ఒకే ఒక్కడు..!

ఆవిర్భావ క్షణం నుంచి ఆఖరి క్షణం వరకు.. ఒకే ఒక్కడు పార్టీ అధ్యక్షునిగా కొనసాగిన చరిత్ర ఉన్న పార్టీలు ఎన్నో ఉండవేమో. అరుదుగా అలాంటి పార్టీలు కొన్నిఉన్నా, అవి అనామక పార్టీలే, అయ్యుంటాయి కానీ  చరిత్ర సృష్టించిన పార్టీలు అయితే కాకపోవచ్చును. కానీ, మరి కొద్ది గంటల్లో కాలగర్భంలో కలిసిపోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆవిర్భావ క్షణం నుంచి చివరి వరకు కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ఒక్కరే, పార్టీ అధ్యక్షునిగా కొనసాగారు. అందుకే, ఏక వ్యక్తి సారధ్యంలో పుట్టి,. పెరిగి. కాలగర్భంలో కలిసి పోయిన పార్టీ తెరాస తప్ప మరొకటి ఉండదేమో. అంటున్నారు. కానీ, అది పూర్తి సత్యం కాదు.   నిజమే, ఎక్కడి దాకానో వెళ్ళ కుండానే, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, ఆయన చేతుల మీదుగానే వెళ్ళిపోయింది. అలాగే, మఖలో పుట్టి పుబ్బలో మాయమై పోయిన దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీ వంటి మరి కొన్ని పార్టీలు కూడా ఉంటే ఉండవచ్చును. కానీ, తెరాసకు అలా మఖలో పుట్టి పుబ్బలో మాయమై పోయిన పార్టీలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుంది.  అందుకే తెరాసను ఆ పార్టీల గాటన కట్టడం సమంజసం కాదు, కుదరని వ్యవహారం అని  పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే  రాజకీయంగా చూసినప్పుడు కేసీఆర్, చిరంజీవి మధ్య తూకం కుదరదని అంటున్నారు. చిరంజీవి పార్టీ ఒక ఫ్లాఫ్ చిత్రం. కానీ, తెరాస  తెలంగాణ సాధించిన పార్టీగానే కాకుండా, వరసగా రెండు సార్లు ప్రజలు ఆదరణతో అధికారం చేపట్టిన పార్టీ. తెరాస ఆవిర్భావానికి చారిత్రక నేపధ్యం ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల వేదికగా, ఉద్యమ పార్టీగా పుట్టిన తెరాస సుమారు పుష్కర కాలం పైగా ఉద్యమ బాటలోనే నడిచింది. ఆరు పదుల తెలంగాణ కలను సాకారం చేసింది.  సుమారు 1200 మందికి పైగా యువకుల ప్రాణత్యాగం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సరే   అలాంటి పార్టీ ఇలా అర్ధాంతరంగా కనుమరుగై పోవడం ఒక విధంగా అనూహ్య పరిణామం.  నిజానికి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకనో ఏమో కానీ, తెలంగాణ ఉద్యమ చరిత్రను చెరిపేసే ప్రయత్నమే చేస్తూ వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ తొలి ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే, కేసేఆర్, ఇక తెరాస ఉద్యమ పార్టీ కాదు. ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ అని ప్రకటించారు. ఉద్యమ పార్టీని ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీగా ప్రకటించిన కేసేఆర్ రాష్ట్ర రాజకీయ గతినీ మార్చి వేశారు. ఉద్యమ వాసనలు  లేకుండా ఉద్యమ ఆనవాళ్ళు కనిపించకుండా, ఉద్యమ గీతం వినిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్ళు నిండినా  అమరవీరుల స్థూపం ఇంకా పూర్తికాలేదు. సగం మంది అమరవీరుల చిరునామాలే చిక్కలేదు. అమరవీరుల కుటుంబాలకు ఇవ్వవలసిన గౌరవం, పరిహారం ఇంతవరకు అందనే లేదు. ఇక ఇప్పుడు ఏకంగా తెరాసకు వీడ్కోలు పలికేందుకు  ముహూర్తం ఖరారు చేశారు.  అదలా ఉంటే తెలంగాణ ఉద్యమ చరిత్రతో ముడి పడిన తెరాస చరిత్ర పుటల్లో చేరిపోవడం అందరినీ కాకున్నా కొందరిని బాధిస్తోందని అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం, చీమలు పెట్టిన పుట్టలో విషనాగులు చేరినట్లు  తెరాసలో ఉద్యమ ద్రోహులు చేరిన నేపధ్యంలో, తెరాస కనుమరుగు కావడమే మేలని అంటున్నారు.

బీజేపీ బాణం ఎవ‌రికి గాయం?

రాజ‌కీయాల మ‌లుపు ఊహించ‌నివి, చిత్ర విచిత్ర‌మైన‌వీను. ఎవ‌రు ఎవ‌ర్ని చెట్టెక్కిస్తారు, ఎవ‌రు ఎవ‌ర్ని ద‌గ్గ‌ర‌కుచేర్చుకుంటారు, ఎవ‌రు ఎవ‌ర్ని దూరం చేసుకుంటార‌న్నది ఇద‌మిద్ధంగా ఫ‌లానా కార‌ణ‌మ‌ని చెప్పడం బ‌హు క‌ష్ట్ హై. ఇక్క‌డ సాగినా సాగ‌క‌పోయినా కేంద్రంలో తేల్చుకుంటాన‌ని ఒంటికాలిమీదా లేస్తుంటారు. ఎన్నాళ్లీ ప్రాంతీయ‌ త‌త్వం.. ఇక సాగిద్దాం కేంద్రంతో తాడో పేడో అన్న ఉత్సాహంతో ఉర‌క‌లూ వేస్తుంటారు. ఇపుడు ఉర‌క‌లు వేస్తూ ఢిల్లీలో కొత్త పార్టీతో హ‌ల్ చెల్ చేయించాల‌న్న ధోర‌ణితో   తెగ హడావుడి పడుతున్న టిఆర్ఎస్ అధినేత తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. కేసీఆర్ ఢిల్లీ క‌లలు పండించుకోవ‌డానికి ఓ పార్టీ అవ‌స‌రం గ‌నుక బీఆర్ ఎస్ అంటూ టీఆర్ఎస్ కే జాతీయరంగు పులి మారు. ఇపుడు ఆయ‌న మ‌రింత ఠీవీగా న‌డ‌వ‌డానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుక్కార‌ణం బీజేపీ వారితో లోపాయ కారి ఒప్పందాలు జ‌రిగాయ‌న్న ఆరోపణలను ఎదుర్కొంటుండడమే. అస‌లు టీఆర్ ఎస్ రెండోప‌ర్యాయం అధికారంలోకి రావ‌డ‌మే బీజేపీ స‌హాయ‌స‌హ‌కారాల‌తోన‌ని, టీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్‌గా మారింద‌న్న అభిప్రాయాలు ఢిల్లీ నుంచి పటాన్ చెరు వ‌ర‌కూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల కేంద్రం మీద, బీజేపీ మీద టీఆర్ ఎస్ అధినేత‌, నేత‌లు ఎంత విరుచుకుప‌డుతున్నా బీజేపీ మాత్రం న‌వ్వుకుంటోంది, అరకొరగా ప్రతి విమర్శలు చేస్తోందే కానీ గ‌ట్టిగా, దీటుగా తెరాస నేతల నోళ్లు మూయించేలా వ్యవహరించడం లేదు. ఇందుకు కార‌ణం వారికి కావ‌ల్సింది తెలంగాణాలో పాగా వేయ డం, అందుకు టీఆర్ ఎస్ కంటే కాంగ్రెస్ ను  అడ్డు తొల‌గించుకోవ‌డం ముఖ్యం. తెలంగాణలో కాంగ్రెస్ బ‌లం పుంజుకోవ‌డంతో పాటు కాస్తంత దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో తెరాస కంటే కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకూ బీజేపీ ప్రథమ తాంబూలమిస్తోంది. తెలంగాణాలో పార్టీని ముందుకు న‌డిపించ‌డంలో కొంద‌రు నాయ‌కుల‌ను వాగ్ధాటి ఉన్న‌వారిని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ మీద దాడి చేయ‌డం జ‌రుగుతోంది. కానీ టీఆర్ ఎస్ ప‌ట్ల మాత్రం అంత ఘాటు ప్రేలాప‌న‌లేవీ లేవు. పైకి తిడుతున్న‌ట్టు క‌న‌ప‌డుతున్నా, లోలోప‌ల సారీ మావా.. అన్న సామెత‌గా సాగుతోంది టీఆర్ ఎస్‌, బీజేపీ దోస్తానా.  ఎంఐఎంని గ‌ట్టిగా టీఆర్ ఎస్ తిట్ట‌లేన‌ట్టే, బీజేపీ మ‌రింతగా ఈడీ దాడులు టీఆర్ ఎస్ మీద ప‌రుగులెత్తించ‌డ‌మూ లేదు. వేడి త‌గ్గించి ఏదో తూతూ మంత్రంలా ఎవ‌రూ అవమానించ‌కుండా బీజెపీ జాగ్ర‌త్త ప‌డుతోంది. దక్షిణాది లో మరీ ముఖ్యంగా తెలంగాణలో పాగా వేయాలంటే, బీజేపీ ఇపుడు కావ‌ల‌సింది కేసీఆర్ లాంటి నాయ‌కుడే.  టీఆర్ ఎస్‌కి, ప్ర‌త్యేకించి కేసీఆర్‌కి కావ‌ల‌సింది తెలంగాణాలో కాంగ్రెస్ అడ్డంకి తొల‌గించుకోవ‌డ‌మే. అం దుకే ఇక్క‌డ బీజేపీని తిడుతున్నా ఆన‌క బీజేపీ భ‌జ‌న మాత్రం చేస్తోంది  టీఆర్ ఎస్‌. ప్రాంతీయంగా అలాగే కమలం పార్టీకి కూడా  కాంగ్రెస్‌  గెల‌వ‌కుండా చేయ‌డానికి ఇక్క‌డ బ‌ల‌మున్న నాయ‌కులు, పార్టీ అవ‌స‌రం గుర్తించింది గ‌నుక నే బీజేపీ కేసీఆర్‌ను ఎన్నుకుంది. దీని వ‌ల్ల కేసీఆర్‌కి క‌లిగే ప్ర‌యోజ‌నం ఎలా ఉన్నా,  బీజేపీ మాత్రం ఎంతో ల‌బ్ధిపొందుతుంది. అన్నిటికీ మించి ఎదుటివాడి మీదకు పక్కవాడి భుజం మీంచి తూటా పేల్చాలనే వ్యూహాన్నే ఇరు పార్టీలూ అనుసరిస్తున్నాయి. బీజేపీ నిజంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజృంభించి అధికారంలోకి వ‌స్తే, టీఆర్ఎస్ మీద కంటే కాంగ్రెస్ మీద భారీ విజ‌యంగానే భావిస్తుంది. కేంద్రంలో అధికారమంటూ నేల విడిచి సాము చేస్తున్న కేసీఆర్ మాత్రం ఇక్క‌డ పార్టీ ప‌రి స్థితిని ఇప్ప‌టికే  ప్ర‌శ్నించే అభిమానుల‌కు, ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు  న‌మ్మ‌కంగా గ‌ట్టి స‌మాధా నం ఇవ్వ‌లేక‌పోతున్నారు.

అభిమానం ఖ‌రీదు అక్ష‌రాలా రూ.24 వేలు!

