పాలన లేదు.. అంతా మత ప్రచారమే! 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక హీట్ పెంచుతోంది. అన్ని పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి, రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభకు మద్దతుగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రచారం చేశారు. కపిలతీర్థంలో రోడ్ షో నిర్వహించిన రఘునందన్ రావు.. వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీయే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని చెప్పారు.  రాజకీయ పోరాటం నుంచి టీడీపీ పక్కకు తప్పుకుందన్నారు.   తిరుప‌తి ఉప‌ ఎన్నికలో వైసీపీకి ఓట్లేసి గెలిపిస్తే పార్ల‌మెంటులో ఆ పార్టీ సంఖ్య పెరగ‌డం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఉండదని రఘునందన్ రావు విమర్శించారు.  తిరుపతిలో అన్యమత ప్రచారాలతో పాటు అన్యమత ప్రార్థనా మందిరాలు లేకుండా చట్టం తీసుకొస్తామని చెప్పారు రఘునందన్ రావు. విగ్రహాలు ధ్వంసం చేసే వారిని గుర్తించ‌లేక‌పోవ‌డం ఏంట‌ని, టెక్నాల‌జీ ఇంత‌గా అభివృద్ధి చెందిన‌ప్ప‌టికీ నిందితుల‌ను గుర్తించ‌డంలో ఎందుకు విఫ‌ల‌మ‌వుతున్నార‌ని ప్ర‌శ్నించారు. వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న అంశాన్ని ప‌ట్టించుకోకుండా మతప్రచారం చేసుకుంటోందని రఘునందన్ రావు ఆరోపించారు.హిందూ వ్యతిరక శక్తులకు తిరుపతి ఓటర్లు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపిచ్చారు. 

ఫోన్ మాట్లాడుతూ.. ఒక్కరికే రెండు కరోనా టీకాలు.. 

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపధ్యంలో పలుచోట్ల వ్యాక్సినేషన్‌లో పొరపాట్లు. ఎఎన్ఎం చేసిన నిర్వాహకం.  ఒక మహిళకి రెండు సార్లు టీకాలు.మోడల్ పీహెచ్సీ‌లో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కమలేష్ దేవి అనే మహిళ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసుపత్రికి వచ్చింది. అయితే ఆమెకు వ్యాక్సిన్ ఇచ్చిన నర్సు ఫోనులో మాట్లాడుతూ ఆమె భుజంపై ఒకేచోట రెండుసార్లు వ్యాక్సిన్ ఇచ్చింది.  ఈ విషయాన్ని ఆ మహిళ గుర్తు చేయగానే, ఆ నర్సు పొరపాటు జరిగిందని సర్ది చెప్పింది. అయితే విషయం తెలియగానే ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు చేశారు. ఈ విషయంపై కమలేష్ దేవి మాట్లాడుతూ తనకు వ్యాక్సిన్ ఇచ్చిన నర్సు ఫోనులో ఎవరితోనే మాట్లాడుతూ తనకు వ్యాక్సిన్ ఇచ్చిందన్నారు. తాను అక్కడే కూర్చున్నప్పటికీ తనను వెళ్లాలని చెప్పకుండా మరోమారు తనకు టీకా ఇచ్చిందన్నారు. దీంతో తాను రెండుసార్లు టీకా ఎందుకు ఇచ్చారని ప్రశ్నించగా, ఆమె కోపంతో ఊగిపోతూ వ్యాక్సిన్ వేశాక ఇంకా ఇక్కడ ఎందుకు కూర్చున్నావని ఎదురు ప్రశ్న వేసిందన్నారు. 

