వివేకా హత్య కేసు అనుమానితుల్లో వైసీపీ ఎంపీ! 

తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడే క్రమంలో అలిసిపోతున్నామని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సునీతా రెడ్డి.. ఈ హత్య అనంతరం తమ జీవితాల్లో ప్రశాంతత అనేది లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. అందుకు ప్రజల మద్దతు తీసుకుందామనే తాను ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానని చెప్పారు. తన తండ్రి హత్య కేసులో తమకు తెలిసిన విషయాలను ఎవరైనా వెల్లడించకపోతారా అని భావిస్తున్నామని సునీతా రెడ్డి తెలిపారు.  తన తండ్రి వివేకా హత్యకేసులో 15 మంది అనుమానితుల జాబితాను దర్యాప్తు అధికారులకు అందజేసినట్టు సునీతా రెడ్డి వెల్లడించారు. ఆ అనుమానితుల్లో ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా ఉన్నాడని తెలిపారు. భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిల పేర్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ జాబితాలో మొదటిపేరు వాచ్ మన్ రంగన్న అని, అతని వ్యవహార శైలి ఎంతో అనుమానాస్పదంగా ఉందన్నారు. ఆ తర్వాత పేరు ఎర్ర గంగిరెడ్డి అని, ఆయన తన తండ్రికి ఎంతో సన్నిహితుడని, హత్య జరిగిన తర్వాత ఘటన స్థలంలో మరకలు శుభ్రం చేయించింది ఆయనే అని ఆరోపించారు.  పరమేశ్వర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు సంబంధించి అనేక సందేహాలున్నాయని వైఎస్ వివేకా  కూతురు చెప్పారు. తమ కుటుంబంలో తమకు కొందరు మద్దతుగా నిలుస్తున్నారని వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిశానని తెలిపారు. దర్యాప్తు సంస్థలు ఈ కేసుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సునీతారెడ్డి కోరారు. 

రబ్బరు స్టాంప్ గా ఎస్‌ఈసీ! ఎన్నికలు బహిష్కరించిన టీడీపీ

ఏపీలో స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా మారాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పరిషత్‌ ఎన్నికల తేదీలను మంత్రులు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలంటే టీడీపీకి భయంలేదన్నారు. ప్రజా కోర్టులో అధికార పార్టీని దోషిగా నిలబెడతామని చంద్రబాబు హెచ్చరించారు. కొత్త ఎస్‌ఈసీ వచ్చీ రాగానే పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారని ఆక్షేపించారు. పరిషత్‌ ఎన్నికల్లో ఎస్‌ఈసీ రబ్బర్‌స్టాంపుగా మారారని ఆరోపించారు. 2014లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో 2 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవమైతే తాజా ఎన్నికల్లో 24 శాతం ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. 2014లో 1శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవమైతే ఈసారి 19శాతం అయ్యాయని గుర్తు చేశారు. అధికార వైకాపా దౌర్జన్యాలు, అక్రమాలతోనే బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తామనే అభ్యర్థులను పోలీసులు బెదిరించారని మండిపడ్డారు.   బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోకపోడాన్ని ఆయన తప్పుబట్టారు. జాతీయ స్థాయిలోనూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అక్రమాలు జరిగిన ఎన్నికలను కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో కరోనా కారణంగా ఎన్నికలు వద్దని మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెబితే తప్పుపట్టారని, ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ ఉందని, ఎన్నికలు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. కొత్త నోటిఫికేషన్‌ ఇస్తే పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రకటించారు.     

ప్రగతి భవన్ లో కేటీఆర్ సన్మానాలు.. ఏ హోదాలో చేశారో సారూ? 

ప్రగతి భవన్.. తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం.. ప్రస్తుతం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో పాటు ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ముఖ్యమంత్రి నివాసంలో ఉంటూ కేటీఆర్ చేస్తున్న కార్యక్రమాలే వివాదంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్.. పార్టీ కార్యక్రమాలకు ప్రగతి భవన్ ను వేదిక చేసుకున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. తాజాగా ప్రగతి భవన్ లో మరో మంత్రితో పాటు ఉన్నతాధికారులకు ఆయన సన్మానం చేయడం దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ పంచాయ‌తీ స‌శ‌క్తి క‌ర‌ణ్ పుర‌స్కారాలు ఇస్తుంది. ఈ ఏడాది అత్యుత్త‌మ స్థానిక సంస్థ‌లుగా 12 పుర‌స్కారాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్రానికి అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్..  రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి  ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకి శుభాకాంక్ష‌లు తెలిపి, స‌త్క‌రించారు. పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ ర‌ఘునంద‌న్ రావుల‌ని స‌న్మానించారు. ఈ కార్యక్రమం ప్రగతి భవన్ లో జరగడం ఇప్పుడు కాక రేపుతోంది.  ప్రగతి భవన్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం. అక్కడ కేసీఆర్ తనయుడిగానే కేటీఆర్ ఉంటున్నారు తప్ప మంత్రిగా కాదు. ప్రగతి భవన్ లో ఏ అధికారిక కార్యక్రమైనా ముఖ్యమంత్రే చేయాలి. కేటీఆర్ చేయడానికి వీలుండదు. అలాంటిది ప్రగతి భవన్ లో మంత్రితో పాటు ఉన్నతాధికారులను కేటీఆర్ సన్మానించడంపై విమర్శలు  వస్తున్నాయి. అసలు ఏ హోదాలో కేటీఆర్.. మంత్రి ఎర్రబల్లితో పాటు ఉన్నతాధికారులను సన్మానించారన్నది రచ్చగా మారింది. రాజకీయంగా  కేటీఆర్ కంటే ఎర్రబెల్లి చాలా సీనియర్.  పదవి పరంగా చూసినా ప్రస్తుతం ఇద్దరూ మంత్రులే. పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి కేంద్రం అవార్డులు వస్తే.. ఆ శాఖ మంత్రిని సత్కరిస్తే ముఖ్యమంత్రి సత్కరించాలి. అధికారులను కూడా సీఎం లేదా సీఎస్ సత్కరించాలి. కాని ఎర్రబెల్లి నిర్వహిస్తున్న మంత్రి పదవికి సమాన హోదాలోనే ఉన్న కేటీఆర్.. ఎర్రబెల్లిని సత్కరించడం ఏంటనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. అది కూడా ప్రగతి భవన్ లో చేయడమేంటనీ ప్రశ్నిస్తున్నారు. అసలు తన కన్నా సీనియర్ అయిన  రాజకీయ నేతను కేటీఆర్ సన్మానించడమే విడ్డూరమంటున్నారు.   తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నా... పాలనంతా కేటీఆర్ డైరెక్షన్ లోనే సాగుతుందని కొంత కాలంగా ఆరోపణలు ఉన్నాయి. విపక్షాలు కూడా కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. మంత్రులు, ఉన్నతాధికారులంతా ప్రగతిభవన్ లో కేటీఆర్ ను కలుస్తుండటం విపక్షాలకు ఆరోపణలు బలాన్నిస్తున్నాయి. అయినా తన తీరు మార్చుకోవడం లేదు కేటీఆర్. తాజాగా ఎర్రబెల్లి దయాకర్ రావును కేటీఆర్ సన్మానించడంపై కాక రేపుతోంది. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎర్రబెల్లిని సన్మానించారా లేక మంత్రిగా చేశారా చెప్పాలంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయితే పార్టీ ఆఫీసులో చేసుకోవాలి కాని ప్రగతిభవన్ వేదిక కాదంటున్నారు. మంత్రిగా చేస్తే..ఏ హోదాలో చేశారో చెప్పాలంటున్నారు. కేటీఆర్ తనకు తానే సీఎంగా భావిస్తున్నట్లుగా ఆయన వ్యవహారం ఉందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. 

కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా..?

కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ? అన్న అనుమానం చలా మంది ప్రజల్లో సందేహాలు కలిగిస్తున్నాయి. ప్రపంచంలో వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న సంస్థలు ఎన్ని ఉన్నాయి అన్న ప్రశ్నకు సమాధానంగా కొంత సమాచారం మీముందు ఉంచుతున్నాము. ప్రపంచం మొత్తం మీద ఉత్పాదక సంస్థలు 1 3 ఉన్నాయని తేల్చారు. కోవిడ్ వ్యాక్సిన్లు ప్రపంచం మొత్తం వాడు తున్నారు. మిలియన్ల ప్రజలు ఇప్పటికే మొదటి విడత డోస్ లు తీసుకున్నారు. ప్రతి రోజూ ఒకటవ రెండవ డోస్ లు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మనం ప్రతి వ్యాక్సిన్ వివరాలు చూద్దాం. ఈ వ్యాక్సిన్ తీసుకోడం వల్ల  ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో చూద్దాం. ఎవరైనా క్యూలో నిలబడి వ్యాక్సిన్ తీసుకుందామని అనుకునే వారిలో రకరకాల సందేహాలు వస్థాయి. అదీ వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి. అలా ఎందుకు జరుగుతుంది. ఒకరికి కాక ఎక్కువ మందికి ఎందుకు జరుగు తుంది? వ్యాక్సిన్ సురక్షితమా కాదా? ఎలర్జీలు ఉంటె వ్యాక్సిన్ వేయరా? వేయించుకో కూడదా ? గత వారం రోజులగా మా తెలుగు వన్ హెల్త్ విభాగం వివిద ఆసుపత్రులలో వ్యాక్సిన్ ఇస్తున్న తీరు, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీ బోడీల తయారీ ఎలాఉంటుంది ?వ్యాక్సిన్ తీసుకున్న వారికి లో  వస్తున్నరీ యాక్షన్ ఏమిటి అన్న అంశాల పైన ఆధ్యనం చేస్తున్నారు. అయితే కొంత లాభం కొంత రిస్క్ ఉన్నది అన్నట్లుగానే ఉన్నదని  నిపుణులు ఆభిప్రాయా పడుతున్నారు. ప్యాండమిక్ నుండి బయట పడాలంటే కోవిడ్ ను నియంత్రించాలంటే కీలక మైన సాధనం వ్యాక్సిన్ మాత్రమే అని ఒప్పుకుని తీరాల్సిందే అని అంటున్నారు నిపుణులు. అసలు వ్యాక్సిన్ వేయించుకోడానికి ఎందుకు  వ్యతిరేకిస్తున్నారు? యాంటీ - ఏషియన్ రేసిజం అని వ్యాక్సిన్ తి మాపై పగ తీర్చుకోవాలని చ్చోస్తున్నారని కొందరి వాదన కాగా , ప్రపంచం మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ ను తయారు చేయడానికి సిద్ధం అయ్యింది. కోవిడ్ 1 9  ప్యండమిక్ అంశం హెడ్ లైన్స్ వార్తాలలోనిలుస్తోంది. దీనిపై జరుగుతున్న పరిశోధనలు అభివృద్ధి. సంరక్షణ  పై ఆనేక విషయాలు వెల్లడి అవుతున్నాయి. గుర్తింపు పొందిన 1 3 రకాల వ్యాక్సిన్లు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వాటి వల్ల పొంచి ఉన్న ప్రమాదం అందులో వాడకూడని రసాయనాలు ఏమిటి? వాటి వల్ల ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అన్న అంశాలను మీ ముందు ఉంచే ప్రయాత్నం చేస్తోంది. తెలుగు వన్ హెల్త్   పొందిన సంస్థల వ్యాక్సిన్ పేరు       కంపెనీ పేరు       కారకమైన వ్యాక్సిన్             ప్రభావం తీవ్రత  1 ) బి ఎన్ టి 1 6 2 బి 2      పి ఫైజర్  బయో టేక్      ఎం ఆర్ ఎన్ ఏ                                      9 5 %     2)  ఎం ఆర్ ఎన్ ఏ 1 2 7 3     మదేర్నా                         ఎం అర ఎన్ ఏ                                     9 4.5 %    3) ఏ డి 2 6 సి కో వి 2    ఎస్   జాన్సన్ అండ్ జాన్సన్       వైరల్ వెక్టార్                                       6 6 %  4)ఏ జెడ్ డి 1 2 2 2             ఆక్స్ ఫోర్డ్ - ఆస్ట్రా జెన్క      వైరల్ వెక్టార్                                         8 1 .3 %  5) కోవి షీల్డ్                   సీరం ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇండియా  వైరల్ వెక్టర్                                    8 1  6)ఏ డి 5 -ఎన్ కోవి              కాన్సినో                              వైరల్  వెక్టార్                                         6 5.2 % 7) స్పుత్నిక్                    గామా లెయా                   వైరల్  వెక్టార్                                               9 1 .6 %  8) కోవ్యాక్సిన్                  భారత్ బయో టెక్  ఇండియా  ఇన్ యాక్టివ్                                        8 ౦.6% 9) బి బి -ఐబి పి -కో ఆర్ వి   ఎస్ ఐఎన్ ఓ ఫర్మా బిజిన్స్   ఇన్ యాక్టివేటేడ్                              7 9 .3 %   10)ఐనో యాక్టి వేటేడ్ వీరా సెల్  సైనో ఫర్మా  వూహాన్      ఇన్ యక్తివేటెడ్                               7 2 .5 %  11)కరోనావి ఏ ఎల్           సైనో వాల్                        ఇన్ యాక్టివేటేడ్                                      5 ౦ .38% కోవి షీల్డ్  ఆక్స్ ఫర్డ్  ఆస్ట్రా జెనిక వ్యాక్సిన్ భారాత్ కోసం తయారు చేసారు. పైన పేర్కొన్న వ్యాక్సిన్ ప్రభావం ఎంత ఉండచ్చు అన్న  అంశాని చూసిన నిపుణులు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో వివరించారు. సహాజంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి అని నిర్ధారించారు.వ్యాక్సిన్ మన శరీరంలో ఇన్యునిటీ పెంచేందుకు అనుమతిస్తుంది. టి మరియు బి వంటి  లీంఫో సైట్స్ ను గుర్తిస్తాయి. వైరస్ ను యాంటీ బాడీలను తయారు చేస్తాయి. వ్యాక్సిన్ కోవిడ్ కు కారణం కాదని తేల్చారు. పూర్తి స్థాయిలో వైరస్ రూపంలో ఉండదు. అనారోగ్యానికి కారణం కాదని నిపుణులు తేల్చారు.శరీరంలో ఇమ్యునిటీ పెంచుతుంది. దీనివల్ల చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మినహా మరి ఏమి లేవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సి డి సి ఇచ్చిన నివేదిక ప్రకారం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రేవెంక్షన్ డబ్లు హెచ్ ఓ నివేదిక ప్రకారం  వ్యాక్సిన్ వల్ల జ్వరం, అలసట, తల నొప్పి, ఒళ్ళు నొప్పులు నుసియా  ఉంటుందని  నిపుణులు తెలిపారు. వ్యక్తి కి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ముఖ్యంగా ఇంజక్షన్ చేసుకున్న  చేతి పై వాపు నొప్పి ఎర్రబడడం దురద, రేష్ లాగా వచ్చి అసహనం గా ఉంటారు తనకు కోవిడ్ వచిందన్న భావన వాళ్ళలో ఉంటుంది. 1 3 రకాల వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్న విషయాన్నీ ఆరోగ్య ఆధికారులు గుర్తించారు. ఈ రకమైనా ఎఫ్ఫెక్ట్స్ సహాజంగా ఉంటుందని అవి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే అవి ఎప్పుడు ఎలా వస్తాయో ఊహించి చెప్పడం అసాధ్యమని తెలిపారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వ్యాక్సిన్ తీసుకున్న తారువాత. వచ్చే లక్షణాలను సమస్యలను వి ఏ ఇ ఆర్ ఎస్ కు రిపోర్ట్ చేయవచ్చు. లేదా వి ఏ ఇఆర్ ఎస్ పోర్టల్ లో తేలపచ్చు. వ్యాక్సిన్ పై వచ్చే వివిధ రకాల సమస్యలపై ఎఫ్ డి ఏ , సి డి సి  లు నిశితంగా పరిశీలిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఆయా సంస్థలు వ్యాక్సిన్ సేఫ్టీ పై సంస్తలు పునతాలోచిస్తున్నట్లు సమాచారం. యురోపియన్ యునియన్ సైతం ప్రజలలో అనుమానించదగ్గ ఎఫెక్ట్స్ పై వైద్యులు కూలం కషంగా ప్పరిసీలించేందుకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞాప్తి చేసింది. ఇదిఇలా ఉంటె భారాత్ లో మాత్రం ఎవరికీ చెప్పాలన్న అంశం పై సమగ్ర సమాచారం లేదు కేవలం డ్రగ్ కంట్రోల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా మాత్రమే చూస్తుందా ఆరోగ్య మంత్రి త్వ శాఖ కు తెలపాలా అన్నది మరో అంశం. ఇదిలా ఉంటె అలర్జీ రియాక్షన్ రావడానికి కారణం వ్యాక్సిన్ లొనీ కొన్ని పదార్ధాలు కారణమని తేల్చారు. దీనివల్ల చార్మం పై దద్దుర్లు, వాపు, ఊపిరి తిత్తుల సమస్యలు వచ్చాయి. ఎనా ఫి లాక్సిస్ అరుదైన సైడ్ ఎఫెక్ట్ సి డి సి పరిసీలనలో 2 . 5 మిలియన్ల ప్రజలు జ్వరం, తరువాతా ఏనా ఫైలక్సిస్ వచ్చిందని, ఎం ఆర్ ఎన్ ఏ వ్యా క్సిన్ లో పోలి ఎతిలిన్ గ్లైకాల్ ను కొన్ని అనుమతి పొందిన వ్యాక్సిన్ లలో వాడకూడదు.కాగా కొన్ని వ్యాక్సిన్ లలో ఏ, ఆర్ ఎన్ ఏ మలిక్యుల్, సెల్ పెనాన్ ట్రేషన్, పి ఇ జి పోలి సర్బేట్ 8 ౦ ఉన్నట్లు సమాచారం. ఎం అర ఎన్ ఏ ద్వారా చాలా తెక్కువ శాతం రీయక్షన్ ఎలర్జీ ఉన్నవాళ్ళని స్క్రీన్ చేయాలని సి డి సి సూచించింది.అయితే మహిళలలో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నది నిజమా ? ఆక్స్ ఫార్డ్ ఆష్ట్రాజనికా వల్ల రక్తం గడ్డ కట్టుకు పోవడం జరిగిందని కొన్ని దేశాలలో ఆశ్త్రా జనికా ను కొన్ని రోజులు నిలిపి వేసినట్లు సమాచారం. మరల దీనికి గల కరనాలాను పరిశీలించినా తరువాత యురప్ దేశాలు మళ్ళీ వ్యాక్సిన్ కు అనుమతించాయి.                  

బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎం.. అసోంలో దుమారం  

ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఉపయోగిస్తున్న ఈవీఎంలపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలను టాంపరింగ్ చేశారనే ఆరోపణలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాకా ఈవీఎంలపై ఆరోపణలు పెరిగిపోయాయి. అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. అక్కడ వెలుగుచూసిన ఘటన సంచలనంగా మారింది. పోలింగ్ అయిపోయాక ఈవీఎంలను బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్లడం కలకలం రేపుతోంది. పోలింగ్ అయిపోయాక ఈవీఎంలను అధికారిక వాహనంలో తీసుకెళ్లాలి. కానీ అసోంలో ఓ బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్లారు. ఈ ఘటన అసోంలోని కరీంగంజ్ లోని రాతాబరీ నియోజకవర్గంలో జరిగింది. ఈవీఎంలను బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్తుండడాన్ని గుర్తించిన ప్రతిపక్ష నేతలు.. వెంటనే కారును ఆపి వాటిని స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ భార్య పేరిట ఉన్న ఆ కారును అడ్డుకున్న ప్రతిపక్ష సభ్యులు.. ఆందోళనలకు దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఎన్నికల్లో అధికార బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈవీఎం తరలింపుపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ రీపోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశించింది.  కరీంగంజ్ ఘటనపై  నిజనిర్ధారణ నివేదికను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఈవీఎంలను స్ట్రాంగ్ రూంకు తీసుకెళ్లే క్రమంలో.. గురువారం రాత్రి 9 గంటల సమయంలో నీలం బజార్ కు దగ్గర్లోనే వాహనం బ్రేక్ డౌన్ అయిందని పేర్కొంది. అప్పటికే వాతావరణం బాగాలేకపోవడం, ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండడంతో అటుగా వచ్చిన వాహనాన్ని లిఫ్ట్ అడిగి తీసుకున్నామని చెప్పింది. ఆ వాహనంలోని ఎన్నికల సిబ్బంది వెంటనే సెక్టార్ ఆఫీసర్ అజయ్ సూత్రధార్ కు ఫోన్ చేశారని, ఆయన వాహనం ఏర్పాటు చేసే లోపే అటుగా వస్తున్న వాహనాన్ని అధికారులు లిఫ్ట్ అడిగారని చెప్పింది. ఆ వాహనం ఎవరిదో తెలియకుండానే అధికారులు ఆపారని, స్ట్రాంగ్ రూం వద్ద ప్రతిపక్ష కార్యకర్తలు ముట్టడించి దాడి చేసినప్పుడే ఆ కారు బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ భార్య మధుమిత పాల్ దిగా తెలిసిందని వెల్లడించింది. రాత్రి 10 గంటలకు కనైశిల్ కు చేరుకున్న తర్వాత.. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో వాహనం ట్రాఫిక్ లో ఆగిందని, అప్పుడే 50 మంది దాకా గుంపుగా వచ్చి కారుపై రాళ్లతో దాడి చేశారని చెప్పింది. ఆ వాహనం బీజేపీ నేతదని ఆ గుంపుకు నాయకుడు చెప్పాడని తెలిపింది. అప్పుడే అది బీజేపీ అభ్యర్థి కారని తెలిసిందని చెప్పింది. వారు హింసకు పాల్పడి దాడి చేయడంతో కరీంగంజ్ ఎస్పీకి గాయాలయ్యాయని తెలిపింది. పోలింగ్ ప్రొటోకాల్ ను ఉల్లంఘించినందుకు పోలింగ్ అధికారి సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశామని ఎన్నికల సంఘం తెలిపింది. 

హైదరాబాద్ ముస్లిం నేతకు బీజేపీ డబ్బులు! 

భారతీయ జనతా పార్టీ ప్రధాన నినాదమే హిందుత్వ. హిందుత్వ కార్డుతోనే ఎన్నికల్లో ప్రచారం చేస్తుంది.. ఓట్లు అడుగుతుంది. ముస్లిం పార్టీలపై బహిరంగంగానే ఆరోపణలు, విమర్శలు చేస్తారు కమలం నేతలు. అలాంటిది ముస్లిం పార్టీ నేతకు బీజేపీ భారీగా డబ్బులు ఇచ్చిందని ఆరోపణలు చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి మమతా బెనర్జీ  సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నుంచి డ‌బ్బులు తీసుకుని.. ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి డబ్బులు తీసుకుని బెంగాల్ వచ్చాడని.. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని అన్నారు. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు అతను ఈ విధంగా చేస్తున్నాడని ఆరోపించారు. ముస్లిం ఓట్ బ్యాంక్ టీఎంసీకి దక్కకుండా ఓట్లను చీల్చేందుకు కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ వ్యక్తిని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. మమతా బెనర్జీ ఎక్కడ అసదుద్దీన్ పేరును ప్రస్తావించకపోయినా.. ఆమె ఆయనను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. కూచ్ బేహార్‌ టీఎంసీ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసగించిన మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. నందిగ్రామ్‌లో తాను తప్పకుండా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. ‘నేను గెలుస్తానని నాకు తెలుసు.. కానీ నాతో పాటు కనీషం 200 మంది అభ్యర్థులు గెలవాలి.. అలా అయితేనే మన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అందుకే మీరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలి. నేను నందిగామ్ నుంచి గెలిచి తీరుతాను.. అందులో ఆందోళన పడాల్సిన అవసరం లేదు’అని అన్నారు. 