ప్ర‌తీవారికి ఒక అభిమానన‌టుడో, క్రీడాకారుడో ఉంటారు. అభిమానం వేలంవెర్రిగాకుండానే ఉండాలి. స్థాయి మించి వెర్రిగా మారితేనే తెలీకుండా ఎంతో న‌ష్టం చేసుకుంటారు. ఆ న‌టుడు, ఆ క్రీడాకారుడూ బాగానే ఉంటారు, ఓ ఫోటోనో, ఆటోగ్రాఫో, న‌వ్వో ప‌డేసి వెళిపోతారు. ఆన‌క ఆలోచించిచూస్తే న‌ష్ట‌పోయేది మాత్రం ఈ  వీరాభిమానే. అందువ‌ల్ల ఏద‌న్నాస‌రే హ‌ద్దులు మీర‌కూడదంటారు. కానీ  రాహుల్ రాయ్ మాత్రం  హ‌ద్దులు చాలా మీరేడు! అస్సాం కుర్రాడు రాహుల్ రాయ్‌కి కింగ్ కోహ్లీ అంటే ప‌డి చ‌చ్చేంత ఇష్టం. అస‌లు స‌చిన్‌,  కోహ్లీల‌కు ఇ లాంటి వీరాభిమానులే ఉన్నారు, ఉంటారు. ఎంత అభిమానం, ప‌చ్చి అంటే కింగ్ కోసం అస్సామీ కుర్రా డు ఏకంగా 23 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశాడు!  అదుగో అలా ఆశ్చ‌ర్య‌ప‌డ‌వ‌ద్దు.. అదంతే.. కోహ్లీయా మ‌జాకా..!   మొన్న గౌహ‌తీలో మ్యాచ్‌కి టీమ్ ఇండియా వ‌చ్చిన‌పుడు కోహ్లీని చూడాల‌ని బోర్జార్ ఎయిర్‌పోర్ట్‌కి రాహుల్ రాయ్ వెళ్లాడు. అక్క‌డ క‌ల‌వ‌లేక‌పోయాడు, టీమ్ వెళ్లే బ‌స్సు వెంట‌బ‌డ్డాడు.. కోహ్లీ క‌ళ్ల‌లో ప‌డాల‌ని..అన్ని య‌త్నాలూ విఫ‌ల‌మ‌య్యాయి. స్టేడియంలోకి వెళ్లేముందు కూడా ప్ర‌య‌త్నించాడు. కానీ సెక్యూరిటీ అస్స‌లు ద‌రిదాపుల్లోకి వెళ్ల‌నీయ‌లేదు.  గౌహ‌తీలో క‌ల‌వ‌కుంటే ఆ త‌ర్వాత ముంబై, ఢిల్లీ వెళ్లి క‌ల‌వ‌డం మ‌రీ దుర్ల‌భం అనుకున్నాడు. వెంట‌నే అత‌నికి ఓ మెరుపు ఆలోచ‌న‌వ‌చ్చింది. కోహ్లీ ఉన్న హోట‌ల్లోనే తాను ఒక గ‌ది బుక్ చేసుకుంటే ఎలా అని. ఇది విన‌డానికి చిత్రంగా ఉంటుంది గాని ప్ర‌య‌త్నించి సాధించాడు. అయితే అందుకు అత‌నికి త‌ల‌కు మించిన భార‌మే అయింది. కోహ్లీ ఉన్న హోట‌ల్లో ల‌క్కీగా ఓ గ‌ది ఖాళీగా ఉండ‌డం రాహుల్ భ‌గ‌వంతుడు ద‌య అనుకున్నాడు. అయితే హోట‌ల్ వారు మాత్రం రూ.23,400 క‌ట్ట‌మ‌న్నారు.  డబ్బు కాదు కింగ్ కోహ్లీని ద‌గ్గ‌రగా చూడటం, వీల‌యితే ఒక మాట‌, మ‌రీ వీల‌యితో ఓ సెల్ఫీ అనుకుని ధైర్యం చేశాడు.   అక్క‌డ చాలాసార్లు పేరుపెట్టి పిలిచాడు, నాలుగ‌యిదు సార్లు త‌ర్వాత కింగ్ చూశాడు.. వీడెవడ్రా న‌న్ను పిలుస్తున్నాడ‌నుకుని చూశాడు.. ఎవ‌రో అభిమాని అనుకున్నాడే గాని వీడు దారుణ‌మైన వీర వీరాభిమాని అన్న సంగ‌తి తెలియ‌దు. మొత్తానికి కింగ్ ద‌గ్గ‌రికి వెళ్లి రెండు మాట‌లు మాటాడి, ఒక సెల్ఫీ తీసుకున్నా డు. కోహ్లీ ఎంతో అభిమానంగా మాట్లాడాడ‌ట‌. రాహుల్ ఆనందానికి అంతే లేదు.   భార‌త్ ఆ మ్యాచ్ గెలిచింది.. రాహుల్ ఇంటికెళ్లితే మ‌రి వాళ్ల కుటుంబం ఏమ‌న్న‌దో మాత్రం తెలియ లేదు!

అలిపిరి ప్రమాదం నుంచి బాబును దేవుడు కాపాడిందిందుకేనేమో?!

ప‌రిస్థితులు, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. కాలంతోపాటు ప‌రిస్థితులు మారుతుంటాయి. ఇవాళ్టి అవాంతరం కొంత‌కాలం త‌ర్వాత గొప్ప భ‌విష్య‌త్ మార్గాన్ని సూచించ‌వ‌చ్చు. ఊహించ‌నివి జ‌రుగుతూంటాయి. కొన్ని అనుభ‌వంలోకి వ‌స్తాయి..ఏమ‌యిన‌ప్ప‌టికీ ధైర్య‌వంతులు, స‌మాజ సంక్షేమాన్నిమ‌న‌సా వాచా ఆశించేవారే ఆ వెలుగులో ముంద‌డుగు వేయ‌గ‌ల్గుతారు. వారే మార్గ‌ద‌ర్శ‌కులు అవుతున్నారు. ఇందుకు కాలం క‌ల్పించే అడ్డంకులు, బాధ‌లు, ఇబ్బందులు, ప్ర‌మాదాలు ఏవీ లెక్క‌లోకి రావు, ఏవీ అడ్డుకోలేవు. ఇది ఏదో మాట‌లు చెప్ప‌డం కాదు, ఇది వాస్త‌వం. ఇందుకు గొప్ప ఉదాహ‌ర‌ణ తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు విష‌యాన్నే తీసుకోవ‌చ్చు.  సరిగ్గా 19 ఏళ్ల కిందట.. అక్టోబర్ 1, 2003న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక పెను ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు. నక్సల్స్ పకడ్బందీ ప్రణాళికతో జరి పిన క్లెమోర్ మైన్ దాడిలో చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ఆయన తిరుమల వెళు తుండగా అలిపిరి వద్ద జరిగింది. సంఘటన జరిగిన ప్రదేశం, పేలుడు ధాటి చూసిన వారంతా  ఆ ప్రమా దం నుంచి చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారంటే అది కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి మహిమే అన్నారు. మంచి నాయ‌కుడిని ఎవ‌రూ దూరం చేసుకోవాల‌నుకోరు, తెలుగు ప్ర‌జ‌లంతా ఆయ న్ను కోర‌కు న్నారు.. ఆయ‌న మ‌ళ్లీ ఎంతో ఆరోగ్యంగా, రెట్టింపు ఉత్సాహంతో జ‌నాల్లోకి  వ‌చ్చారు. అంతటి ప్రమాదం నుంచి భగవంతుడు తనను ఎందుకు కాపాడాడంటే.. సమాజం కోసం, తెలుగు రాష్ట్రం కోసం తాను చేయాల్సిన పని ఇంకా ఉందనే భావిస్తున్నానని అప్పట్లో చంద్రబాబు కూడా అన్నారు. అంతటి ప్రమాదం నుంచి వెంకటేశ్వరుడు చంద్రబాబును ఎందుకు కాపాడారో.. చంద్రబాబును ప్రాణా లతో కాపాడిన కారణమేమిటో 2014లో అందరికీ అర్ధమైంది. రాష్ట్ర విభజనతో జీరోగా మిగిలిపోయిన విభజి త ఆంధ్రప్రదేశ్ ను  నంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకే నని.. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం  చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలూ తేటతెల్లం చేశాయి. దేవ తల రాజధాని ‘అమరావతి’ని నవ్యాంధ్ర రాజధానిగా నిర్మించే గురుతర బాధ్యత చంద్రబాబుపై ఆ భగవంతుడే ఉంచాడా అని పించక మానదు. భద్రాచలంలో రామాలయ నిర్మాణం కోసం రామదాసును రాముడే ఆశీర్వదించాడం టారు.  రాముడి ఆశీశ్సులతో ప్రజా సహకారం తీసుకుని రామాలయ నిర్మాణానికి ఉపక్రమించిన రామదాసు    ఎన్ని కష్టాలు ఎదుర్కొన వలసి వచ్చిందో చరిత్ర చెబుతోంది. అలాగే  అమరావతి నిర్మాణానికి పూను కున్న చంద్రబాబుకూ అవాంతరాలు ఎదురౌతున్నాయి. దేవతల కార్యాన్ని పూర్తి చేసే క్రమంలో రాక్ష సులు అడ్డంకులు సృష్టించడం పురాణాల కాలం నుంచీ వస్తున్నదే. రామాయణ ఇతిహాసం చెప్పే విషయం అదే. ఆ అవాంతరాలన్నీ అధిగమించి చివరకు అనుకున్నది సాధించడమే నాయకుడి లక్ష ణం. ఇప్పుడు అమరావతికి అడుగడుగునా ఎదురౌతున్న అవాంతరాలు రాక్షస మూకల అడ్డంకులు పెరుగుతున్నా చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం అకుంఠిత దీక్ష‌తో పోరాడుతూనే ఉన్నారు.  మంచికి ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రు సాయ‌ప‌డుతూనే ఉంటారు.. ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో దేవ‌త‌లు సాయ ప‌డ్డారు. చంద్ర‌బాబు అమ‌రావ‌తి నిర్మాణానికి వేసుకున్న ప్ర‌ణాళిక‌లు అన‌తికాలంలో కార్య‌రూపం లోకి రావాల్సింది. కానీ ప‌రిస్థి తులు మారాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయాన్ని ఎదుర్కొంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది.  ప్ర‌జ‌లు తెలీకుండానే గొప్ప దార్శనికుడి నాయకత్వాన్ని కాదనుకున్నారు వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. వస్తూనే చంద్ర‌బాబు విజ‌న్‌ని దెబ్బ‌తీసింది. ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టి, ఆరంభించి కొన‌సాస్తున్న ప‌థ‌కాలన్నీ నిర్ల‌క్ష్యం చేసి కేవ‌లం రాజ‌కీయ లబ్ధి, స్వార్ధం కోసమే పాలన సాగిస్తోంది.  దీంతో రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడింది. ప్రజలు కష్టాల పాలవుతున్నారు.   ప్ర‌జ‌లు కేవ‌లం మూడేళ్ల కాలంలోనే వైసీపీ కుతంత్రాల‌ను తెలుసుకున్నారు. రాజ‌ధాని నిర్మాణ ప్రాజెక్టును ఎంత‌గా భ్ర‌ష్టుప‌ట్టిస్తున్న‌దీ గ్ర‌హించారు. దీంతో ఈ మూడేళ్ల కాలంలో రాష్ట్రం ఏ విధంగా భ్రష్టుపట్టిందో వారికి గ్రహింపునకు వచ్చింది. మళ్లీ చంద్రబాబు దార్శనికతే రాష్ట్రాన్ని కాపాడుతుందన్న భావనకు వచ్చారు. అందుకే గడప గడపకూ తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలనూ, మంత్రులనూ గడప గడపలోనూ నిలదీస్తున్నారు. అంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వం పాల‌నా తీరు, జగన్ పార్టీ నాయ‌కుల వ్య‌వ‌హార‌శైలీ అన్నిటికీ జనం తిర‌స్కారాన్ని బ‌హుమ‌తిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఇటీవల స్వయంగా జగన్ చేయించుకున్న సర్వే పలితాలే తేటతెల్లం చేశాయి.   ఉందిలే మంచీకాలం ముందు ముందునా.. అంద‌రూ సుఖ‌ప‌డాలి.. అంటూ  ఆంధ్రా ప్ర‌జ‌లు పాడుకుం టూన్నారు.

