సల్మాన్ పెళ్లి తర్వాతే నాదీ!
posted on Jul 12, 2022 @ 2:45PM
మీరు ఫోటోలో చూస్తున్న చిన్న కళ్ల లావుపాటి వ్యక్తి పేరు తెంజెన్ ఇమ్నా అలాంగ్. ఆయనేమీ ఫైటర్ కాదు. ఆయన నాగాలాండ్ విద్యాశాఖ మంత్రి! పాపం ఇంకా పెళ్లి కాలేదు! ఆయనకు వొళ్లంతా వెటకారమే. నాలుగు మాటలు మాట్లాడితే మూడు మాటలు ఎదుటివాడు పొట్టచెక్కలయ్యేట్టు సరదా కబురే వుంటుంది. ఇంతటి సరదా లావుపాటి వ్యక్తి కి నిజంగానే అంతే సరదా సతీమణి వుంటుందని చాలామంది భావించా రు. అంతటితో ఆగలేదు..గూగుల్లో ఆమె ఎవరని తెగ సెర్చ్ చేశారట! ఈ సంగతి తెలిసి, అలాంగ్.. అబ్బే వెతక్కండి, నాకింకా పెళ్లే కాలేదు నేనూ తగిన అమ్మాయి కోసం వెదుకుతున్నా! అని ట్వీట్ చేశారు.
చిత్రమేమంటే అలాంగ్ ట్వీట్ షాదీ డాట్ కామ్ నిర్వాహకుడు అనుపమ్ మిట్టల్ దృష్టిలో పడింది. అయ్యో.. ఈయనకు మనం తప్పకుండా ఓ అమ్మాయిని చూడాల్సిందే అనుకున్నారు. అదే హిందీలో ట్వీట్ చేశారాయన. దీనికి మామూలుగా యువకులైతే ఎగిరి గెంతేసి. మీ పుణ్యం వుంటుంది మంచి అమ్మా యిని చూడండి.. ఇవీ నా వివరాలు అంటూ తెగ ఆవేశపడేవారు. కానీ అలాంగ్ మరో విధంగా స్పందించా రు. బాలీవుడ్ నటుడు సల్మాన్ భాయ్ పెళ్లాడిన తర్వాతనే నేనూ చేసుకుంటాను.. అని ట్వీట్ చేశారు నాగాలాండ్ మంత్రిగారు. ..భాయ్ ఫిల్హాల్ బిందాస్ హై.. భాయ్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నా.. అన్నారు అలాంగ్.
ఇంకాస్త సరదాగానూ అన్నారిలా.. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా, జనాభా పెరుగుదల సమస్య ల పట్ల వివేకంతో ఉండి, సంతాన సాఫల్యతపై సమాచార ఎంపికలను పెంపొందించుకుందాం. లేదా నాలాగే ఒంటరిగా కలిసి వుందాం, కలిసి మనం స్థిరమైన భవిష్యత్తుకు తోడ్పడవచ్చు. ఈరోజే సింగిల్స్ ఉద్యమంలో చేరండి అని రాశారు.
అంతకుముందు, ఒక బహిరంగ ప్రసంగంలో చిన్న కళ్ళు కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలపై అలాంగ్ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈశాన్య ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఎదు ర్కొంటున్న సాధారణ జాత్యహంకారాన్ని పిలుస్తూ అతని వ్యాఖ్య చిరునవ్వులను పంచింది. నా కళ్లలోకి తక్కువ ధూళి చేరుతుంది. అలాగే, నేను వేదికపై ఉన్నప్పుడు, సుదీర్ఘ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను సులభంగా నిద్రపోతాను, అని అలోంగ్ చెప్పాడు.