వివేకాది రాజకీయ హత్యే.. 

తన తండ్రి హత్య జరిగి రెండు ఏళ్ళు అయింది. అయినా నిందితులు ఎవరో తెలియదు. న్యాయం కోసం వెళితే మీ ఏరియాలో ఇలాంటి హత్యలు జరగడం మాములే కదా అన్నారు. మాజీ మంత్రి కి న్యాయం జరగకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య గురించి వదిలేయమని తనకు చాలా మంది సలహా ఇచ్చారని.. నా మనసు మాత్రం న్యాయం కోసం పోరాడమని చెబుతోందన్నారు. తన తండ్రి ఏపీ దివంగత సీఎంకు సోదరుడని.. ప్రస్తుత సీఎం జగన్‌కు స్వయానా బాబాయ్‌ అని ఆమె చెప్పారు. తన తండ్రి హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఇంకెంతకాలం వేచిచూడాలని నిలదీశారు. ఈ అన్యాయంపై పోరాటంలో తనకు అందరి సహకారం కావాలని కోరారు. ఈ కేసు విషయంలో కొందరు అధికారులను కలిశా. కడప ప్రాంతంలో హత్యలు సాధారణం అన్నట్లు వారు మాట్లాడారు. హత్యలు జరగడం సాధారణమెలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు. హత్య కేసులో సాక్షులకు హాని జరుగుతుందేమోనని భయమేస్తోంది. నాన్న హత్య గురించి మాట్లాడేందుకు..వాస్తవం చెప్పేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. నాన్న అందరితో ప్రేమగా మెలిగేవారు.. ఆయనకు శత్రువులెవరూ లేరు. ఆర్థిక పరమైన కారణాలతో హత్య జరిగి ఉంటుందని నేను అనుకోవడం లేదు. నాకు తెలిసినంత వరకు ఇది రాజకీయ హత్యే’’ అని సునీతారెడ్డి అన్నారు. 

జగన్ దెబ్బకు వ్యాపారులు పరార్..  

వైసీపీ నేతల తీరుతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలంటే కంపెనీలు భయపడుతున్నాయని . ఉన్న కంపెనీలు పరార్ అయి వెళ్లిపోతున్నాయని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రజలు వైసీపీ పార్టీకి  22 మంది ఎంపీలను గెలిపిస్తే.. ఏపీకి ఏం ఒరగబెట్టారని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో నిత్యం తప్పులు చేసిన ప్రభుత్వంగా పేరు పొంది. అనునిత్యం కోర్టులతో మొట్టికాయలు ఏ ప్రభుత్వం వేయించుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని అడిగే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. ఇకనైనా ప్రజలు వైసీపీకి ఓట్లు వేసి ఓట్లను దుర్వినియోగం చేసుకోవద్దని సుజనా చౌదరి అన్నారు.  ఇది ఇలా ఉండగా ఏపీకి హోదా పేరుతో కొన్నిపార్టీలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉపఎన్నికలో బీజేపీని గెలిపిస్తే తిరుపతి అభివృద్ధి చెందుతుందని అన్నారు. విభజన చట్టంలో ఉన్నవాటితో పాటు లేనివి కూడా ఏపీకి కేంద్రం ఇచ్చిందన్నారు. ప్రత్యేక హోదాను వైసీపీ, టీడీపీలు రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. పుదుచ్చేరికి హోదా ఇచ్చారంటూ బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 

మళ్ళీ జనం లోకి అన్నలు..  

తెలంగాణలో అన్నల యాక్షన్ టీమ్.. గోదావరి నది దాటిన మావోయిస్టులు.అన్నల అలజడి మళ్ళీ  మొదలుకానుందా. ? అడవిలో మళ్ళీ అన్నల తూటాల చప్పుడు చేయనున్నాయా..?  నీరు గారిన అన్నల ఉద్యమం  చాపకింద నీరులా విస్తరిస్తుందా..? ఇన్నీ రోజులు సైలెంట్ గా ఉన్న అన్నలు మళ్ళీ తెలంగాణాలో ఎందుకు అడుగుపెట్టారు.? అసలు వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటి.. ? ఇంతకీ అన్నల రాక.. రెక్కి కోసమా.. టార్గెట్ కోసమా..?  ఐదుగురు సభ్యులున్న ఈ టీం ఇటీవల గోదావరి నది దాటి భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోకి వచ్చి షెల్టర్ తీసుకున్నట్టుగా గుర్తించిన పోలీసులు అలర్ట్ అయ్యారు. అన్నల కోసం గాలింపులు నిర్వహిస్తున్నారు. ఇంతకాలం అడపాదడపా అత్తారింటికి చుట్టపు చూపుగా వచ్చిపోయిన మావోయిస్టులు ఇప్పుడు ఏకంగా యాక్షన్ టీంనే రంగంలోకి దింపడంతో  పోలీసు ఒక వైపు తలనొప్పిగా, మరోవైపు ఛాలెంజ్ గా మారింది. కాగా ఛత్తీస్ ఘడ్ లోని దండకారణ్య ప్రాంతానికి చెందిన వారే ఈ టీంలో సభ్యులుగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు రాష్ట్రంలోకి ఎందుకు వచ్చారు, వారి టార్గెట్ ఏంటీ..? అన్న రహస్యాలు తెలుసుకునే పనిలో పోలీస్ నిఘా వర్గాలు నిమగ్నం అయ్యాయి. ఈ కారణంగానే పోలీసులు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలను రెక్కీ నిర్వహిస్తున్నారని  తెలుస్తోంది. గ్రామ గ్రామాన కార్డన్ సెర్చ్ లు నిర్వహిస్తున్న పోలీసులు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. దీంతో సరిహద్దు పల్లెల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టార్గెట్లే లక్ష్యంగా మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం తెలంగాణ సరిహద్దుల్లోకి ప్రవేశించింది. గతంలోనే రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కొంతమందిని లక్ష్యం చేసుకుని మావోయిస్టులు దాడులు చేసేందుకు స్కెచ్ వేసినా ప్రాక్టికల్ గా సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు కూడా అదే టార్గెట్లను లక్ష్యం చేసుకుని వచ్చారా లేక కొత్తవారి కోసమా అనేది తేలాల్సి ఉంది. ఇంతకాలం ఎలాంటి ఘటనలకు తావివ్వకుండా ఉన్న పోలీసులు ఇప్పుడు కూడా అప్రమత్తం అయ్యారు. యాక్షన్ టీం కార్యకలాపాలను ఆదిలోనే అంతం  చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలలోని మహదేవపూర్, పల్మెల, మహాముత్తారం మండలాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు యాక్షన్ టీం డెన్ ల కోసం వేట మొదలెట్టారు. మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్న వారి గురించి ఆరా తీస్తూ.. అనుమాన ప్రాంతాల్లో అలెర్ట్ గా ఉన్నారు పోలీసులు.   