 థ‌రూర్‌కి  నో అంటున్న తెలంగాణా కాంగ్రెస్ 

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి పోటీ బ‌రిలో మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, శ‌శిథ‌రూర్ నిలిచారు. అయితే అధిక శాతం కాం గ్రెస్ వాదులు ఖ‌ర్గే రావాల‌ని కోరుకుంటున్నారు. తెలంగాణా కాంగ్రెస్ నాయ‌కులు, అభిమానులు కూడా ఖ‌ర్గే వైపే మొగ్గు చూపుతున్నారు. శ‌శిథ‌రూర్ ఇక్క‌డికి ప్రచారం కోసం వ‌చ్చిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ రేవంత్ రెడ్డి ఆ స‌మావేశానికి డుమ్మా కొట్ట‌డ‌మే తెలంగాణా కాంగ్రెస్ నాయ‌కుల అభిప్రాయం బ‌య‌ట ప‌డింది.  అయితే పార్టీ ప‌ద‌వి ఏక‌గ్రీవం చేయ‌డం ఇష్టంలేక‌నే ఆయ‌న స్వ‌తంత్రంగా రంగంలోకి దిగి పోటీ  త‌ప్ప‌నిస‌రి చేశారు. మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ప‌ట్ల పార్టీకి  ఉన్న న‌మ్మ‌కం ఆయ‌న్ను అభ్య‌ర్ధిని చేసింది.  అయితే ప్ర‌స్తుతం పార్టీ ప‌ద‌వి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇద్ద‌రూ త‌మ మ‌ద్ద‌తుదారుల‌తో ప్ర‌చారం చేసుకోను  వీలు క‌ల్పించారు. క‌నుక ఖ‌ర్గేను పార్టీ ప్ర‌తినిధిగానే చూడ‌న‌క్క‌ర్లేద‌ని  కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల సంఘం పేర్కొన్న‌ది.  కాగా, థరూర్ మాత్రం త‌మ మ‌ధ్య విభేదాలు వ‌దిలేసి అంద‌రం ఒక్క‌టిగా బీజేపీని ఎదుర్కొవ‌ల‌సిన అవ‌స రం ఉంద‌ని అన్నారు. దీన్ని ఖ‌ర్గే కూడా స‌మ‌ర్ధించారు. ప్ర‌స్తుతం ఆయ‌న్ను పార్టీ ప‌ద‌వికి పోటీ ప‌డుతు న్న అభ్యర్ధిగా చూడ‌టం త‌ప్ప ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌లో త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.  మ‌రో వంక కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఖ‌ర్గేను పార్టీ ప‌ద‌వికి పోటీచేస్తున్న అభ్య‌ర్ధిగానే చూడాల‌ని, అంతే  త‌ప్ప సోనియా ఆస‌క్తి చూపుతోంద‌ని ఆయ‌న కోసం ప్ర‌త్యేకించి ప్ర‌చారాలు చేయ‌డాలు, ఓటింగ్ కోసం కాంగ్రెస్ నాయకుల మీద ఒత్తిడి చేయ‌డం వంటివి చేప‌ట్ట‌వ‌ద్ద‌ని ఏఐసిసి ప్ర‌త్యేకంగా  అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నాయకుల‌ను హెచ్చ‌రించింది.  ఏమైన‌ప్ప‌టికీ, బీజేపీ పాల‌నా విధానాల‌ను, ప్ర‌త్యేకించి రైతాంగానికి విరుద్దంగా చేప‌ట్టిన చ‌ట్టాల‌ను వ్య‌తి రేకించి రైతంగానికి న్యాయం జ‌రిగేట్టు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుని భార‌త్ జోడో యాత్ర సాగాల‌ని  కాంగ్రెస్ నేత  జైరామ ర‌మేష్ అన్నారు. కాంగ్రెస్ యువ నేత రాహుల్ చేప‌ట్టిన యాత్ర చివ‌రి ద‌శ‌లో సోనియా గాంధీ, ఖ‌ర్గే కూడా పాల్గొనే అవ‌కాశం ఉంది. రైతాంగానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ ఖ‌ర్గే రాహుల్‌కు మ‌ద్ద‌తునీయాల‌ని ర‌మేస్ ఆకాంక్షించారు. 

కేటీఆర్’కు పట్టాభిషేకం.. హరీష్ రావుకు..?

ఇప్పటి కిప్పుడు కాకపోయినా,మరో రెండు మూడు నెలల్లో, ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో మునిగి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి, విజయ దశమి ‘జాతీయ’ ప్రకటన తర్వాత కేసీఆర్, రాష్ట్రంలో కంటే ఢిల్లీలో, కాదంటే ఇతర రాష్ట్రాల పర్యటనలలోనే ఎక్కువగా ఉంటారనే సంకేతాలు స్పష్ట మవుతున్నాయి. అందు కోసమే ఆయన ప్రత్యేకంగా ‘ఛార్టర్డ్ ఫ్లైట్’ ను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా అధికార పార్టీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో, మరీ ముఖ్యంగా తెరాస నాయకులలో చర్చ మొదలై నట్లు తెలుస్తోంది.  నిజానికి ముఖ్యంత్రి కేసీఆర్, గాంధీ జయంతి రోజు ప్రగతి భవన్లో జరిగిన పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకుల సమావేంలోనే, ఈ మేరకు సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. పార్టీ ముఖ్య నేతలు, ఇతర రాష్ట్రాలలో కీలక బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించినట్లు వార్త లొచ్చాయి. ఈ నేపద్యంలో, కొందరు ‘ముఖ్య’ నేతలను ఇక్కడి బాధ్యతల నుంఛి తప్పించి, జాతీయ బాధ్యతలు అప్పగిస్తారా? లేక  ఇక్కడి బాధ్యతలు అలాగే ఉంచి, అదనపు బాధ్యతలుగా ఇతర రాష్ట్రాల బాధ్యతలను అప్పగిస్తారా అనే చర్చ పార్టీలోనే కాకుండా,  రాజీకీయ, మీడియా వర్గాల్లోనో  జరుగుతోంది. ఇందుకు సంబదించి పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ముఖ్యమంత్రి కేసీఆర్, ఒక మాట మాట్లాడారంటే, ఆ మాటకు అర్థ తాత్పర్యాలు, నానార్దాలు చాలానే ఉంటాయని అన్నారు. అలాగే, ఇప్పడు, ముఖ్యమంత్రి పార్టీ నేతలు జాతీయ బాధ్యతలకు సిద్ధం కావాలని సంకేత మాత్రంగా చేసిన వ్యాఖ్యల వెనక ప్రత్యేక అర్థం ఏమైనా ఉందా, అంటే, ఉందనే అంటున్నారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి మాటల్లో అలాంటి అర్థాలు ఉన్నా, లేకున్నా నిజంగా సీరియస్’గా జాతీయ రాజకీయాల్లో ముందుకు పోవాలంటే, అదొక్క కేసీఆర్ వల్లనో మరొకరి వల్లనో అయ్యే పనికాదు. ఒకరో ఇద్దరో కాదు, చాలా మంది చాలా త్యాగాలు చేయవలసి ఉంటుందని, ముఖ్యంగా తెరాస పార్టీ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి, ఇంకా పార్టీలో మిగిలున్న హరీష్ రావు వంటి ముఖ్య నేతలు త్యాగాలకు సైతం సిద్దం కావాల్సి ఉంటుందని అంటున్నారు.  ఇప్పటికే ఢిల్లీ రాజకీయలలో సంబంధాలున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్, ప్రస్తుత మాజీ ఎంపీలతో పాటుగా సంస్థాగత నిర్మాణంలో,. సంస్థాగత వ్యవహారాలనుచక్క పెట్డంలో గట్టి పట్టున్న ట్రబుల్ షూటర్’ హరీష్ రావు  వంటి వారి అవసరం జాతీయ పార్టీకి ఉంటుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్’కు అన్ని విధాలనమ్మిన బంటుగా ఉండే మేనల్లుడు హరీష్ రావుకు స్థాన చలనం ఉండే అవకాశాన్ని కొట్టి వేయలేమని అంటున్నారు.  అదొకటి అలా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్, జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే, ఆటోమేటిక్’గా ప్రస్తుతం సెకండ్ ఇన్ కమాండ్’ గా ఉన్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, కే.తారక రామ రావు, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే, ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలో బిజీ అయిన తర్వాత, అవసరాన్ని బట్టి, ముఖ్యమంత్రి పదవి కూడా కేటీఆర్ కు  అప్పగించే అవకాశాలను కాదనలేమని అంటున్నారు. అదే జరిగితే, జాతీయ స్థాయిలో కేసీఆర్ నాయకత్వంలో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఎన్నికలకు వెళితే, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే, ప్రశ్న రాకుండా, ముందుకుసాగి పోయే అవకాశం ఉంటుందని, అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి పదవిని మాత్రం అంత తేలిగ్గా అదీ కుమారుడు కేటీఆర్’కే అయినా ఇవ్వరని వదులుకోరని అంటున్నారు.  నిజానికి, 2018లో తెరాస రెండవ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేటీఆర్ పట్టాభిషేకం గురించి మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి, ఒకటి రెండు సందర్భాలలో ముహూర్తాలు కూడా ఫిక్స్ అయ్యాయి. అయినా  అదేమీ జరగలేదు. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు కేసీఆర్ మానసికంగా సిద్ధమయ్యారని, రాజకీయ సమీకరణాలను సరి చూసుకుని కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు, జాతీయ రాజకీయ వ్యుహలకు సమాంతరంగా వ్యూహ రచన సాగుతోందని అంటున్నారు. అందులో భాగంగా కూడా కొందరు ‘ముఖ్య’ నేతలకు జాతీయ బాధ్యలు అప్పగించి, పక్కకు తప్పించవచ్చని అంటున్నారు.అదే నిజమైతే, అధికార మార్పిడి, అంత సులభంగా జరిగిపోతుందా, లేక ముఖ్యమంత్రి అనేక సందర్భాలలో  ప్రస్తావించిన విధంగా తెలంగాణ షిండే తెర మీదకు వస్తారా, సంక్షోభం తలెత్తుతుందా,అనే కోణంలోనూ చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ జాతీయ పార్టీ కోసం రెండు టీవీ చానెళ్లు!

కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించే విషయాన్ని ఆషామాషీగా తీసుకోలేదని ఆయన చేతలు చెప్పకనే చెబుతున్నాయి. థర్డ్ ఫ్రంట్, ప్రత్యామ్నాయ కూటమి, కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి.. ఆ తరువాత కాంగ్రెస్ ను కలుపుకునైనా సరే బీజేపీయేతర కూటమి ఇలా గత కొంత కాలంగా అన్ని రకాలుగానూ కసరత్తు చేసిన కేసీఆర్ అవేవీ కలిసి రాకపోయేసరికి ఏకంగా తానే ఒక జాతీయ పార్టీని ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు ముహూర్తం ఖరారైపోయిన తరువాత ఆ పార్టీ గురించి ఆయన చేస్తున్న, చేసిన కసరత్తులు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి.వాటిలో ప్రధానమైనది తన జాతీయ రాజకీయ పార్టీకీ, జాతీయ రాజకీయాలలో తన ప్రవేశానికి పెద్ద ఎత్తున ప్రచారం కోసం కేసీఆర్ స్వయంగా రెండు చానెళ్లు ప్రారంబించనున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఆ చానెళ్లు పని చేస్తాయంటున్నారు. వాటిలో ఒకటి హిందీ చానెల్ కాగా, మరొకటి ఇంగ్లీష్ చానల్. కేవలం ప్రాంతీయ మీడియాను నమ్ముకుంటే.. తనకూ, తన పార్టీకి జాతీయ స్థాయిలో మైలేజీ ఉండదని బావించిన కేసీఆర్ తానే స్వయంగా చానల్ ప్రారంభించాలనీ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఢిల్లీ కేంద్రంగా పని చేసే ఈ రెండు చానెళ్లూ తన జాతీయ రాజకీయాలను విస్తృతంగా ప్రచారం చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు పని చేస్తాయని ఆయన చెబుతున్నారు. వీటిని పార్టీ ఆవిర్బావాన్ని ప్రకటించే దసరా రోజునుంచే ప్రారంభించే అవకాశాలున్నాయని తెరాస వర్గాలు చెబుతున్నాయి. అయితే అదెంత వరకూ నిజమన్నది నిర్ధారణ కావలసి ఉంది. ఇప్పటి వరకూ జాతీయ స్థాయిలో హిందీ, ఇంగ్లీషు బాషల్లో టీవీ చానెళ్లు ప్రారంభించనున్నట్లు కేసీఆర్ స్వయంగా ధృవీకరించలేదు. ఇప్పటికే ప్రకటనల రూపంలో జాతీయ మీడియాలోనే కాకుండా, అన్ని రాష్ట్రాలలోని ప్రాంతీయ మీడియాలోనూ పెద్ద ఎత్తున తెలంగాణ ‘మోడల్’ అభివృద్ధి అంటూ ప్రచారం చేయించుకున్న కేసీఆర్, ఇప్పుడు సొంతంగా తన కొత్త జాతీయ రాజకీయ పార్టీ కోసం భారీ ఎత్తున రెండు చానెళ్లను ప్రారంభించడం అంటే.. పక్కా వ్యూహంతో, పకడ్బందీ ప్రణాళికతో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారనే అర్ధమౌతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఉద్యమ వార్తల ప్రచారానికి ఆయన నమస్తే తెలంగాణ పత్రికను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మీడియా ప్రచారం ద్వారానే ప్రజలలోకి వేగంగా వెళ్లగలమని కేసీఆర్ మొదటి నుంచీ విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన తన కొత్త పార్టీని వేగంగా ప్రజలలోకి తీసుకెళ్లేందుకే మన దేశం, మన చానెల్ అన్నట్లుగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో రెండు చానెళ్లను ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలూ పూర్తి చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ జాతీయ చానెళ్ల ద్వారా కేసీఆర్ జాతీయ అజెండా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాధించిన విజయాలు, దేశానికే ‘మోడల్’ అన్న గుర్తింపు పొందేలా అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమం తదితర అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఈ చానళ్ల సహకారంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలలో తన జాతీయ పార్టీకి మద్దతు దారులను పెంచుకోవడం, ప్రతి రాష్ట్రం నుంచీ తన పార్టీ రంగంలోకి దిగేందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.  

ఆర్ ఎస్ ఎస్ కామెంట్ కేంద్రంపై ఎక్కుపెట్టిన‌దేనా?

ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి పేదరికం, నిరుద్యోగం, అసమానతలపై ఎర్ర జెండాలు వేసి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. సామాజిక సవాళ్ల గురించి సంఘ్ ఎప్పుడూ ఆలో చిస్తుంద‌ని బీజేపీ అధికార ప్రతినిధి చెప్పారు.  స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్ జె ఎం) కార్యక్రమంలో భారత దేశ పేదరికం, నిరుద్యోగం అసమానతలను ఎత్తిచూపుతూ ఆర్ ఎస్ ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి, అవి  బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వా న్ని లక్ష్యంగా చేసుకున్నాయి.  బిజెపి అధికార ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్ మాట్లాడుతూ, హోసబాలే చెప్పినదానిపై పార్టీకి ప్రత్యేక వైఖరి లేదని, అయితే సాధారణమైన కొన్ని సవాళ్లను ఆయన నొక్కిచెప్పారని, కాంగ్రెస్‌కు చెందిన కొం దరు నాయకులు - ఇది ఎదుగుదలకు వ్యతిరేకంగా భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నారు.  భారత్ జోడోయాత్ర  ప్రభావాన్ని చూడండి. దేశాన్ని విచ్ఛిన్నం చేసి, సమాజంలో విషాన్ని వ్యాపింపజేసే వారు నేడు తమ పరిధిని పెంచుకోవడానికి పేదరికం, నిరుద్యోగం అసమానతలను లేవనెత్తు తున్నారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ హిందీలో  ట్వీట్ చేశారు. బీజేపీ సైద్ధాంతిక గురువు, ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత చేసిన ప్రకటన ప్రాముఖ్యతపై రాజకీయ నిపుణు లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో సహచరుడు, రాజకీయ విశ్లేషకుడు రాహుల్ వర్మ దీనిని బీజేపీ ప్రభుత్వంపై చేసిన విమర్శగా పరిగణించడం లేదు. ఆర్‌ఎస్‌ఎస్ తరచుగా బీజేపీకి మనస్సాక్షిగా వ్యవహరిస్తోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో కూడా, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలు భారతీయ కిసాన్ సంఘ్ మరియు భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా డిమాండ్ లు, నిరసనలు చేసేవ‌ని ఆయన అన్నారు. కానీ, మరొక రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ "హోసబాలే చెప్పినది చాలా స్పష్టంగా ఉంది, అయితే ఆర్ ఎస్ ఎస్‌ లేదా బీజేపీ నాయ కులలో ఒక వర్గం విభేదిస్తున్నారా అనేది బహిరంగ ప్రశ్న అని అన్నారు. ఎస్జెఎం వెబ్‌నార్‌లో, హోసబాలే పేదరికాన్ని వధించవలసిన రాక్షసుడితో పోల్చా డు. ఇక్కడ నివసిస్తున్న 20 కోట్ల మందికి పైగా ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. దాదాపు 23 కోట్ల మంది ప్రజలు రోజుకు రూ.375 ఆదాయం పొందుతున్నారు. నిరుద్యోగిత రేటు కూడా 7.6 శాతం వద్ద చాలా బాధ కలిగిస్తోంది. దేశంలో పేదరికం, నిరుద్యోగం ఉంది, అయితే పెరుగుతున్న అసమానతలను కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచంలోని మొదటి  ఆరు ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం  ఒకదానిలో ఒకటిగా ఉన్నప్పటికీ,  అంతా బాగానే ఉందని మేము చెప్పలేము. భారతదేశంలోని జనాభాలో ఒక శాతం మంది  దేశ సంపదలో 20 శాతం కలిగి ఉండగా, 50 శాతం మంది వద్ద 13 శాతం సంపద ఉందని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి అన్నారు. ఈ ఆర్థిక అసమానత గురించి మనం ఏదైనా చేయాలి. జనవరిలో, సంఘ్-అనుబంధ ఎస్ జె ఎం, ఏడు ఇతర మితవాద సంస్థలతో కలిసి, స్వావలంబి భారత్ అభియాన్ (ఎస్ బి ఏ) ను ప్రారంభించింది, ఇది 2030 నాటికి  దేశాన్ని నిరుద్యోగ రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆదివారం నాటి కార్యక్రమం, 'స్వావలంబన్ కా శంఖనాద్స‌, ఎస్ బి ఏ బ్యానర్‌లో నిర్వహించబడుతున్న ఈవెంట్‌ల శ్రేణిలో భాగం. పేదరికం, అసమానత, నిరుద్యోగంపై హోసబాలే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అగర్వాల్  ఈ సవాళ్లను ప్రధానమంత్రి స్వయంగా ప్రసంగాలలో లేవనెత్తారని అన్నారు. ఒక సామాజిక సంస్థగా, ఆర్ ఎస్ ఎస్‌ తన స్వంత ప్రత్యేక చొరవను కలిగి  ఉంది, ఈ సమయంలో వ్యాఖ్య లు చేసింది, ఎప్పుడూ సామాజిక సవాళ్ల గురించి ఆలోచిస్తుంది. అయితే ఇది ఆర్‌ఎస్ఎస్ చేసిన విమర్శ లేదా స్థానం మార్పు కాదని ఆర్థిక వ్యవహారాల బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్  కార్యకర్త కూడా  అయిన  హోసబాలే ప్రసంగాన్ని పౌరుల భాగస్వామ్యం  ద్వారా పేదరికాన్ని మరింత ఎలా తగ్గించవచ్చనే నేపథ్యంలో చూడాలని అన్నారు, ఎందుకంటే ప్రభుత్వం మాత్రమే ప్రతిదీ చేయ గలదు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.  ప్రభుత్వ పథకాలు  ఎంత  బాగా పని చేస్తున్నాయో ఉదాహరణలను అందించారు, అయితే, పరిమిత సమయంలో పేదరికాన్ని తగ్గించలేము. మరింత స్వావలంబన అవసరం మరియు స్వావలంబి భారత్ అభియాన్  ఆ  దిశలో ఎలా ముందుకు వెళ్లా లనే  దానిపై  దృష్టి పెడుతుంది. ప్రతిపక్షం పనికిమాలిన వివాదాన్ని సృష్టిస్తోందని  సంఘ్ కార్యకర్త పేర్కొన్నారు. ప్ర‌ధాని మోదీ తరచుగా స్వయం-విశ్వాసాన్ని సమర్ధిస్తారు, ఇది మరింత ఉపాధి కల్పనకు దారితీస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఏప్రిల్‌లో, రాబోయే 25 సంవత్సరాల వరకు ప్రజలు స్థానిక వస్తువులను ఉపయో గిస్తే, దేశం నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సమయంలో దేశం స్తబ్దు గా ఉండలేదు, తప్పనిసరిగా ఆత్మనిర్భర్ (స్వయం-ఆధారపడాలి) అని  నొక్కి చెప్పాడు. పేదరికం, అసమానతలపై ఆందోళనలు లేవనెత్తినప్పటికీ మోడీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమా లను హోసబాలే ప్రశంసించారని వర్మ అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు, అతను నిరుద్యోగం వెనుక ఉన్న కారణాలలో ఒకటిగా పేద స్థాయి విద్యను సూచించాడు మరియు దానిని పరిష్కరించడానికి జాతీ య విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. ఆ కోణంలో చూస్తే ఆయన వ్యాఖ్యలను ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలుగా చూడకూడదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ముంజేతి కంకణానికి అద్దమెందుకు జగనన్నా?

ఏపీలో పాలన ఎంత దివ్యంగా సాగుతోందో తెలుసుకోవడానికి విపక్ష నేతల ప్రసంగాలు వినాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలనూ పట్టించుకోవలసిన అవసరం లేదు. జగన్ అధికారంలోకి వచ్చాకా ఎంతో ప్రేమతో ప్రభుత్వంలో విలీనం చేసిన ఆర్టీసీ సిబ్బందిని అడిగితే చెబుతారు. ఒక ఉద్యోగం దొరకడమే దుర్లభంగా మారిన ఈ రోజుల్లో జగన్ సర్కార్ ఇంచక్కగా ఆర్టీసీ సిబ్బందికి రెండు ఉద్యోగాలు ఇచ్చేసింది. ఒకటి ఆర్టీసీలో డ్రైవర్/ కండక్టర్ ఉద్యోగమైతే.. రెండోది వాళ్ల వాళ్ల బస్సులు వెళ్లే దారిలో రహదారుల వేసుకునే ఉద్యోగం మరొకటి. మరి వేతనం సంగతి అంటారా? ఆ విషయం అడగొద్దు. ఒక ఉద్యోగానికి జీతం ఇవ్వడమే గగనంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో రెండో ఉద్యోగం ఇవ్వడమే గొప్ప..దానికి వేతనం కూడా ఇవ్వాలా? అందుకే వేతనం సంగతి మరిచిపోయాం అంటున్నారు ఆర్టీసీ సిబ్బంది. ఇక విషయానికి వస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లోనూ మనమే గెలుస్తాం.. గెలవాలి. ఇంత అద్భుతంగా పని చేస్తున్న మన ప్రభుత్వానికి కాకుండా ఇంకెవరికి ఓట్లేస్తారు అని పార్టీ నేలతను నిలదీస్తున్న జగన్ కు ఆయన పాలనలో రాష్ట్రం ఎంత వైభవంగా వెలిగిపోతోందో చెప్పడానికి రోడ్ల పరిస్థితి చాలు. ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? అన్నట్లుగా ఏపీ రోడ్లపై బస్సులు నడపడానికి ఆర్టీసీ సిబ్బంది పడుతున్న పాట్లు చూస్తే చాలు.   ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్శీపట్నం నియోజకవర్గం నాతవరం నుంచి తాండవ మధ్య రోడ్డుపై పల్లె వెలుగు బస్సు ప్రయాణాన్ని  ప్రయాణీకులు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తే చాలు. ఆ దారిలో వెళ్లే బస్సులను నడిపే డ్రైవర్, కండక్టర్లు ఎంత హ్యాపీగా తన విధులు నిర్వర్తిస్తున్నారో గమనిస్తే చాలు.  బస్సు ముందుకు కదలాలంటే ఆ బస్సు నడిపే డ్రైవర్, కండక్టర్ లే దారి వేసుకోవాలి. రోడ్డు నిర్మించుకోవాలి. ఆ పనే చేస్తున్నారు. బండలను తెచ్చి రోడ్డు లెవెల్ చేసుకుని గుంటలను పూడ్చుకుని ముందుకు కదులుతున్నారు. ఆర్టీసీ సిబ్బందే రోడ్డు వేసుకుని మరీ బస్సు నడుపుతున్న ఒక వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిపోయింది. జగన్ పాలనలో ఏపీ వైభవాన్ని ఈ వీడియో కళ్లకు కడుతోందంటూ నెటిజన్లు తెగ ‘ప్రశంసలు’ కురిపించేస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వల్లనే ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు స్వయంగా రోడ్లు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అని ఆయన ట్వీట్ లో ఘాటుగానే విమర్శించారు. మీ పరిపాలన వల్లనే ప్రజలు అంతా ఇలాంటి కష్టాలు పడుతున్నారని మాధవ్ హాట్ కామెంట్స్ చేశారు. దీనికి మరి వైసీపీ నేతలు ఎలా కౌంటర్ ఇచ్చి తమను తాము డిఫెన్స్ చేసుకుంటారో చూడాలి.

బండ్ల గణేష్.. ఆ గట్టునున్నావా?.. ఈ గట్టునున్నావా?

ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుందంటారు. మనవూరి పాండవులు అనే సినిమాలో ముళ్ల పూడి వారి డైలాగ్ ఒకటి ఉంటుంది. అన్నీ వేటి కూతలు అవి కూస్తే.. నువ్వు మాత్రం అన్నిటి కూతలూ కూస్తావు అని అర్ధం వచ్చే డైలాగ్ అది. ఇప్పుడు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తీరు అలాగే ఉంది. ఏపీలో రెండు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి బండ్ల గణేష్ అవసరాన్ని బట్టి ఒక్కో పార్టీ మాట మాట్లాడుతున్నారని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఏవో చిన్న చిన్న కామెడీ పాత్రలు వేసుకుంటూ లాగిస్తూ హఠాత్తుగా నిర్మాత అవతారం ఎత్తిన బండ్ల గణేష్ జనసేనాని పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కల్యాణ్ మీద ఈగ వాలితేనే తెగ హడావుడి చేసే బండ్ల గణేష్ రాజకీయంగా మాత్రం పవన్ కల్యాణ్ తో అడుగులు కలిపి నడవడం లేదు. గతంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు ఆయన అడుగులు వైసీపీ వైపు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ స్వయంగా బండ్ల గణేష్ అటువంటి ప్రకటన ఏదీ చేయకపోయినా.. వైసీపీ నేతలతో ఆయనకున్న సంబంధాలు, పరిచయాలు మాత్రం బండ్ల గణేష్ అడుగులు వైసీపీ వైపే అని చెప్పకనే చెబుతున్నాయి. బండ్ల గణేష్ అంటేనే వివాదానికి కేరాఫ్ అడ్రస్ అని సినీ వర్గాల్లోనే చెప్పుకుంటుంటారు. ఆయన అడుగేస్తే కాంట్రవర్సి, ఆయన మాట్లాడితే కాంట్రవర్సి, ఆయన మౌనంగా ఉంటే కాంట్రవర్సి.. కాట్రవర్సి..కాంట్రవర్సి..కాంట్రవర్సి అన్నట్లుగా ఉంటుంది బండ్ల గణేష్ తీరు. బండ్లగణేష్ సామాజిక మాధ్యమంలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు. మా ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ అప్పట్లో సెన్సేషన్. పవన్ కల్యాణ్ తనకు సినిమా తీసే చాన్స్ ఇస్తే వేయికోట్ల వసూళ్ల రేంజ్ ఎలా ఉంటుందో చూపుతానని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా సంచలనం సృష్టించాయి. అటువంటి బండ్ల గణేష్ జనసేనలో కాకుండా వైసీపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలే ఆయన ఇక్కడ మాటలు ఇక్కడ, అక్కడి మాటలు అక్కడా చెబుతున్నారా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన లైవ్ లోనే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ తో లైవ్ లోనే ఫోన్లో మాట్లాడిన తీరు, ఆ సంభాషణలో మాజీ మంత్రితో బండ్ల గణేష్ కు ఉన్న చనువు చూస్తుంటే.. వైసీపీ నేతలతో ఆయనకు చక్కటి అనుబంధం, అండర్ స్టాండింగ్ ఉందని పించేలా ఉన్నది. పైగా వైసీపీ నేతలతో బండ్ల గణేష్ అనుబంధం గురించి గతంలోనే చాలా వార్తలు వచ్చాయి. బండ్ల గణేష్ నిర్మాతగా మారేందుకు, ఆయన ఎదిగేందుకు వైసీపీ ‘సహకారం’ మెండు అని ఇండస్ట్రీలోనే చెప్పుకుంటుంటారు. తాజాగా ఆయన చనువుగా మాజీ మంత్రికి ఫోన్ చేసి మరీ మాట్లాడటం దానినే ధృవపరిచింది. పవన్ కల్యాణ్ గురించి వేదికలెక్కీ, సామాజిక మాధ్యమం వేదికపైనా ప్రసంగాలు దంచే బండ్ల గణేష్ రాజకీయం వద్దకు వచ్చే సరికి వైసీపీవైపే మొగ్గు చూపుతున్నారనీ, దీని వెనుక కారణం ఏమిటన్నది అంతుబట్టకుందనీ బండ్ల గణేష్ సన్నిహితులే అంటున్నారు. ఏది ఏమైనా సినిమాల వరకూ పవన్ కల్యాణ్ రాజకీయాల వద్దకు వచ్చే సరికి బండ్ల గణేష్ కు వైసీపీలోనే తన భవిష్యత్ కనిపిస్తున్నట్లుందని సామాజిక మాధ్యమంలో సెటైర్లు పేలుతున్నాయి.   చూస్తుంటే తన బాస్ అయిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనను వదిలేసి వైసీపీలోకి బండ్ల గణేష్ చేరేలానే ఉన్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాల పరంగా పవన్ ను అభిమానించే బండ్ల.. రాజకీయంగా మాత్రం వేరే అడుగులు వేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరీ బండ్ల గణేష్ రాజకీయాలు ఎటువైపు సాగుతున్నాయది.?

తెలుగుదేశం వైపు కేసీఆర్ చూపు?

అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. ఇంకా కుదరకపోతే ఎదుటి పార్టీని చీల్చు.. ఆవిర్బావం నుంచీ తెరాస రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు ఇదే పంథాలో సాగాయి. తన లక్ష్యసాధన కోసం..అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏమైనా చేస్తానని కేసీఆర్ అప్పట్లో చెప్పిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేసింది. ఆ తరువాత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునీ ఎన్నికల బరిలోకి దిగింది. ఆ తరువాత అన్ని పొత్తులనూ వదులుకొని విమర్శలు గుప్పించింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రం ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కూడా ప్రకటించిన కేసీఆర్ ఆ తరువాత కొత్త రాష్ట్రంలో (తెలంగాణ) కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పావులు కదిపిన సంగతి విదితమే. ఇప్పుడు కొత్త  జాతీయ పార్టీని ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్.. అవే పాత వ్యూహాలు, ఎత్తుగడలతో పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తనకు జాతీయ పార్టీ విషయంలో అండగా నిలిచే పార్టీలను, వ్యక్తులను గాలించే పనిలో పడ్డారు. దేశ వ్యాప్తంగా క్రియాశీలంగా ఉన్న ఏ ఒక్క నాయకుడూ, ఏ ఒక్క పార్టీ ఆయనతో కలిసి అడుగులు వేయడానికి సుముఖత చూపకపోవడంతో.. ఆయన చూపు ఏపీ వైపు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం వైపు మళ్లిందని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో కేసీఆర్ పని చేసిన సంగతి విదితమే. అప్పట్లో తన కున్న పరిచయాలను ఇప్పుడు ఉపయోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు. తెరాస ఆవిర్భావం తరువాత, తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఆపరేషన్ ఆకర్ష్ కు ఆకర్షితులైనది తొలుత తెలంగాణలోని తెలుగుదేశం నాయకులే.ప్రస్తుతం తెరాసలో కీలకంగా ఉన్న వారిలో అత్యధికులు గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారే.. అదే దారిలో ఇప్పుడు ఆయన ఏపీలోని తెలుగుదేశం నాయకులకు గాలం వేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా చెప్పారంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వెల్లడించారు. ఎర్రబెల్లి కూడా మాజీ తెలుగుదేశం నాయకుడేనన్న సంగతి విదితమే. గతంలో టీఆర్ఎస్ లోకి తెలంగాణ తెలుగుదేశం నాయకులను ఆకర్షించిన విధంగానే ఇప్పుడు తన జాతీయ పార్టీలో చేరాల్సిందిగా ఆయన ఏపీ తెలుగుదేశం నాయకులను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో పెద్దగా చురుకుగా లేని నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా ఆయన టార్గెట్ అంతా మాజీ ఎంపీలపై ఉందని అంటున్నారు. తన కొత్త పార్టీ తరఫున  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచీ అభ్యర్థులను నిలపాలని భావిస్తున్న కేసీఆర్ ముందుగా అందుకు అభ్యర్థుల గాలింపు కోసం ఏపీని, అందులోనూ తెలుగుదేశం నేతలను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కడప జిల్లాలపై కేసీఆర్ దృష్టి పెట్టారని చెబుతున్నారు. ఇప్పటికే తన కొత్త రాజకీయ పార్టీ బీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఆ జిల్లాలకు చెందిన కొందరు తెలుగుదేశం నాయకులకు కేసీఆర్ నుంచి పిలుపు వెళ్లిందని అంటున్నారు. ఏపీలో తన కొత్త రాజకీయ పార్టీ బీఆర్ఎస్ కు మార్గం సుగమం చేసే దిశగా కేసీఆర్ గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని అంటున్నారు. అందులో భాగంగానే మాజీ ఎంపీ, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ తో సుదీర్ఘ భేటీ జరిపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక తెరాస మంత్రులు, నాయకులూ కూడా తరచూ ఏపీపైనా, ఏపీలో పరిస్థితులపైనా చేసిన, చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు కూడా కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశానికి ఏపీలో సానుకూలత ఏర్పరిచే వ్యూహంలో భాగమేనని అంటున్నారు.   ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ లో తనతో కలిసి పని చేసిన నేతలకు కేసీఆర్ నుంచి ఆహ్వానం వెళ్లిందని అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారా? పెట్టరా అన్న అనుమానాలు ఉండేవి. కానీ ఈ నెల 2 (ఆదివారం) ఆయన పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో ఆయన ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేసేశారు.  కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసేశారు. తాను స్థాపించనున్న జాతీయ పార్టీ పేరును దసరా రోజున ప్రకటించాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్ లో దసరా రోజున (అక్టోబర్ 5) టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ పేరు ప్రకటించనున్నారు. డిసెంబర్ 9న ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. తాను స్థాపించబోయే కొత్త జాతీయ పార్టీ ఎదుర్కొనే తొలి ఎన్నిక మునుగోడే అవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక విజయంతో తన కొత్త జాతీయ పార్టీ శుభారంభం చేస్తుందని ఆయన భావిస్తున్నారు.  ఇక అసలు విషయానికి వస్తే ఏపీలో పాగా వేయాలని కేసీఆర్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు.కొంత కాలంగా టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ ఏపీలోనూ విస్తరిస్తుందని, ఆ రాష్ట్రంలోనూ తాము రాజకీయం చేస్తామనీ చెబుతూ వస్తున్నారు. అంతెందుకు ఏపీలో పాలన అధ్వానంగా ఉందని, సమయం వచ్చినా రాకున్నా, సందర్భం అయినా కాకున్నా విమర్శలు గుప్పిస్తున్నారు.   ఏపీ నుంచి తన కొత్త రాజకీయ పార్టీకి మద్దతు లభిస్తుందన్న ఆశతో కేసీఆర్ ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంద్రులపై విద్వేష పూరిత వ్యాఖ్యలు, విమర్శలతో చెలరేగిపోయి, ఆ తరువాత రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా ఏపీకి విభజన చట్టం ప్రకారం న్యాయంగా ఇవ్వాల్సిన వాటికి, రావాల్సిన వాటికీ అడుగడుగునా అడ్డం పడుతున్న కేసీఆర్ కు ఏపీ నుంచి ఏ విధమైన మద్దతైనా వస్తుందా అన్న అనుమానాలను అయితే పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏపీలోని వైసీపీ సర్కార్ కు అన్ని విధాలుగా లోపాయికారీ మద్దతు ఇస్తూ, ఆ ప్రభుత్వాధినేత బలహీనతలను ఆసరాగా తీసుకుని అడుగడుగునా ఏపీపై విమర్శలు గుప్పిస్తున్న టీఆర్ఎస్ పైనా, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పైనా ఏపీలో సానుకూలత వ్యక్తం అవుతుందా అంటే అనుమానమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిలుపునకు, ఆహ్వానానికీ ఏపీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందన్నది చూడాల్సింది. ఇప్పటికైతే కేసీఆర్ ఆహ్వానానికి ఏపీ నేతల నుంచి ఎటువంటి స్పందనా రాలేదనే చెబుతున్నారు.  

మాన‌వ ప‌రిణామంపై ప‌రిశోధ‌న..నోబెల్ అందుకున్న పాబో

స్వీడిష్ శాస్త్రవేత్త  మానవ పరిణా మంలో ఆవిష్కరణలకు మెడిసిన్ నోబెల్ గెలుచుకున్నాడు. అంత రించిపోయిన హోమినిన్‌ల జన్యు వులు, మానవ పరిణామానికి సంబంధించి కనుగొన్నందుకు శాస్త్రవేత్త స్వంటే పాబో 2022 ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని గెలుచుకు న్నారని అవార్డు సంఘం సోమ వారం ప్ర‌క‌టించింది. లక్షల ఏళ్ల కిందట అంతరించి పోయిన నియాండర్తల్‌ జాతితో ఆధునిక మానవ జాతికున్న సంబంధం, రోగనిరోధక వ్యవస్థపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. నియాండర్తల్‌, డెనిసోవన్‌ జాతుల జన్యువులతో ప్రస్తుత మానవ జాతి జన్యువులను పోల్చుతూ పాబో పరిశోధనలు చేశారు. నియాండర్తల్‌ జాతితో ఆధునిక మానవులు కలిసి జీవించినట్లు ఆయన నిరూపిం చారు. ఈ క్రమంలో ఇరు జాతుల కలయిక ద్వారా పిల్లలు కూడా పుట్టినట్లు తెలియజేశారు. సుమారు 8 లక్షల ఏళ్ల కిందట ఇది జరిగినట్లు పాబో పరిశోధనల్లో తేలింది. నియాండర్తల్‌  జన్యువుల కలయిక ద్వారా ఆధునిక మానవుల్లో ప్రత్యేక రోగ నిరోధక వ్యవస్థ ఏర్పడింది. కోవిడ్‌19 మహమ్మారి ప్రపంచాన్ని కొంత సాధారణ స్థితికి తీసుకురావడానికి అనుమతించిన వ్యాక్సిన్‌ల అభివృద్ధికి చివరికి బహుమతి లభిస్తుందని చాలా మంది ఆశించడంతో వైద్య పరిశోధనా కేంద్రం ఆశించింది. అయినప్పటికీ, ఏ పరిశోధన అయినా గౌరవించబడటానికి చాలా సంవత్సరాలు పడుతుంది, విజేతలను ఎన్నుకునే బాధ్యత కలిగిన కమిటీలు ఎల్లప్పుడూ పోటీదా రులతో నిండిన రంగంలో కొంత ఖచ్చితంగా దాని పూర్తి విలువను నిర్ణయించాలని చూస్తాయి. మానవ చర్మంలో ఉష్ణోగ్రత, స్పర్శను గ్రహించి, భౌతిక ప్రభావాన్ని నరాల ప్రేరణలుగా మార్చే గ్రాహకాలను కనుగొన్నందుకు అమెరికన్లు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్‌లకు గత సంవత్సరం ఔషధ బహుమతి లభించింది. 67 ఏళ్ల స్వాంటే పాబో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిక్‌, మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎవొల్యూషనరీ ఆంత్రోపాలజీలో పరిశోధనలు చేశారు.

