సన్యాసిగా మారిన మాజీ ఎమ్మెల్యే..
posted on Apr 3, 2021 @ 2:48PM
అతని పేరు డాక్టర్ వడ్డమాను శివరామకృష్ణారావు. రెండు సార్లు ఎమ్మెల్యే గా సేవలు అందించాడు. చివరికి ఏమనుకున్నాడో గానీ సన్యాసం తీసుకున్నాడు. బద్వేలు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వడ్డమాను శివరామకృష్ణారావు సన్యాసం స్వీకరించారు. చివరికి స్వామి దగ్గర శిష్యరికం తీసుకుని శివరామానంద సరస్వతిగా పేరు పొందాడు..
కడప జిల్లా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శివరామకృష్ణారావు బద్వేలు నియోజకవర్గం నుంచి 1978లో ఒకసారి, 1989లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం రాజకీయాలనుంచి వైదొలగి రాజమండ్రిలో సన్యాసం తీసుకున్నారు. స్వామి సత్వవిదానంద సరస్వతి అనే గురువు వద్ద శిష్యరికం పొందిన ఆయన ద్వారా శివరామానంద సరస్వతిగా తన పేరు మార్చుకున్నారు. భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, జ్ఞానం ప్రసాదించమని ఆయనను వేడుకున్నానని అన్నారు. ఈ నిర్ణయంలో ఎలాంటి విభేదాలు లేవని రాజకీయ నాయకునిగా ఉన్న హయాంలో బద్వేలు నియోజవకర్గ అభివృద్ధికి కృషిచేశామన్నారు. తన అభ్యుదయం కోసమే దీక్ష తీసుకున్నానన్నారు. ఇది ఏ రకమైన రాజకీయం కాదన్నారు. మానవుడు మాధవునిగా ఎదగాలనే తలంపుతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. పోరుమామిళ్లలోని లక్ష్మినరసింహస్వామి దేవాలయం, కలమకూరులోని శివాలయం, రామాలయం నిర్మించామని కృష్ణుని ఆలయం నిర్మాణ దశలో ఉందని తెలిపారు. భగవంతుని సేవలోనే జీవితం కొనసాగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.