ప్రధాన అర్చకుడిగా మళ్లీ రమణ దీక్షితులు! టీటీడీలో మరో  వివాదం 

తిరుమల పుణ్యక్షేత్రం వివాదాలను కేంద్ర బిందువుగా మారుతోంది. టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయం రిటైర్డ్ అర్చకులు, ప్రస్తుత ప్రధాన అర్చకులకు మధ్య అగాధాన్ని  రాజేసింది. రిటైర్డ్ అర్చకులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వయో పరిమితి పేరుతో రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ  ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటు అర్చకులు విధుల్లో చేరాలంటూ ఆదేశించింది. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు  తెలిపింది.  టీటీడీ ఆదేశాలతో ప్రధాన అర్చకుడి హోదాలో రమణదీక్షితులు తిరిగి శ్రీవారి ఆలయ ప్రవేశం చేయనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది.  టీటీడీలో అర్చక వివాదం ఎప్పటి నుంచో ఉంది. 1933 వరకు మహంతుల పాలనలో కొనసాగిన శ్రీవారి ఆలయ వ్యవహారాలకు చెక్ పెడుతూ..., టీటీడీని నియమించింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. పాలన మాత్రమే టీటీడీ కొనసాగించినా.. సంవత్సరాల తరబడి రామానుజ చార్యులు నిర్ధేశించిన విధంగా మిరాశీ వ్యవస్ధకు చెందిన అర్చకులు స్వామి వారికి పూజ కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీవారి ఆలయంలో మిరాశీ వ్యవస్థనే రద్దు చేస్తూ 1987లోని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో మిరాశీ వంశానికి చెందిన గొల్లపల్లి, పెద్దింటి, పైడిపల్లి, తిరుపతమ్మ కుటుంబాలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. సుదీర్ఘ వాదోపవాదాలు విన్న అత్యున్నత న్యాయస్థానం 1997 తీర్పును వెల్లడించింది. మిరాశీ వ్యవస్థను రద్దు చేస్తూ... మిరాశీ వంశీకులను అర్చకులుగా నియమించాలని టీటీడీని ఆదేశించింది. ఆ తరువాత 2007లో మిరాశీ వంశీకులు అర్చక వారసత్వం ఒక కుటుంబ నుంచి ఒకరు పొందేలా అప్పటి ఏపీ గవర్నమెంటు జీఓను విడుదల చేసింది.  2013లో వయో పరిమితి అంశాన్ని మొట్టమొదటి సారి టీటీడీ అమలు చేసింది. టీటీడీ అనుబంధ అలయాలైన తిరుచానూరు, గోవింద రాజా స్వామి ఆలయాలలోని మిరాశీ అర్చకులను పదవీ విరమణ చేయించింది టీటీడీ. మొత్తం ముగ్గురు అర్చకులు అప్పుడు పదవి విరమణ పొందారు. మిరాశీ వంశీకులు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. అర్చకులకు 65 సంవత్సరాల వయో పరిమితి చెల్లదని.., వారి ఒంట్లో శక్తి ఉన్నంత వరకు సంభావం లేకుండా అర్చకులుగా కొనసాగించాలని కోర్టు టీటీడీకి ఆదేశాలు జారీ చేసింది. 2015వ సంవత్సరం అర్చకులకు రిటైర్మెంట్ అనే పదమే లేదని అప్పటి ఈఓ ఎం.జి గోపాల్ తెలిపారు.అయితే 65 సంవత్సరాలు పైబడిన అర్చకులు ప్రమాదవశాత్తు ప్రధాన ఆలయంలో స్వామి వారి ఉత్సవ మూర్తులను నేలపై పడేలా చేసిన సంఘటనల దృష్ట్యా టీటీడీ మరో మారు వయో పరిమితి అంశాన్ని బోర్డులో ప్రవేశ పెట్టింది. ప్రవేశ పెట్టడం, ఆమోదం పొందడం అంత శరవేగంగా అయిపోయాయి. దీనితో గొల్లపల్లి వంశానికి చెందిన రమణ దీక్షితులతో పాటు మరో మూడు కుటుంబాలకు సంబంధించిన ప్రధాన అర్చకులకు టీటీడీ రిటైర్మెంట్ ప్రకటించింది. ఖాళీ అయిన పోస్టులను అదే కుటుంబంకు చెందిన వారిని నియమించింది. టీటీడీ నిర్ణయంపై రమణ దీక్షితులు సుప్రీమ్ కోర్టుకు వెళ్లగా.. తిరుచానూరు, గోవింద రాజా స్వామి మిరాశీ అర్చకులు హైకోర్టుని ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉండగా... హైకోర్టు మిరాశీ అర్చకులపై స్పష్టమైన తీర్పును గత సంవత్సరం డిసెంబర్ 14 తేదీన ప్రకటించింది. మిరాశీ అర్చకులు ఉద్యోగులు కాదని, వారికి టీటీడీ సర్వీసులు వర్తించవని తేల్చి చెప్పింది ధర్మాసనం. వారిని అర్చకత్వానికి అనుమతించాలని ఆదేశించింది. అయితే ఈ విషయంలోనూ టీటీడీ కోర్టులో అప్పీల్ కు వెళ్ళింది. మిరాశీ అర్చకుల పదవి విరమణ అనే అంశాన్ని రాజకీయం చేస్తూ అప్పటి అధికార పార్టిపై తీవ్ర విమర్శలు చేస్తూ రమణదీక్షితులు పావులు కదిపారు. దీంతో రమణదీక్షితులపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ వంశపార్యంపర్య వృత్తిని అర్చకత్వాని కొనసాగించేలా చేయాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పదించిన జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే అర్చకుల సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు.  ఎన్నికల ఫలితాల ముందు కూడా జగన్ ను రమణ దీక్షితులు కలిశారు. సీఎం జగన్ తిరుమల పర్యటనకు వచ్చిన ప్రతిసారి రమణదీక్షితులు కలిసి తనకు న్యాయం చేయాలనీ కోరారు. అయితే రమణ దీక్షితులకు ఆగమ సలహాదారునిగా నియమించిన టీటీడీ ఆలయ గౌరవ ప్రధాన అర్చకునిగా హోదా కల్పిస్తూ 2019 నవంబర్ 6వ తేదీన ఉత్తర్వులిచ్చింది. నియమితులైన కొన్ని రోజులకే తనకు కచ్చితంగా ఆలయ ప్రధాన అర్చక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చాడు రమణ దీక్షితులు. ఇప్పుడు ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్న వేణుగోపాల దీక్షితులు, కృష్ణ దీక్షితులు మరికొందరు ఆలయ అర్చకులు మార్చి మాసంలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఖాళీల భర్తీ కోసం అభ్యర్థించిన మిరాశీ అర్చకులు తమ మిరాశీ వంశానికి చెందిన వారికే అర్చకత్వం ఇవ్వాలని కోరగా.., పచ్చ జెండా ఊపుతూ.., టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసారు సీఎం జగన్. దీన్ని గమనించిన మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి.., వైసీపీ నేతలతో చర్చలు కొసాగించారు. తనకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన నాయకులు పంచాయితిని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై టీటీడీ అధికారులతో చర్చించిన సీఎం.., రమణ దీక్షితులుకు ఆలయ ప్రధాన అర్చక పదవి ఇవ్వాలని సూచించారట. సీఎం ఉత్తర్వుల మేరకు వయోపరిమితి పేరుతో రిటైరైన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 

సన్యాసిగా మారిన మాజీ ఎమ్మెల్యే.. 

అతని  పేరు డాక్టర్ వడ్డమాను శివరామకృష్ణారావు. రెండు సార్లు ఎమ్మెల్యే గా సేవలు అందించాడు. చివరికి ఏమనుకున్నాడో గానీ సన్యాసం తీసుకున్నాడు. బద్వేలు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వడ్డమాను శివరామకృష్ణారావు  సన్యాసం స్వీకరించారు. చివరికి స్వామి దగ్గర శిష్యరికం తీసుకుని శివరామానంద సరస్వతిగా పేరు పొందాడు..   కడప జిల్లా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శివరామకృష్ణారావు బద్వేలు నియోజకవర్గం నుంచి 1978లో ఒకసారి, 1989లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం రాజకీయాలనుంచి వైదొలగి రాజమండ్రిలో సన్యాసం తీసుకున్నారు. స్వామి  సత్వవిదానంద  సరస్వతి అనే గురువు వద్ద శిష్యరికం పొందిన  ఆయన ద్వారా శివరామానంద సరస్వతిగా తన పేరు మార్చుకున్నారు. భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, జ్ఞానం ప్రసాదించమని ఆయనను వేడుకున్నానని అన్నారు. ఈ నిర్ణయంలో ఎలాంటి విభేదాలు లేవని రాజకీయ నాయకునిగా ఉన్న హయాంలో బద్వేలు నియోజవకర్గ అభివృద్ధికి కృషిచేశామన్నారు. తన అభ్యుదయం కోసమే దీక్ష తీసుకున్నానన్నారు. ఇది ఏ రకమైన రాజకీయం కాదన్నారు. మానవుడు మాధవునిగా ఎదగాలనే తలంపుతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. పోరుమామిళ్లలోని లక్ష్మినరసింహస్వామి దేవాలయం, కలమకూరులోని శివాలయం, రామాలయం నిర్మించామని కృష్ణుని ఆలయం నిర్మాణ దశలో ఉందని తెలిపారు. భగవంతుని సేవలోనే జీవితం కొనసాగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.   

