పిల్లాడిలా ఉన్నాడని ఉద్యోగ నిరాకరణ!
posted on Aug 3, 2022 @ 12:20PM
అర్హతను అనుసరించి ఉద్యోగం.. సహజంగా జరుగుతుంది. కేవలం సాంకేతిక విజ్ఞనం వున్నవారికీ చదువుతో సంబంధం లేకుండానే ఉద్యోగం లభిస్తుంటుంది. అన్ని అర్హతలూ ఉండి ఇంటర్వ్యూల్లో విఫల మయ్యే వారూ ఉంటారు. కొందరికి సంస్థల పెద్దలతో పరిచయాలతో ఉద్యోగాలు వస్తూంటాయి. చిత్ర మేమంటే మావో షెంగ్ అనే 27 ఏళ్ల వ్యక్తికి మాత్రం ఉద్యోగం ఇవ్వనంటున్నారు. కారణం అతను మరీ 12 ఏళ్ల పిల్లాడి లా కనిపించడమేనట! పైగా కార్మిక చట్టాలు అంగీకరించవన్నారట!
కొందరు వయసును మించి కనపడతారు, మరికొందరి వయసు అంతగా తెలీదు. కానీ మావోది మాత్రం నిజంగా దురదృష్టమే. ఎందుకంటే అతనికి ఉద్యోగం చాలా అవసరం. అతను చాలా ఉద్యోగ ప్రయత్నా లు చేశాడు. ఏకంగా తన అవసరాన్ని తెలియజేస్తూ ఒక టిక్ టాక్ కూడా తయారు చేసి తెలిసిన వారి ద్వారా అనేక కంపెనీలకు పంపించాడు. కానీ అందరూ ఆ టిక్ టాక్‌ను ఎవరో పిల్లాడు సరదాగా చేసి పం పించాడని రిలాక్స్ కోసం చూస్తూ నవ్వుకున్నారట! పాపం మావో మాత్రం తన అభ్యర్ధనను ఇలా అర్ధం చేసుకున్నారని తెగ బాధపడ్డాడు.
అమెరికాలో 15 ఏళ్ల వాడికీ ఏదో ఒక ఉద్యోగం లభిస్తున్నపుడు చైనాలో అలాంటి అవకాశం లేకపోవడం దారుణమని పసివాడు కాని ఈ కుర్రాడు కాస్తంత మండిపడ్డాడు. అయితే ఎలాగో ఒక కంపెనీవారు నిజంగానే వీడు పిల్లాడు కాదు కుర్రాడే అని నమ్మి ఉద్యోగం ఇచ్చిందిట. ఇక మావో పెళ్లి చేసుకుని తండ్రిని మరింత బాగా చూసుకుంటాడని పక్కింటివారంతా అనుకుంటున్నారు.