విదేశీచదువు ఆశావహులకు జగన్ అడ్డంకి
posted on Jul 12, 2022 @ 12:52PM
చక్కగా చదువుకునేవారికి ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించడం, విదేశీ చదువులకు వెళ్లేవారికి ఆర్ధిక మద్దతుతో ధైర్యాన్నివ్వడం ఏ ప్రభుత్వమైనా చేస్తుంది, చేయాలి. కానీ జగన్ సర్కారు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. విదేశీ విద్యా దీవెన అని గొప్ప పేరు పెట్టడంతోనే సరిపెట్టుకుంది. బిసీ, ఎస్సీ, ఎస్టీ విద్యా ర్ధులకు ఎంతో మేలు జరుగుతుందని సమాచారశాఖ ద్వారా భారీ ప్రచారమే చేయించుకుంది. అందర్నీ ఆకట్టుకుంది. కానీ నిబంధనలను పరిశీలిస్తే అసలు రంగు బయటపడింది. గతంలో చంద్ర బాబు హయాంలో వున్న విదేశీ విద్యాపథకాన్ని జగన్ సర్కారు పూర్తిగా అటకెక్కించింది. ఈ పథకం ద్వారా ఎవ రికీ ప్రయోజనాలంద కుండా నిబంధనలు కఠినతరం చేసింది. 200 క్యూఎస్ ర్యాంకింగ్స్ యూనివర్సిటీ ల్లో సీట్లు పొందిన వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని ఉత్తర్వుల్లో మెలిక పెట్టింది.
ఒకప్పుడు పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కలగా ఉన్న విదేశీ విద్యను చంద్రబాబు ప్రభుత్వం సాకా రం చేసింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, స్వీడన్, నెదర్లాం డ్స్, ఫ్రాన్స్, డెన్మార్క్, రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, చైనా దేశాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పిం చారు. ప్రారంభంలో రూ.10 లక్షలు ఉన్న సాయాన్ని ఆ తర్వాత రూ.15 లక్షలకు పెంచారు. ఏడాదిలో రెండుసార్లు విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చి, 2016-17 విద్యా సంవత్సరం నుంచి విద్యా ర్థులకు స్కాలర్‌షిప్‌లు అందించారు. ఎన్టీఆర్ విదేశీ విద్యా దరణ పథకం కింద 2016-17 నుంచి మూడేళ్ల పాటు 1707 మంది బీసీ విద్యార్థులకు రూ.104 కోట్ల సాయం చేశారు. 2017-18 నుంచి ఈబీసీ విద్యార్థులకు పథకం వర్తింపజేసి, 783 మందికి రూ.16 కోట్లు చెల్లించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు శాచురేషన్ విధానంలో అమలు చేశారు. మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలకు, కాపు కార్పొరేషన్ ద్వారా కాపు విద్యార్థులకు, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందించారు
కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రచారం కోసమే తప్ప, ఈ పథకం పేద వర్గాలకు ప్రయోజనం కల్పించేందుకు కాదనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా మెరిట్ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికి మాత్రమే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పిస్తుంది. వంద క్యూఎస్ ర్యాంకింగ్స్ లోపు వర్సిటీల్లో సీట్లు పొందితే 100 శాతం ఫీజు చెల్లిస్తుం ది. వంద నుంచి 200 ర్యాంకింగ్స్ యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తుంది. నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ చేస్తుంది. ప్రతిఏటా సెప్టెంబరు-డిసెంబరు, జనవరి-మే మధ్య అర్హులను గుర్తిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.
తాజాగా జగన్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 200 క్యూఎస్ ర్యాంకింగ్స్ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్యా దీవెన పథకం వర్తిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 200 క్యూఎస్ ర్యాంకింగ్స్ వర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకే అంటూ మెలిక పెట్టింది. నిబంధనలను కఠినతరం చేయడం వల్ల ప్రభుత్వం అందించే సాయం బడుగులకు అందదని చెబుతున్నారు. ఆ స్థాయి వర్సిటీల్లో సీట్లు పొందే విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారని అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో చదువుకునే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం వర్తించే పరిస్థితి లేదని విమర్శిస్తున్నా రు. 200 క్యూఎస్ ర్యాంకింగ్స్ వర్సిటీల్లో సీట్లు సంపా దించుకునే విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్ షిప్‌లు అందించాల్సిన అవసరం లేదని, పలు కార్పొరేట్ సంస్థలు, యూనివర్సిటీలే స్కాలర్‌షిప్‌లు అందిస్తా యని అభిప్రాయపడుతున్నారు.