బాబాయ్ పై గొడ్డలి వేటు ఎవరిదో? 

పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ తెలుగు దేశం పార్టీ తీసుకున్న నిర్ణయంపై సెటైర్లు వేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తమ్ముళ్లు విరుచుకుపడ్డారు. ఘాటుగా  కౌంటరిచ్చారు. విజయసాయిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. "ఏ2 దొంగ రెడ్డీ... బాబాయ్ గొడ్డలితో గుండెపై పొడుచుకున్నాడా? లేక మీరే గొడ్డలి వేటు వేశారా? ఓ చెల్లి తెలంగాణ రోడ్లపైనా, మరో చెల్లి ఢిల్లీలో అన్న కాదు అరాచకుడని నినదిస్తూ భయపెడుతున్నారా?" అంటూ ప్రశ్నించారు. "పంచాయతీలు, మున్సిపాలిటీలు గెలిచాం అంటూ కాలర్ ఎగరేస్తున్న ఏ1 వలలు, బారికేడ్లు, 1000 మంది పోలీసుల కాపలాలో వ్యాక్సిన్ వేయించుకున్నాడంటేనే జనాన్ని చూసి ఎలా వణుకుతున్నాడో అర్థమవుతోంది" అని ఎద్దేవా చేశారు. "సీబీఐ వాళ్లు వస్తున్నారట... హైదరాబాదులో కొవిడ్ బెడ్లు రెడీ చేసుకో సాయిరెడ్డీ!" అంటూ చివర్లో చురకేశారు అయ్యన్నపాత్రుడు. గతంలో జయలలిత, జ్యోతిబసు వంటి వారు ఎన్నికల్ని బహిష్కరించారని టీడీపీ నేత చినరాజప్ప అన్నారు. వాళ్లు కార్యకర్తల్ని కాపాడుకొని సీఎంలు అయ్యారని ఏ2 విజయసాయిరెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. మీ ఏ1 కూడా అసెంబ్లీని రెండేళ్లు బహిష్కరించిన విషయం మరిచారా?, విజయసాయికి దొంగ లెక్కలు తప్ప చరిత్ర జ్ఞానం ఎక్కడుంది? అని ఆయన ప్రశ్నించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి ప్రజాస్వామ్య విలువలు ఏం తెలుసన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దొంగ, పోలీసు ఒక్కటయ్యారని చిన్న రాజప్ప విమర్శించారు. ఎన్నికలను బహిష్కరించడం చరిత్రలో ఇదే మొదటిసారి అని.. రాష్ట్రంలో భయానక పరిస్థితులున్నాయని మాజీ మంత్రి జవహర్ అన్నారు. దొంగ, పోలీసు ఒకటయ్యారన్నారు. ఎస్‌ఈసీ నీలం సాహ్ని జగన్ బంట్రోతు, రబ్బరు స్టాంపులా పని చేస్తున్నారన్నారు. అందుకే ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. టీడీపీ పారిపోయిందని సోము వీర్రాజు అంటున్నాడని.. ఎవరిపై పోరాటం చేయాలో మీకు తెలియదన్నారు. టీడీపీపై కాదని.. వైసీపీ మీద పోరాటం చేయాలన్నారు. నోటాకి వచ్చిన ఓట్లు కూడా బీజేపీకి  రాలేదన్నారు జవహర్. టీడీపీని కించపరుస్తూ మాట్లాడితే సహించేది లేదన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలను కళ్లు ఉండి చూడలేని కబోది సోము వీర్రాజు అని జవహర్ మండిపడ్డారు.  

మందు బాబులు దాడి.. పోలీసులు పరార్.. 

రెండు గ్రూపులు పొట్టనిండా తాగారు. ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. చుట్టూ చూస్తున్న జనం వాళ్ళని ఆపలేక.. మానవత్వం తో 100 డయల్ చేశారు.. సినిమాలో చూపించేలా కాకుండా చాలా స్పీడ్ గా వచ్చారు పోలీసులు. పోలీసులు వస్తే గొడవ పడేవాళ్ళు ఎవరైనా పారిపోతారు. ఆగిపోతారు. కానీ వాళ్ళు అలా చేయలేదు. మద్యం మత్తులో వాళ్ళు చేసిన హంగామా అంత ఇంత కాదు. గొడవ ఆపడానికి వచ్చిన పోలీసులనే పరుగెతిన్చారు.. కర్రలతో దాడి చేసి రక్తం కారేలా కొట్టారు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.  ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతోందని 100 డయల్‌కు కాల్ వచ్చింది. దీంతో అధికారులు వెంటనే  పోలీస్ స్టేషన్‌లో బ్లూకోట్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్‌, లక్ష్మణ్‌ లను ఘటనా స్థలానికి వెళ్లాలని అలర్ట్ చేశారు. అనంతరం వెంటనే సదరు కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి చేరుకోని గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఇంతలోనే గొడవకు ప్రధాన కారకుడు అయిన నజీమొద్దీన్.. మద్యం మత్తులో తనకే అడ్డు వస్తారా అంటూ ఆ ఇద్దరు కానిస్టేబుళ్లపై కర్రతో దాడి చేశాడు. పరిగెత్తించి మరి కొట్టాడు. ఏకంగా తలలు ఎండా కాలం పుత్తకాయల్లా పగులగొట్టాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై రాజకుమార్ చెప్పారు. ప్రస్తుతం గాయపడ్డ బ్లూకోట్ కానిస్టేబుళ్లు కరీంనగర్‌లోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

డ్రగ్స్ మాఫియాలో ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు! 

