కాళేశ్వర సందర్శనకు అనుమతించండి... సిఎస్ కు బండి సంజయ్ లేఖ
posted on Aug 28, 2022 @ 2:36PM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయం లో తమ అనుమా నాలు నివృత్తి చేసు కోవాలనుకుంటు న్నామని, ప్రాజెక్టు సందర్శనకు అను మతిని కోరుతూ ఏపీ సీఎస్‌కు బండి సంజయ్ లేఖ రాశా రు. భారీ వరదలతో కాళేశ్వరం ఎత్తిపోత ల ప్రాజెక్టులో మోటా ర్లకు ఏర్పడిన నష్ణాన్ని పరిశీలించ డానికి బీజేపీ బృందం పర్యటిస్తుం దన్నారు.
1998 వరదలతో శ్రీశైలం టర్బైన్స్ దెబ్బతిన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రాజెక్టును సందర్శించాయన్నారు. 2004 - 2009లో జరిగిన జలయజ్ఞం పనులపై వచ్చిన విమర్శలకు ప్రతిపక్షాలను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందన్నా రు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇరిగేషన్ అధికారులను పంపి తమ సందేహాలను నివృత్తి చేయాలని బండి సంజయ్ ఆ లేఖ లో పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సాగునీటి పారుదల రంగం నిపుణులతో కూడిన 30 మంది ప్రతినిధి బృందం ప్రాజెక్టును సందర్శించాలనుకుంటున్నామని తెలిపారు.సెప్టెంబర్ తొలి వారంలో ఈ సందర్శనకు వెళ్లాలనుకుం టున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ప్రాజెక్టు పరిశీలన ద్వారా తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నామని తెలిపారు.అదేవిధంగా తమ బృందంతో పాటు ప్రభుత్వ సాగునీటి శాఖ అధికారులను పంపి అనుమానాలను నివృత్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను లేఖలో కోరారు. ఈ ఏడాది జూలై మాసంలో గోదావరి నదికి వచ్చిన వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పంప్ హౌస్ ముంపునకు గురైన విషయం తెలిసిందే. ఈ పంప్ హౌస్ ముంపునకు గురి కావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణ మని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
కృష్ణానదికి 1998లో వరదలు వచ్చిన సమయంలో కూడా శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో వరద నీరు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విపక్షాలు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన విషయాన్ని బండి సంజయ్ ఆ లేఖలో గుర్తు చేశారు. 2004 - 2009 లో జరిగిన జలయజ్ఞం పనులపై వచ్చిన విమర్శలకు ప్రతిపక్షాలను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానా లను నివృత్తి చేసిందని బండి సంజయ్ ప్రస్తావించారు.