థరూర్‌కి నో అంటున్న తెలంగాణా కాంగ్రెస్
posted on Oct 4, 2022 @ 11:26AM
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పోటీ బరిలో మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్ నిలిచారు. అయితే అధిక శాతం కాం గ్రెస్ వాదులు ఖర్గే రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణా కాంగ్రెస్ నాయకులు, అభిమానులు కూడా ఖర్గే వైపే మొగ్గు చూపుతున్నారు. శశిథరూర్ ఇక్కడికి ప్రచారం కోసం వచ్చినప్పటికీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ రేవంత్ రెడ్డి ఆ సమావేశానికి డుమ్మా కొట్టడమే తెలంగాణా కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం బయట పడింది.
అయితే పార్టీ పదవి ఏకగ్రీవం చేయడం ఇష్టంలేకనే ఆయన స్వతంత్రంగా రంగంలోకి దిగి పోటీ తప్పనిసరి చేశారు. మల్లిఖార్జున్ ఖర్గే పట్ల పార్టీకి ఉన్న నమ్మకం ఆయన్ను అభ్యర్ధిని చేసింది. అయితే ప్రస్తుతం పార్టీ పదవి ఎన్నికల సమయంలో ఇద్దరూ తమ మద్దతుదారులతో ప్రచారం చేసుకోను వీలు కల్పించారు. కనుక ఖర్గేను పార్టీ ప్రతినిధిగానే చూడనక్కర్లేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం పేర్కొన్నది.
కాగా, థరూర్ మాత్రం తమ మధ్య విభేదాలు వదిలేసి అందరం ఒక్కటిగా బీజేపీని ఎదుర్కొవలసిన అవస రం ఉందని అన్నారు. దీన్ని ఖర్గే కూడా సమర్ధించారు. ప్రస్తుతం ఆయన్ను పార్టీ పదవికి పోటీ పడుతు న్న అభ్యర్ధిగా చూడటం తప్ప ఆయన చేసిన ప్రకటనలో తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. మరో వంక కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఖర్గేను పార్టీ పదవికి పోటీచేస్తున్న అభ్యర్ధిగానే చూడాలని, అంతే తప్ప సోనియా ఆసక్తి చూపుతోందని ఆయన కోసం ప్రత్యేకించి ప్రచారాలు చేయడాలు, ఓటింగ్ కోసం కాంగ్రెస్ నాయకుల మీద ఒత్తిడి చేయడం వంటివి చేపట్టవద్దని ఏఐసిసి ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులను హెచ్చరించింది.
ఏమైనప్పటికీ, బీజేపీ పాలనా విధానాలను, ప్రత్యేకించి రైతాంగానికి విరుద్దంగా చేపట్టిన చట్టాలను వ్యతి రేకించి రైతంగానికి న్యాయం జరిగేట్టు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని భారత్ జోడో యాత్ర సాగాలని కాంగ్రెస్ నేత జైరామ రమేష్ అన్నారు. కాంగ్రెస్ యువ నేత రాహుల్ చేపట్టిన యాత్ర చివరి దశలో సోనియా గాంధీ, ఖర్గే కూడా పాల్గొనే అవకాశం ఉంది. రైతాంగానికి మద్దతు ప్రకటిస్తూ ఖర్గే రాహుల్‌కు మద్దతునీయాలని రమేస్ ఆకాంక్షించారు.