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ మాఫియా కేసులో అడ్డంగా బుక్కయ్యారనే ప్రచారం జరుగుతోంది. అయితే కేసు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను తప్పించటానికి  గుట్టు చ‌ప్పుడు కాకుండా సెటిల్మెంట్లు అవుతున్న‌ాయని సమాచారం. అధికార పార్టీకి చెందిన కీలక నేతకు.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అత్యంత సన్నిహితులు కావడంతో... అంతా గప్ చుప్ గా సాగుతుందని తెలుస్తోంది.  కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవలే డ్రగ్ రాకెట్ బయటపడింది. ఈ కేసులో తీగ లాగితే తెలంగాణలో డొంక బయటపడింది. బెంగళూరులో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఉద్యమకారుడినని చెప్పుకునే ఓ పెద్ద మనిషి డ్రగ్స్ రాకెట్‌లో ప్రధానంగా ఉన్నట్లుగా గుర్తించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఓ నటుడిని బెంగళూరు పోలీసులు పిలిచి ప్రశ్నించారు. అతని విచారణలో ఎమ్మెల్యేల పేర్లు బయటికి వచ్చాయని తెలుస్తోంది.  హైదరాబాద్‌లో ప్రధానంగా లింకులు కనిపిస్తుండటంతో బెంగళూరు పోలీసులు అరెస్టులకు కూడా సిద్ధమవుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే అరెస్ట్ కోసం బెంగళూరు పోలీసులు సన్నాహాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరన్నదానిపై స్పష్టత ఉన్నప్పటికీ.. మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది. అలాగే ఉద్యమం పేరుతో హడావుడి చేసే వ్యక్తిని కూడా… అరెస్ట్ చేయనున్నారు. ఈయన పైకి ఉద్యమకారుడినని చెప్పుకుంటారు కానీ సినిమాలకు ఫైనాన్స్ చేయడం క్యాబ్‌ల వ్యాపారం చేయడం వంటివి ఉన్నాయి. ఈ క్రమంలో సినిమా వాళ్లతో ఏర్పడిన పరిచయాలు డ్రగ్స్ మార్కెట్‌లో పాలు పంచుకునేదాకా తీసుకెళ్లాయని అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసును హైదరాబాద్ పోలీసులు కోల్డ్ స్టోరేజ్‌లో పడేశారు. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ సినీతారల్ని కూడా అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీగ మొత్తం లాగుతూంటే కేసు ఎక్కడెక్కడికో వెళ్తోంది. తాజాగా అది తెలంగాణ ఎమ్మెల్యేల వద్దకు చేరుతుంది. పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నట్లుగా భావిస్తున్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తే.. రాజకీయంగా పెను సంచలనం కానుంది.  

మద్యం మత్తులో ఇంటికి నిప్పు..

మద్యం మత్తులో ఇంటికి నిప్పు..  మత్తు వదలరా నిద్దర మత్తూ.. ఛీ ఛీ.. మద్యం మత్తు వదలరా.. మత్తులోనే పడితే నీ సీన్ సిరిగిపోద్ది.. అందుకే మత్తు వదలరా మద్యం మత్తువదలరా.. పొట్ట నిండా తాగి, ఎనిమిది మంది ఉన్న ఇంటికి నిప్పంటించాడు ఓ మందు బాబు.. మద్యం మత్తులో ఒక్కడు ఇంటికి తాళం వేసి ఇంటికి నిప్పు అంటించాడు. ఈ రోజు ఉద‌యం ఇంట్లోని వారంతా నిద్రపోతోన్న స‌మ‌యంలో భోజా (50) అనే తాగుబోతు ఇంటి పైక‌ప్పు ఎక్కి, పెట్రోలు పోసి ఇంటికి నిప్పంటించాడు. దీంతో  ఎనిమిది మంది మంటల్లో చిక్కుకున్నారు.  మంట‌లు అంటుకుని ముగ్గురు అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మిగ‌తావారిని ఆసుప‌త్రికి త‌ర‌లించగా మ‌రో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. వారిలో న‌లుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. కుటుంబ తగాదాల కార‌ణంగానే అత‌డు ఆగ్ర‌హంతో ఊగిపోతూ ఈ దారుణానికి పాల్పడిన‌ట్లు తెలిసింది. కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్ తాలూకా ముగుట‌గెరె గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.  ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు  పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.   

జగన్ కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జగన్ కు గుడ్ బై చెప్పేశారు ఆ పార్టీ కీలక నేత.  తన  నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల ప్రకారం వైసీపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. జాతీయ పార్టీలో చేరాలనుకుంటున్నానని ఆ నేత తెలిపారు. తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిలకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. కీలక నేత రాజీనామా చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది.  వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఆ పార్టీ తెలంగాణ  అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి.  తన జీవితంలో ఇది దుర్దినం అన్నారు. సామాన్యుడిగా ఉన్న తనకు రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్ నియమించారని చెప్పారు. జాతీయ పార్టీలో చేరి భవిష్యత్ లో  హుజూర్ నగర్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని తెలిపారు. 2007 నుంచి తనకు జగన్ తో సంబంధం ఉందన్నారు శ్రీకాంత్ రెడ్డి. అప్పుడు కాంగ్రెస్ లో చేరి.. తర్వాత  వైఎస్ జగన్ తో కలిసి నడిచానని తెలిపారు. వైఎస్ జగన్ భవిష్యత్ లో ఇంకా గొప్ప స్థానాలు అధిరోహించాలని కోరుకున్నారు గట్టు.  తెలంగాణలో పోరాటాలు చేయలేదనే ఆరోపణలు తమపై వచ్చాయన్నారు గట్టు శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్రం వచ్చి ఏడు సంవత్సరాలైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక పోవడం అన్యాయమన్నారు. గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా వైసీపీలో కలకలం రేపుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. అంతేకాదు టీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు అన్యాయం చేస్తున్నా వైసీపీ స్పందించలేదని కామెంట్ చేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని జగన్ ఆదేశించారనే సంకేతం వచ్చేలా గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయడం, మిగిలిన వారు షర్మిలకు మద్దతుగా ఉంటుండటంతో తెలంగాణలో వైసీపీ దుకాణం బంద్ అయినట్టేననే చర్చ జరుగుతోంది. 

