దాడులకు గురయ్యేవారికి అండగా ఉంటాం.. అచ్చెన్నాయుడు
posted on Aug 28, 2022 @ 1:05PM
పరిస్థితులు అననుకూలించినపుడే దుష్ట ఆలోచనలు మొదల వుతాయి. ప్రజల నుంచి తిరస్కారం ఎదుర్కొంటున్న జగన్ సర్కా ర్ విపక్షాలను ఎండగట్టడంతో పాటు, వారి నాయకులు, అభిమానులు, కార్యకర్తలమీదా దాడులకు వెనుకడటంలేదని విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. దాదాపు రాష్ట్రంలో ప్రతిప్రాంతంలోనూ ఈ రకమైన విప క్షాలపై దాడులు, తిట్లపురాణాలకు వైసీపీ దూకుడుగా వ్యవహరి స్తోంది. దానికితోడు పోలీసు యంత్రాంగం కూడా అధికారగణానికి వత్తాసు పలుకుతోందని విప క్షాలు మండిపడుతున్నాయి.
మూడేళ్ల పాలన కాలంలో రాష్ట్రంలో జరిగిన దాడుల సంఘటనల్లో ఎంతమందికి శిక్షపడింది, ఎంతమందిపై కేసులు నమోద య్యాయో లెక్కలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తల్ని ఎంతో మందిని జైళ్లకు తరలించారన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొం టున్న కార్యకర్తలకు నాయకు లకు టీడీపీ అన్ని విధాల అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కొంతమంది పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కయి అక్రమ కేసులు, అర్థరాత్రి అరెస్టులు, థర్డ్ డిగ్రిలతో టీడీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం పోలీసులు డ్యూటీలో భాగం అనుకుంటున్నారా?.. లేక ఫ్యాషన్ అనుకుంటు న్నారా? అని ప్రశ్నించారు. పోలీసులు ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదన్నారు.
చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల చిట్టా తయారు చేస్తున్నామన్నారు. తమ కార్యకర్తల కన్నీళ్లకు కారణమైన ఖాకీలను, వైసీపీ నేతల్ని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజే వారిపై చర్యలకు శ్రీకారం చుడతామన్నారు. 2024 తర్వాత ఏపీ రాష్ట్రంలో వైసీపీ ఉండదని, జగన్ రెడ్డి ఉండరని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.