.

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం

స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తరువాత ప్రభుత్వ తీరు, ఆ కేసులో ప్రభుత్వ న్యాయవాదుల వాదనలు గమనించిన ఎవరికైనా సరే కోర్టు ప్రొసీడింగ్స్ ను సాధ్యమైనంతగా జాప్యం అయ్యేలా చేసి వీలైనన్ని ఎక్కువ రోజులు చంద్రబాబును జైలులో ఉంచాలన్న వ్యూహమే కనిపిస్తున్నది. ఏసీబీ, హైకోర్టులలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తరువాత సహజంగానే చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. అక్కడ వాదనలలో చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు సూటిగా, సుత్తి లేకుండా ఉంటే.. ప్రభుత్వ తరఫు న్యాయవాది మాత్రం సాధ్యమైనంతగా కాలయాపన చేయడమే లక్ష్యంగా తన వాదనలు వినిపించారు. దీంతో  విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నది. మంగళవారం ( అక్టోబర్ 17) వాదనలు పూర్తై తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. అయితే ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాత్రం సుదీర్ఘంగా తన పాత వాదనలనే వినిపించారు. ఆయన వాదిస్తున్న సమయంలో పలుమార్లు న్యాయమూర్తులు ప్రశ్నలు సంధించారు. మంగళవారం మధ్యాహ్నం సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు రాగానే తొలుత ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదని ఆయన చెప్పారు. అయితే ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తుండగా సుప్రీం కోర్టు ధర్మాసనం పలు  ప్రశ్నలు సంధించింది. ఈ కేసుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని ఒక సందర్భంలో  ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే వాటిని  పట్టించుకోకుండా రోహత్గీ తన వాదనలు కొనసాగించారు. సమయం మించిపోతోంది.. ముగించాల్సిందని కోరితే మరికొంత  సమయం కావాలన్నారు. అయితే సుప్రీం ధర్మాసనం అందుకు అంగీకరించలేదు. ఈ కేసులో వాదనలు ఈరోజే పూర్తి అవుతాయని స్పష్టం చేసింది. ఆ తరువాత చంద్రబాబు  తరఫు న్యాయవాది హరీష్ సాల్వే సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందంటూ పలు తీర్పులను ఉటంకించారు. అన్నిటికీ ఈ  కేసులో రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్లలో ఆరోపణలు  తప్ప మరేమీ  లేవని సోదాహరణంగా వివరించారు. ఈ  కేసు వెనుక రాజకీయ కక్షసాధింపు ఉందనీ.. ఎన్నికల ముందు  విపక్ష నేతను జైలులో ఉంచి  రాజకీయంగా లబ్థి పొందేందుకు ప్రభుత్వం  ప్రయత్నిస్తోందన్నారు. ఇరు పక్షాల వాదనలూ విన్న అనంతరం సుప్రీం కోర్టు తీర్పేను శుక్రవారానికి రిజర్వ్ చేసింది. కాగా ఈ రోజు సుప్రీంలో విచారణకు రావలసిన సైబర్ నెట్ కేసును కూడా శుక్రవారానికి వాయిదా వేయడమే కాకుండా అప్పటి వరకూ చంద్రబాబును అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఆ కేసు విచారణ కూడా శుక్రవారమే పూర్తి చేసి తీర్పు వెలువరిస్తామని పేర్కొంది.  

తెలంగాణ అసెంబ్లీకి నందమూరి సుహాసిని.. ఈసారి పక్కా అంటున్న టీడీపీ!

ఏపీలో ఈసారి అధికారం తెలుగుదేశం పార్టీదే. ఈ విషయం ఇప్పటికే  పలు సర్వే సంస్థలు పేర్కొన్నాయి. అలాగే  రాజకీయ పరిశీలకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికార వైసీపీ సొంత సర్వేలలో కూడా ఇదే ఫలితాలలు రావడంతో ఇప్పుడు వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఏదోలా కార్యకర్తలను రెచ్చగొట్టి, వ్యవస్థలను మ్యానేజ్ చేసి, అధికారంలో ఉండగా సంపాదించుకున్న ఆర్ధిక వనరులను వినియోగించుకొని, పందిని నందిని చేసి చూపించగల రాజకీయ వ్యూహకర్తలను అడ్డం పెట్టుకొని ఎలాగైనా గెలవాలని ఆరాటపడుతున్నది. అయితే  మరో సారి మోసపోయేందుకు సిద్ధంగా లేమని ప్రజలు వైసీపీ నేతలకే మొహం మీద చెప్పేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా తెలుగుదేశం జోష్ కనిపిస్తున్నది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణలో ఎలాంటి కార్యక్రమం తలపెట్టినా అనూహ్య స్పందన లభిస్తున్నది. తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీ తెలుగుదేశం క్యాడర్ గతంలో మాదిరి ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపడం లేదు. ఈసారి తమ ఉనికి  చాటుకోవాలన్న తపన తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తుంది. దీంతో తెలంగాణ తెలుగుదేశం నాయకత్వం కూడా ఆ దిశగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 87 స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేశామని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తాజాగా ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో చంద్రబాబుతో కాసాని జ్ఞానేశ్వర్ ఇటీవల ములాఖత్ అయ్యారు.   హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో ములాఖత్ వివరాలు వెల్లడించారు. ఆ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారని, చంద్రబాబు ఆమోదించాక త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని జ్ఞానేశ్వర్ చెప్పారు. కాగా  నంద‌మూరి సుహాసిని ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్డడం ఖాయ‌మ‌ని తెలుగుదేశం నేతలు బల్లగుద్ది చెప్తున్నారు. ఈ సారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ నందమూరి ఆడపడుచుని గెలిపించి ఋణం తీర్చుకుంటామని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ‌త 2018 ఎన్నిక‌ల్లో తొలిసారి నంద‌మూరి కుటుంబం నుంచి సుహాసిని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సంగతి తెలిసిందే. దివంగ‌త హ‌రికృష్ణ కుమార్తె అయిన సుహాసిని గురించి అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు. కానీ  సుహాసిని రాజకీయ అరంగేట్రం,  2018 ఎన్నిక‌ల్లో కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో నిలవడం చకచకా జరిగిపోయాయి. కూకట్ పల్లిలో సెటిలర్లు ఎక్కువగా ఉండడం, కాంగ్రెస్‌తో అప్ప‌ట్లో టీడీపీ పొత్తు ఉండడం, బాబాయ్ బాలకృష్ణ దగ్గరుండి ప్రచారం చేయడం వంటి కారణాలతో సుహాసిని ఖ‌చ్చితంగా గెలిచి తీరుతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా సుహాసిని ఓట‌మి చ‌వి చూశారు. కాగా ఇప్పుడు వ‌చ్చిన అసెంబ్లీ పోరులో ఆమె మ‌రోసారి ఎన్నిక‌ల బరిలోకి దిగనున్నారు. అయితే, ఈసారి పగడ్బందీ ప్రణాళికతో ఎ సుహాసినిని తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేయాలని తెలంగాణ  తెలుగుదేశం నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. ఈ సారి నందమూరి సుహాసినిని గెలిపించుకోవ‌డం ల‌క్ష్యంగా రెండు చోట్ల పోటీకి దింపనున్నట్లు తెలుస్తుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన కూక‌ట్ ప‌ల్లి నియోజకవర్గంతో పాటు ఈసారి ఎల్బీన‌గ‌ర్‌ను కూడా సుహాసినికి కేటాయించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కూకట్ పల్లిలో ఆంధ్రా సెటిలర్లు ఎక్కువే అయినా   వీరిలో కొంత శాతం తెలంగాణలో బలమైన పార్టీలకు షిఫ్ట్ అయ్యారు. కానీ  ఎల్బీ నగర్ అలా కాదు. ఇప్పటికీ ఇక్కడ తెలుగుదేశం బలంగా ఉంది. ఆ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతుంటాయి. ఇక్కడ సెటిలర్లలో ఎక్కువ శాతం ఏపీలో తెలుగుదేశం పార్టీకి  కంచుకోట లాంటి ప్రాంతాల నుండి  వచ్చిన వారే కావడంతో తెలంగాణలో ఉన్నా తాము తెలుగుదేశం కార్యకర్తలమే అని గట్టిగా చెబుతుంటారు.  అందుకే గత ఎన్నికలలో ఎల్బీ న‌గ‌ర్‌ నుండి బీసీ నాయ‌కుడు ఆర్‌.కృష్ణ‌య్య కూడా విజ‌యం సాధించారు. అప్పట్లో టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్) ప్ర‌భావం జోరుగా ఉన్న‌ప్ప‌టికీ కృష్ణయ్య విజ‌యాన్ని అడ్డుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా సుహాసినిని పోటీ చేయించనున్నట్లు తెలుస్తుంది.    

పొమ్మని పొగపెడుతున్నా పోలేక.. వైసీపీలో బాలినేని విలవిల!