2024లో యూటీగా హైదరాబాద్? మేడ్చల్, రంగారెడ్డిపై కేసీఆర్ ఫోకస్ 

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా? 2024లో యూటీ కావడం ఖాయమా?.. ఈ ప్రశ్న రాష్ట్ర విభజనకు ముందు నుంచి వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనే  హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారనే ప్రచారం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని యూటీగా చేసి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేస్తారని చర్చ జరిగింది. కొందరు సమైక్యాంధ్ర నేతలు కూడా ఇదే డిమాండ్ చేశారు. అయితే రాష్ట్ర విభజనతో హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రమే ఏర్పడింది. కాకుంటే పదేళ్ల పాటు హైదరాబాద్ ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచారు. ఆ గడువు 2024తో ముగియనుంది.  ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు మూడేండ్లలో ముగియనుండటంతో మళ్లీ కేంద్ర పాలిత ప్రాంతం కానుందనే  అంశం తెరపైకి వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిని యూటీగా చేయాలని.. అవసరమైతే దేశానికి రెండో రాజధానిగా ప్రకటించాలనే నిర్ణయానికి కేంద్ర సర్కార్ వచ్చిందంటున్నారు. అందుకే కొన్ని రోజులుగా దీనిపై లీకులు ఇస్తున్నారని చెబుతున్నారు. ఫిబ్రవరిలో లోక్ సభలోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దీనిపై మాట్లాడారు. హైదరాబాద్ ను యూటీగా మార్చాలని కేంద్రం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. హైదరాబాద్ ను యూటీ చేస్తున్నారంటూ  అసద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అసద్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించినా... యూటీపై వస్తున్న వార్తలు మాత్రం ఆగడం లేదు.  తాజాగా రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల అభివృద్ధికి కేసీఆర్ కసరత్తు చేస్తుండటం ఇందుకు బలాన్నిస్తోంది. శుక్రవారం  ఈ రెండు జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు కేసీఆర్. ఈ రెండు జిల్లాలు భవిష్యత్తులో హైదరాబాద్‌కు పోటీగా అభివృద్ధి చెంది నగర ముఖచిత్రాన్ని మరింత గుణాత్మకంగా మార్చివేస్తాయన్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ జిల్లాల్లో సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధ్యక్షతన నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ ను యూటీ చేయాలనే కేంద్ర ఆలోచనపై సీఎం కేసీఆర్ కు సిగ్నల్స్ వచ్చాయని అంటున్నారు. అందుకే కేసీఆర్ మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలపై ఎక్కువ ఫోకస్ చేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి ఇస్తోంది. హైదరాబాద్ ను యూటీగా ప్రకటించినా... మేడ్చల్ , రంగారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే తెలంగాణకు డోకా ఉండదని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం.  రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల అభివృద్ధిపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేయడానికి కేంద్ర పాలిత ప్రాంతం కానుందనే సమాచారమే కారణమంటున్నారు. నిజానికి హైదరాబాద్ ను యూటీ చేస్తే వరంగల్ ను రాజధానిగా మార్చాలని మొదట కేసీఆర్ నిర్ణయించారట. అయితే ఇప్పుడు ఆయన తన ఆలోచన మార్చుకున్నారని చెబుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం అభివృద్ధి శర వేగంగా సాగుతోంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఐటీ సంస్థలన్ని కోలువున్నాయి. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలన్ని అక్కడే ఉన్నాయి. అందుకే  జీహెచ్ఎంసీని కేంద్రం యూటీగా మార్చినా..  తెలంగాణకు నష్టం లేకుండా ఈ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేసుకోవాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా హైదరాబాద్ శివారు ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయకుండా.. ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ చుట్టూ ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటితో పాటు అభివృద్ధి వేగంగా ఉన్న ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చారు.  రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కేసీఆర్ కుటుంబంతో పాటు ఆయన సన్నిహితులకు భారీగా భూములు ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్ యూటీ ఎయితే రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయాలని భావించడానికి  ఇది కూడా ఒక కారణమంటున్నారు. అందుకే వరంగల్ ప్రతిపాదనను పక్కనపెట్టి... ఈ ప్రాంతంపై కేసీఆర్ ఫోకస్ చేశారని అంటున్నారు. రీజనల్ రింగు రోడ్డు కోసం కేంద్రంపై టీఆర్ఎస్ సర్కార్ ఒత్తిడి పెంచడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. రీజనల్ రింగు రోడ్డు వస్తే మేడ్చల్, రంగారెడ్డితో పాటు సిద్ధిపేట, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలకు మహార్దశ పట్టనుంది. ఈ ప్రాంతంలోనూ కేసీఆర్ కుటుంబానికి భారీగా ఆస్తులు ఉన్నాయనే ప్రచారం ఉంది. మొత్తంగా మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక రచించడానికి .. హైదరాబాద్ యూటీ కానుండటమే కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ ను యూటీ చేసినా తనకు ఇబ్బంది లేకుండా కేసీఆర్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

బాధ, ఆవేదనతోనే.. తొలిసారి ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ 

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తెలుగు దేశం పార్టీ బహిష్కరించడం చర్చగా మారింది. రాజకీయ వర్గాల్లో భిన్న స్పందనలు వస్తున్నాయి. పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంతో  టీడీపీ అధినేత చంద్రబాబు వివరణ ఇచ్చారు. బాధ, ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే అవకాశం లేదన్నారు. నాలుగు వారాల కోడ్ ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశం ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బొమ్మగా చేసి ఎన్నికలను పరిహాసాస్పదంగా మారుస్తున్న జగన్‌ ప్రభుత్వ వ్యవహార శైలికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ‘నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణలో ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలోనూ పోటీ చేశాం. తీవ్రవాదుల ప్రభావం బాగా బలంగా ఉన్న చోట్ల కూడా చేశాం’ అని చంద్ర బాబు చెప్పారు.  రాజకీయ చరిత్రలో టీడీపీ  ఎన్నికల బహిష్కరించడం ఇదే తొలిసారి.  పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఎప్పుడూ ఎన్నికలను బహిష్కరించలేదు. తెలంగాణ ఉద్యమం వంటి సమయాల్లోనూ ఎన్నికల్లో పోటీ చేసింది. మధ్యలో కొన్నిసార్లు కొన్ని ఉప ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. నాటి ప్రధాని పీవీ నరసింహరావు పోటీ చేసిన నంద్యాల లోక్‌సభ స్థానంలో, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీజేఆర్‌ మరణం తర్వాత జరిగిన ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాగ్యా నాయక్‌ను నక్సలైట్లు హత్య చేసిన తర్వాత వచ్చిన ఉప ఎన్నిక, వైసీపీ నేత శోభా నాగిరెడ్డి మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నిక లో ఆ పార్టీ పోటీ చేయలేదు. ఏక మొత్తంగా ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి.  టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం పొలిట్‌బ్యూరో, రాష్ట్ర స్థాయి నేతల సమావేశం నిర్వహించారు. ఎన్నికల బహిష్కరణపై టీడీపీ నేతల నుంచి భిన్న స్వరాలు వినిపించాయి. ఎన్నికలను బహిష్కరించడమే మేలని కొందరు వాదించగా వారితో మరికొందరు విభేదించారు. అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్యచౌదరి, యనమల రామకృష్ణుడు, కూన రవికుమార్‌ వంటివారు.. ఎన్ని సమస్యలున్నా ఎన్నికల్లో పోరాడుతూనే ఉండాలని, అప్పుడే కేడర్‌ను నిలబెట్టుకోగలమని అభిప్రాయపడ్డారు. కానీ మెజారిటీ నేతలు బహిష్కరణకే మొగ్గు చూపారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున పోటీలో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కూడా చంద్రబాబు మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు. మెజారిటీ నేతల అభిప్రాయం ప్రకారం ఎన్నికల బహిష్కరణ  నిర్ణయాన్ని ప్రకటించారు.  