జీరోగా మిగిలిన సూపర్ స్టార్! బీజేపీ పావుగా రజనీ కాంత్ 

రజనీకాంత్.. సినిమాల్లో సూపర్ స్టార్... ఆయనకు లక్షలాది మంది ఫాన్స్. రజనీ ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు అన్నమాట. సినిమాలో బాప్ గా వెలుగొందారు. అంతటి సూపర్ స్టార్  రాజకీయ క్రీడలో మాత్రం జీరోగా మారిపోయారు. బాషాను మించిన పొలిటికల్ బాప్ నరేంద్ర మోడీ చేతిలో పావుగా మారిపోయారు. పార్టీ పెడతానంటూ హడావుడి చేసి.. చివరి వెనక్కి తగ్గిన రజనీ కాంత్.. ప్రధాని మోడీ, అమిత్ షా టీమ్ ఆడిన గేమ్ లో  పరువు తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.  రజనీకాంత్‌కు 2021 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది కేంద్ర సర్కార్. ఆ అత్యుత్తమ అవార్డుకు ఆయన వంద శాతం అర్హుడే. నటనతో, తనదైన శ్టైలితో, ప్రత్యేక మేనరిజంతో.. ఏళ్ల పాటు భారత ప్రేక్షకులను అలరించిన అద్బుత నటుడు రజనీకాంత్. అయితే.. ఆ తమిళ తలైవాని అవార్డు వరించిన సమయం, సందర్భం, విధానం మాత్రం నిస్సందేహంగా వివాదాస్పదమే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కమలనాథులు విసిరిన రాజకీయ పాచిక.. ఫాల్కే అవార్డు. 2016లోనే రజనీకాంత్ కు దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. పద్మ విభూషణ్ వచ్చినా... తమిళనాడు ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజుల ముందర.. ఉన్నట్టుండి ఉరుము ఉరిమినట్టు.. రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించడం వెనక ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.  రజనీకాంత్ కోసం అనేక నియమ, నిబంధనలను సైతం కేంద్రం పక్కన పెట్టేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఫాల్కే అవార్డుకు ఎంపిక కోసం ముగ్గురు సభ్యుల కమిటీ భేటీ అవుతుంది. దేశవ్యాప్తంగా సినిమారంగ ప్రముఖుల పేర్లను పరిశీలిస్తుంది. అందులో అత్యుత్తమ వారిని అవార్డుకు ఎంపిక చేస్తారు. అయితే, రజనీకాంత్ విషయంలో ఇలా జరగలేదు. ఫాల్కే అవార్డు ఎంపికకు ముగ్గురు సభ్యులతో కమిటీయే ఏర్పడ లేదు. ఎలాంటి సమావేశమూ నిర్వహించలేదు. ఫాల్కే అవార్డుకు ఇంకెవరి పేర్లూ పరిగణలోకి తీసుకోలేదు. అమిత్ షా, జేపీ నడ్డా, ప్రకాశ్ జవదేకర్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీనే రజనీకి ఫాల్కే అవార్డు కట్టబెట్టింది. రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం వెనక బీజేపీకి పెద్ద కథే ఉందని తెలుస్తోంది. జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాల్లో స్పేస్ ఏర్పడింది. దాన్ని అందిపుచ్చుకుని తమిళనాట పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ ఎత్తులో భాగంగానే అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లిందనే విమర్శలు ఉన్నాయి. చిన్నమ్మ జైలుకు వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి పళని స్వామి.. బీజేపీ చేతిలో కీలు బొమ్మగా మారారని అంటారు. కేంద్రం డైరెక్షన్ లోకి  అన్నాడీఎంకే వెళ్లడంతో తమిళనాడులో బీజేపీ ఆడింది ఆటగా మారింది. అదే  జోష్ తో అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అన్నాడీఎంకేతో కలిసి అధికారంలోకి రావాలని ప్లాన్ చేసింది. అయితే ఎన్నికలకు ముందే శశికళ విడుదల ఉండటంతో బీజేపీ ప్లాన్ బీ అమలు చేసిందంటారు. ప్లాన్ బీలో భాగంగానే రజనీకాంత్ పార్టీ తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. శశికళ కొత్త పార్టీ పెడితే అన్నాడీఎంకే మనుగడ కష్టం. ఎందుకంటే అమె టార్గెట్ పళనీ స్వామినే. ఇది గ్రహించిన బీజేపీ రజనీతో గేమ్ ఆడించిందని చెబుతున్నారు. శశికళ పార్టీ పెడితే.. దానికి కౌంటర్ గా రజనీకాంత్ పార్టీ ఉండేలా స్కెచ్ వేశారు. అందులో భాగంగానే మూడేండ్ల కింద రాజకీయ పార్టీ పెడతానంటూ ప్రకటన చేశారు రజనీకాంత్. అయితే మూడేళ్లు నాన్చుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి ముందు గత జనవరిలో ఆరోగ్య కారణాలతో పార్టీ పెట్టడం లేదని ప్రకటించారు. దీనిపైనా అనుమానాలు వచ్చాయి. రజనీకాంత్ కు చాలా ఏండ్ల నుంచి ఆరోగ్య సమస్యలున్నాయి. అయినా ఆయన పార్టీ ప్రకటన చేశారు. పార్టీ ఏర్పాటు లేదని చెప్పడానికి రజనీకాంత్ ఆరోగ్య కారణాలు చూపడం అందరని ఆశ్చర్యపరిచింది. అయితే రజనీకాంత్ రాజకీయ పార్టీపై వెనక్కి తగ్గటానికి ప్రధాన కారణం.. బీజేపీతో శశికళకు డీల్ కుదరడమేనని సమాచారం. శశికళకు తమిళనాడులో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువ చేస ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఆ ఆస్తులను బూచీగా చూపి చిన్నమ్మను బీజేపీ బెదిరించిందని చెబుతున్నారు. ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులు ఉండటం.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో శశికళ తలొగ్గక తప్పలేదంటున్నారు. బీజేపీ చెప్పినట్లు వినకపోతే ఆస్తులు దక్కకుండా పోవడంతో పాటు కేసులు ఎదుర్కొవాల్సి వస్తుందనే భయంతో.. ఎన్నికల్లో పోటీ యోచనను శశికళ విరమించుకున్నారని టాక్. శశికళ తప్పుకోవడంతో బీజేపీ కూటమికి పెద్ద గండం తప్పినట్లైంది. దీంతో శశికళ పార్టీకి పోటీగా ప్లాన్ బీ లో భాగంగా తెరపైకి తెచ్చిన రజనీకాంత్ పార్టీ అవసరం బీజేపీకి లేకుండా పోయింది. దీంతో మోడీ టీమ్ ఆదేశాలతోనే ఆరోగ్య కారణాలు చూపుతూ రజనీకాంత్... తన పార్టీని క్లోజ్ చేశారని అంటున్నారు. తమిళనాడులో తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఆడినట్లుగా గత ఐదేండ్లుగా రజనీకాంత్ నడుస్తున్నారని అంటున్నారు. అందుకే 2016లో రెండో అత్యున్నత పురస్కారం ఇచ్చిన కేంద్ర సర్కార్.. తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించిందనే విమర్శలు వస్తున్నాయి. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కు అవార్డులు రావడం స్వాగతించాల్సిన విషయమే అయినా.. అందులో రాజకీయ కోణం ఉండటంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. సినిమాల్లో రారాజుగా వెలిగిన రజనీ కాంత్... బీజేపీ రాజకీయ ఎత్తుల్లో బలి పశువు అయ్యారని, జనాల దృష్టిలో జోకర్ గా మిగిలిపోయారని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతైనా సూపర్ స్టార్ రజనీ కాంత్ .. రాజకీయాల్లో జీరో గా మారిపోవడానికి బీజేపీ కుటీల రాజకీయాలే కారణమని తమిళనాట జోరుగా చర్చ జరుగుతోంది.   

ఉమ్మితే ఇకపై ఫైన్..