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అన్నిటికీ  మించి ముఖ్యమంత్రి జగన్ కు దగ్గర బంధువు అయిన బాలినేని పరిస్థితి పార్టీలో ఇప్పుడు అత్యంత దయనీయంగా మారింది. ఇటువంటి పరిస్థతి పగవాడికి కూడా వద్దురా నాయనా అన్నట్లుగా తయారైంది. పార్టీలో ఆయనకు పొమ్మన లేక పోగపెడుతున్న పరిస్థితులు ఉన్నా.. ఆ పొగకు ఉక్కిరి బిక్కిర అవ్వడం తప్ప పార్టీ నుంచి బయటకు రాలేక, పార్టీలో ఇమడ  లేక ఆయన నరక యాతన అనుభవిస్తున్నారు. తన  అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం  చేసిన ప్రతి సారీ ఆయనకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు వస్తున్నది. బుజ్జగింపు మాటలతో సముదాయించి పంపేస్తున్నారు. పరిస్థితి మళ్లీ  షరా మామూలే. టార్గెట్ చేసినట్లుగా పార్టీలో ఆయన , ఆయన క్యాడర్  అనుక్షణం వేధిపులకు గురి అవుతున్నారు.  ఔను నిజమే ఇప్పుడు ఆయన గురించి అందరూ ఒకే మాట అంటున్నారు. పాపం బాలినేని.. పేరుకేమో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆప్తుడు, దగ్గర బంధువు.  కానీ పార్టీలోనేమో  కూరలో కరివేపాకు. పోనీ బయటకి వెళ్లిపోదామంటే ఎప్పటికప్పుడు బుజ్జగింపులు. ఎలాగోలా ఉందామంటే మనస్సాక్షిని చంపుకొని, ఆత్మగౌరవాన్ని వదలుకుని ఉండలేని పరిస్థితి. మొత్తంగా బాలినేని పరిస్థితి పగవాడికి కూడా  రాకూడదురా భగవంతుడా అన్నట్లుగా తయారైంది.  పార్టీలో తగిన గౌరవం లేకపోవడం.. బాధను వెళ్లగక్కుతూ అల్టిమేటం జారీచేయడం.. ఇంతలోనే తాడేపల్లి నుండి పిలుపు రావడంతో బుజ్జగింపులకు పడిపోయి మళ్ళీ పార్టీలో కలిసి పోవడం మంత్రి పదవిని జగన్ ఊడబీకేసినప్పటి నుంచీ బాలినేనికి పార్టీలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని   కీలక నేత. అందులో సందేహం లేదు. నాడు వైఎస్సార్.. నేడు జగన్ హయాంలోనూ ఓ వెలుగు వెలిగారు. అయితే, ఇదంతా వైసీపీ అధికారంలోకి రాకముందు మాట. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక  జగన్ తొలి కేబినెట్ లో స్థానం దక్కినా, మలి క్యాబినెట్ లో పదవి పోయిన తరువాత వైసీపీలో బాలినేనికి ప్రాధాన్యత సంగతి అటుంచి కనీస గౌరవం కూడా లేకుండాపోయింది. పార్టీలో పరిస్థితి అలా ఉంటే.. కనీసం ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా అధికారులు ఇవ్వడం లేదు.   ఆఖరికి పోలీసులు, ఎమ్మార్వోలు, ముఖ్య అధికారుల బదిలీల విషయంలో  ఆయనకు కనీస సమాచారం ఉండటం లేదు. ఇటీవల బాలినేని ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. వీరిద్దరూ పర్చూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. బాలినేనికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.  తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించిన బాలినేని.. 48 గంటల్లోగా తన అనుచరులను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే డైరెక్ట్ గా జగన్ ను కలుస్తానని హెచ్చరిక లాంటి ప్రకటన చేశారు.  అయితే ఆయన  అల్టిమేటమ్ ను పట్టించుకున్న  నాథుడే లేరు.   ఇక తాజాగా మరోసారి బాలినేని అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపడుతూ.. తన సెక్యూరిటీని సైతం సరెండర్ చేశారు.  ప్రకాశం జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల స్కాం లో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్కాంలో అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, తన రాజకీయ జీవితంలో  ఇటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడే ఆయనో సంచలన వ్యాఖ్య చేశారు. కేవలం నాలుగేళ్ల నుంచే  ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నాను అన్నారు. అంటే పరోక్షంగా జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ, అంటే వైసీపీ సర్కార్ వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యవస్థంగా మారాయని ఆయన పరోక్షంగా చెప్పారు. సరే ఇక విషయానికి వస్తే పోలీసుల తీరుకు నిరసనగా  తన గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ నకిలీ దస్తావేజుల స్కాంలో   ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అనుచరులు ఉన్నారని బాలిరెడ్డి ఆరోపణ. అయితే పోలీసులు మాత్రం బాలినేని అనుచరులను వదిలేసి ఓ పది మందిని అరెస్టు చేశారు. దీనిపైనే బాలిరెడ్డి ఫైర్ అయ్యారని అంటున్నారు. సూత్రధారులను, అసలు నిందితులను వదిలేసి కేసును నిర్వీర్యం చేయడానికి పోలీసలు ప్రయత్నిస్తున్నారంటూ బాలినేని డీజీపీకి లేఖ రాసి మరీ తన గన్ మెన్లను సరెండర్ చేశారు. అయితే ఆయన ఈ చర్యను సర్కార్ కానీ, పోలీసులు కానీ సిరియస్ గా తీసుకునే పరిస్థితులైతే లేవని అంటున్నారు.  

సంఘీభావ యాత్రలను సహించరా ? 

ఆంధ్ర ప్రదేశ్ లో రాజ్యాంగం అమలవుతోందా? అక్రమ కేసులో మాజీముఖ్యమంత్రిని జైలు పాలు చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండ్ గా కొత్తగా  వచ్చిన డిఐజీ రవికిరణ్ టిడిపి శ్రేణులపై ఉక్కుపాదం మోపారు. డెమాక్రటిక్ పద్దతితో చంద్రబాబు అర్ధాంగి రాజమండ్రి జైలు వద్ద  ఇవ్వాల్టి నుంచి చేపట్టిన రెండు రోజుల సంఘీభావ కార్యక్రమాన్నిఅడ్డుకుని మరిన్ని విమర్శలను మూటగట్టుకున్నారు.  రాజమండ్రి జైలులో ఉన్న అరకొరసౌకర్యాలతో చంద్రబాబు ఆరోగ్యం రోజు రోజుకి దిగజారుతోంది. అలెర్జీ, డీ హైడ్రేషన్, ఐదు కిలోల బరువు తగ్గడం ఆయన కుటుంబసభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన  జగన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ అయిన నాటి నుంచి కనీసం హెల్త్ బులిటిన్స్ సక్రమంగా ఇవ్వకపోవడం శోచనీయం. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రజల్లో ఉన్న ఆందోళనను తొలగించే బాధ్యత కూడా వైఎస్ ఆర్ ప్రభుత్వంపై ఉంది. ప్రజా స్వామ్యంలో నిరసనలు వ్యక్తం చేయడం రాజ్యాంగంలోనే ఉంది. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తుంది. అక్రమ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరికి సంఘీభావంగా రెండు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమానికి పోలీసులు అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇటీవలే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు, టిడిపి శ్రేణులు చలో రాజమండ్రి సెంట్రల్‌ జైలు పిలుపులో భాగంగా నిర్వహించే ధర్నాలు, రాస్తారోకోలకు ఎటువంటి అనుమతులు లేవని తూ. గో జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపిన సంగతి తెలిసిందే . పోలీసు నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.  టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో డీఐజీ రవికిరణ్ బాధ్యతలు చేపట్టారు. ఈ మార్పుపై టీడీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారు. అయితే ఇప్పుడు రాజమండ్రి జైలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. జైలులో చంద్రబాబుకు సరైన భద్రత లేదని కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రావుల్ వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లారు. ఆ స్థానంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సమీప బంధువైన ఏపీ జైళ్లశాఖ కోస్తాంధ్ర రీజియన్‌ డీఐజీ ముదపురెడ్డి రవికిరణ్‌... రాజమండ్రి జైలు ఇన్ ఛార్జ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో టీడీపీ క్యాడెర్ మరింత ఆందోళన నెలకొంది. రవికిరణ్ ఎంట్రీతోనే చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరికి అనుమతి నిరాకరించారు. దీనిపై విమర్శలు తీవ్రంగా వచ్చాయి. తాజాగా నారా భువనేశ్వరి రెండు రోజుల పాటు చేపట్టే కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తం అవుతుంది. కానీ ఎపి పోలీసులు అనధికారికంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.   ఏసీబీ కోర్టు వద్ద ఐదురకాల పోలీస్ ఫోర్సులను ఏర్పాటు చేసింది ఎపి ప్రభుత్వం. ర్యాలీలు, నిరసనలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే  చంద్రబాబు లాయర్లు రెండు పిటిషన్లు వేశారు. గృహ నిర్బంధానికి  అనుమతి కోరుతూ ఓ పిటిషన్ వేశారు. జైలులో ప్రత్యేక సౌకర్యాలు ఉన్న గది కేటాయించాలని మరో పిటిషన్ వేశారు. అయితే చంద్రబాబు లాయర్లు చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. మరోవైపు పోలీసులు రాజమండ్రి జైలు పరిసరాల్లో అప్రకటిత కర్ఫ్యూ  విధించారు.  చంద్రబాబును స్కిల్ స్కాంలో మరింతగా ప్రశ్నించాలని సీఐడీ భావిస్తుంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్‌లో రూ.241 కోట్లు అవినీతి జరిగిందనే అభియోగాలతో.. ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును వేధింపులకు గురి చేస్తోంది. చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేశారు. ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబుపై 120(బి), 166,167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదైంది. టీడీపీ చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపడితే  తప్పేముందని  నారా భువనేశ్వరి ప్రశ్నించారు.తనకు మనోధైర్యం కోసం పార్టీ శ్రేణులు యాత్ర చేస్తే తప్పా అని ఆమె ప్రశ్నించారు.పార్టీ కార్యకర్తలు  తమ బిడ్డల్లాంటి వారని  భువనేశ్వరి పేర్కొన్నారు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకొంటామని  నోటీసులు ఇస్తారా అని ఆమె పోలీసులను ప్రశ్నించారు.తనను కలవకూడదని  చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడదన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. తెలుగుదేశం అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు?