ప్రచారంలో కస్సుబుస్సుమన్న నమిత.. .

నటి నమిత ప్రచారం చేయడానికి వెళ్ళింది.. అసలు అభ్యర్థే పత్తాలేదు.. తొమ్మిదినరకు ప్రారంభం కావాల్సిన ప్రచారం 10 :15 స్టార్ట్ అయింది..  నటి నమితకు చిర్రెత్తే. దాంతో ప్రచారం గిచారం జాంతానై.. కేల్కతం దుకాణ్ బంద్ అంటూ.. అభ్యర్థులు ప్రచారంలో లేకపోతే  నేను చెన్నై చెక్కేస్తా అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. ఈ ఘటన రామనాధపురంలో జరిగింది.  బీజేపీ పార్టీ  అభ్యర్ధులకు మద్దతుగా ఆ పార్టీ నాయకురాలు నటి నమిత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నమిత ప్రచారంతో కార్యకర్తలు మాత్రం కేరింతలు కొడుతూ రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. రామనాథపురం బీజేపీ అభ్యర్ధి కుప్పు రాముకు మద్దతుగా నమిత గురువారం రామేశ్వరం మున్సిపాలిటీల్లో నాలుగు ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు.  ఉదయం 9.30 గంటలకు మరుదుపాండియన్‌ విగ్రహం సమీపం నుంచి ఆమె ప్రచారం ప్రారంభించాల్సి ఉండగా, 10.15 గంటలకు కూడా అభ్యర్ధి కుప్పు రాము రాలేదు. దీంతో, మరుదుపాండియన్‌ విగ్రహం సమీపంలో ప్రచారం రద్దు చేసుకున్న నమిత, బస్టాండ్‌, దేవర్‌ విగ్రహం ప్రాంతంలో ప్రచారానికి వెళ్లారు. అప్పటికీ కూడా అభ్యర్ధి జాడలేకపోవడంతో ఆగ్రహించిన నమిత ప్రచారం రద్దు చేసుకొని హోటల్‌కు వెళ్లిపోయారు. సాయంత్రం ప్రచారానికి రావాలని బీజేపీ కార్యకర్తలు కోరడంతో, ఆగ్రహించిన నమిత శివంగిలా ఊగిపోయారు  ‘అభ్యర్ధి లేకుండా ప్రచారం చేయబోనని, ఇలాగైతే చెన్నై వెళ్లిపోతానని మండిపడ్డారు.. అయినా ఆ అభ్యర్థి పట్టించుకుంటేగా?

సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థికి వర్మ సపోర్ట్

సంచనాలకు కేరాఫ్ గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ  మరోసారి కేక పుట్టించారు. సినిమాలపై కాకుండా ఓ ఎన్నికపై ఆయన చేసిన ట్వీట్  ఇప్పుడు వైరల్ గా మారింది. తెలంగాణలో రాజకీయ రచ్చగా మారింది. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నోముల భగత్ కు మద్దతుగా ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ.  దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య  కొడుకు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్అభ్యర్థి నోముల భగత్... ఓ చిరుత పులితో వాకింగ్ చేస్తూ వెళ్తున్న చిన్న వీడియోను వర్మ ట్వీట్ చేశారు. "వామ్మో... కేసీఆర్, కేటీఆర్‌లు టైగర్‌, సింహాలు అని మనకు తెలుసు. కానీ, అభ్యర్థి నోముల భగత్ చిరుత పులిని వాకింగ్‌కి తీసుకెళ్తుండడం నాకు నచ్చింది. ఒకవేళ నాకే కనుక నాగార్జున సాగర్‌ ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ ఉంటే 17న నా ఓటు ఇతనికే వేసేవాణ్ని’’ అని వర్మ ట్వీట్ చేశారు. ‘ ఈ అభ్యర్థి నోముల భగత్... "మాకు ఓటు వేయండి. నాగార్జునసాగర్‌లో మన గర్జనకు ఏ ఒక్క పార్టీ నిలబడలేదు" అంటున్నారు. చిరుత పులితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్న వ్యక్తిని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు’’అని మరో ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ.  రాంగోపాల్ వర్మ ట్వీట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్వీట్‌కి అనుకూలంగా, వ్యతిరేకంగా చాలా మంది రిప్లైలు ఇస్తున్నారు. చిరుతపులితో నోముల భగత్ నిజంగానే వెళ్లారా... వెళ్తే... ఎక్కడ వెళ్లారు... ఎప్పుడు వెళ్లారనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీడియోని గమనించిన చాలా మంది నెటిజన్లు అది గ్రాఫిక్ కాదనీ... నిజమైన వీడియోనే అని అంటున్నారు. చిరుతపులి, నోముల భగత్ నీడలను బట్టీ... నిజంగానే చిరుతపులి తో వాకింగ్ చేశారని అంటున్నారు. ఇది నిజమే అయితే... ఇండియాలో ఇలా చెయ్యడానికి అనుమతి ఇవ్వరు. చుట్టూ ఉన్న గడ్డిని బట్టీ... అది ఆఫ్రికా సహారా ఎడారి లాంటిది కావచ్చని కొందరు అంటున్నారు. అక్కడి సఫారీల్లో ఇలా చిరుతలతో ప్రజలు దగ్గరగా ఉండేలా వాటికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు కాబట్టే... ఇది అక్కడిదే అంటున్నారు కొందరు.

గూగుల్ పే.. ఫోన్ పే వాడుతున్నారా.. అయితే.. 