జాతీయ రాజకీయాల్లో విపక్షాల గురి తప్పుతోందా?

2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి. కురువృద్ద కాంగ్రెస్ పార్టీ  అధినాయకురాలు సోనియా గాంధీ మొదలు రేపో మాపో జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు  బీజేపీ ప్రత్యర్ధి పార్టీల నాయకులు అందరిదీ అదే మాట. అందుకోసమే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ‘భారత్ జోడో’ యాత్ర చేస్తున్నారు. అందుకోసమే, కమ్యూనిస్టులు ఎవరితో అంటే వారితో చేతులు కలిపేందుకు సిద్డమవుతున్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్ ఎవరి శక్తి కొలది వారు  ప్రయత్నిస్తున్నారు. ఎవరి వ్యూహాలు వారు రచించుకుంటున్నారు. మరోవంక, బీజీపే వ్యతిరేక పార్టీల నేతలు అందరినీ  రింగ్ మాస్టర్ లా ఆడిస్తున్న, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  కూడా అదే ధ్యేయంతో బీహార్ లో పాద యాత్ర ప్రారంభించారు.   సరే 2024 ఎన్నికలకు ఇంకా చాలా దూరముంది. అంతకంటే ముందుగా తెలంగాణ సహా మరో ఐదారు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలున్నాయి, ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గానూ భావిస్తునారు. అందులోనూ ఇప్పుడు గుజరాత్ హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముందు వరసలో ఉన్నాయి.మరో రెండు నెలల్లోనే ఈ రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో వుంది. ఈ రెండు రాష్ట్ర్రాలలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగితే 2024 లోక్ సభ ఎన్నికలపై, విపక్షాలు ఆశలు పెట్టుకోవచ్చని రాజకీయ పండితులు విశ్లేస్తున్నారు.  అయితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడించే స్థితిలో ప్రతిపక్ష పార్టీలున్నాయా? అంటే, రాజకీయ విశ్లేషకులే కాదు, వివిధ సంస్థలు నిర్వహిచిన సర్వేలు కూడా లేదనే అంటున్నాయి. గుజరాత్,  హిమాచల్ ప్రదేశ్‌  రెండు రాష్ట్రాలలోనూ మళ్ళీ బీజేపీదే గెలుపని  సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.ఇప్పటికే, వేరు వేరు సంస్థలు నిర్వహించిన సర్వేలు అదే చెప్పాయి. ఇప్పడు తాజాగా, ఏబీపీ న్యూస్‌-సీఓటర్‌  నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ కూడా  రెండు రాష్ట్రాల్లో మరోసారి బీజేపీదే గెలుపని తేల్చి చెబుతున్నది.  ఏబీపీ న్యూస్‌-సీఓటర్‌ ఒపీనియన్‌ పోల్‌ ప్రకారం గుజరాత్‌ అసెంబ్లీలో ఎన్నికలలో బీజేపే అధికారాని నిలబెట్టుకోవడమే కాకుండా, గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. గత ఎన్నికలలో బీజేపీ  అతికష్టం మీద  మొత్తం  182 స్థానాలకు గానూ 99 స్థానాలలో గెలిచి పరువు నిలుపుకుంది. అయితే  ఈసారి 135 నుంచి 143 వరకు స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఒపీనియన్  పోల్‌ పేర్కొంది. కాంగ్రెస్‌కు 36 నుంచి 44 స్థానాల వరకు సీట్లు దక్కవచ్చని ఒపీనియన్ పోల్ అంచనావేసింది. అలాగే 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 37-45 సీట్లలో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్ తెలిపింది.  ఒపీనియన్ పోల్స్ తోపాటుగా గుజరాత్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను విశ్లేషించినా బీజేపీ విజయం ఖాయంగానే కనిపిస్తోందని రాజకీయ పండితులు  పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉంది. బీజ్పీకి గట్టి పోటీ ఇచ్చింది. కానీ గడచిన ఐదేళ్ల కాలంలో  ముఖ్యంగా అహ్మద్ పటేల్ కన్ను మూసిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది.అంతే కాకుండా పటేదార్ ఆందోళనతో ఫేమ్ లోకి వచ్చిన యువనేత, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌  హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ  నాయకత్వ సమస్యను ఎదుర్కుంటోంది. ఇది హస్తం పార్టీ నేతలను కలవరపెడుతోంది.  మరోవంక, పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన ఆమ్ ఆద్మీ గుజరాత్ లోనూ కాంగ్రెస్ ఓటుకు గండి కొడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వరసగా ఆరు పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీకి సహజంగానే రాష్ట్రంలో కొంత వ్యతిరేకత ఉంది, అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్,  ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య చీలిపోవడంతో  అది బీజేపీకి మేలు చేస్తుందని అంటున్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ సమర్ధ నాయకత్వం లేకపోవడం మైనస్ పాయింట్‌గా మారిందని అంటున్నారు,. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గుజరాత్ లో సాగితే కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రయోజనం ఉంటుందని స్థానిక నాయలు ఆశించారు. అయితే, రాహుల్ యాత్ర రూట్ మ్యాప్ లో  గుజరాత్’, హిమాచల ప్రదేశ్ రాష్ట్రాలను చేర్చలేదు. దీంతో, గుజరాత్,హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఆశలు వదులుకుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో, రాహుల్ యాత్ర వలన వస్తుందనుకున్న మైలేజి రాకపోగా  నెగటివ్ ప్రచారానికి అవకాశం ఇచ్చిందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. దీనికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌లో ఆదరణ పెరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకుడు, అరవింద్ కేజ్రీవాల్ వారంలో రెండు సార్లు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోనూ అదే పరిస్థితి, కని పిస్తోంది. అందుకే  బీజేపీ వ్యతిరేక పార్టీలు, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడం  ఇప్పటికైతే, అయ్యే పని కాదనే అనిపిస్తోంది. అయితే, రాజకీయాలలో ఎప్పుడైనా, ఏదైనా జరగ వచ్చును.

సీనియర్ల సహాయ నిరాకరణ.. చిక్కుల్లో రేవంత్ ?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సమస్యలు చుట్టుముడుతున్నాయా?, ఇటు మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలు,  అటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సన్నాహాల మధ్య ఆయన నలిగి పోతున్నారా?  ఇదే అదనుగా  సీనియర్లు తమ వంతు సమస్యలు సృష్టిస్తున్నారా?  అంటే, గాంధీ భవన్ వర్గాలు అవునననే అంటున్నాయి.   నిజానికి, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి పార్టీ సీనియర్లు ఆయన పట్ల కొంత గుర్రుగానే ఉన్నారు. అదేమీ, రహస్యం కాదు. అయినా, ముందు కొంత కాలం, రేవంత్ రెడ్డి, సర్దుకు పోయే ధోరణి అవలంబించారు. అందరినీ కలుపుకు పోయే ప్రయత్నం చేశారు. పార్టీ సీనియర్లలోనూ  ఒకరిద్దరు మినహా మిగిలి నేతలందరూ రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉండడం వల్లనో ఏమో కానీ అలివి కాని చోట అధికుల మనరాదు అన్నట్లు మౌనంగా ఉండిపోయారు. కానీ, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సేనియర్లను హోం గార్డ్స్ తో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారో, ఇక అక్కడి నుంచి, సీన్ మారిపోయింది. నిజానికి,అప్పటికే రెంత్ రెడ్డి ఒకటికి రెండు సార్లు గీత దాటి, సీనియర్ నాయకులను హర్ట్ చేసే వ్యాఖ్యలు చేశారు. అలాగే, రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి, అద్దంకి దయాకర్ మునుగోడు సభలో పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డిని ఉద్దేశించి  పార్టీలో ఉంటే ఉండు, పొతే ..’ అంటూ చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి, సేనియర్ల మధ్య దూరాన్ని మరింత పెంచింది. దయాకర్ తో పాటుగా, రేవంత్ రెడ్డి కూడా కోమటి రెడ్డికి క్షమాపణలు చెప్పినా, అటు రేవంత్, ఇటు దయాకర్ చేసిన వ్యాఖ్యలు సీనియర్లను వెంటాడుతూనే ఉన్నాయి. పైకి అంతా సర్డుకున్నట్లు కనిపించినా లోలోపల అగ్గి రగులుతూనే వుందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయని న్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇంతకాలం ఒక విధంగా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సీనియర్ నాయకులు, ఇటు నుంచి మునుగోడు  అటు నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర రేవంత్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమయంలో బాధ్యత మొత్తాన్ని, రేవంత్ రెడ్డిపై వదిలేసి, తమాషా చూస్తున్నారని, అందుకే రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అంటున్నారు.   ఓ వంక మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు వచ్చేసింది. ఈ రోజుకు ఖచ్చితంగా నెల రోజుల తర్వాత, నవంబర్ 3 న పోలింగ్ జరుగుతుంది. మరో వంక కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిస్తున్న భారత్ జోడో పాదయాత్ర ఈ నెల ( అక్టోబర్) 24 న రాష్ట్రంలో ప్రవేశిస్తోంది. ఇదే అదనుగా  సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహాలతో పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా, మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి నెగ్గితే రేవంత్ రెడ్డి మరింతగా రెచ్చి పోతారని, దానికి తోదు రాహుల్ యాత్ర రాష్ట్రంలో సక్సెస్ అయితే  ఇక తమకు కాంగ్రెస్ పార్టీలో నూకలు చెల్లినట్లే భావిస్తున్న సీనియర్లు  ముందు జాగ్రత్తగా ఒక విధంగా సహాయ నిరాకరణ సూత్రాన్ని పాటిస్తున్నారని అంటున్నారు.   రేవంత్ రెడ్డి, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలతోనే కాకుండా, ఇటు సొంత పార్టీలోని అంతర్గత శత్రువులతోనూ ఏకకాలంలలో  పోరాడా వలసి వస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అదలా ఉంటే, మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు, రేవంత్ రెడ్డితో కొంత సఖ్యతగా ఉంటున్న మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు గీతా రెడ్డి, షబ్బీర్ ఆలీ సహా మరి కొందరికి  నేషనల్ హెరాల్డ్ కేసులో  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.  విచారణకు ఢిల్లీ పిలిపించింది. దీంతో  రేవంత్ రెడ్డి,  కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా  విరుచుకు పడుతున్నారు. ఈడీ నోటీసుల పేరుతో కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలిపించడం.. వారిని భయభ్రాంతులకు గురిచేసి బీజేపీలో చేర్చుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ  ఈడీని ఎలక్షన్ డిపార్ట్‌మెంట్‌గా మార్చిందని పేర్కొన్నారు. అయితే, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కు అసలు కారణం సీనియర్లు సహకరించక పోవడమే  అంటున్నాయి పార్టీ వర్గాలు.కారాణాలు ఏవైనా రేవంత్ రెడ్డి బయటి నుంచే కాకుండా లోపలి నుంచి కూడా సమస్యలు ఎదుర్కుంటున్నది మాత్రం నిజమని పరిశీలకులు అంటున్నారు.