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే   అధికార  పార్టీ 115 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ 51 మంది అభ్యర్థులతో  తొలి జాబితాను రెండు రోజుల కిందట విడుదల చేసింది. ఇహనో ఇప్పుడో బీజేపీ కూడా  అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. అయితే రాష్ట్రంలో అన్ని స్థానాలలోనూ పోటీ చేస్తామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీలో మాత్రం ఎన్నికల హడావుడి ఇసుమంతైనా కనిపించడం లేదు. అసలు ఈ సారి  తెలుగుదేశం పార్టీ బరిలో నిలుస్తుందా? లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ ఎన్నికల బరిలో నిలుస్తే  అభ్యర్థుల జాబి ప్రకటన ఎప్పుడు అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.    స్కీల్  కేసు అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన నేపథ్యంలో  తెలంగాణలోని పార్టీ నాయకులతో ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల భేటీ  అయ్యారు. ఆ భేటీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ పరిస్థితి, పోటీ విషయాలు చర్చించారు. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను ఇక తెలంగాణలో పార్టీ పటిష్టతపై దృష్టి సారిస్తానని చెప్పారు.  ఓ వైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. మరోవైపు ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియకు సమయం ఆసన్నమవుతోంది. ఇంకోవైపు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రాజమండ్రి, ఢిల్లీ తిరుగుతున్నారు. దీంతో తెలంగాణలో సైకిల్ పార్టీపై దృష్టి సారించే వారు ఎవరనే ఓ చర్చ సైతం ఆ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే   రాష్ట్ర విభజన జరిగిన తర్వాత  రాష్ట్రంలో పార్టీ నాయకులంతా తెరాస గూటికి చేరారు. అయితే  కేడర్ మాత్రం చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీతోనే ఉంది.   అలాగే  రాష్ట్రంలో హైదరాబాద్ , ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్  జిల్లాల్లో టీడీపీ క్యాడర్ చాలా బలంగా ఉంది. ఆయా జిల్లాల్లో టీడీపీ నుంచి బలమైన అభ్యర్థులను బరిలో దింపితే.. ప్రత్యర్థులకు ముచ్చెమటలు తప్పవని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇక గత ఏడాది చివరిలో చంద్రబాబు సారథ్యంలో ఖమ్మంలో నిర్వహించిన టీడీపీ శంఖారావం సభ దిగ్విజయంగా విజయవంతమైంది. అలాగే హైదరాబాద్ మహానగరంలో నిర్వహించిన సభే కాకుండా.. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా నిర్వహించిన సభలు సైతం సక్సెస్ అయినాయి. అదే విధంగా తెలంగాణలో టీడీపీ చేపట్టిన.. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కూడా మంచి ఫలితాన్ని సాధించాయి.  అదీకాక.. ఏపీలో చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే..    తెలంగాణలో నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలో ఐ యామ్ విత్ సీబీఎన్ , లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ అంటూ హైదరాబాద్‌లో వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలు, నిరసనలకు దిగారు. ఇక చంద్రబాబు అరెస్ట్ ప్రభావం..  తెలంగాణలో జరగనున్న ఎన్నికలపై తీవ్ర  ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో ఆంధ్ర సెటిలర్లు భారీగా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఉపాధి, ఉద్యోగాలు లేకోపోవడంతో.. భారీ సంఖ్యలో ఏపీ ప్రజలు.. తెలంగాణకు వలస వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో వారి సత్తా చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. దీంతో తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకొనే ప్రతి సెటిలరూ కూడా మరో ఆలోచనకు తావులేకుండా  తెలుగుదేశం పార్టీకే ఓటు వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది.  అలాంటి వేళ తెలంగాణలో  తెలుగుదేశం పోటీ , అభ్యర్థుల ప్రకటన ఎటువంటి జాప్యం లేకుండా జరగాలని తెలుగుదేశం శ్రేణులే కాకుండా పార్టీ అభిమానులు సైతం కోరుతున్నారు.  

కేసీఆర్ వ్యూహాలు రివర్స్.. బీఆర్ఎస్ లో కాంగ్రెస్ కోవర్టులు?!

మామూలుగా  కాంగ్రెస్ ను కుదిపేసే అసంతృప్తి, అసమ్మతి ఈ సారి బీఆర్ఎస్ కు కంగారు పెడుతోంది. గత పదేళ్లుగా ఏ వ్యూహాలతో అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేశారో.. అవే వ్యూహాలను ఇప్పుడు బీఆర్ఎస్ అసమ్మతి నేతలు అనుసరిస్తున్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ముచ్చటగా మూడో సారి సీఎం పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ కు అడుగడుగునా అడ్డంకులే ఎదురౌతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ఆయన డిఫెన్స్ లో పడ్డారు. మరో వైపు కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవడమే కాకుండా.. అధికారాన్ని హస్తగతం చేసుకోగలమన్న ధీమాతో ముందుకు సాగుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్నా.. తెలంగాణ ఆవిర్భావం నుంచీ అధికారానికి దూరమై ఉని మాత్రంగా మిగిలిన కాంగ్రెస్ లో అసమ్మతి, అసంతృప్తి ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి ముందు అధికారంలోకి రావడమే లక్ష్యంగా సమైక్యంగా కదలాలన్న భావన వ్యక్తమౌతోంది. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారన్న వార్తలు మాత్రమే విన్నాం.. కానీ ఈ సారి కాంగ్రెస్ పార్టీకి కోవర్టులుగా బీఆర్ఎస్ నేతలు కొందరు పని చేస్తున్నారన్న అనుమానాలు అధికార పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా ఔననే చెబుతున్నాయి. బీఆర్ఎస్ లోని కొందరు..  కాంగ్రెస్‌కు కోవర్టులుగా పనిచేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అధికార పార్టీకి అందినట్లు సమాచారం. వారు కూడా అలాంటి ఇలాంటి వారు కాదు. కేసీఆర్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన వారేనని పార్టీ వర్గాల సమాచారం. ఇలాంటి వారు దాదాపు డజను మంది వరకూ ఉన్నారని అంటున్నారు.  ఏతావాతా ఎన్నికల తరువాత సపోజ్ ఫర్ సపోజ్ హంగ్ ఏర్పడితే..ఈ డజను మందీ గంపగుత్తగా గోడదూకేయడానికి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఆ కారణంగానే కేసీఆర్ తొలి జాబితా అంటూ 115 మంది అభ్యర్థులను ప్రకటించినా అందులో సగం మందికి కూడా బీఫారాలు ఇవ్వలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత పార్టీ అభ్యర్థులుగా తాను ఇప్పటికే ప్రకటించిన వారిపై నిఘా పెట్టారని అంటున్నారు.  ఒక వైపు పార్టీ ప్రచారంపై దృష్టి పెడుతూనే మరో వైపు అభ్యర్థుల కదలికపై కన్నేసిన కేసీఆర్.. మరో వైపు కోవర్టులు ఎవరన్న సమాచారం కోసం ఇంటెలిజెన్స్ వర్గాలపై ఆధారపడ్డారని చెబుతున్నారు.  ఇప్పటికే వారిలో కొందరిని గుర్తించినా.. ఈ సమయంలో అభ్యర్థులను మారిస్తే అది ప్రజలలోకి తప్పుడు సంకేతాలను పంపే ప్రమాదం ఉందని సంకోచిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.   ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేలలో, కేసీఆర్ స్వయంగా చేయించుకున్న సర్వేలలో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ తారాజువ్వలా పైపైకి వెడుతోందనీ, అదే సమయంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందనీ తేలిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ తరఫున వచ్చే ఎన్నికలలో పోటీకి టికెట్ ఖరారైన కొందరు అభ్యర్థులలో తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన  మొదలైందని చెబుతున్నారు. అలా ఆందోళనలో ఉన్న వారిలో అత్యధికులు గత ఎన్నికల తరువాత తాము గెలిచిన పార్టీ నుంచి ఫిరాయించి బీఆర్ఎస్ పంచన చేరిన వారేనన్నది పరిశీలకుల విశ్లేషణ.  వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఇప్పటికే నిర్ధారించుకున్న వారు ముందుగానే ఆ పార్టీకి టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే కేసీఆర్ లో ఆందోళన మొదలైందనీ, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ప్రకటించిన అభ్యర్థులలో మార్పులు, చేర్పులూ చేస్తే అది ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపిస్తుంది.. అలా అని మార్చుకుంటే.. ఎన్నికల అనంతరం పూడ్చుకోలేని నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఏం చేయవలే.. ఈ సమస్యను ఎలా అధిగమించవలె అంటూ కేసీఆర్ మథన పడుతున్నారని పార్టీ శ్రేణుల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని బీఆర్ఎస్ వర్గాల ద్వారానే తెలుస్తున్నది.    నీవు నేర్పిన విద్యయూ నీరజాక్ష అన్నట్లుగా.. ఇప్పటి వరకూ ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేయాలనీ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిర్వీర్యం చేయాలని కేసీఆర్ అనుసరించిన వ్యూహాలూ, ఎత్తుగడలే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా  ఇంత కాలం ఆయన వెన్నంటి ఉన్నవారిలో కొందరు అనుసరించడం కేసీఆర్ కు మింగుడుపడటం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి.   

తెలంగాణలో కాంగి‘రేసు’.. తగ్గిన కారు స్పీడు!

ఇంకేముంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీ ఇరగదీసింది. ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని శ్రేణులకు నయా జోష్ ఇచ్చినట్లు అయింది. దీంతో తెలంగాణలో పోలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటి వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలమధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే ఇరు పార్టీలూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ అదే బిల్డప్ ఇచ్చాయి. అలాంటి వేళ ఆ రెండు పార్టీల నేతలు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పరస్పర విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేసి కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం మొదలెట్టారు.  అయితే అప్పటి వరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలు, పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి బలంగా దూసుకుపోతుండగా..   కర్ణాటక ఎన్నికల ఫలితాలతో.. ఆ పార్టీ అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకూ అంతా రీచార్జీ  అయిపోయారు. దీంతో రాష్ట్రంలో అధికారాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకొంటుందనే ఓ ప్రచారం  తెలంగాణ సమాజంలో చాలా వేగంగా చొచ్చుకు పోయింది.  అలాగే రేవంత్‌రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కాంగిరేసుగుర్రంలా దౌడు తీయిస్తున్నారన్న భావన సామాన్య జనంలో కూడా బలంగా వేళ్లూనుకుంది. కానీ శతాబ్దానికిపైగా చరిత్ర గల పార్టీలో దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న నేతలను కాకుండా.. బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడం పార్టీలోని సీనియర్లుగా చెప్పుకుంటున్న నాయకులకు సుతరాము ఇష్టం లేకుండా పోయింది..  దీంతో కర్ణాటక ఎన్నికల పలితాలు హస్తం పార్టీకి అనుకూలంగా వచ్చే వరకు సదరు వర్గం.. రెవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు  గుప్పించింది. అలాంటి అసంతృప్తి జీవులను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం నవరత్న తైలంతో వారికి తలంటి మరీ  కూల్ చేసింది.  ఇంతలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో టికెట్ల రగడ మొదలైంది.   తొలి జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. దీంతో టికెట్లు ఆశించి భంగపడిన  అసంతృప్తి జీవులంతా ఒక్క సారిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శల  బాణాలు సంధించారు.  ఇక ప్రస్తుతం మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ అసెంబ్లీ స్థానం  నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే ఆయన్ని అక్కడ ఓడించి తీరుతామని.. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడిన ఆసంతృప్తి జీవులంతా భీషణ ప్రతిజ్జలు చేస్తున్నారు. మరోవైపు పార్టీతో దశాబ్దాలుగా అనుబంధం ఉన్న పాతతరం నేతలంతా అసంతృప్తితో జూలు విదిల్చి కదం తొక్కుతున్నారు. అలాంటి వారిలో తాజాగా పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి పోన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి  రాజీనామా చేశారు.  ఆ బాటలో మరింత మంది నేతలు   పయనించే అవకాశం ఉందనే ఓ ప్రచారం సైతం  రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఇంకో వైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయేఇచ్చినా.. ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి చెప్పుకోలేక రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ పరాజయంతో చతికిలపడిన పార్టీ ఈ సారి మాత్రం ఎలాంటి అవకాశాన్నీ వదులుకోకూడదన్నట్లుగా కాంగ్రెస్ శ్రేణుల్లో పట్టుదల కనిపిస్తోంది.   కురుక్షేత్రానికి వెళ్లే ముందు పాండవులు జమ్మి చెట్టుపై ఉన్న ఆయుధాలను దించుకొన్నట్లు తెలంగాణ సెంటిమెంటును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాడుకొంటున్నారనీ, అయితే పార్టీ పేరులోనే తెలంగాణ పదాన్ని తుడిచేచసిన కేసీఆర్ కు ఈ సారి సెంటిమెంట్ అందివచ్చే అవకాశం లేదనీ పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన   రేవంత్ రెడ్డి.. తన మాటలు పదునుతో.. బీఆర్ఎస్ అగ్రనేతలతో కంగారు పుట్టిస్తుండమే కాకుండా..  పార్టీలోని నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకు వస్తూ.. ముందుకు సాగుతున్నారు.  ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా.. రేవంత్ పగ్గాలు చేపట్టిన తరువాతనే కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనబడుతోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ హై కమాండ్ సీనియర్ల అసంతృప్తి, అసమ్మతి రాగాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా రేవంత్ కు దన్నుగా నిలబడింది.  అయితే  హస్తం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో గ్రూప్‌లు, అసంతృప్తి నేతలు, కోవర్టుల కొకొల్లలుగా ఉంటారు. దీంతో వాళ్లందరినీ ఏకతాటిపైకి తీసుకు రావడం.. అలాగే అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలను వెనక్కి నెట్టి.. తనతోపాటు తన పార్టీ శ్రేణులను ముందుకు తీసుకు వెళ్లి.. రానున్న ఎన్నికల ఫలితాల్లో తన సత్తా చాటు కొంటూ దుమ్ము రేపండం రేవంత్ కు ఇప్పటికీ సవాలేనని పరిశీలకులు అంటున్నారు.   

ఈ సారి ఎన్నికలు చాలా టఫ్.. ఓటమి హింట్ ఇచ్చిన బాలినేని!

అదేంటో పాపం ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వైసీపీ నేతలకు వణుకు పుడుతున్నట్లుంది. ఇప్పటికే తాము సొంతంగా చేయించుకున్న సర్వేలు, మరికొన్ని ప్రైవేట్ సంస్థలు ఇచ్చిన సర్వేలఫలితాలు, వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజలలోకి వెళ్తే వచ్చిన స్పందన, ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు, నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనపై ప్రజలలో ఉన్నఅసంతృప్తి అన్నీ తమ కళ్ళతో చూసి.. తమ చెవులతో విన్న వైసీపీ నేతలు ఇప్పుడు ఎన్నికల పేరెత్తగానే భయంతో వణికిపోతున్నారు. ఆ మధ్య వైనాట్ 175 అన్న ఆ నోళ్లతోనే ఇప్పుడు ఒకవేళ టీడీపీ గెలిస్తే మన పరిస్థితి ఏంటో ఊహించుకున్నారా అని మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఎన్నికలు మామూలుగా ఉండవు.. చాలా టఫ్ అని బాహాటంగానే చెబుతున్నారు. ఈమాటలను చూస్తేనే అర్ధం అవుతున్నది కదా.. వైసీపీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో.  ఆ మధ్య సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు,  వైసీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి, సీఎం జగన్మోహన్ రెడ్డి  బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి టీడీపీ గెలిస్తే మన పరిస్థితి ఏంటో ఊహించుకున్నారా అంటూ పార్టీ కార్యకర్తలనే అడిగారు. మేము గెలిస్తే తాట తీస్తాం అంటూ టీడీపీ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారని, అందరం కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలనువేడుకున్నారు. ఇప్పుడు అదే బాలినేని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఈసారి జరిగే ఎన్నికలు అంత ఈజీగా వుండవని, గట్టిగానేపోరాడుతామన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న  సందర్భంగా బాలినేని ఈ వ్యాఖ్యలు చేశారు. బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కాకుండారాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.  వైసీపీ నేతలకు 2024 ఎన్నికల రిజల్ట్, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరగబోయే పిక్చర్ కూడా క్లియర్ గానే ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. బాలినేని నేడు, అంతకు ముందు మాట్లాడిన వ్యాఖ్యలను విశ్లేషించిన పరిశీలకులు కూడా వైసీపీ ఈసారి ఘోర పరాజయం పాలవ్వడం తనకుతెలుసనీ, కానీ ఇప్పుడే చేతులెత్తేసినట్లుగా వ్యాఖ్యలు చేయడం తీరని నష్టం చేకూరుస్తుందన్న భావనలోనే ఇలా హెచ్చరికల లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈసారిరాష్ట్రంలో పరిస్థితులు, ఎన్నికల ఫలితాలపై కూడా పలువురు నేతలు అధిష్టానంగా పిలవబడే పెద్దల వద్ద పలుమార్లు చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని పార్టీలోనేఅంతర్గతంగా చర్చించుకుంటున్నారట. అధిష్టానం పెద్దలకు కూడా ప్రస్తుత పరిస్థితులు తెలిసినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. మరోసారి మనమే అధికారంలోకి రాబోతున్నామంటూసీఎం జగన్ మోహన్ రెడ్డిని ఊహల పల్లకిలో ఊరేగేలా చేస్తున్నారన్న  గుసగుసలు వైసీపీ శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయి. ఈ సోకాల్డ్ పెద్దల మూలంగానే ఇప్పుడు పార్టీకి మరింత నష్టం జరుగుతుందని మిగతా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అధికార వైసీపీని ఇప్పుడు తీవ్ర నిరుత్సాహం కమ్మేసింది. నిజానికి ఆరు నెలల ముందు నుండి వైసీపీ నేతలకు తమ ఓటమి అర్ధమైపోయింది. దీంతోనే ఏ కార్యక్రమం నిర్వహించినా కనీస స్పందన కూడా రావడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు టీడీపీ పనైపోయిందని, చంద్రబాబు దోషిగా, ఇక జైలు నుండి బయటకి రాడని ప్రచారం చేసి వైసీపీకి హైప్ తేవాలని చూశారు. ఇందుకోసం కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ, అవేమీ వర్క్ అవుట్ కావడం లేదు. రియాలిటీని కళ్లారాచూసిన వైసీపీ నేతల్లో ఉత్సాహం మాత్రం కనిపించడం లేదు. చంద్రబాబు అరెస్టు తరువాత వెల్లువెత్తిన ప్రజా నిరసన, ఆగ్రహం చూడటంతోనే వైసీపీ శ్రేణులకు, నేతలకూ కూడా 2024లోతమ ఓటమి ఎలా ఉండబోతోందో కనిపించేసింది. దీంతో కొందరు ఇప్పటికే గోడ దూకేందుకు టీడీపీ, జనసేన నేతలతో టచ్ లో ఉండగా.. వీరంతా ఒక్కసారి చంద్రబాబు బయటకి వస్తేహడావుడిగా కండువాలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక, మరికొందరు అసలు ఈసారి పోటీ చేసేది లేదంటూ ముందుగానేప్రకటించేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించేసినట్లు కనిపిస్తోంది.

క్లోజ్ అయిన కేసు రీఓపెన్ పిటిషన్.. కక్షకాక మరేంటి?

