జగనన్న... ఆంక్షల పాలన ఏం ధర్మం?
posted on Aug 28, 2022 @ 1:13PM
ఇంటిల్లపాదినీ సంతోషంగా జీవించేలా చూడటం ఇంటిపెద్ద కర్తవ్యం. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటూ అందరి ఆనందాన్ని కోరుకోవడం ఇంటి పెద్ద ధర్మం. ఇదే ధర్మం రాష్ట పాలకులకు వర్తిస్తుంది. ప్రజలందరినీ ప్రశాంతంగా, సంతోషంగా జీవించేలా చూడటం ప్రభుత్వం, సీఎం ధర్మం. అలాగాకుండా ప్రభుత్వమే అడ్డంకులు కల్పిస్తూ, ముఖ్యమంత్రి, అధికారులు అన్ని రకాల అడ్డంకులు పెడుతూంటే ప్రజలు ఎలా ఉంటారు. ఏపీలో రాను రాను పరిస్థితులు ప్రజాహితంగా లేవన్నది విమర్శకుల మాట. తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్ అందుకు అద్దంపడుతోంది.
ప్రజలు సంతోషంగా ఉండడం అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఇష్టంలేకుండా పోయిందని ఆయన మీడియాతో అన్నారు. దీనికితోడు పండగలు నిర్వహించుకోవాలా వద్దా అన్నది కూడా ప్రభుత్వం అనుమతి తీసుకున్నతర్వాతనే అన్నది మరీ దారుణమని ఆగ్రహించారు.
ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ వినాయకచవితికి సిద్ధపడడంలో ప్రజలు తలమునకలయ్యారు. విగ్రహాల ఏర్పాటు విషయంలో కొన్ని సాధారణ ఆంక్షలు ఉంటాయి. కానీ ఆంక్షలు హద్దులు మీరి ఉంటున్నాయన్నారు.
...
తాడిపత్రి ప్రజలు సంతోషంగా ఉండడం అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఇష్టం లేదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అధికారులు దయ దాక్షిణ్యాలతో హిందూ పండుగలు నిర్వహించుకోవాలా? అని ప్రశ్నించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతుల కోసం గంటల తరబడి యువత నిరీక్షిస్తు న్నా రని మండిపడ్డారు.
వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి నిరాకరణతో వైసీపీ పతనం మొదలైందని ప్రభాకర్ న్నారు. శాంతి భద్రతల పేరుతో వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి నిరాకరణ సరికాదన్నారు. మున్సిపల్ చైర్మన్ అయిన తనకే అనుమతి కోసం ఆయా అధికారులు చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చెయ్యి స్వామి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు