ముర్మూకి టిడీపి మద్దతు.. సందిగ్ధంలో బిజెపి
posted on Jul 12, 2022 @ 1:39PM
సామాజిక న్యాయం విషయంలో రాజకీయపార్టీలు కట్టుబడి వుండాలి. రాజకీయపార్టీలు తమ సిద్ధాంతా న్ని ప్రచారం చేసుకోవడంతోపాటు అభ్యర్ధి ఎన్నిక విషయంలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి తమ ప్రత్యేకతను చాటుకుంటాయి. ఇపుడు తెలుగు దేశం పార్టీ తాను సామాజిక న్యాయానికి కట్టుబడి వుందన్న ది మరోసారి రుజువు చేసుకుంది.
రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్దిగా బిజెపి కూటమి ప్రకటించిన ద్రౌపది ముర్ముకి తెలుగు దేశంతో పాటు వైసీపీ కూడా మద్దతు తెలపాల్సి వచ్చింది. కారణం ముర్మూ సామాజికంగా వెనుకబడిన గిరిజన తెగకు చెందినవారు కావడమే. ఆమెను రాష్ట్రపతిగా చూడాలన్న ఆకాంక్ష కలిగి వుండడమే తెలుగుదేశం మద్దతు నిచ్చి వుండవచ్చు. ఒక్కసారి గతంలోకి వెళితే, 2014 లో రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ ఆగ్రహించి తెలుగుదేశం ఎన్‌డిఏ నుంచి బయటకి వచ్చింది. బిజెపి వర్గాలు టిడిపిని అప్పటి నుంచి శతృవుగానే చూస్తున్నాయి. కానీ ముర్మూ అభ్యర్ధిత్వం విషయంలో చంద్రబాబు మద్దతు ప్రకటించడం బిజెపి వర్గాలను ఆశ్చర్యపరిచి వుండవచ్చు. తమతో అనేకాంశాల్లో విభేదించిన బాబు ఇప్ప టి నిర్ణయం బిజెపి వర్గాలను ఆలోచనలో పడేసింది. బిజెపితో అంటకాగుతున్న వైసీపీ మద్దతు నిచ్చిన అభ్యర్ధిని టిడీపీ అంగీకరించడం వూహించని పరిణామమే. ఎన్డీయే లేదా విపక్ష కూటమి తమ మద్దతు కోరిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని టీడీపీ భావిస్తూ వచ్చింది. లేకుంటే తటస్థంగా ఉండాలనే ఆలోచన ఒక దశలో చేసింది.
కానీ, ఎన్నికలకు కేవలం వారం మాత్రమే సమయం ఉన్న తరుణంలో రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము అమరావతికి రానున్న నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేతో చర్చించిన చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే ప్రతి పాదించిన గిరిజిన మహిళ ముర్ముకు మద్దతు గా నిలవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ ముర్ముకు మద్దతు ప్రకటిం చింది. రాష్ట్రపతి ఎంపిక సమయంలో ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ సీఎం జగన్ కు ఫోన్ చేసి మద్దతు కోరారని పేర్ని నాని అధికారికంగా వెల్లడించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరలేదంటూ కొందరు బీజేపీ రాష్ట్ర నేతలు చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని ఈ విధంగా సమా ధానం ఇచ్చారు. అయితే కేంద్ర మంత్రి షెకావత్ సైతం వైసీపీ మద్దతు కోరామని స్పష్టత ఇచ్చారు. కానీ చంద్రబాబు మద్దతు మాత్రం బీజేపీ కోరలేదు.అయినా చంద్రబాబు ఎన్డీఏకు మద్దతు తెలిపింది. ఇది బిజెపి నాయకులను ఆశ్చర్యపరిచింది. కానీ సామాజిక న్యాయం పట్ల ఎంతో నమ్మకాన్ని టిడీపీ ఈ విధంగా ప్రకటించిందన్నది ప్రజలు గుర్తించారు.
2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏయేకు దూరం అయిన చంద్రబాబు తిరిగి ఇప్పుడు ఎన్డీయే అభ్యర్ధికి మద్ద తు ప్రకటించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గతంలోనూ ఏపీలో కీలకంగా ఉన్న టీడీపీ, వైసీపీ ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేసిన రామ్ నాధ్ కోవింద్ కు మద్దతిచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. టీడీపీ తొలి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చంద్రబాబు పార్టీ నేతల సమావేశంలో చెప్పా రు. 2014 ఎన్నికలు సమయంలో టి.డి.పి.,బి.జె.పి జనసేన కలిసి పోటిచేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి బయటకి వచ్చేసింది.