కొంత మంది శుభ్రతతో సంబంధం ఉండదు. చుట్టూ జనాలు ఉన్న పట్టించుకోరు. నోట్లో  పాన్ నములుతూ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తుంటారు.. ఇకపై అలా ఉమ్మేస్తే ఫైన్. ఈ నిర్లక్ష్య ధోరణికి తప్పదు భారీ మూల్యం ఆనుతున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.  కరోనా విజృంభిస్తున్న తరుణంతో  పబ్లిక్ ప్లేసుల్లో.. కార్యాలయ ప్రాంగణాల్లో ఉమ్మితే చట్ట ప్రకారం మందలింపు ఉంటుందని జీహెచ్‌ఎంసీ అధికారులు అంటున్నారు. ముఖ్యంగా కార్యాలయ  సిబ్బందికి జరిమానా విధించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ ఆదేశాలిచ్చారు. కొవిడ్‌ బారిన పడుతున్న అధికారులు, సిబ్బంది సంఖ్య పెరుగుతుండటంతో ఆయన గురువారం యంత్రాంగానికి మార్గదర్శకాలు జారీ చేశారు.  ఇది ఇలా ఉండగా కొవిడ్‌ నిబంధనలు తప్పకుండ పాటించాలని, జోనల్‌ కమిషన్లు, ఉపకమిషనర్లు, విభాగాధిపతులు కరోనా నిబంధనలు కఠినంగా  అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టంచేశారు. కార్యాలయం లోపల, బయట మాస్కు తప్పనిసరిగా ధరించాలి. డోర్స్  దగ్గర మాస్కు లేకుంటే ప్రవేశం లేదని సూచించే బోర్డులు తప్పనిసరని పెట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ తెలిపారు. వ్యక్తుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండాలి. కార్యాలయాల్లోకి ఎక్కువ మందిని అనుమతించవద్ధని. ఆఫీసు లోపలికి వచ్చే వారి శరీర ఉష్ణోగ్రత చెక్ చేసిన తర్వాత అనుమతి ఇవ్వాలని. శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచాలని. తరచూ పరిసరాలను, తలుపుల హ్యాండిళ్లను శుభ్రం చేయించాలని. లిఫ్టులను సాధ్యమైనంత వరకు వాడకుండా, మెట్ల మార్గాన్ని ఎంచుకోవడం మంచిది. అత్యవసర దస్త్రాలనే నేరుగా సంతకాలకు, పరిశీలనకు తీసుకెల్లాలని. మిగిలినవన్నీ ఇ-ఆఫీసు ద్వారానే నడవాలి. శీతల యంత్రాలు, కూలర్ల వినియోగాన్ని తగ్గించడం మంచిదని’ కమిషనర్‌ సూచించారు.    

ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పరిషత్ ఎన్నికలపై తమ అభిప్రాయాలను నేతలు చంద్రబాబుకు తెలిపారు. ఎన్నికలను బహిష్కరించాలని మెజారిటీ నేతలు సూచించారు. అభ్యర్థులు కూడా పోటీ నుంచి వెనక్కి వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల బహిష్కరణపై క్యాడర్‌కు, అభ్యర్థులకు వివరించాలని నేతలు అభిప్రాయం పడ్డారు.  ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడినట్టు భావిస్తున్న టీడీపీ అందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నప్పుడే అధికార పార్టీ రెచ్చిపోయిందని, ఇప్పుడు ఆయన లేకుండా జరిగే ఎన్నికలను మరింత దిగజార్చడం ఖాయం అని టీడీపీ అభిప్రాయపడుతోంది. నిన్నటి వరకు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నీలం సాహ్నీ తాజాగా ఎస్ఈసీగా రావడంతో టీడీపీ పరిషత్ ఎన్నికల సరళిపై ఓ అంచనాకు వచ్చింది. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై  పార్టీలతో ఎన్నిక‌ల సంఘం సమావేశం జరిపింది. ఈ స‌మావేశానికి వైసీపీ, కాంగ్రెస్‌, సీపీఎం పార్టీల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో స‌హ‌కారంపై ఆయా పార్టీల నేత‌లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని చ‌ర్చించారు.ఎన్నికలపై ముందుగా చర్చించ‌కుండానే ఎస్ఈసీ షెడ్యూల్ ను ప్ర‌క‌టించ‌డం స‌రికాద‌ంటూ టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ ఎస్ఈసీ సమావేశానికి దూరంగా ఉన్నాయి. ఇటువంటి నిర్ణ‌యాల వ‌ల్ల‌ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలా జ‌రుగుతాయ‌ని ప్ర‌శ్నిస్తున్నాయి.  ఎస్ఈసీ నిర్వహించిన సమావేశానికి హాజరైన కాంగ్రెస్ తమ నిరసనను తెలియజేసింది. సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ఎస్ఈసీకి చెప్పి కాంగ్రెస్ ప్రతినిధి మస్తాన్ వలీ బయటకొచ్చేశారు. తూతూ మంత్రంగా ఎస్ఈసీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో దౌర్జన్యాలు అరికట్టకుంటే ఎన్నికల ప్రక్రియ ఆషామాషీగా తయారవుతోందన్నారు. భయపెట్టే ఇటీవల ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయని తెలిపారు.అప్రజాస్వామికంగా నోటిఫికేషన్ విడుదల చేశారని వ్యాఖ్యానించారు. నాలుగు వారాల సమయం తీసుకుని పరిషత్ ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఈసీ ప్రభుత్వ ఏజెంటుగా పని చేయకూడదని సూచించారు. అప్రజాస్వామికంగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలను బహిష్కరించాలనేది టీడీపీ నిర్ణయమని...తాము మాత్రం పోటీ చేస్తామని మస్తాన్ వలీ తేల్చిచెప్పారు. అర్థాంతరంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల వెనుక ఎస్ఈసీ ఆంతర్యమేంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశాక అఖిలపక్ష సమావేశం ఎందుకని ప్రశ్నించారు. ఎస్ఈసీ ఏర్పాటు చేసిన సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని రామకృష్ణ వెల్లడించారు. 

పని తక్కువ.. మాటలెక్కువ! పార్టీలోనే పవర్ లేని సునీల్ దేవదర్ 

ఇంట గెలిచి రచ్చ గెలవాలి ఇది పెద్దల సామెత.. ఇంట్లో గెలవలేనప్పుడు బయట ఎంత ఫోజులు కొట్టినా ఫలితం ఉండదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కో ఇంచార్జ్ సునీల్ దేవదర్ పరిస్థితి అచ్చం ఇలానే ఉంది. సొంత రాష్ట్రంలో కనీసం ఒక అసెంబ్లీ టికెట్ ఇప్పించుకోలేని సునీల్.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెగ హడావుడి చేసేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థినే ప్రకటించేస్తున్నారు. సునీల్ దేవదర్ మాటలతో ఏపీ బీజేపీ నేతలే షాకవుతున్నారు. మహారాష్ట్రకు చెందిన సునీల్ దేవదర్ బీజేపీ జాతీయ సెక్రటరీగా ఉన్నారు. త్రిపుర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ సహా ఇంచార్జ్ గా చాలాకాలంగా కొనసాగుతున్నారు. సునీల్ వచ్చాకా ఏపీ బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అందుకే అతన్ని ఏపీ కమలం నేతలెవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. బీజేపీ పెద్దలకు ఆయనపై నమ్మకం లేదు. అందుకే కొన్ని ఏండ్లుగా సహా ఇంచార్జ్ గానే కొనసాగిస్తున్నారు. నిజానికి ఏపీ బీజేపీకి చాల కాలం ఇంచార్జ్ లేరు. ఆ సమయంలో కూడా సునీల్ కు ఇంచార్జ్ గా ప్రమోషన్ ఇవ్వలేదు బీజేపీ హైకమాండ్. ప్రస్తుత ఇంచార్జ్ గా ఉన్న మురళీదర్ రావు కూడా ఏపీలో ఎక్కువగా తిరగరు. కాని కో ఇంచార్జ్ దేవదర్ మాత్రం ఇక్కడే మకాం వేసి హంగామా చేస్తున్నారు.  ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తృణామూల్ కాంగ్రెస్ తో బీజేపీ హోరాహోరీగా పోరాడుతోంది. అయినా బెంగాలీ వచ్చినా సునీల్ దేవదర్ ను బెంగాల్ పిలిపించలేదు హైకమాండ్. బెంగాలీ వచ్చిన కొద్ది బీజేపీ జాతీయ నేతల్లో దేవదర్ ఒక్కరు. అయినా అతన్ని ప్రచారానికి పిలవలేదంటే... అతని పనితీరుపై పార్టీ పెద్దలకు ఎంత నమ్మకం ఉందో ఊహించవచ్చు. అలాంటి సునీల్ దేవదర్ ఏపీలో మాత్రం పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. దేశ రాజకీయాల్లోనే ఎంతో పేరున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా ఆరోపణలు, విమర్శలు చేస్తుంటారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తుంటారు.  ఇటీవల తిరుపతిలో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ పొగుడుతూ డ్యాన్స్ చేస్తూ మాట్లాడారు సునీల్ దేవదర్. ఆయన ప్రసంగం విన్న బీజేపీ నేతలే ఖంగుతిన్నారట. సునీల్ దేవదర్ పై ఆరోపణలు భారీగానే వస్తున్నాయి. ఎక్కడికెళ్లినా స్టార్ హోటళ్లలో బస చేస్తూ లోకల్ లీడర్లపై భారం మోపుతారని చెబుతున్నారు. కేంద్ర పరిధిలో ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామంటూ వసూళ్లకు పాల్పడుతారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు వంత పాడుతూ.. ఆయన చెప్పినట్లే చేస్తున్నారని అంటున్నారు. వైసీపీకి అనుకూలమనే ఆరోపణలు ఉన్న సోము వీర్రాజు డైరెక్షన్ లో జగన్ కు మద్దతుగా.. టీడీపీకి వ్యతిరేకంగా సునీల్ దేవదర్ ప్రకటనలు చేస్తున్నారనే విమర్శలు ఏపీ బీజేపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా... ప్రతిపక్ష టీడీపీ పై పడితే పార్టీకి వచ్చే ప్రయోజనం ఏంటనే చర్చ బీజేపీ నేతల్లోనే జరుగుతోంది. వైసీపీ నుంచి సునీల్ కు ప్యాకేజీ వెళుతుందని కొందరు ఆరోపిస్తున్నారు.  మొత్తంగా  సునీల్ దేవదర్ తీరుతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి నష్టమేనని కొందరు బీజేపీ నేతలు ఓపెన్ గానే చెబుతున్నారు. వసూళ్ల కోసమే ఇక్కడ హడావుడి చేస్తుంటారని అంటున్నారు. ఇలాంటి నేతలు ఉన్నంతవరకు బీజేపీ ఎదగడం కష్టమంటున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసైనా పద్దతి మార్చుకోకపోతే ఎలా  అని నిలదీస్తున్నారు. సునీల్ దేవదర్ తీరుపై హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. 