ఏదైనా చేయాలి.. చంద్రబాబు జైల్లోనే ఉండాలి. కేసు ఏదైనా కానీ చంద్రబాబును జైలు నుండి బయటకి రాకుండా చేయాలి. ఈ కేసు కాకపోతే మరో కేసు.. ఆ కేసు కాకపోతే ఇంకో కేసు. ఏసీబీ కోర్టు కాకపోతే హైకోర్టు.. హైకోర్టులో ఫెయిలైతే సుప్రీంకోర్టు. లాయర్లకు, వాదనలకు ఖర్చెంతైనా కానీ డబ్బులేమీ మనవి కాదు ప్రజలవే కదా.  ఖర్చుఎంతైనా కానీ.. చంద్రబాబు బయటకి రానే కూడదు. ఇదీ ఇప్పుడు ఏపీలో వైసీపీ అధిష్టానం పెద్దల లక్ష్యం. ఆ లక్ష్యం సాధించడానికి అడ్డగోలుగా కేసుఅలు పెట్టడమే కాకుండా  తమ మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడా హెచ్చరికలు, బెదరింపులతో చంద్రబాబుపై పలు కేసులు ఉన్నాయి.. రాసి పెట్టుకోండి.. స్కిల్ కేసు ఒక్కటే అనుకుంటున్నారేమో.. ఇంకా నాలుగైదు కేసులు ఉన్నాయి. రాసి పెట్టుకోండి చంద్రబాబును బయటకి రాకుండా చేస్తాం అంటూ ఓపెన్ గానే మాట్లాడిస్తున్నారు. దీనిని బట్టే వైసీపీ నేతలు ఎంతగా చంద్రబాబుపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారో  అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం చంద్రబాబు అక్రమంగా అరెస్టై   35 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో  ఉన్న సంగతి తెలిసిందే.  స్కిల్ కేసు కాకుండా రాష్ట్ర ప్రజలకు చౌకగా ఇంటర్నెట్ అందించేందుకు తెచ్చిన ఫైబర్ నెట్, ప్రతిపాదన తప్ప అసలు రూట్ మ్యాప్ కూడా లేని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, రౌడీల మూకలతో వైసీపీయే కుట్రలు పన్ని సృష్టించిన అంగళ్ళ అల్లర్ల కేసులు కూడా నమోదు చేశారు. మిగతా కేసులలో ప్రస్తుతానికి చంద్రబాబు అరెస్ట్ అయ్యే అవకాశం లేకపోగా.. స్కిల్ కేసులో వేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు రానుంది. అటు ఇదే కేసులో బెయిల్ పిటిషన్ సైతం హైకోర్టులో మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ మంగళవారం స్కిల్ కేసులో ఇటు హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ చంద్రబాబుకు పాజిటివ్ తీర్పు వస్తుందని భావించారో ఏమో కానీ ప్రభుత్వం అనూహ్యంగా మరో కేసు తెర మీదకి తెచ్చింది. అప్పుడెప్పుడో ఎలాంటి ఆధారాలు లేవని కోర్టులు సైతం విచారణను పక్కకి పెట్టేసిన అమరావతి అసైన్డ్ భూముల అవకతవకల కేసును ఇప్పుడు మళ్ళీ తెరపైకి తెచ్చే కుట్రకు ప్లాన్ చేశారు. ఈ కేసు రీ ఓపెన్ చేసేందుకు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విషయానికి వస్తే 2021లో అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపైన సీఐడీ విచారణ కూడా చివరి దశలో ఉంది. ఈ కేసులో గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నారాయణ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా విచారణను నవంబర్ 1 వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది. అయితే , ఇప్పుడు అనూహ్యంగా సీఐడీ ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆధారాలు అందాయని చెబుతూ మళ్ళీ విచారణ కోరుతున్నది. ఇప్పటికే ఈ కేసు విచారణకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా.. కొత్త ఆధారాలను పరిగణలోకి తీసుకోవాలని పిటీషన్ లో సీఐడీ కోరింది. కొత్త ఆధారాల నేపథ్యంలో కేసును రీఓపెన్ చేయాలని కోరగా ఈ పిటిషన్లను కూడా కోర్టు విచారించింది. కేసు రీ ఓపెన్ చేయడంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది.  అయితే, ఇప్పుడు ఈ కేసులో కూడా వయా నారాయణగా చంద్రబాబును ఇరికించే ప్రయత్నమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్నాళ్లుగా సీఐడీకి దొరకని ఆధారాలు ఇప్పుడే ఎలా దొరికాయని, సీఐడీలోకి కొత్తగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన అధికారులే ఇలా ఊడిగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపుగా ముగింపు దశకు వచ్చిన ఈ కేసును ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసి విచారణ పేరుతో చంద్రబాబును అరెస్ట్ చేసి వేధించేందుకే పన్నిన కుట్రగా టీడీపీ ఆరోపిస్తున్నది. అయితే, కేసు ఏదైనా కానీ చంద్రబాబు బయటకి రాకుండా చేస్తామంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడం.. ఇప్పుడు ఇలాంటి కేసులు మళ్ళీ రీఓపెన్ చేయడంపై ఇది ఖచ్చితంగా దుర్మార్గమైన చర్యగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

వలస నేతలకే పెద్ద పీట.. కాంగ్రెస్ తొలి జాబితా ప్రత్యేకత

కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. భారీ కసరత్తులు, సమాలోచనల అనంతరం విడుదల చేసిన జాబితాలో ప్రత్యేకత ఏమిటంటే..  కొత్తగా పార్టీలో చేరిన 11 మందికి టికెట్లు ఇచ్చారు. మొత్తంగా 12 మంది కొత్తవారికి టికెట్లు లభించింది. కొల్హాపూర్, నకిరేకల్‌లో కొత్తగా వచ్చిన వారికి టికెట్లు దక్కాయి. ఇటీవల పార్టీలో చేరిన వేములకు నకిరేకల్ సీటు దక్కింది. అలాగే నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్ పోటీ చేస్తున్నారు.  అలాగే బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన మైనంపల్లి హనుమంతరావు కుటుంబంలో ఇద్దరికి సీట్లు లభించాయి. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు డబుల్ టికెట్లు దక్కాయి. జానారెడ్డి అడిగిన మిర్యాలగూడ సీటును మాత్రం హైకమాండ్ పెండింగ్‌లో ఉంచింది. ఐతే.. నాగర్ కర్నూలులో నాగం ఫ్యామిలీకి   టికెట్ దక్కలేదు.  ఓసీలకు 26 సీట్లు, బీసీలకు 12 సీట్లు, ఎస్సీలకు 11 సీట్లు, ఎస్టీలకు 2 సీట్లు దక్కాయి. అలాగే.. రెడ్డి సామాజిక వర్గం వారికి 17 సీట్లు, వెలమ వర్గానికి 7 సీట్లు, బ్రాహ్మణ వర్గానికి 2, మైనార్టీలకు 3 సీట్లు దక్కాయి. ఖమ్మంలో  ఇద్దరు సిట్టింగ్‌లను మాత్రమే ఈ జాబితాలోపేర్లు ప్రకటించారు. మధిర నుంచి మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తుండగా.. భద్రాచలం నుంచి పొడెం వీరయ్య బరిలో దిగుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే తొలి జాబితాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావుకు సీట్లు దక్కలేదు. కొత్తగూడెం సీటు సీపీఐకి కేటాయించే అవకాశం ఉండటం వల్లే, పొంగులేటి సీటు ఎక్కడ అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే తుమ్మల నాగేశ్వరరావు సీటు విషయంలో హైకమాండ్ డైలమాలో ఉన్నట్లు సమాచారం. అలాగే కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీకి టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చి చేరిన వారిలో  11 మందికే  సీట్లు ద‌క్కాయి * మెదక్ - మైనంపల్లి రోహిత్ రావు *మల్కాజ్ గిరి - మైనంపల్లి హన్మంత రావు *నిర్మల్ - కూచడి శ్రీహరి రావు * నకిరేకల్ - వేముల వీరేశం * ఆర్మూర్ - వినయ్ కుమార్ రెడ్డి * బాల్కొండ - సునీల్ రెడ్డి * జహీరాబాద్ - ఎ. చంద్ర శేఖర్ * కల్వకుర్తి - కసిరెడ్డి నారాయణ రెడ్డి * గద్వాల - సరిత * కొల్లాపూర్ - జూపల్లి కృష్ణ రావు * నాగర్ కర్నూల్ - కుచుకుళ్ల రాజేష్ రెడ్డి ఇక పోతే కాంగ్రెస్ తొలి జాబితాలో  ఆరుగురు మహిళలకు పార్టీ టికెట్లు ఇచ్చింది.  1. ములుగు - సీతక్క 2. సనత్ నగర్ - కోట నీలిమ 3. గోషామహల్ - మొగిలి సునీత 4. గద్వాల్ - సరిత తిరుపతయ్య 5. కోదాడ - పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి 6. స్టేషన్ ఘన్ పూర్ - సింగాపురం ఇందిర ఇక బీసీలకు 12  టికెట్లు దక్కాయి.  1. వేములవాడ - ఆది శ్రీనివాస్ 2. మేడ్చల్ - తోటకూర వజ్రేష్ యాదవ్ 3. సనత్ నగర్ - కోట నీలిమ 4. గోషామహల్ - మొగిలి సునీత 5. చాంద్రాయణగట్ట - బోయ నగేష్ 6. యాకుత్ పుర - రవి రాజు 7. బహదూర్‌పురా - రాజేష్ కుమార్ పులిపాటి 8. సికింద్రాబాద్ - ఆదం సంతోష్ 9. గద్వాల - సరిత 10. ఆలేరు - బీర్ల ఐలయ్య 11. షాద్ నగర్ - శంకరయ్య 12) ముషీరాబాద్ - అంజన్ కుమార్ యాదవ్ ఇక టికెట్ ఆశించి భంగపడ్డ నేతలలో ముందుగా చెప్పుకోవలసింది  నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి. ఆయ‌న బీజేపీలో ఉన్నప్పుడు కనీసం   ప్రెస్‌మీట్ పెట్టుకోవ‌డానికి కూడా ఆ పార్టీ  అవ‌కాశం ఇచ్చేది కాదు. ఆయ‌న ఏమైనా మాట్లాడాలంటే సెక్ర‌టేరియ‌ట్ వెళ్ళి అక్క‌డ మీడియా పాయింట్ వ‌ద్ద మాట్లాడేవారు. దీంతో  బిజెపిలో అవ‌మానాలు భ‌రించ‌లేక ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆశించినా టికెట్ దక్కలేదని ఆయ‌న అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తొలి జాబితా విడుదల అయిన తరువాత.. ప్రకటించిన నియోజకవర్గాలను బట్టి చూస్తే నాగ సహా 11 మంది టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. వారు.. 1. నాగం జనార్ధన్ రెడ్డి (నాగర్ కర్నూల్) 2. జగదీశ్వర్ రావు (కొల్లాపూర్) 3. రాగిడి లక్ష్మారెడ్డి (ఉప్పల్) 4. మేడ్చల్ (హరివర్థన్ రెడ్డి) 5. కుద్బుల్లాపూర్ (భూపతి రెడ్డి) 6.సంగిశెట్టి జగదీశ్వర్ రావు (ముషీరాబాద్) 7.మర్రి ఆదిత్య రెడ్డి (సనత్ నగర్) 8. రాఘవేందర్ రెడ్డి (కల్వకుర్తి) 9. మెట్టు సాయి కుమార్ (గోషామహల్) 10. చక్లోకర్ శ్రీనివాస్ (మలక్ పేట్) 11. ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ (షాద్ నగర్)

విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయానికి జగన్ రిబ్బన్ కట్టింగ్.. అసలు కథ ఇదీ!

విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ సంస్థ కార్యాలయాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. రూ. 35 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ కేంద్రం సాప్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌గా పనిచేస్తుందని.. దాదాపు 1000 మంది ఉద్యోగులు ఈ సెంటర్‌ నుంచి పనిచేయనున్నట్లు రిబ్బన్ కట్ చేసిన అనంతరం సీఎం జగన్ తెలిపారు. ఇక  గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉందా అని సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకోగా.. విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్‌ హాల్స్, అధునాతన కెఫ్‌టేరియా, విశాలమైన పార్కింగ్‌ సౌకర్యాలతో తీర్చిదిద్దినట్లు సంస్థ ప్రతినిధులను సీఎంకు వివరించారు. విశాఖలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసిన సీఎం.. ఈ తరహా పరిశ్రమలు రావడం వల్ల విశాఖ కూడా త్వరగా ఎదుగుతుందని చెప్పారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు స్థాయిలో అభివృద్ధి చెందడానికి అన్ని అనుకూలతలు ఉన్న నగరం విశాఖ ఒక్కటే అన్నారు. ఇక, పనిలో పనిగా ఇక్కడ నుండే డిసెంబర్ లో తాను కూడా విశాఖ నుండే పాలన మొదలు పెడతామని చెప్పారు. అయితే, ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని కాస్త నిశితంగా ఆలోచించి గమనిస్తే.. దిగ్భ్రాంతికర విషయాలు బయట పడతాయి. అసలు విశాఖలో ఇన్ఫోసిస్ ఏంటి.. విశాఖలో కొత్తగా ఆఫీసు పెట్టడం ఏంటి? అది కూడా ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థ విశాఖ లాంటి నగరంలో జస్ట్ రూ.35 కోట్ల పెట్టుబడితో ఆఫీసు ప్రారంభించడం ఏంటి?  రూ.35 కోట్ల పెట్టుబడితో మొదలు పెట్టిన కార్యాలయంలో వెయ్యి మందికి ఉపాధి ఏంటి? అనే అనుమానాలు రాకమానవు. సీఎం ప్రారంభించిన ఈ కార్యాలయానికి సంబధించి ప్రభుత్వ వర్గాలు మీడియాకి ఇచ్చిన సమాచారంలో ఎక్కడా పొంతన లేదు. దీనికి కారణం ఇది కేవలం రిబ్బన్ కటింగ్ కార్యక్రమం మాత్రమే. ఈ కంపెనీతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కనీసం కంపెనీ ఇక్కడ ఆఫీసు ప్రారంభించడంలో కూడా ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. ప్రోత్సాహకాలు ఇచ్చి, స్థలం కేటాయించి ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఇన్ఫోసిస్ కంప్లీట్ గా ప్రైవేట్ ఐటీ సంస్థ అనే సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ దేశంలో ఎక్కడ తమ కంపెనీ ఆఫీసు ప్రారంభించినా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఉంటుంది. పూర్తిస్థాయి కార్పొరేట్ కల్చర్ లో పనిచేసే ఈ సంస్థ తమ కార్యాలయాలను కూడా అదే స్థాయిలో రూపొందించుకుంటుంది. కానీ విశాఖలో మాత్రం ఇన్ఫోసిస్ స్టాండర్డ్స్ కి తగ్గట్లుగా కార్యాలయం లేదు. ఇంకా చెప్పాలంటే ఇది ఇన్ఫోసిస్ తమ అవసరం కోసం  ఒక మోస్తరుగా తమ బ్రాంచి ఏర్పాటు చేసుకుంది. కరోనా తర్వాత ఐటీ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉద్యోగులకు అవకాశం ఇచ్చారు.  ఈ మధ్యనే మళ్ళీ బ్యాక్ టూ ఆఫీస్ అంటూ ఉద్యోగులను కార్యాలయాలకు రావాలని చెబుతున్నాయి.  ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ కూడా అందరినీ తమ బెంగళూరు, హైదరాబాద్ ఆఫీసుకు పిలుస్తున్నది. కానీ  చిన్న నగరాలు, పట్టణాల నుంచి   వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేసే వారు బెంగళూరు, హైదరాబాద్ వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఇన్ఫోసిస్ కూడా ఆయా ప్రాతాల్లో కార్యాలయాలు ప్రారంభించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే  విశాఖలో కూడా ఆఫీస్ ప్రారంభించింది. ఈ ఆఫీసు  ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఆగస్టులో నే ప్రారంభమైంది. అక్కడ కార్యకలాపాలు కూడా సాగుతున్నాయి.  కానీ విశాఖకు ఇన్ఫోసిస్ ను తామే తీసుకువచ్చామని   ప్రచారం చేసుకుని, తమ భుజాలు తామే చరుచుకోవడానికి జగన్  ప్రభుత్వం ఇప్పుడు ఇలా రిబ్బన్ కటింగ్ కార్యక్రమం పెట్టింది. అయితే   విశాఖ ఇన్ఫోసిస్ తో కొత్తగా ఉద్యోగాలు వచ్చేది లేదు. కొత్తగా చేసుకున్న క్యాంపస్ రిక్రూటమెంట్లను కూడా ఆపేసిన ఇన్ఫోసిస్ వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇక ఈ విశాఖ ఆఫీసులో కూడా పాత వాళ్ళకే అవకాశం ఉంది తప్ప కొత్తగా నియామకాలు ఉండవు. అందుకే రూ.35 కోట్లతో ఇన్ఫోసిస్ సింపుల్ గా మూడు నెలల క్రితమే విశాఖలో కార్యాలయం ప్రారంభించింది. కానీ, దాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు జగన్ ఇప్పుడు ఇలా రూ.50 కోట్లు ఖర్చు పెట్టి రిబ్బన్ కట్ చేశారు.

ఔను వాడేసుకున్నాం.. అయితే ఏంటి? కేంద్ర నిధుల దారిమళ్లింపుపై జగన్ సర్కార్!