ఇక ఫోన్ తో ఏటీఎం లో నగదు విత్డ్రా డెబిట్ కార్డు లేకుండానే.. ఎలా  అనుకుంటున్నారా గూగుల్ పే, ఫోన్ పే ఉండగా చింతేందుకు దండగ.. నేరుగా గూగుల్ పే ఫోన్ పే తో క్యాష్  విత్డ్రా చేసూకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే, అమెజాన్‌ పే వంటి మొబైల్‌ వ్యాలెట్‌ యాప్‌ల్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు. ఈ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) ఆధారిత యాప్‌తో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఏటీఎం తయారీ సంస్థ ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. యూపీఐ ఆధారిత ఇంటరాపరబుల్‌ కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయల్‌ (ఐసీసీడబ్ల్యూ) ఏటీఎంలను తయారు చేసింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), సిటీ యూనియన్‌ బ్యాంక్‌ భాగస్వామ్యంలో తొలుత వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. తమకు చెందిన 1,500కు పైగా ఏటీఎంలను ఇప్పటికే ఈ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌తో అప్‌గ్రేడ్‌ చేసినట్లు సిటీ యూనియన్‌ బ్యాంక్‌ వెల్లడించింది. దేశంలోని మరిన్ని ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ బ్యాంకుల    ఏటీఎంల్లోనూ ఈ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ విషయమై ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌, ఎన్‌పీసీఐ కలిసి పలు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నాయి. ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ ఇండియా ఎండీ నవరోజ్‌ దస్తూర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.  ఏటీఎం లో నగదు విత్ డ్రా ఇలా..  1  ఏటీఎం నుంచి నగదు కావాలంటే  ముందుగా మీ మొబైల్‌లోని యూపీఐ ఆధారిత యాప్‌ను ఓపెన్‌ చేయాలి. ఆ యాప్‌        మీ బ్యాంక్‌ ఖాతాతో అనుసంధానితమై ఉండాలి.   2  ఏటీఎంలో క్యూఆర్‌ క్యాష్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తద్వారా ఏటీఎం తెరపై కన్పించే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.  3  స్కానింగ్ ‌ పూర్తయ్యాక నగదు విత్‌డ్రా వివరాలను ఎంటర్‌ చేసి, ‘ప్రొసీడ్‌’ బటన్‌ను నొక్కాలి. 4  ఆ తర్వాత 4 లేదా 6 డిజిటల్‌ యూపీఐ పిన్‌కోడ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా ఏటీఎం మెషీన్‌ నుంచి నగదు పొందవచ్చు.  5  ఈ పద్ధతిలో ఒకసారికి గరిష్ఠంగా రూ.5,000 మా త్రమే ఉపసంహరించుకునే వీలుంటుంది. భవిష్యత్‌లో ఈ పరిమితిని            మరింత పెంచే అవకాశముంది.   ఎస్‌బీఐ యోనో క్యాష్‌ తరహాలో.. దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. యోనో లైట్‌ యాప్‌ కస్టమర్లకు ఇప్పటికే ఈ తరహా సేవలందిస్తోంది. డెబిట్‌ కార్డు అవసరం లేకుండా క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ ద్వారా ఎస్‌బీఐ ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది.   

వంద కోసం చంపేశారు.. 

కోట్లు కాదు. లక్షలు కాదు. వంద రూపాయలు  ప్రాణం తీసింది. వినేవాడు చూపించే ఏమైనా చెప్తారు అనుకుంటున్నారా.. నిజంగానే.. మేడం.. సర్ అదేంటి నవ్వుతున్నారా.. నమ్ముతారా లేదా..  ఆ..బొక్కలే.. వంద రూపాయలు ప్రాణం తియ్యడం ఏంటి..? వీడి బోండా ..అనుకుంటున్నారా..? అయినా సరే..  మీరు నమ్మి తీరాల్సిందే.. ఎందుకంటే  నేను చెప్పేది కథ కాదు.. కట్టు కథ అంతకన్నా కాదు.    కలిసి రోజు పనికి వెళ్లే వాళ్ళు. కలిసి మద్యం తాగేవాళ్ళు.. అప్పటి వరకు కలిసే ఉన్నారు.. ఇంతలో ఏమైందో తెలీదు.. తన తోటి స్నేహితుడ్ని కత్తితో పొడిచి చంపాడు.. ఈ ఘటన విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... వాంబేకాలనీ ప్రాంతానికి చెందిన సెంట్రింగ్‌ మేస్త్రీ షేక్‌ రఫీ వద్ద అదే ప్రాంతానికి చెందిన యడ్లవల్లి నాగరాజు అలియాస్‌ పండు(27) సెంట్రింగ్‌ పనులకు వెళ్తుంటాడు. ఖర్చుల కోసం రూ.100 ఇవ్వాలని రఫీని పండు రెండు రోజులుగా అడుగుతున్నాడు. రెండు రోజులుగా అడుగుతున్న రూ. 100  ఇవ్వకపోవడంతో ఇదే విషయమై గురువారం సాయంత్రం రఫీ ఇంటి వద్ద వీరిద్దరూ గొడవపడటంతో పెద్దలు సర్దుబాటు చేసి పంపేశారు. శుక్రవారం ఉదయం 10గంటల రఫీ ఇంటికి వెళ్ళాడు. పండుని ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లాడు. రాజీవ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ షేక్‌ హుసేన్‌, మరో సెంట్రింగ్‌ కార్మికుడు కిశోర్‌ని కలిశారు.. అందరు కలసి  పైపులరోడ్డు సెంటర్‌ సమీపంలోని దుర్గా బార్‌లో మద్యం తాగారు. అక్కడినుంచి వెళ్లిపోయిన గంట తర్వాత మళ్లీ కలిశారు. నున్న రూరల్‌ పోలీసు స్టేషన్‌ సరిహద్దు ప్రాంతంలో బైక్‌లు పెట్టారు. దుర్గాబార్ ‌పక్క రోడ్డులో మళ్ళీ గొడవ పడ్డారు. పండును హుసేన్‌, కిశోర్‌ పట్టుకోగా రఫీ కత్తితో పొడిచి చంపాడు. ఈ కొట్లాటలో నిందితులు ముగ్గురికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ లక్ష్మీనారాయణ వెంటనే సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న పండును, గాయాలపాలైన రఫీ, హుసేన్‌, కిశోర్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే పండు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగిలిన ముగ్గురికీ చికిత్స అందిస్తున్నారు. పండును అంతమొందించే ఉద్దేశంతోనే రఫీ ఉదయం నుంచి వెంటబెట్టుకొని తిరుగుతూ స్నేహితుల సహాయంతో హత్య చేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. 