హైదరాబాద్ పై మళ్లీ ఉగ్ర పడగ?.. దాడుల కుట్ర భగ్నంతో ఉలిక్కిపడిన విశ్వనగరం

ప్ర‌జ‌లలో మ‌ళ్లీ ఉగ్ర‌ దాడులు భయం పెచ్చరిల్లింది. సమాజంలో ద్వేష భావం పెరగడం, మత ఉద్రిక్తతలు నెలకొనడానికి తోడు ఆదివారం( అక్టోబర్ 2) హైద‌రాబాద్‌లో ఉగ్రదాడులకు కుట్రను భగ్నం చేస్తూ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయ‌డంతో ఆ భ‌యం, ఆ ఆందోళన రెండింత‌ల‌యింది.  ప్ర‌ధానంగా వారు ఆర్ ఎస్ ఎస్‌, బీజేపీ నాయ‌కుల‌పై  ఉగ్రదాడులకు కుట్ర పన్నారన్న సమాచారం ఆ భయాందోళనను మరింత పెంచింది.  ఏమ‌యిన‌ప్ప‌టికీ హైదరాబాదీయులు మ‌రో మారు మత ఘర్షణలను సహించేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేరు. చాలాకాలం క్రితం కోటీలోని గోకుల్ చాట్ భండార్, లుంబినీ పార్కులలో జరిగిన జంట పేలుళ్లు, దిల్‌సుఖ్ న‌గ‌ర్ ల‌లో జ‌రిగిన   పేలుడు ఘటనల గాయాల నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో  దసరా పండుగ సమయంలో మరో ఉగ్రదాడికి కుట్రను పోలీసులు భగ్నం చేశారన్న వార్త వారిని మరో సారి భయాందోళనలకు గురి చేసింది. కుట్ర భగ్నమైంది కనుక సరిపోయింది.. లేకుంటే అన్న ఊహా హైదరాబాదీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.  తాజాగా ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తులకు పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది.   కేంద్రం ఇటీవ‌ల దేశవ్యాప్తంగా  పిఎఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థ‌ల‌పై ఎన్ ఐ ఏ దాడులు దూకుడుగా చేప‌ట్టిన నేపథ్యమే.. హైద‌రాబాద్‌పై ఉగ్రవాదుల కన్నుపడటానికి కారణంగా భావిస్తున్నారు.   దీనికి తోడు ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవ‌ల ఢిల్లీలోని మ‌ద‌ర‌సా లో ముస్లిం నేత‌తో స‌మావేశం కావ‌డాన్ని, భగవత్ ను కొందరు ముస్లిం మత పెద్దలు ప్రస్తుతించడాన్ని కూడా తీవ్ర‌వాద   సంస్థ‌లు జీర్ణించుకోలేక‌పోతున్నాయనీ, ఆ పర్యవశానమే ఉగ్ర దాడులకు కుట్రలని అంటున్నారు.  బీజేపీ పాల‌నా ప‌రమైన నిర్ణ‌యాలు, దేశంలో ముస్లింల అణ‌చివేత‌కు కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టుగా బీజేపీ వ‌ర్గాలు  మాట‌లలు కూడా ఆ సంస్థ‌ల‌ను రెచ్చ‌గొడుతోంద‌న్న అభిప్రాయాలు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉంది. తెలంగాణాలో అధికారంలోకి రావాల‌న్న ల‌క్ష్యంతోనే  మైనారిటీలపైనా, మ‌రీ ముఖ్యంగా హైద‌రాబాదీయుల‌మీద కేంద్రం ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. అనుచిత వ్యాఖ్యలు చేయ‌డం, నిఘా పేరుతో మైనారిటీలను వేధిస్తున్నారంటూ ఎంఐ ఎం నేత అస‌దుద్దీన్ ఓవైసీ కేంద్రాన్ని విమర్శించిన నేపథ్యం కూడా ఇదే.  కాగా పోలీసులు తాజాగా అరెస్టు చేసిన ముగ్గురిలో జాహిద్ అనే వ్యక్తి 2005న హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో బాంబు పేలుడు కేసులో నిందితునిగా ఉన్నాడు. దానికి సంబంధించి కేసును 2017లో కొట్టివేశారు. అయితే కొంతకాలంగా ఉగ్రకార్యకలాపాలకు దూరంగా ఉన్న జాహిద్ తాజా కుట్ర కోణంలో భాగమయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. కాగా గతంలో మక్కా మసీద్ పేలుళ్ల ఘటనలో కూడా జాహిద్ ను పోలీసులు ప్రశ్నించారు. ఇక ప్రస్తుతం జాహిద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధీ నంలో ఉన్నాడు. రద్దీ ప్రదేశాలే లక్ష్యంగా గ్రనేడ్‌  దాడులు చేసేందుకు కుట్ర పన్నిన ముగ్గురు ఉగ్రవాదులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి.. ఉగ్ర కుట్రను భగ్నం చేశారు.  ఈ సందర్బంగా పాకిస్థాన్ మేడ్ గ్రనేడ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మాణుష్య ప్రాంతంలో గ్రనేడ్ ట్రయల్ బ్లాస్ట్ ప్రయత్నాలలో ఉండగా  పోలీసులు అరెస్ట్ చేశారు. 

క్ష‌మించ‌మ్మా..!

అవాంత‌రాలు చెప్పిరావు, వ‌చ్చివెళ్లిన త‌ర్వాత గాని ప్ర‌భావం తెలీదు. ఎతిక్ అనే పెద్దామె ఇండోనే షియా మ‌లాంగ్న‌గ‌రం సైఫాల్అన్వ‌ర్ ఆస్ప‌త్రిలో నేల‌మీద దిగులుగా కూచునుంది. క‌న్నీళ్లింకిన క‌ళ్లు ఐసియూనే చూస్తున్నాయి. లోప‌ల ఆమె ఏకైక కుమార్తె 21ఏళ్ల డ‌యాన్ పుష్పిత చావుబ‌తుకుల మ‌ధ్య ఉంది. డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ చేస్తున్నారు.  కూతురు కోరిన కోరిక‌ను కాద‌న‌లేక ఆ రోజు ఫుట్‌బాల్ మ్యాచ్‌చూడ్డానికి పిల్ల స్నేహితురాలితో పంపింది. మృత్యువే పిలిచిన‌ట్ట‌యిందని బావురుమంటోంది పుడు. అస‌లా తొక్కిస‌లాట దృశ్యం టీవీలో చూస్తేనే  దాదాపు ప్రాణం పోయినంత అయింది.  పోలీసులు టియ‌ర్‌గ్యాస్ వ‌ల్ల క‌నీసం ఊపిరాడుతోంది పిల్ల‌కి.. అంటూ రోదిస్తోంది.  ఆ సంఘ‌ట‌న జ‌ర‌గ‌గానే ఆమె స్నేహితురాలి ద‌గ్గ‌ర నుంచి ఫోన్ వ‌స్తే ఆస్ప‌త్రికి చేరుకుంది ఎతిక్‌.  క్రీడాచ‌రిత్ర‌లో భ‌విష్య‌త్తులో ఏ త‌ర‌మూ మ‌ర్చిపోలేని ఘోరం జ‌రిగిపోయింది. అభిమానుల ఉన్మాద‌మే ఇంత‌మంది చావుకు కార‌ణ‌మైంద‌ని అంటున్నారు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న‌వారు. ఆట ఆట లానే చూడాలి, ఆట‌ను ఉన్మాదంతో చూస్తే ఇలానే ఫ‌లితం ఉంటుంది మ‌రి. తొక్కిస‌లాట‌లో చ‌ని పోయిం ది 125 మంది, గాయ‌ప‌డింది 300 మంది. కానీ మ‌ర‌ణిస్తున్న‌వారి సంఖ్య పెరుగుతోంది. ఎంద‌రో త‌మ పిల్లల్ని, బంధువుల్నీ, స్నేహితుల్నీ పోగొట్టుకుంటున్నారు. త‌న కూతురికి భుజం ఎముక విరిగిం దిట‌, మొహం వాచిపోయింది, చెవి అంచు చీలి ర‌క్తం వ‌ర‌ద‌లైందిట‌! ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 12 గంట‌లపాటు ఆస్ప‌త్రిలో ఆ పెద్దామె అలా ప‌డుంది. తిండి లేదు, క‌ళ్లు మూత‌లు ప‌డ‌టం లేదు, దాహమూ లేదు.. పిల్ల బ‌తికి బ‌య‌ట‌ప‌డితే బాగుండ‌న‌ని ఐసీయూ త‌లుపుల‌కే క‌ళ్ల‌ప్ప‌గించింది ఎతిక్‌. పోలీసులు నేరుగా జ‌నాల‌మీద‌కే గురిపెట్టి టియ‌ర్ గ్యాస్ షెల్స్ కొట్ట‌డంతో ఆ పొగ లో ఎవ‌రు ఎక్క‌డు న్నారో కూడా తెలీకుండా పోయింద‌ని, ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఖంగారుగా ప‌రిగెట్ట‌డంలో ఇద్ద‌రం అనేక‌ మందిని దాటుకుంటూ రావ‌డంలో నేను చాలాసార్లు కింద‌ప‌డ్డాన‌ని, కొంద‌రు కాళ్లూ చేతుల మీద తొక్కు కుంటూ వెళ్లార‌ని అయినా నా స్నేహితురాలిని వీడ‌కుండా బ‌య‌టికి లాక్కురాగ‌లిగాన‌ని ఎతిక్ కుమార్తె ఫ్రెండ్  అప్ప‌టి సంఘ‌ట‌న వివ‌రిస్తూంటే ప్రాణంతో ఈ ఇద్ద‌రూ ఎలా బ‌య‌ట‌ప‌డినందుకు వేయి దేవేళ్ల‌ కు మొక్కు కున్నారు డాక్ట‌ర్లు, న‌ర్సులూ, ఎతిక్‌తో పాటు!  ఆప‌రేష‌న్ త‌ర్వాత ఎతిక్ త‌న కుమార్తెను చూడ్డానికి డాక్ట‌ర్లు అంగీక‌రించారు. పిల్ల‌కు మాట రావ‌డం లేదు. చేయి మెల్ల‌గా క‌దిలిస్తూ పెద్దామె క‌న్నీళ్లు తుడిచింది.. క్ష‌మించ‌మ్మా... ఇంకెప్పుడూ ఎక్క‌డికీ వెళ్ల‌ను.. మొండికేయ‌ను.. అంది!

తెర‌వెనుక  కొట్లాట‌లు...బూమ‌రాంగ్‌లే! 

