తెరవెనుక కొట్లాటలు...బూమరాంగ్‌లే!
posted on Oct 3, 2022 @ 2:49PM
రెండు వీధుల వారికి పడనప్పుడు అటు వేపు, ఇటువేపు వీలయినపుడల్లా బహిరంగంగానో, రహస్యంగానో పట్టుకుని కొట్టుకోవడం, ఆస్పత్రి పాలుకావడం సాధారణంగా జరుగుతూంటుంది. ఇది అన్ని ప్రాంతాల్లో చాలా కాలం నుంచి ఉన్నదే. క్రమేపీ కొట్టుకోవడం, తిట్టుకోవడానికి ఒక వేదిక చాలా ఆధునికంగా తయారు చేసుకున్నారు. తిట్టుకోవడానికి పూర్వం ఫోన్లు ఉండేవి. ఇపుడు సోషల్ మీడియా పేర పెద్ద వేదిక తయార యింది. ఇక కొట్టుకుంటూ రక్తాలు కార్చుకునే కంటే చక్కగా తిట్టుకుంటూ వీయినంత ఆనందిస్తున్నారు.
ఇది మరింతగా పెరిగిపోయి, నాయకుల వ్యక్తిగత అంశాలనీ తెరమీదకి తీసుకువస్తున్నారు. దీనివల్ల వైసీపీ, టీడీపీ వీరాభిమానులు వారి పరువునే బజారున పెడుతున్నారన్న స్పృహ కోల్పోతున్నారనే అనా లి. అయితే రాష్ట్రంలో పాలనాపరంగా పెద్దగా పేరుప్రతిష్టలు సంపాదించుకోలేక వెనుకబడిన ఉక్రో షంలో వైసీపీ ఉందన్నది అందరికీ తెలిసిందే. అందుకే విపక్షం మీద వీలయినన్ని విధాలా విరుచు కుపడేందుకు దూకుడు ప్రదర్శిస్తోంది. ఇంటగెలవలేక రచ్చగెలిచే యత్నాలు చేయడంలో అవమాన పడటమే తప్ప జరుగుతున్నదేమీ లేదు. తన పరిస్థితిని గమనించుకోకుండా వైసీపీ విపక్షం మీద లేనిపోని అభాం డాలతో సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని నోటిదూల తీర్చుకోవడం అన్నది మానసిక రుగ్మతకు పరాకాష్ట గానే చెప్పుకోవాలి. దీనికి అంతులేదు. సోషల్ మీడియా మీద గౌరవం ప్రజల్లో సన్నగిల్లడానికి ఇదో కారణంగా చెప్పాలి. ఈరోజుల్లో ఎవరైనా సోషల్ మీడియాలోకి తొంగిచూసి నా వైసీపీవారి అవాకులు, చవాకులే కనిపించేది!
పూర్వం బాణాలేసుకునేవారు, ఇపుడు ట్వీట్ల యుద్ధం చేస్తున్నారు. పూర్వం తగునా.. అనుకనేవారు ఇపు డు తగ్గేదేలా.. అంటున్నారు. వారు ఒకటంటే వీరు రెండు, నాలుగు అనడానికి వెనుకాడటం లేదు. మరీ దారుణమేమంటే అసలు పార్టీ తో, రాజకీయాలతోనూ సంబంధం లేని నాయకుల కుటుంబీకులనూ తెరమీదకి తేవాలన్న తాపత్రయం మాత్రం అంగీకారం కాదు. ఆగ్రహావేశంలో అదీ చేస్తున్నారు. రాజకీ య వైరం ఈ తరహా కొత్త రంగు వేసుకుని ప్రత్యక్షం కావడం సబబు కాదని విశ్లేషకుల మాట. ఫోటోలు, అర్ధం లేని కామెంట్లతో పోస్టు చేయడం వంటివి ఆ మనుషుల మనస్తత్వాన్ని బయటపెడుతుంది. ఫలి తంగా ప్రజల్లో ఆ పార్టీ, ఆ నాయకుల మీదా ఉన్నగౌరవం మరింత దిగజారి ఎన్నికల సమయంలో ఓట్లు అడిగే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇప్పటికే ఈ సామాజిక మాధ్యమాల రొద ప్రజలకూ ఇబ్బం దికరం గానే మారింది.
తాజాగా తీసుకుంటే, ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాలని జగన్ నిర్ణయించి బిల్లు పాస్ చేసిన తర్వాత రెండు రోజుల పాటు అంశంపై చర్చ ఓ మాదిరిగా సాగింది. ఈ అంశంపై టీడీపీ సానుభూతిపరులందరూ విపరీతంగా స్పందించారు. ఒకరికొకరు పోటీగా వీడియోలు పోస్ట్ చేసు కుంటున్నారు. ఎన్టీఆర్‌పై దాడిశెట్టి రాజా లాంటి నేతలు చేసే రకరకాల వ్యాఖ్యాలను సోషల్ మీడి యాలో రక రకాలుగా ప్రజెంట్ చేస్తున్నారు. పోటీగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా గతంలో రోశయ్య మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు. నేనేమైనా తక్కువా అన్నట్టుగా జగ్గారెడ్డి వైఎస్ చనిపోయిన సమయం లో ఏ మాత్రం బాధ లేకుండా కుటుంబం అంతా కూర్చుని ముఖ్యమంత్రి పదవి గురించి చర్చించుకు న్నారని చేసిన వ్యాఖ్యలనూ హైలెట్ చేస్తూ కామెంట్లు చేశారు.
వైసీపీ నేతలు చంద్రబాబు మాకు ఎన్టీఆర్ అవసరం లేదని అన్నారంటూ రెండు దశాబ్దాల క్రిందట ఒక పత్రికలో వచ్చిన వార్త క్లి ప్పింగ్‌ను పోస్టర్లుగా ప్రింట్ చేసి అంటించారు. వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ చేశారు. ఇప్పుడు టీడీపీ నేతలు భారతీపే అనే పోస్టర్లు అంటిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పేటీఎంకు పేర డీగా పేసీఎం పోస్టర్లు తెచ్చి నలభై శాతం కమిషన్లు యాక్సెప్ట్ చేస్తార న్నట్లుగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఇప్పుడు భారతీ పే పేరుతో టీడీపీ నేతలు పోస్టర్లు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏపీలో రాజకీయాలు కుటుంబాలను టార్గెట్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ప్రస్తు తం లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి సమీప బంధువు విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయన ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెట్టిన పెట్టుబడి అంతా.. ఏపీ నుంచి వచ్చిందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తు న్నారు. పోటీ గా ఇప్పుడు భారతీ పే పేరుతో పోస్టర్లు వైరల్ చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో స్ట్రాటజిస్టులను పెట్టుకుని మరీ సోషల్ మీడియా సైన్యాలను నడిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికీ వెనుకాడటం లేదు. అయితే ఎన్ని కోట్లు పెట్టినా సోషల్ మీడియా రాజకీ యం ఎప్పుడూ ఏ మాత్రం సభ్యత.. సంస్కారం ఉండటం లేదు. ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీ లదీ అదే తీరు. ఇదే పార్టీల వీరాభిమానులు గ్రహించాలి. అభిమానం డోస్ ఎక్కువైతే తమ నాయ కులకే ప్రమాదమన్నది వీరాభిమానులు, వీరసేనలు తెలుసుకోవాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.