భారత్ లో కరోనా విలయమేనా?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గిన వైరస్.. మార్చి నుంచి మళ్లీ పంజా విసురుతోంది. మహారాష్ట్రలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని 11 రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోందని వైద్య వర్గాలు హెచ్చరించాయి. తాజాగా మనదేశంలో కరోనాకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. ఏప్రిల్  రెండో వారం తర్వాత దేశంలో కరోనా వైరస్ విజృంభణ గరిష్ఠ స్థాయికి చేరుతుందని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మే చివరి వరకు అలానే కొనసాగి ఆ తర్వాత క్రమంగా తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది సెప్టెంబరులో వైరస్ గరిష్ఠ స్థాయికి చేరుకుని ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి తగ్గిందని, ప్రస్తుతం రెండో దశలోనూ వైరస్ ఉద్ధృతి అలానే ఉండే అవకాశం ఉందని  ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తీరును చూస్తే ఏప్రిల్ 15-20 మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్రా అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉందని, మున్ముందు ఆ సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి మహారాష్ట్ర, పంజాబ్‌లలో కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని తెలిపారు. హర్యానాలోని అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్ మీనన్ మాత్రం ఏప్రిల్, మే నాటికి వైరస్ విజృంభణ తీవ్రస్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. వైరస్ వ్యాప్తి రేటు, అది సోకే అవకాశం ఉన్న జనాభా, పాజిటివ్ కేసుల సంఖ్యను ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తలు ఈ అంచనాకొచ్చారు.   

పవన్ కు షాకిచ్చిన రత్నప్రభ.. సోము వీర్రాజు పరువు గోవిందా!

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి రిటైర్జ్ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేస్తున్నారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ పై కీలక ప్రకటన చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. తమ కూటమి తరపున పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు. సోము వీర్రాజు ప్రకటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం బీజేపీలో ప్రకంపనలు రేపుతుండగా.. సీఎంలను ముందే ప్రకటింతే సాంప్రదాయం లేని బీజేపీ.. ఎలాగూ గెలిచే అవకాశం లేదని భావించే ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ను ప్రకటించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.   తాజాగా తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ .. పవన్ కల్యాణ్ కు షాకిచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి కాదంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓ మీడియా  ఛానల్ డిబేట్ లో  మాట్లాడిన రత్నప్రభ.. పలు అసక్తికర విషయాలు వెల్లడించారు. ఏపీకి కాబోయే సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పిన విషయం తనకు తెలియదన్నారు. పవనే సీఎం అభ్యర్థి అంటూ మీడియాలో ఎలా వచ్చిందన్న విషయం కూడా తెలియదని వ్యాఖ్యానించారు. పవన్ పై రత్నప్రభ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజే పవన్ సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించినా.. రత్నప్రభ తెలియదు అన్ని పేర్కొనడం చర్చనీయాంశమైంది. రత్నప్రభ వ్యాఖ్యలతో సోము వీర్రాజు పరువు పోయిందనే ప్రచారం సాగుతోంది.  తిరుపతి ఉపఎన్నికలో ఇరు పార్టీల కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు రత్నప్రభ. బీజేపీకి జనసేన మద్దతు లేదన్న ప్రచారం సరికాదన్నారు. . తన అభ్యర్థిత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంతృప్తిగా ఉన్నారన్నారు.తిరుపతిలో ప్రచారం కూడా చేస్తారని చెప్పారు. తిరుపతిలో ఉన్న సమస్యలు తనకు తెలుసని చెప్పారు. ప్రస్తుతం తిరుపతిలో పరిశ్రమలు లేవని, తనను గెలిపిస్తే తిరుపతిలో పరిశ్రమలకు తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని రత్నప్రభ అన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించే విధంగా ప్రయత్నిస్తానని చెప్పారు. తిరుపతిలో మతమార్పిడి జరుగుతున్నాయని ఆరోపించిన రత్నప్రభ.. హిందువులపై దాడులు కూడా పెరిగాయన్నారు. తిరపతిలో హిందూ ధర్మాన్ని కాపాడతామన్నారు. దుబ్బాక ఫలితమే తిరుపతిలోనూ రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తిరుపతిలో తాను గెలుస్తానని, ప్రజల మద్దతు తమకే ఉందని రత్నప్రభ విశ్వాసం వ్యక్తం చేశారు. 

పాలించే వాడికి  మెరిట్ ఉండాలి.. ఈటల మరో సంచలనం

ఇటీవల కాలంలో హాట్ కామెంట్స్ తో  హీట్ పుట్టిస్తున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి మాటల తూటాలు పేల్చారు. రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం కార్యక్రమంలో ఆయన  సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలించే వాడికి కూడా మెరిట్ ఉండాలన్నారు. ఉద్యమాలు ప్రజల కోసం చేస్తే వారికి గొంతు కలపాలని సూచించారు.. ప్రజల ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలన్నారు ఈటల రాజేందర్. ‘‘నేను మంత్రి కావొచ్చు, కానీ ముందుగా మనిషిని. మెరిట్ లేనిదే టీచర్ కారు.మెరిట్ లేనిదే మెడికల్ సీటు రాదు. దేశ పౌరునిగా, సగటు మనిషిగా స్పందించాలి. ఎర్రకోట సాక్షిగా మన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ అది సక్రమంగా అమలు కావడం లేదని ఈటల రాజేందర్  అన్నారు.  అంబానీ ఒక్కడి సంపద పెరిగితే పేదరికం పోదని, సంపద కేంద్రీకృతమే పేదరికానికి కారణమని మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శించారు. అందుకే మనం క్రిమిలేయర్ గురించి మాట్లాడుకుంటున్నామన్నారు. ఎలుకల బాధకు ఇంటిని తగలబెట్టుకోవద్దని వ్యాఖ్యానించారు. ఢిల్లీ రైతు బాధ ఏదో ఒక రోజు నీ గడప కూడా తొక్కుతుందని ఈటల హెచ్చరించారు. 

దేశంలో కరోనా పంజా.. 11 రాష్ట్రాలు యమ డేంజర్ 

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత  పెరిగిపోతోంది. వైరస్ సెకండ్ వేవ్ ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.11 రాష్ట్రాల్లో ‘తీవ్రమైన ఆందోళనకర పరిస్థితులు’ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గత 14 రోజులలో ఈ రాష్ట్రాల నుంచి 90 శాతం కేసులు వచ్చాయని వెల్లడించింది. గత కరోనా దశ కంటే ఈసారి 11 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.  మహారాష్ట్రలో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్పారు రాజీవ్ గౌబా. మహారాష్ట్ర విషయంలో మాత్రం తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. కోవిడ్ కేసుల విషయంలో తక్షణమే మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కోవిడ్‌ను అరికట్టడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న అన్ని వనరులనూ ఉయోగించాలని, ఆరోగ్య శాఖే కాదు, ఇందుకు అన్ని శాఖలూ ప్రభుత్వాలకు సహకరించాలని రాజీవ్ గౌబా విజ్ఞప్తి చేశారు.