వచ్చేదేం లేదు. అయినా సొమ్యులు ఎక్కడ నుండి వస్తాయి.. అవేమైనా చెట్లకు కాస్తాయా.. లేక ప్రభుత్వ ఖజానా ఏమన్నా అక్షయపాత్రా తీసేకొద్దీ ఊరేందుకు! తెస్తే అప్పులు.. లేకపోతే అమ్మకాలు ఇంతే కదా సంక్షేమం అన్నట్లుగా మారిపోయింది ఏపీ పరిస్థితి. ఇందులో మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత పంచే వాటికి కూడా ముందే బటన్ నొక్కేసి.. భారీ సభలతో ఊదరగొట్టడంతో ఎప్పుడు ఆ డబ్బులు తమ ఖాతాలోకి వస్తాయా అని వేయి కళ్ళతో ఎదురుచూడానికే లబ్ధిదారుల పాత్ర పరిమితమైపోయింది. రాష్ట్రానికి ఆదాయమూ లేదు..  ఆదాయం తెచ్చే విధానాలూ లేవు. ఉన్నదల్లా అడ్డగోలుగా అప్పులు తేవడం.. ఆ అప్పులనే బటన్ నొక్కి సంక్షేమం అమలు చేస్తున్నాం అని డప్పుకొట్టుకోవడమే పాలసీగా మారిపోయింది.  ఈ క్రమంలోనే కేంద్రం నుండి వచ్చే డబ్బును కూడా ఉద్దేశించిన పథకానికి కాకుండా సొంతానికి అంటే తమకు ఓట్టు తెచ్చిపెడతాయనుకుంటున్న బటన్ నొక్కుడు సంక్షేమ పథకాలకి వాడేసింది.  రాష్ట్ర డబ్బుకు అంటే లెక్కలు అడిగే వారెవరూ ఉండరు. ఒక వేళ ఉన్నా వారిపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు అంటూ వేధింపులకు  గురి చేసి నోరు నొక్కేయవచ్చు. అడిగడానికి మీరెవరంటూ దబాయించేయచ్చు.  కానీ కేంద్రం అలా కాదు కదా. మా డబ్బులు ఏం చేసారో చెప్పాలంటూ నిలదీస్తుంది. ఇప్పుడు అలాగే చేస్తోంది. వివిధ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,019 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వానికి విడుదల చేసింది. జగన్ సర్కార్ వాటిని యథాప్రకారంగా దారి  మళ్ళించేసింది.  దీనిని గుర్తించిన కేంద్ర ఆర్థికశాఖ  ఆ నిధులు ఎక్కడున్నాయో, ఏమయ్యాయో  చెప్పాలని రాష్ట్రప్రభుత్వానికి తాజాగా లేఖ పంపింది. నిజానికి కేంద్రం విడుదల చేసిన మొత్తంతో పాటు, రాష్ట్ర వాటాగా కూడా కొన్ని నిధులు విడుదల చేసి కేంద్రం ఏ పథకానికి ఉద్దేశించి అయితే నిధులు విడుదల చేసిందో ఆ  పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. కానీ, ఇంత వరకు రాష్ట్రం తన వాటా  నిధులు విడుదల చేయలేదు సరికాదా కేంద్ర నిధులను కూడా  దర్జాగా వాడేసుకుంది. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ సీరియస్ అయి లేఖ రాయడంతో విషయం బయటపడింది. తప్పుదిద్దుకోవడం, తప్పు ఒప్పుకోవడం అలవాటు లేని జగన్ సర్కార్   అత్యవసర సమయంలో ఇలా కేంద్ర నిధులను రాష్ట్రాలు ఇతర పథకాలకు వాడు కోవడం కొత్తేమి కాదని.. మేము కూడా అలాగే వాడుకున్నామని చెప్తున్నారు. ఆ మొత్తాన్ని సాధ్యమైనంత త్వరగా సర్ధుబాటు చేస్తామని అధికారులు కేంద్రాన్ని బ్రతిమాలుకుంటున్నారు. అయితే  కేంద్ర నిధులను లెక్కా పత్రం లేకుండా వాడుకోవాల్సిన అత్యవసరం ఏంటో కూడా కాస్త వివరంగా చెప్తే బావుంటుంది. కానీ, అత్యవసరం అంటే అత్యవసరం అంతే లాజిక్కులు అడగకూడదు అన్నట్లు ఉంది జగన్ సర్కార్  తీరు. ఈ రూ.2,019 కోట్ల నిధులలోనే కాదు.. దాదాపుగా ఈ నాలుగేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక విధానం మొత్తం ఇలాగే అరాచకంగా ఉంది. రాష్ట్రంతో పాటు కేంద్ర పథకాల కోసం కూడా భారీగా నిధులు వస్తూంటాయి. ఈ నిధులకు తోడుగా రాష్ట్రం కూడా తన వాటా కలిపి పథకాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాలను ఏర్పాటుచేసి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నిధులు అందులో జమ చేసి వాటి ద్వారానే పథకాలు అమలు చేయాలన్న నిబంధన ఉంది.  అయితే  ఏపీకి మాత్రం  ఏ నిబంధనలూ వర్తించవు అన్నట్లుగా ఇష్టారాజ్యంగా కేంద్రం నిధులను వాడేసింది.   ఈ విషయం కూడా కేంద్రానికి తెలియనిదేమీ కాదు. అయితే, అప్పుడప్పుడు ఇలా గదమాయిస్తుంది. గతంలో కూడా రెండుసార్లు ఇలాగే హెచ్చరించగా ఇది మూడవసారి. ఇప్పుడు కూడా జగన్ సర్కార్ దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. ఔను మాకు ఇచ్చిన నిధులే కదా మేము ఖర్చు చేసింది.. దేనికి ఎందుకు అని లెక్కలు అంటారా చెప్తాం కాస్త ఓపిక పట్టండి అన్నట్లుగానే వ్యవహరిస్తున్నది. కేంద్రం పట్ల  సీఎం జగన్ వినమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదన్న సంగతి తెలిసిందే.  కేంద్రంలో ఏ శాఖ అయినా కాస్త బోల్ట్ టైట్ చేస్తే ఎవరిని పట్టుకోవాలో జగన్ కు బాగా తెలుసు. అందుకే ధీమాగా కేంద్ర నిధులను వాడేసుకోగలుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

జాబితాలో 115 మంది.. బీఫారాలు అందింది 51 మందికే!

తెలుగువన్ మొదటి నుంచీ  ఏం చెబుతోందో అదే జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఊరికి ముందు అంటే  ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడక ముందే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 115 స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించేశారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. వాటిలో నాలుగంటే నాలుగు పెండింగ్ లో పెట్టి.. ఒకే సారి 115 నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే ఆలా ప్రకటించినప్పుడే తెలుగువన్  జాబితాలో పేర్లు ఉన్న వారందరికీ బీఫాంలు ఇచ్చే అవకాశం లేదని అంచనా వేసింది. ఇప్పుడు అదే జరిగింది. ఆర్భాటంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించేసినా ఆదివారం ( అక్టోబర్ 15)న కేసీఆర్ తన చేతుల మీదుగా వారిలో  51 మందికి మాత్రమే  బీ-ఫారాలు అందజేశారు. వాటితో పాటు ఎన్నికల ఖర్చుల కోసం రూ. 40 లక్షల పార్టీ ఫండ్ ను కూడా అందించారు. మిగిలిన వారికి రిక్త హస్తమేనా అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. అసలు ఈ చర్చ అన్ని పార్టీల కంటే ఎక్కువగా బీఆర్ఎస్ శ్రేణుల్లోనే జరుగుతోంది. అయితే మిగిలిన బీఫారాలు సిద్ధం కాలేదనీ, ఒకటి రెండు రోజులలో అందరికీ ఈస్తామనీ పార్టీ హైకమాండ్ చెబుతోంది.   కేసీఆర్ ప్రకటించిన జాబితాలో మార్పులూ చేర్పులూ ఉంటాయనీ, ఉండక తప్పదనీ ఆయన ఆ జాబితా ప్రకటించిన  నాటి నుంచీ కూడా పార్టీలోనే పెద్దఎత్తున చర్యలు జరుగుతున్నాయి. జాబితా ప్రకటన తరువాత వెల్లువెత్తిన అసంతృప్తిని నామినేటెడ్ పదవులతో చల్లార్చాలని చేసిన ప్రయత్నాలు అంతంత మాత్రంగా కూడా ఫలితాన్నివ్వలేదని పార్టీ శ్రేణులే పెదవి విరిచాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రకటించిన అందరికీ బీఫారాలు ఇవ్వకుండా  పెండింగ్ లో పెట్టడంతో  జాబితాలో మార్పులు, చేర్పులపై జరుగుతున్న ప్రచారం మరింత జోరందుకుంది.  ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తి అయ్యేదాకా వేచి చూసే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. పార్టీలో అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలు విఫలం కావడంతో కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల ప్రకటన తరువాత పరిస్థితిని బట్టి ముందడుగు వేయాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ప్రకటించిన అభ్యర్థులందరికీ ఒకే సారి భీపారాలు అన్న కేసీఆర్ ఇప్పుడు అవి రెడీ కాలేదని చెప్పడాన్ని ఇతర పార్టీలే కాదు.. సొంత పార్టీ వారు కూడా నమ్మడం లేదు.    ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్  సాధించాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా, ముందుగానే, అభ్యర్ధులను ప్రకటించి, ప్రత్యర్ధులకు సవాలు విసిరిన కేసీఆర్ ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారని పరిశీలకులు అంటున్నారు. అయితే ఇప్పుడేమిటి? ఆయనలో ఏమూలో పార్టీ విజయావకాశాలపై అనుమానాలు తలెత్తడంతోనే ముందుగానే  అభ్యర్థులను ప్రకటించేశారనీ, అసమ్మతి ఉధృతిని చూసి అవసరమైతే మార్పులూ చేర్పులూ చేసుకోవడానికి వీలుగా ఆయనీ ఆప్షన్ ఎంచుకున్నారనీ  అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. ఇక ప్రకటించిన క్షణం  నుంచీ కేసీఆర్ కసరత్తు అంతా  ఆ జాబితాలో మార్పులూ, చేర్పుల మీదే ఉందని కూడా అంటున్నారు.  మొత్తం మీద ఆదివారం (అక్టోబర్ 15) ఆయన ప్రకటించిన జాబితాలో కేవలం 51 మందికి మాత్రమే బీఫారాలు ఇచ్చారు. దీంతో టికెట్లు దక్కిన వారందరికీ బీఫారాలు ఇవ్వకపోవచ్చునన్న పార్టీ వర్గాల ప్రచారం నిజమై కూర్చుంది. రెండు మూడు రోజుల్లో మిగిలిన వారికి బీఫారాలు ఇస్తామని చెబుతున్నప్పటికీ.. కొందరికి మొండి చేయి తప్పక పోవచ్చునని పరిశీలకులు అంటున్నారు.   టికెట్  వస్తుందో రాదో అనే అనుమానంతో పక్క చూపులు చూస్తున్న వారిని కట్టడి చేసేందుకే  కేసీఆర్ గంపగుత్తగా ఒకే సారి 115 మంది అభ్యర్థులతో జాబితా విడుదల అయితే చేశారు  కానీ, ఆ జాబితాలో ఉన్న వారందరికీ  బీఫారంలు ఇస్తారన్న నమ్మకం  లేదన్న ప్రచారం అప్పట్లోనే బీఆర్ఎస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున జరిగింది.  ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైందని అంటున్నారు. 

జగన్ రెడ్డికి ఊరికో ప్యాలెస్.. ఎక్కడా స్థిమితంగా, స్థిరంగా ఉండరు!

సీఎం అంటే ఓ ఇల్లు.. రెండు కార్లు సరిపోవా? పోనీ, ఒక ప్యాలెస్, ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ తలా ఒక కారు సరిపోదా? నగరానికో ఇల్లు.. డజన్ల కొద్దీ కార్లు కావాలా?  రానా దగ్గుబాటి హీరోగా నటించిన లీడర్ సినిమలో డైలాగ్ దాదాపుగా ఇలాగే ఉంటుంది.  ఇప్పుడు ఇది ఏపీ   ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే జగన్ ఎక్కడకి వెళ్తే అక్కడ ఓ ప్యాలెస్ కట్టుకుంటున్నారు. నిధులు, నిబంధనల   సంగతెలా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు తన ప్యాలెస్ లతోనే  హైలెట్ అవుతున్నారు. ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని తాడేపల్లిలో నిర్మించుకున్న ప్యాలెస్ లో నివాసం ఉంటున్న జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే విశాఖ నుండి పరిపాలన చేయనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కోసం విశాఖ రుషికొండపై వందల కోట్లతో నివాసం(ప్యాలెస్) సిద్ధం అవుతోంది. త్వరలోనే ఈ నివాసంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గృహప్రవేశం కూడా చేయనున్నారు. అయితే, సహజంగా సీఎం నివాసం అంటే అధికారం ఉన్నన్ని రోజులే ఉటుంది. ఎందుకంటే అది ప్రభుత్వ భవనం కనుకప.  ముఖ్యమంత్రి  మాజీ కాగానే అది ఖాళీ చేయాలి. కానీ రుషికొండపై కడుతున్న నివాసాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోసమే జీవిత కాలం ఉండేలా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. పర్యాటక శాఖ పేరిట కడుతున్న ఈ నిర్మాణాన్ని 33 ఏళ్ల పాటు ఓ ప్రైవేట్ వ్యక్తికి లీజుకి ఇవ్వనున్నట్లు చెప్తున్నారు. ఈ ప్రైవేట్ వ్యక్తి సీఎం జగన్ బినామీనే అనీ, అందుకే  జగన్ కోసమే ఆ నివాసం నిర్మాణమైందనీ అంటున్నారు. ఇప్పుడు జగన్ వయసు 50 సంవత్సరాలు కాగా మరో 33 ఏళ్ళు అంటే 83 సంవత్సరాల వయసు వరకూ ఆ నివాసం జగన్ కోసమే ఉంటుంది. దీంతో అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్ని నివాసాలు ఉన్నాయి? ఇప్పటికే ఎన్నో ప్యాలెస్ లు ఉండగా  ఇప్పుడు రుషికొండపై ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్యాలెస్ లాంటి నివాస భవనం కూడా  తనకే కావాలని జగన్ రెడ్డి ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఆయన ఎన్ని నివాసాల్లో  కాపురం చేస్తారు? అసలు ఆయనకు ఈ నివాసాల ఫాంటసీ ఏంటి అనేది చర్చకు వస్తున్నది.  అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇదేం ఫాంటసీనో కానీ ఆయన ఎక్కడ ఉండాలంటే అక్కడ ఓ ప్యాలెస్ ఉండాలనుకుంటున్నారు.  ఊరికో బిల్డింగ్ కట్టుకుంటారు కానీ అందులో ఉండలేరు. అప్పటికప్పుడు అవసరానికి అక్కడ ఉండాల్సి వస్తే అక్కడ ఓ ప్యాలెస్ కట్టేసి ఉన్నన్ని రోజులు ఉండేసి వస్తున్నారు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి సొంత ప్రాంతం పులివెందులలో, తాతల కాలం నుండి వచ్చిన పాత ఇంటి స్థానంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్యాలెస్ లాంటి భవనం కట్టుకున్నారు. ఇది చూసేందుకు సాధారణంగానే ఉన్నా లోపల 50 కాపురాలు నివాసం ఉండేలా ఉంటుంది. ఆ తర్వాత వైఎస్ఆర్ సొంత జిల్లా కడపలో మరో   ప్యాలెస్ ఉంది. అప్పట్లోనే దీనిని రాజశేఖరరెడ్డి కళ్ళు చెదిరేలా నిర్మించారు. ఈ కడప నివాసం మొత్తం రాయలసీమకు హైలెట్ గా నిలుస్తుంది. దేశవిదేశాల నుండి తెప్పించిన మెటీరియల్ తో ఇది నిర్మించగా విదేశీ నిపుణులతో ఆర్కిటెక్ట్ చేయించారు. జగన్ కు ఉమ్మడి కడప జిల్లాలోని ఇడుపులపాయలో కూడా ప్యాలస్ లాంటి  భవనం ఉంది.  ఇక  జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ గురించి చెప్పనవసరం లేదు. అంతే కాదు జగన్ బెంగళూరు ప్యాలెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సుమారు 23 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్ లో హెలిపాడ్, ఇండోర్ థియేటర్స్ వంటి ఎన్నో అధునాతన హంగులు ఉండగా.. ఇందులో మూడు షిఫ్టులులో వందల మంది పని వారు ఉంటారని చెప్తారు. సామాన్య మానవునికి ఏ మాత్రం ఎంట్రీ లేని ఈ ప్యాలెస్ విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం   రెండు, మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇక, అది కాకుండా ఇప్పుడు జగన్ నివాసం ఉన్న తాడేపల్లి ప్యాలెస్ గా పిలవబడే భవనం కూడా సామాన్యమైంది కాదు. ఇప్పుడు ప్రభుత్వం అంతా అక్కడ నుండే నడుస్తుందంటేనే అర్ధం చేసుకోవచ్చు అది ఏ స్థాయిలో ఉందో. దీని విలువ కూడా వందల కోట్ల రూపాయలలోనే ఉంటుందని అంచనా. మరోవైపు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జగన్ చెన్నైలో కూడా ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నారని చెబుతున్నారు. ఇప్పుడు  సుమారు రూ.500 కోట్ల వ్యవయంతో ఆయన కోసం రిషికొండపై ప్యాలెస్ రెడీ అవుతోంది. 

కేసుల సాగతీతలో ఘనాపాఠి.. జగన్ మనసెరిగి మెసులుకుంటున్న రోహత్గీ?!

చంద్రబాబు  అక్రమ అరెస్టును సక్రమమే అని నిరూపించలేక సాగతీత పర్వాన్ని కొనసాగిస్తున్నది ప్రభుత్వం. ఏసీబీ, హైకోర్టులలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేతకు ముందు రెండు కోర్టుల్లోనూ సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇప్పుడు కేసు సుప్రీం కోర్టులో ఉంది. మూడు చోట్లా కూడా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు.. ఆధారాలు చూపకుండా కేవలం సెక్షన్ల ఆధారంగానే కేసును నడిపారు. నడుపుతున్నారు. చంద్రబాబు కోర్టులో దాఖలు చేసినది క్వాష్ పిటిషన్ కనుక న్యాయస్థానాలు కేసు మెరిట్స్, డీ మెరిట్స్ విషయం కాకుండా.. అరెస్టు సక్రమమా? కాదా? అన్న విషయంపైనే వాదనలు వింటున్నారు.  ఏసీబీ, హైకోర్టులలో కీలక సెక్షన్ అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆయన సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న విధాన నిర్ణయం విషయంలో గవర్నర్ అనుమతి లేకుండా విచారించవచ్చా? అరెస్టు చేయవచ్చా? అన్న విషయాన్ని పట్టించుకోకుండా కేవలం సెక్షన్ ల మేరకే తీర్పులు చెప్పాయని న్యాయనిపుణులు అంటున్నారు. ఇక సుప్రీం కోర్టు వద్దకు వచ్చే సరికి ప్రభుత్వ వాదనలన్నీ తేలిపోయాయని అంటున్నారు. అయినా సాంకేతికంగా వాదనలను కొనసాగిస్తూ వాయిదాల మీద వాయిదాలు పడేలా ప్రభుత్వ లాయర్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జగన్ కేసుల విషయంలో సాగతీతలో ఘనాపాఠిగా పేరొందారు. ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసులు పదేళ్లుగా విచారణకు నోచుకోకుండా వాయిదాల పర్వం కొనసాగుతుండడాన్ని, ఒక్క సారి కూడా ఆయన కోర్టుకు హాజరు కాకుండా బెయిలుపై ఉండడాన్ని ఈ సందర్భంగా న్యాయనిపుణులు ప్రస్తావిస్తున్నారు. అలాగే కోడికత్తి కేసులో బాధితుడిగా కూడా కోర్టుకు హాజరు కాకుండా.. ఐదేళ్లుగా ఆ కేసులో నిందితుడు కోడికత్తి శీనుకు బెయిలు కూడా రాకుండా జైలులోనే మగ్గుతున్న పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విషయంలో ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కూడా జగన్ మనసెరిగి వ్యవహరిస్తున్నారని అంటున్నారు.   చంద్రబాబు అక్రమ అరెస్టును సమర్ధించేందుకు ఒక్క అధారాన్ని కూడా చూపలేకపోయినా.. రోజుల తరబడి కేసును వీలైనంతగా సాగదీయడానికి ఆయన శతధా ప్రయత్నిస్తున్నారు. గత శుక్రవారం మధ్యాహ్నం విచారణలో కూడా ఇయన ఒక్కటంటే ఒక్క ఆధారం చూపలేకపోయినా, సెక్షన్ 17ఏపై న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా గంటన్నరకు పైగా సుదీర్ఘ వాదనలు వినిపించి.. మరింత సమయం కావాలని కోరారు. దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ మంగళవారం (అక్టోబర్ 17)కు వాయిదా పడింది.   ముకుల్ రోహత్గీ ఎంత సేపూ   స్వాతంత్రం వచ్చినప్పటికేసుల్ని… సెక్షన్ 17ఏ చట్టం రాక ముందు నాటి కేసుల్ని మాత్రమే రిఫరెన్స్ గా చూపుతూ తన వాదనలు వినిపించారు.   కేసు పాతతే.. ఎఫ్ఐఆర్ కొత్తది అయినప్పుడు రద్దయిన సెక్షన్ల కింద కేసులు ఎలా నమోదు చేస్తారన్న సుప్రీం కోర్టు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ఆ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం లేనప్పుడు కేసులు ఎలా పెడతారని సుప్రీం కోర్టు సూటిగా ముకుల్ రోహత్గీని ప్రశ్నించింది.