కరోనా తో హాస్పిటల్ లో చేరిన సచిన్.. 

ఇటీవల కాలంలో తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు  తెలిపిన క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ . తాజాగా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్య చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరినట్టు సచిన్ ట్విటర్ ద్వారా తెలిపాడు. నేను త్వరగా కరోనా నుండి కోలుకోవాలని మీరు చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు. అంటూ సచిన్ తన ట్విట్ లో తెలిపారు. వైద్యుల సూచనల మేరకు నేను కొద్ది సేపటి క్రితమే ఆస్పత్రిలో చేరాను. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ప్రపంచకప్ గెలుచుకుని పదేళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయులందరికీ, నా టీమ్‌మేట్స్‌కు అభినందనల`ని సచిన్ ట్వీట్ చేశాడు. తొందర్లోనే సచిన్ కోవిడ్ నుండి కోలుకుని  మన ముందుకు మళ్ళీ చిరునవ్వుతో  తిరిగిరావాలని మనము అందరం ప్రార్థిద్దాం..    

ప్రాణాల‌తో పోరాడి ఓడిన నిరుద్యోగి.. కేసీఆర్ చేసిన హత్యేనన్న సంజయ్ 

ఉద్యోగ నోటిఫికేషన్లు రావట్లేదని వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నం చేసి... నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్ధి సునీల్ చనిపోయాడు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందిన బోడ సునీల్ అనే యువకుడు మార్చి 26న కాకతీయ యూనివర్సిటీలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన తోటి విద్యార్ధులు వెంటనే ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. వారం రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సునీల్..  శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. వరంగల్ రూరల్ జిల్లా గూడూరు మండలం, తేజావత్ రామ్సింగ్ తండాకు చెందిన సునీల్ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసే వాడు.. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి ఈ విషయాన్ని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సినోడిని ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. విద్యార్ధులు ముఖ్యమంత్రిని విడిచిపెట్టొద్దని చెప్పాడు. తెలంగాణ వచ్చి ఏడేళ్లైనా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బోడ సునీల్ ఆత్మహత్యాయత్నం ఘటన తెలంగాణలో దుమారం రేపింది. సునీల్ ను విపక్ష నేతలు పరామర్శించారు. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సునీల్ ఘటనకు టీఆర్ఎస్ సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు పాల్పడి మరణించిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ కుటుంబాన్ని  కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఇది సీఎం కేసీఆర్ చేసిన హత్యని అన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. పేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే సీఎం గానీ, మంత్రులు గానీ ఎవరూ ఆ పేద కుటుంబానికి బరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం ఉద్యోగం లేకుండా బతకలేరని, రాష్ట్రంలో చదువుకున్న యువతకు మాత్రం ఉద్యోగాలు లేవని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ అంటూ మాయమాటలు చెబుతారని, ఎన్నికలు అయిన తర్వాత మరిచిపోతారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేసు పెట్టాలని సంజయ్ అన్నారు. ఆనాడు అనేకమంది బలిదానాలతో ప్రత్యేక తెలంగాణ వచ్చిందని, ఈనాడు సీఎం తన పదవిని కాపాడుకోవడం కోసం అనేకమందిని బలితీసుకుంటున్నారని విమర్శించారు. దయ చేసి విద్యార్థులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని బండి సంజయ్ సూచించారు

స్టాలిన్ టార్గెట్ గా ఐటి దాడులు.. 

ఇది ఎన్నికల సమయం. జనంలో ఎవరి బలం ఎంతో చూపించుకుని తరుణం. ఈ తరుణంలో ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి వాడే అస్త్రాలే ఐటి దాడులా.. అనేంతగా పని కట్టుకుని ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా తమిళనాడు శాసన సభ ఎన్నికల వేళ డీఎంకే అధినేత స్టాలిన్ టార్గెట్ గా అతని అల్లుడు శబరీశన్  ఐటి శాఖ గురి పెట్టింది.  అతని నివాసంలో సోదాలు నిర్వహించింది.  నీలాంగరాయ్‌లోని నివాసంలో శబరీశన్ నివసిస్తున్నారు. ఈ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తమిళ నాడు శాసన సభ ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగుతాయి. డీఎంకే నేతలపై ఐటీ దాడులు జరగడం ఇది రెండోసారి. గత నెలలో సీనియర్ డీఎంకే నేత ఈవీ వేలుకు చెందిన 10 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి. ఎన్నికల ప్రచారం కోసం నిధులను రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. వేలు నుంచి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.  ఇదిలావుండగా, డిప్యూటీ స్పీకర్ వీ జయరామన్‌పై వదంతులు ప్రచారం చేస్తున్నారని శబరీశన్‌పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. జయరామన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పొల్లాచ్చి సెక్సువల్ అబ్యూజ్, బ్లాక్‌మెయిల్ కేసులో తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా వదంతులు ప్రచారం చేస్తున్నారని శబరీశన్‌పై జయరామన్ ఫిర్యాదు చేశారు.

ఉద్యోగం ఊడగొట్టిన గుండు.. 

