సంక్షోభన్నుంచీ బయటపడేందుకు సంఘర్షించాలి.. కేసీఆర్
posted on Aug 28, 2022 @ 3:05PM
దేశాన్ని సంక్షోభాన్నుంచీ బయటకు తేవడానికి ప్రజాసంక్షేమం కోరుకునే శక్తులు సంఘర్షణ సాగించాలని తెలంగాణా ముఖ్య మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలుచేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు రంగాల అభివృద్థి, రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు రంగాల్లోని ప్రగతిని పరిశీలించేందుకు 26 రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు వంద మంది రైతు సంఘాల నాయకులతో జరిగిన భేటీలో సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జాతీయ రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ రెండో రోజు ఆదివారం సమావేశమ య్యారు. శనివారం (ఆగష్టు27) నుంచి సమావేశమవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, దేశంలో వ్యవసాయం ఏదుర్కొంటున్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుపుతు న్నట్లు సమాచారం. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నెలకొల్పిన అంశాలపై జాతీయ రైతు సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ వివరించ నున్నారు.
జాతీయ రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ రెండో రోజు సమావేశమయ్యారు. 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకులు, ఐక్య వేదిక గా ఏర్పాటు కావాలని తీర్మానించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణ జిల్లాల్లో పర్యటించి రైతు సంక్షేమం గురించి తెలు సుకున్న జాతీయ రైతు సంఘాల నాయకులు ఆ వివరాలు నోట్ చేసుకున్నారు.
అయితే ఒక పక్క జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో, తాజాగా జాతీయ రైతు సంఘాల నాయకులతో సీఎం కేసీఆర్ భేటీ ఆసక్తికరంగా మారింది. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీరు అందించడం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి సదుపాయాలను చూసి తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహ కారానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కిసాన్ ఆందోళనలో పాల్గొని అమరులైన రైతులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందించడం కూడా తెలిసిందే.
రైతు సంఘాల నేతలు కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వారు తీవ్రంగా ఖండించారు. పంటలు పండిం చ డంతో పాటు, గిట్టుబాటు ధరలను కల్పించాలని డిమాండ్ చేశారు. అసంఘటితంగా ఉన్న రైతాంగం సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని రైతు సంఘాల నాయకులు ఆకాంక్షించారు. దేశంలో సరికొత్త రైతు ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరమున్న దని వారు స్పష్టంచేశారు.