మద్యం మత్తులో ఇంటికి నిప్పు..
posted on Apr 3, 2021 @ 1:03PM
మద్యం మత్తులో ఇంటికి నిప్పు..
మత్తు వదలరా నిద్దర మత్తూ.. ఛీ ఛీ.. మద్యం మత్తు వదలరా.. మత్తులోనే పడితే నీ సీన్ సిరిగిపోద్ది.. అందుకే మత్తు వదలరా మద్యం మత్తువదలరా.. పొట్ట నిండా తాగి, ఎనిమిది మంది ఉన్న ఇంటికి నిప్పంటించాడు ఓ మందు బాబు.. మద్యం మత్తులో ఒక్కడు ఇంటికి తాళం వేసి ఇంటికి నిప్పు అంటించాడు.
ఈ రోజు ఉదయం ఇంట్లోని వారంతా నిద్రపోతోన్న సమయంలో భోజా (50) అనే తాగుబోతు ఇంటి పైకప్పు ఎక్కి, పెట్రోలు పోసి ఇంటికి నిప్పంటించాడు. దీంతో ఎనిమిది మంది మంటల్లో చిక్కుకున్నారు. మంటలు అంటుకుని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మిగతావారిని ఆసుపత్రికి తరలించగా మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ తగాదాల కారణంగానే అతడు ఆగ్రహంతో ఊగిపోతూ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్ తాలూకా ముగుటగెరె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.