గూడు మరిచిన పావురం!
posted on Jul 12, 2022 @ 10:33AM
ఒక డెబ్బయ్యేళ్ల పెద్దాయన తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. చాలాసేపు కబుర్లాడుకున్నారు. తర్వాత ఇంటికి అని బయలు దేరాడు. కానీ దారి మర్చిపోయాడు. ఆ సంగతి గ్రహించి ఆయన స్నేహితుడి కొడుకు కార్లో ఇంటి దగ్గర దింపి మరీ వెళ్లాడు. ఇది మతిమరుపునకు పరాకాష్ట.. అంటూ మనవరాలు అందరికీ చెబుతూ తెగ నవ్వుకుంది ఓ పూటంతా. పిల్లలకు, విన్నవాళ్లకు సరదాగా, నవ్వులాటగానే వుంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు తాలూకు బాధ అనుభవిస్తేగాని వివరించ డం చాలా కష్టం. మనిషంటే మరచిపోయాడు, పావురం మరచిపోవడమేమిటి?
పక్షులు చాలా దూరమూ వెళుతూంటాయి, మళ్లీ అదే దారిలో తిరిగి వస్తూంటాయి. అది వాటి సహజ లక్షణం. కానీ బ్రిటన్‌కి చెందిన ఒక పావురం ఒకటీ రెండు కాదు ఏకంగా నాలుగు వేల మైళ్లు దూరం వెళ్లి ఇంటికి దారి మర్చిపోయింది!
ఒక బ్రిటన్ పావురం యుఎస్‌లో 4,000 మైళ్ల దూరంలో ఎగురుతూ చాలా దూరం వెళ్లింది. చాలాసేపటికి అది బ్రిటన్‌లోని టైన్‌సైడ్ ప్రాంతానికి వస్తూ ఇంటి దారి కోల్పోయింది. దాన్ని ఆ తర్వాత పక్షుల సంరక్షణ నిపుణులు గుర్తించి పట్టుకున్నారు. ఈ రేసింగ్ పక్షి విలువ 1,000 పౌండ్ల కంటే ఎక్కువ అని అధికారులు చెప్పారు.
మూడు వారాల క్రితం, ఛానల్ దీవులలోని గ్వెర్న్సీ నుండి హోమింగ్ పావురం బయలుదేరింది. అది ఇంగ్లాండ్ ఈశాన్య ప్రాంతం లోని తన ఇంటికి తిరిగి పోటీ చేయవలసి ఉంది ప్రయాణం అతనికి 10 గంటలు పట్టింది. అయితే, బహుమతి పొందిన పావురం తప్పిపోయింది దానికి ఏమి జరిగిందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. బాబ్ అనే పేరున్న ఈ రేసింగ్ పావురం వారం రోజుల క్రితం ఛానెల్ ద్వీపం నుంచి వెళ్లింది. గట్టిగా పది గంటలు పట్టింది ఆ ప్రయాణం. అయితే ఆ పావురం కనిపించకపోవడంతో చాలామంది అది ఎక్కువగా కనిపించే ప్రాంతాలన్నీ వెతికారట. అది వాస్తవానికి ఇంగ్లండ్ ఈశాన్యప్రాంతానికి తిరిగి రావాలి. అది తన గూడు వున్న ప్రాంతం. అది వెళ్లిన సంగతీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అది కనపడటం లేదన్న వార్త గుప్పుమంది. అంతే రోజూ దాన్ని చూస్తూ ఆడుకునే పిల్లలంతా దిగులుపడ్డారు.
ఈ మిస్టరీని జూలై ఆరో తేదీన పరిష్కరించారు. ఆ రోజు అలబామాలోని మాన్రో అనే వూళ్లో ఓ పెద్దాయన తోటలో కనపడిందట. ఆ తోట దానికి ఎంతో నచ్చినట్టుంది. అక్కడే వుండడానికి ఇష్టపడింది. బాబ్ అని పిలిచే ఈ పావురం కాళ్లకి ఏదో బ్యాండ్ కట్టి వుంది. దానితో ఇది సముద్రానికి అవతల వేపు యునైటెడ్ కింగ్‌డమ్‌కి చెందినది అని పక్షుల సంరక్షణ విభాగం వారు కనుగొన్నారు. అంత దూరం నుంచి వచ్చినా బాబ్ ఆరోగ్యంగానే వుందని అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ పావురం యుకెలోని విన్ టా లోన్ నివాసి అలాన్ టాడ్‌కి చెందినదని తేలింది. బాబ్ కొంత దూరం ప్రయాణించిన తర్వాత పొరపాటున అట్లాంటా వెళ్లే ఓడ మీద వాలి అలా సముద్రానికి అవతలి తీరం వేపు వెళ్లిందట!