అతని  పేరు శ్రీకాంత్. వృత్తి ఉబర్ క్యాబ్ డ్రైవర్. దేవుడి భక్తి భుక్తి పెడుతుందంటారు.. కానీ శ్రీకాంత్  పొట్ట కోటింది. రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పలేదు అంటే ఇదే కావచ్చు మరి. దేవుడికి వెళ్లి గుండు కోటించుకున్నాడు.  ఇక అంతే తన కడుపుపై కొరడా పడింది. అది ఎలా..  అనుకుంటున్నారా మీరే చూడండి ఏం జరిగిందో..   హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్‌ శ్రీకాంత్ దాదాపు  ఏడాదిన్నరగా ఉబర్‌లో పనిచేస్తున్నాడు. అతడు ఇప్పటివరకు 1428 ట్రిప్‌లతో 4.67 స్టార్‌ రేటింగ్‌తో ఉన్నాడు. ఈ మధ్య కాలం లోనే తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకున్న అతడు.. ఫిబ్రవరి 27న తిరిగి ఉబర్ యాప్ లో లాగిన్  అయ్యేందుకు పలుమార్లు సెల్ఫీతో ప్రయత్నించగా అతనికి నిరాశే మిగిలింది. ఎంత ట్రై చేసిన లాగిన్ అవ్వకపోవడం తో ఒక్కసారిగా కంగుతిన్నాడు. తన ఖాతా కి ఏమైందో అని కంగారు పడ్డాడు. ఆ టెన్షన్ మళ్ళీ మళ్ళీ  లాగిన్ అయ్యాడు.  చివరికి  ఖాతా పూర్తిగా బ్లాక్‌ కావడంతో కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నాడు. తనకు ఎదురైన ఇబ్బందిపై ఆవేదన వ్యక్తంచేశాడు.   నా ఉబర్‌ ఖాతాలో లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తే తలపై జుట్టు లేకపోవడంతో యాప్‌ నన్ను గుర్తించలేదు. నా ఖాతా బ్లాక్‌ అయింది. మరుసటి రోజు ఉబర్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. నా కారుకు వేరే డ్రైవర్‌ను పెట్టుకోవాలని సూచించారు. కానీ, నేను అంత భరించలేను. నెల తర్వాత మళ్లీ ఉబర్‌ కార్యాలయానికి పలుమార్లు తిరిగితే.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు ఒక ఈ-మెయిల్‌ ఐడీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఇంకా ఆ వ్యవహారం నడుస్తూనే ఉంది’’ అని వాపోయాడు.   శ్రీకాంత్‌కు డ్రైవింగే జీవనాధారమని యాప్‌ ఆధారిత ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్ల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి షేక్‌ సలాయుద్దీన్‌ తెలిపారు. అతడి కారుకు ఈఎంఐ కూడా చెల్లించాల్సి ఉందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో డ్రైవర్లంతా ఖాళీగానే తిరగాల్సి వచ్చిందని, కొన్ని సందర్భాల్లో అల్గారిథమ్‌ డ్రైవర్ల ముఖాల్ని గుర్తించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గ్రీవెన్స్‌ కోసం సమర్థమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. శ్రీకాంత్‌కు ఎదురైన ఇలాంటి సమస్య మరో డ్రైవర్‌కు ఎదురవ్వకూడదని తెలిపారు.      

ఈటలకు పొగ బెడుతున్నారా?

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లో అసమ్మతి రాగం ముదురుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా కొంత కాలంగా  పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాక రేపుతున్న మంత్రి ఈటల రాజేందర్ టార్గెట్ గా కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయం నడుస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ అనుచరురాలు , కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయను గద్దె దింపడమే లక్ష్యంగా ఓ వర్గం పావులు కదుపుతోందనే వార్తలు వస్తున్నాయి. చొప్పదండి సమీపంలోని ఓ మామిడి తోటలో 11 మంది జడ్పీటీసీ సభ్యులు సమావేశం కావడం గులాబీ పార్టీలో వేడి పుట్టిస్తోంది.  జిల్లాలోని 15 జడ్పీటీసీ స్థానాల్లో ఒక చైర్ పర్సన్ , ఒక వైస్ చైర్మన్‌ పోగా .. మిగిలిన 13 మందిలో 11 మంది ప్రత్యేకంగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఈటల మద్దతుదారైన  జడ్పీ చైర్ పర్సన్‌పై సొంత పార్టీ సభ్యులే అవిశ్వాస తీర్మానానికి రెడీ కావడం వెనుక ఒక కీలక నేత హస్తం ఉందని తెలుస్తోంది. కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్‌గా కనుమల్ల విజయ రెండేళ్ల కింద బాధ్యతలు చేపట్టారు. ఈమెది ఈటల రాజేందర్‌ సొంత నియోజకవర్గం హుజూరాబాద్ పరిధిలోని ఇల్లందకుంట. మంత్రి అనుచరురాలు కావడంతో అప్పట్లో ఆయన పట్టుబట్టి మరీ ఆమెను జడ్పీ చైర్ పర్సన్ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే మొదటి నుంచి జడ్పీటీసీ సభ్యులతో జడ్పీ చైర్ పర్సన్‌ కు పడటం లేదు. ఎస్ఎఫ్‌సీ, డీఎంఎఫ్‌టీ ఫండ్స్‌లో తమకు న్యాయమైన వాటా రావట్లేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెను తప్పిస్తే కొత్త చైర్ పర్సన్ అయ్యే అవకాశం ఒక్క చొప్పదండి జడ్పీటీసీ సభ్యురాలికే ఉంది. చొప్పదండిలో మీటింగ్ జరగడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. చైర్‌పర్సన్ ఎన్నికై త్వరలో రెండేళ్లు పూర్తవుతున్నందున అవిశ్వాస తీర్మానం పెట్టాలని చర్చించుకున్నారని తెలుస్తోంది. జడ్పీ చైర్‌పర్సన్‌ను పదవి నుంచి విజయను ఎలా తప్పించాలనే అంశంపై వీరంతా చర్చించారని అంటున్నారు.  జడ్పీ చైర్ పర్సన్‌పై అవిశ్వాసానికి 11 మంది జడ్పీటీసీలు ప్లాన్ వేస్తున్నారనే విషయం తెలియడంతో మంత్రి ఈటల రాజేందర్ అప్రమత్తమయ్యారు. జడ్పీటీసీలందరినీ  హుజూరాబాద్ పిలిపించుకుని మాట్లాడారు . చైర్ పర్సన్‌ను కూర్చోబెట్టి ఆయా సమస్యలపై చర్చించారు . సొంత పార్టీలో ఉంటూ ఇలాంటి పనులు చేయొద్దని ఏ సమస్య ఉన్నా తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి పంపించారు . ఇది జరిగిన తర్వాత మూడు రోజుల కింద కూడా ఉద్యోగుల ప్రమోషన్లు, ట్రాన్సఫర్లలో తమ మాట చెల్లడం లేదని , మరోసారి ఐదుగురు జడ్పీటీసీలు మంత్రి ఈటలను కలిశారు . దీంతో ఆయన జడ్పీ చైర్ పర్సనను హైదరాబాద్ పిలిపించి మందలించినట్లు సమాచారం.  

కట్టేసి పేడ తినిపించి.. చిన్నారులపై కిరాతకం..  

మాయ మైపోతున్నాడమ్మా .. మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూస్తూ మానవత్వం ఉన్న వాడు అనే పాట ఆ కవి కలం నుండి వూరికే రాలేదు..అలాంటి ఘటనలు ఎన్నో చూసి రాసి ఉంటాడు. ఆ కవి చెప్పినట్లు నిజగానే మనుషుల్లో మానవత్వం కవువై.. క్రూరత్వం పెరుగుతుంది. నిజా నిజాలు తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. చిన్న పిల్లల పై కూడా కొందరు మూర్ఖులు తన ప్రతాపం చూపుతున్నారు.  తాజాగా తమ కుక్క ను వెతుకుంటూ మామిడి తోటలోకి వెళ్లారు ఇద్దరు మైనర్ బాలురు. ఆ తోటలోకి వెళ్లడమే ఆ మైనర్ల పాలిట నేరమైంది.. తోటలో ఉన్న కాపలాదారులు మానవత్వం మరిచి వారి పట్ల  అనాగకరికంగా ప్రవర్తించారు.. కాళ్లు చేతులు కట్టేసి చితకబాదారు. అంతటితో ఆగక బలవంతంగా పేడ తినిపించారు ఆ నీచులు.  మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన బేడ బుడగజంగాల బాలురు ఇద్దరు తప్పిపోయిన తమ కుక్క కోసం గాలిస్తూ కంఠాయపాలెంలోని వీరభద్రరావు మామిడి తోటలోకి వెళ్లారు. వారు మామిడి కాయలు దొంగిలించడానికి వచ్చారంటూ కాపలాదారులు వారి కాళ్లుచేతులు కట్టేసి బంధించారు. ఆ తర్వాత బలవంతంగా పేడ తినిపిస్తూ పైశాచికంగా ప్రవర్తించారు. బాలురపై దాడికి పాల్పడిన  బానోత్‌ యాకు, బానోతు రాములుపై కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.