రెండు వీధుల వారికి ప‌డ‌న‌ప్పుడు అటు వేపు, ఇటువేపు వీల‌యిన‌పుడ‌ల్లా బ‌హిరంగంగానో, ర‌హ‌స్యంగానో ప‌ట్టుకుని కొట్టుకోవ‌డం, ఆస్ప‌త్రి పాలుకావ‌డం సాధార‌ణంగా జ‌రుగుతూంటుంది. ఇది అన్ని ప్రాంతాల్లో చాలా కాలం నుంచి ఉన్న‌దే. క్ర‌మేపీ కొట్టుకోవ‌డం, తిట్టుకోవ‌డానికి ఒక వేదిక చాలా ఆధునికంగా త‌యారు చేసుకున్నారు. తిట్టుకోవ‌డానికి పూర్వం ఫోన్లు ఉండేవి. ఇపుడు సోష‌ల్ మీడియా పేర పెద్ద వేదిక త‌యార యింది. ఇక కొట్టుకుంటూ ర‌క్తాలు కార్చుకునే కంటే చ‌క్క‌గా తిట్టుకుంటూ వీయినంత ఆనందిస్తున్నారు.  ఇది మ‌రింతగా పెరిగిపోయి, నాయ‌కుల వ్య‌క్తిగ‌త అంశాల‌నీ తెర‌మీద‌కి తీసుకువ‌స్తున్నారు. దీనివ‌ల్ల వైసీపీ, టీడీపీ వీరాభిమానులు వారి ప‌రువునే బ‌జారున పెడుతున్నార‌న్న స్పృహ కోల్పోతున్నార‌నే అనా లి. అయితే రాష్ట్రంలో పాల‌నాప‌రంగా పెద్ద‌గా పేరుప్ర‌తిష్ట‌లు సంపాదించుకోలేక వెనుక‌బ‌డిన ఉక్రో షంలో వైసీపీ ఉంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అందుకే విప‌క్షం మీద వీల‌యిన‌న్ని విధాలా విరుచు కుప‌డేందుకు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.  ఇంట‌గెల‌వ‌లేక ర‌చ్చ‌గెలిచే య‌త్నాలు చేయ‌డంలో అవ‌మాన ప‌డ‌ట‌మే త‌ప్ప జ‌రుగుతున్న‌దేమీ లేదు. త‌న ప‌రిస్థితిని గ‌మ‌నించుకోకుండా వైసీపీ విప‌క్షం మీద లేనిపోని అభాం డాల‌తో సోష‌ల్ మీడియాని అడ్డుపెట్టుకుని నోటిదూల తీర్చుకోవ‌డం అన్న‌ది మాన‌సిక రుగ్మ‌త‌కు ప‌రాకాష్ట గానే చెప్పుకోవాలి. దీనికి అంతులేదు. సోష‌ల్  మీడియా  మీద గౌర‌వం ప్ర‌జ‌ల్లో స‌న్న‌గిల్ల‌డానికి  ఇదో  కారణంగా చెప్పాలి. ఈరోజుల్లో ఎవ‌రైనా సోష‌ల్ మీడియాలోకి తొంగిచూసి నా వైసీపీవారి అవాకులు, చ‌వాకులే క‌నిపించేది!  పూర్వం బాణాలేసుకునేవారు, ఇపుడు ట్వీట్ల యుద్ధం చేస్తున్నారు. పూర్వం త‌గునా.. అనుక‌నేవారు ఇపు డు త‌గ్గేదేలా.. అంటున్నారు. వారు ఒక‌టంటే వీరు రెండు, నాలుగు అన‌డానికి వెనుకాడ‌టం లేదు. మ‌రీ దారుణ‌మేమంటే అస‌లు పార్టీ తో, రాజ‌కీయాల‌తోనూ సంబంధం లేని నాయ‌కుల  కుటుంబీకులనూ  తెర‌మీద‌కి తేవాల‌న్న తాప‌త్ర‌యం మాత్రం అంగీకారం కాదు. ఆగ్ర‌హావేశంలో అదీ చేస్తున్నారు.  రాజ‌కీ య వైరం ఈ  త‌ర‌హా  కొత్త రంగు వేసుకుని ప్ర‌త్య‌క్షం కావ‌డం స‌బ‌బు కాద‌ని విశ్లేష‌కుల మాట‌. ఫోటోలు, అర్ధం లేని కామెంట్ల‌తో పోస్టు చేయ‌డం వంటివి ఆ మ‌నుషుల మ‌న‌స్త‌త్వాన్ని బ‌య‌ట‌పెడుతుంది. ఫ‌లి తంగా ప్ర‌జ‌ల్లో ఆ పార్టీ, ఆ నాయ‌కుల మీదా ఉన్న‌గౌర‌వం మ‌రింత దిగ‌జారి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓట్లు అడిగే అవ‌కాశం కూడా లేకుండా పోతుంది. ఇప్ప‌టికే ఈ సామాజిక మాధ్య‌మాల రొద ప్ర‌జ‌ల‌కూ  ఇబ్బం దిక‌రం గానే మారింది.  తాజాగా తీసుకుంటే, ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాలని జగన్ నిర్ణయించి బిల్లు పాస్ చేసిన తర్వాత రెండు రోజుల పాటు అంశంపై చర్చ ఓ మాదిరిగా సాగింది. ఈ అంశంపై టీడీపీ సానుభూతిపరులందరూ  విప‌రీతంగా స్పందించారు. ఒకరికొకరు పోటీగా వీడియోలు పోస్ట్ చేసు కుంటున్నారు. ఎన్టీఆర్‌పై దాడిశెట్టి  రాజా లాంటి నేతలు చేసే రకరకాల వ్యాఖ్యాలను సోషల్ మీడి యాలో రక రకాలుగా ప్రజెంట్ చేస్తున్నారు. పోటీగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా గతంలో రోశయ్య మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు.  నేనేమైనా త‌క్కువా అన్న‌ట్టుగా  జగ్గారెడ్డి వైఎస్ చనిపోయిన  సమయం లో ఏ మాత్రం బాధ లేకుండా కుటుంబం అంతా కూర్చుని ముఖ్యమంత్రి పదవి గురించి చర్చించుకు న్నారని చేసిన వ్యాఖ్యలనూ హైలెట్ చేస్తూ కామెంట్లు చేశారు.   వైసీపీ నేత‌లు  చంద్రబాబు మాకు ఎన్టీఆర్ అవసరం లేదని అన్నారంటూ రెండు ద‌శాబ్దాల  క్రింద‌ట ఒక‌  పత్రికలో వచ్చిన  వార్త  క్లి ప్పింగ్‌ను పోస్టర్లుగా ప్రింట్ చేసి అంటించారు. వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ చేశారు. ఇప్పుడు టీడీపీ నేతలు భారతీపే అనే పోస్టర్లు అంటిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పేటీఎంకు పేర డీగా పేసీఎం పోస్టర్లు తెచ్చి నలభై శాతం  కమిషన్లు యాక్సెప్ట్ చేస్తార న్నట్లుగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఇప్పుడు భారతీ పే పేరుతో టీడీపీ నేతలు పోస్టర్లు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏపీలో రాజకీయాలు కుటుంబాలను టార్గెట్ చేసుకోవడం కామన్ అయిపోయింది.  ప్రస్తు తం లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి సమీప బంధువు విచారణ ఎదుర్కొంటున్నారు.  ఆయన ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెట్టిన పెట్టుబడి అంతా.. ఏపీ నుంచి వచ్చిందని టీడీపీ నేతలు  ఆరోపణలు చేస్తు న్నారు. పోటీ గా ఇప్పుడు భారతీ పే పేరుతో పోస్టర్లు వైరల్ చేస్తున్నారు.  ఇటీవ‌లి కాలంలో  స్ట్రాటజిస్టులను పెట్టుకుని మరీ సోషల్ మీడియా సైన్యాలను నడిపిస్తున్నాయి.  కోట్ల రూపాయ‌లు  ఖర్చు పెట్ట‌డానికీ వెనుకాడ‌టం లేదు.  అయితే ఎన్ని కోట్లు పెట్టినా సోషల్ మీడియా రాజకీ యం ఎప్పుడూ  ఏ మాత్రం సభ్యత.. సంస్కారం ఉండటం లేదు.  ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీ లదీ అదే తీరు. ఇదే పార్టీల వీరాభిమానులు గ్ర‌హించాలి. అభిమానం డోస్ ఎక్కువైతే త‌మ నాయ‌ కుల‌కే ప్ర‌మాద‌మ‌న్న‌ది వీరాభిమానులు, వీర‌సేన‌లు తెలుసుకోవాలని విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు.

మునుగోడులో మూడు పార్టీల్లో ముందున్నదెవరో?

మునుగోడు ఉప ఎన్నిక నగారా మోగింది. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నెల 14 వరకూ నామినేషన్ల దాఖలకు గడువు ఉంది. మునుగోడుతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్,, ఒడిశా ల్లోని ఒక్కో నియోజకవర్గానికి, బీహార్‌ లో రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదలా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక, అధికార తెరాస మాత్రమే కాదు, కాంగ్రెస్, బీజేపీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకాగా తీసుకున్నాయి. ఒక విధంగా, 2023 అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్ కానుందని, పరిశీలకులు ప్రజలు భావిస్తున్నారు. అలాగే, మునుగోడు ఉప ఎన్నిక అధికార తెరాస ఎనిమిదేళ్ళ పాలనకు రెఫరెండం, అయితే, బీజేపీ తెలంగాణలో కాషాయ జెండా ఎంట్రీకి గేట్’వే (ముఖ ద్వారం)గా భావిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టికుని సత్తాచాటేందుకు చూస్తోంది. ముఖ్యంగా, సిట్టింగ్ స్థానం, హుజూర్’ నగర్  సహా 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఉపన్నికల్లోనూ ఓటమిని ఎదుర్కున్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి అయినా, మరో సిట్టింగ్ స్థానం మునుగోడును ఎలాగైనా నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. బీజేపీలో చేరిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక జరుగతున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల్లో  రాజగోపాల రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగుతున్నారు. అధికారికంగా, బీజేపే అధిష్టానం ఇంకా ఆయన పేరు ప్రకటించక పోయినా, పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు ఇప్పటికే అయన తరపున పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు. మరోవంక, కాంగ్రెస్ పార్టీ పాల్వాయ్ స్రవంతిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించి, ముమ్మరంగా ప్రచ్రాం సాగిస్తోంది. అయితే అధికార తెరాస మాత్రం ఇంతవరకు అభ్యర్ధిని ప్రకటించలేదు. కానీ, జిల్లా మంత్రి జగీష్ రెడ్డి సారధ్యంలో కేసీఆర్’ బొమ్మతో ప్రచారం సాగిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతొ విందులు, వినోదాలతో పెద్ద ఎత్తున ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు నియోజక వర్గంలో ఇంకా ఎంతో కొంత పట్టున్న వామపక్ష పార్టీలు తెరాసకు మద్దతు ప్రకటించాయి. అయితే  మునుగోడు, ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపధ్యంలో, ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

హిమాలయాలను మించిన ఔన్నత్యం లాల్ బహదూర్ శాస్త్రి వ్యక్తిత్వం

కాలేజీ పిల్ల‌ల‌కి, పెద్ద ఉద్యోగాల‌కు శిక్ష‌ణ‌కు వెళ్లే వారికి ప‌ర్స‌నాలిటీ డెవ‌ల‌ప్మెంట్ కోర్సుల‌ని  చాలా చెబు తుంటారు. కానీ నిస్వార్ధ నాయ‌కుడు, మాజీ ప్రధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి  జీవితంలో కొన్ని అంశాలను తీసుకుని   బోధిస్తే విలువలతో కూడిన వ్యక్తిత్తం,  హిమాలయాలను మించిన ఔన్నత్యం పిల్లలలో సమకూరుతాయి. లాల్ బహదూర్ శాస్త్రి జీవితానికి మించిన  గొప్ప‌తనం ఏ పర్సనాలిటీ డెవలెప్ మెంట్ కోర్సూ బోధించలేదు.  దేశాన్ని జైజ‌వాన్‌..జైకిసాన్ అంటూ ముందుకు న‌డిపించిన ధీరుడు లాల్‌బ‌హ‌దూర్‌. భార‌త్‌,పాకిస్తాన్ యుద్ధం త‌ర్వాత దేశ ప్ర‌గ‌తికి బాట‌లు వేసి ముంద‌డుగు వేయించిన రాజ‌కీయ‌వేత్త ఆయ‌న‌.  దేశ ర‌క్ష‌ణ‌కు సైనికుడు ఎలాగో దేశ ప్ర‌జ ల‌కు తిండి అందించే రైతూ అంతే స‌మానుడే అనే ఒక  గొప్ప నినాదంతో దేశాన్ని సైనిక‌, రైతు సంక్షేమ ప‌థంలో న‌డి పించిన మ‌హానాయ‌కుడాయ‌న‌.  పాల ఉత్పత్తి పెంచేందుకు దోహదపడిన శ్వేత విప్లవం, వ్యవసాయం అభివృద్ధికి బాటలు వేసిన హరిత విప్లవం లాంటి ఉద్యమాలను ప్రోత్సహించిన తొలితరం రాజకీయ నాయకులలో అతి ముఖ్యులు లాల్ బహదూర్.  1965లో ఎం.ఎస్. స్వామినాథన్ హరిత విప్లవానికి నాంది పలకగా.. ప్రభుత్వ పెద్దగా ఆ ఉద్యమా నికి స‌హ‌క‌రించి ఆ మిషన్ విజయవంతం అవడంలో కీలక పాత్ర పోషించారు. లాల్‌బహదూర్‌ శాస్త్రి ఎన్న‌డూ ప‌దవులు, వాటితో  వ‌చ్చే ప్ర‌తిష్ట‌, పలుకుబడి కోసం పాకులాడ‌లేదు. ప్ర‌ధాని గా  ఉన్న కాలంలో  కూడా చాలా సామాన్యునిలానే జీవించారు. చిత్ర‌మేమంటే అప్ప‌ట్లో ఆయ‌న‌కు కొంత‌ కాలం కారు కూడా లేదు. త‌ర్వాత ఎప్పుడో పిల్ల‌ల‌ కోసం ఒక ఫియెట్ కొన్నారు.. అదీ అప్పుచేసి! అంతేకాదు మ‌రో గ‌ర్వించ ద‌గ్గ అంశ‌మేమిటంటే,  ప‌ద‌వులును అడ్డుపెట్టుకుని ఉన్న‌తోద్యోగాలు ఇప్పించ‌డం వంటివి ఆయ‌న ఎన్నడూ  చేయలేదు. అంతెందుకు ఆయ‌న కుమారుడు హ‌రికృష్ణ‌శాస్త్రికి అత‌ను ప‌నిచేసే అశోక్ లేలాండ్ కంపెనీ లో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ప్ర‌మోష‌న్ వచ్చింది. లాల్‌బ‌హ‌దూర్ కి భ‌విష్య‌త్తు గోచ‌ర‌మై, హ‌రికృష్ణ‌ను ఉద్యోగం మానిపించేరు. కార‌ణం ఆ కంపెనీవారు త‌ర్వాత త‌న‌ను ఏదో ఒక ప‌ని గురించి వేధించ‌కుండా ఉంటార‌ని.  ఇప్ప‌టి రాజ‌కీయ‌నాయ‌కుల్లాగా ఆయ‌న పెద్ద పెద్ద భ‌వంతుల్లో ఉండాల‌నుకోలేదు. చిత్ర‌మేమంటే, ఆయన‌కు క‌నీసం స్వంత ఇల్లే లేదు. ఒక‌సారి అంటే  లాల్‌బ‌హదూర్ ఇంకా ప్ర‌ధాని కావ‌డానికి  చాలా కాలం ముందు ఆయ‌న స్నేహితుడు ఒకాయ‌న ఆయ‌న‌కు తెలీకుండా ఇంటి ఏర్పాటు చేయబోయాడు. ప్ర‌జా ప్ర‌తినిధులు ఇలాంటివాటికి ఆశ‌ప‌డ‌కూడ‌ద‌ని వారించి అత‌ని ప్ర‌య‌త్నాన్ని ఆపించాడు. ఇలాంటి వ్యక్తిత్వాలే జాతిని నిర్మస్తాయి ! భవిష్యత్ తరానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయి.