ప్రపంచ బ్యాడ్మింటన్... భారత్ జోడీకి కాంస్యం
posted on Aug 28, 2022 @ 11:35AM
కాంస్య పతకం సాధించడం ద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్‌ను భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి చిరస్మ రణీయం చేసుకున్నారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీ్‌సలో భారత జంట హోరాహోరీగా పోరాడింది. కానీ ఆరో సీడ్ ఆరోన్ చియా/సోయి ఇక్ ఇన్ (మలేసియా) 20-22, 21-18, 21-16 స్కోరుతో సాత్విక్/షెట్టి జోడీపై గెలుపొందింది. 77 నిమిషాల మ్యాచ్ లో భారత జంట తొలి గేమ్‌ను సొంతం చేసుకొని ఆధిక్యం ప్రదర్శించినా..అదే జోరును కొనసాగించలేక పరాజయం చవిచూసింది.
ఇండోనేసియా ద్వయం చేతిలో ప్రపంచ ఏడో ర్యాంక్ జంట సాత్విక్, చిరాగ్‌కిది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం.
ఇటీవలి కామన్వెల్త్ క్రీడల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ చియా/సోయి జంట భారత్ జోడీపై నెగ్గింది. సెమీస్‌లో ఓడినా. .ప్రతిష్ఠా త్మక వరల్డ్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో పతకం అందుకున్న తొలి భారత జోడీగా సాత్విక్/చిరాగ్ చరిత్ర సృష్టించారు. అంతే కాదు..2011 నుంచి ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పతకం సాధిస్తూ వస్తున్న భారత రికార్డును వారు కొనసాగిం చారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో సెమీ-ఫైనల్‌కు చేరిన మొదటి భారతీయ జంటగా అవతరిం చిన భారత జంట శుక్రవారం భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. మహిళల డబుల్స్‌లో 2011లో కాంస్యం సాధించిన జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప తర్వాత డబుల్స్ ఈవెంట్‌లో భారత్‌కు ఇది రెండో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకం.