గవర్నర్ నోట ఆరడుగుల బులెట్

  హైదరాబాద్ లో మొన్న జరిగిన 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ ముగింపు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సభకు హాజరయిన గవర్నర్ నరసింహన్ పవన్ కళ్యాణ్ న్ని ఉద్దేశ్యించి మంచి ఆసక్తికరమయిన సలహా ఇచ్చారు. ఆయన పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘అత్తారింటికి దారేది’ సినిమాలో బాగా పాపులర్ అయిన పాటలో ‘ఆరడగుల బులెట్...దైర్యం విసిరిన రాకెట్’ అని పవన్ కళ్యాణ్ న్ని సంబోధిస్తూ పలికినప్పుడు సభలో హర్షద్వానాలు మిన్నంటాయి. చివరికి పవన్ కళ్యాణ్ కూడా ఆయన మాటలకు నవ్వాపుకోలేకపోయాడు.   గవర్నర్ పవన్ కల్యాణ్ న్ని ఉద్దేశించి “మీరు ‘అత్తారింటికి దారేది’ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా నటించారు. గానీ ఇంటికి తిరిగిన వెళ్ళిన తరువాత కూడా అంతే పవర్ చూపించకండి. రియల్ లైఫ్ లో పవర్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం” అని అన్నారు.   బహుశః గవర్నర్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అయినందున అతని సినిమాలను, అతని రాజకీయ ప్రవేశంపై వస్తున్న మీడియాలో వస్తున్న కధనాలను గమనించిన తరువాతనే రాజకీయాలోకి రావడం అంత మంచిది కాదని ఈవిధంగా సున్నితంగా సూచించి ఉంటారు.   పవన్ కళ్యాణ్ కి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నందునే తన మెగా అన్నగారి ప్రజారాజ్యం కోసం అంత కష్టపడ్డారు. కానీ, ఆ తరువాత ఆయన తాము ఏ పార్టీకి వ్యతిరేఖంగా పోరాటం చేసారో మళ్ళీ అదే పార్టీలో తన పార్టీని కలిపేసి కేంద్రమంత్రి పదవి పుచ్చుకోవడంతో సహజంగానే అది పవన్ కళ్యాణ్ కి కోపం కలిగించి ఉండవచ్చును. అయితే కుటుంబ విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అతను ఎన్నడూ కూడా అన్నగారిని విమర్శించలేదు. కానీ తన సినిమాల ద్వారా ఆయనకి అప్పుడప్పుడు చురకలు వేస్తుంటారు.   ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వస్తే బాగుంటుందనే ఆలోచనతో కొందరు చేసిన ప్రయత్నాలను నాగబాబు ఖండించారు. ప్రస్తుతం సినిమాలతో తీరిక లేకుండా ఉన్నతమకు రాజకీయాలలో రావడానికి కానీ, ఏ పార్టీలో చేరే ఆలోచనలు గానీ తమకు లేవని నాగబాబు స్పష్టం చేసారు.   రాజకీయలలో నైతిక విలువలు అదః పాతాళానికి పడిపోయిన ఈ తరుణంలో ప్రజలు అమితంగా అభిమానించే పవన్ కళ్యాణ్ వంటి నిజాయితీపరుడు చొరవ తీసుకొని రాష్ట్రాన్ని కడిగేయాలని ప్రజలు ఆశపడటం సహజమే. కానీ, అది టాగూర్ వంటి సినిమాలలోనే సాధ్యం అవుతుంది తప్ప నిజ జీవితంలో సాధ్యం కాదని స్వయంగా మెగా బ్రదరే రుజువు చేస్తున్నపుడు మచ్చలేని పవన్ కళ్యాణ్ కి కూడా మళ్ళీ ఈ రొంపిలోకి లాగడమెందుకనే ఉద్దేశ్యంతోనే గవర్నర్ ఆవిధంగా సలహా ఇచ్చి ఉంటారనుకోవాలి.   ఇంతకీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో రావాలా వద్దా? మీరే డిసైడ్ చేయండి మరి.

విభజనుల గొంతులో వెలక్కాయ!

      జాగో, భాగో నినాదాలతో, హైదరాబాద్, భద్రాచలం మాదేననే డిమాండ్లతో హోరెత్తిస్తున్న విభజనుల గొంతులో ఇప్పుడు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూపంలో పచ్చి వెలక్కాయ పడింది. శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం కర్నూలు జిల్లా భూముల్లో వున్నదని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు గుంటూరు జిల్లా భూముల్లో వున్నదన్న వార్తలు రావడం, ఆ వార్తలకు తగిన ఆధారాలు కూడా వుండటంతో విభజనవాదులు అవాక్కయ్యారు. అయితే కాసేపట్లోనే తేరుకున్న విభజనవాదులు తమ సహజమైన తెలివితేటల్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. తమ గొంతులో వున్న వెలక్కాయ మింగుడు పడటం కోసం, ఈ వార్తలు మమ్మల్నేమీ భయపెట్టవని క్రియేట్ చేయడం కోసం స్టేట్‌మెంట్లు రువ్వడం ప్రారంభించారు. ‘ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా సీమాంధ్రులు కుట్రలు చేశారు’ అనే ఒక స్టాక్ డైలాగ్‌ని తక్షణం విడుదల చేశారు. ఆ తర్వాత ‘ప్రాజెక్టులు సీమాంధ్ర భూముల్లో వున్నా మాకేం పర్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సరిహద్దులు నిర్ణయించి తెలంగాణకి హక్కులు ఇస్తుంది’ అంటూ మరో స్టేట్‌మెంట్ తెలంగాణ అమాయక ప్రజలకు కానుకగా ఇచ్చారు. తద్వారా తెలంగాణ ప్రజల్ని మరింత మోసం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే పదవుల కోసం విభజనవాదాన్ని పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకుల తీరు పట్ల చిరాకుగా వున్న తెలంగాణ ప్రజలు ఇప్పుడు రెండు ప్రాజెక్టుల విషయంలో వస్తున్న వార్తలను చూసి భయపడిపోతున్నారు. విభజనుల ప్రయత్నాలు ఫలించి రాష్ట్రం విడిపోతే, రెండు ప్రాజెక్టులూ తమకు అందుబాటులో లేకపోతే పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకుని హడలిపోతున్నారు. అయితే విభజనవాదులు మాత్రం హైదరాబాద్, భద్రాచలంతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ మావేనంటూ ప్రచారం చేసుకుంటూ ఆత్మతృప్తి పడుతూ ఆత్మవంచన బాటలో పయనిస్తున్నారు.

విభజనకు ఎందుకు ఒప్పుకొన్నామంటే

  మెగాస్టార్ చిరంజీవి కేంద్రమంత్రిగా మారిన తరువాత కెమెరాల ముందు సరిగ్గా నటించలేక చాలా తడబడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు రాజీనామా చేసిన తరువాత మీడియా కెమెరాలను ఎదుర్కోవడానికి సైతం పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆయాన సహవాసం వల్లనో మరేమో కానీ మిగిలిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు మాత్రం చాలా నిర్భయంగా, అద్భుతంగా కెమెరాల ముందు నటించేస్తున్నారు. దానితో పదవులలో కొనసాగుతున్న వారెవరో, రాజీనామాలు ఇచ్చిన వారెవరో, రాజీనామా లేఖలను రాంగ్ అడ్రస్ కి పంపినవారెవరో ప్రజలకు తెలియనీయకుండా అందరూ చాలా చక్కగా మేనేజ్ చేసేస్తున్నారు.   రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు గ్లూకోసు డబ్బాలు, బూస్టు సీసాలు చాలా ఖాళీ చేసేసి మరీ పోరాడుతున్న కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలంలు , రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే పాయె, కనీసం హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతంగానయినా చేయకపోతే రాజీనామా చేస్తామని బెదిరించినట్లు తాజా సమాచారం. కానీ అటు కేంద్ర మంత్రుల బృందం గానీ, ఇటు ప్రజలు గానీ ఆ తాటాకు చప్పుళ్ళను వినేందుకు ఇష్టపడటం లేదు.   అయితే ఈ సందర్భంగా అప్రయత్నంగా వారి నోట ఒక గొప్ప రహస్యం ప్రజలకు తెలుసుకొనే భాగ్యం కలిగింది. హైదరాబాద్‌ను యూటీ చేస్తారనే నమ్మకంతోనే రాష్ట్ర విభజనకు తాము ఒప్పుకున్నామని వారు వాపోతునప్పుడు ప్రజలు ఔరా! తెర వెనుక ఇటువంటి ఇంకెన్ని ఒప్పందాలు జరిగాయో’ అంటూ ముక్కున వేలేసుకోక తప్పలేదు.

ఐబీ ఆందోళనపై ఆగ్రహం!

      తెలంగాణ వచ్చేస్తే తమ జీవితాలలో ఏదో మార్పు వచ్చేస్తుందని తెలంగాణ ప్రజలు అనుకోవడం లేదు. రాష్ట్ర విభజన వల్ల తమకు నష్టం వాటిల్లే ప్రమాదం వుందనే భయపడుతున్నారు. అయితే ఈ భయం మాత్రం తెలంగాణ రాష్ట్రం వచ్చేయాలని తెగ ఉబలాటపడిపోతున్న విభజనవాదుల్లో మాత్రం కనిపించడం లేదు. ఎప్పుడు తెలంగాణ వస్తుందా ఎప్పుడు పదవులు పంచుకుందామా.. ఎప్పుడు సీమాంధ్రులను హింసిద్దామా అనే ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం హర్షించదగ్గ పరిణామం కాదని దేశవ్యాప్తంగా మేధావులు అంటున్నారు.   తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎన్నో ఇతర సమస్యలకు కారణం అయ్యే ప్రమాదం వుందని ఆందోళన పడుతున్నారు. అటు తెలంగాణతో గానీ, ఇటు సీమాంధ్రతో గానీ సంబంధంలేని వ్యక్తులు, ఆలోచనపరులు, కీలక బాధ్యతల్లో వున్నవారు కూడా ఈ మాటే చెబుతున్నారు. ఇప్పడీ విషయాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఇబ్రహీం కూడా చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడితే వచ్చే సమస్యలు అందరికంటే క్షుణ్ణంగా తెలుసుకోగలిగింది ఇంటెలిజెన్స్ బ్యూరో మాత్రమే. అలాంటి అధికారిక సంస్థ చీఫ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆందోళనకర పరిణామాలు ఏర్పడతాయని అంటున్నారు. దేశ భద్రత అనే అంశం మీద ఇంటెలిజెన్స్ బ్యూరో న్యూఢిల్లీలో ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో డీజీపీ, ఐజీపీ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐబీ చీఫ్ ఇబ్రహీం మాట్లాడుతూ, ‘తెలంగాణ ఏర్పాటు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కదానికే సంబంధించిన అంశం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలకు కొత్త సవాళ్ళు ఎదురయ్యే అవకాశం వుంది’ అన్నారు.  దేశ ఇంటెలిజన్స్ వ్యవస్థకు అధిపతిగా వున్న అధికారి నోటి నుంచి వెలువడిన ఈ మాటలను అంత ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదు. అయితే  ఐబీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలను చేయడాన్ని తెలంగాణ వాదులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇబ్రహీం చేసిన వ్యాఖ్యలను కూడా సీమాంధ్రుల కుట్రలో భాగంగా అభివర్ణించే ప్రయత్నాలు ప్రారంభించేశారు. ఇబ్రహీం తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చేయాలన్న ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం మీద తెస్తున్నారు. వీళ్ళ ప్రయత్నాలు ఫలిస్తే ఐబీ చీఫ్ ‘నా ఉద్దేశం అది కాదు.. మీడియా వక్రీకరించింది’ లాంటి స్టేట్‌మెంట్‌తో మీడియా ముందుకు వచ్చే అవకాశం వుంది.

కాబోయె సీఎం కన్నా అంటూ ఫ్లెక్సీలు

      రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కాబోయె ముఖ్యమంత్రి అంటూ ప్లేక్సిలు వెలిశాయి. గుంటూరులో జరిగిన రచ్చబండలో కాబోయే ముఖ్యమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అంటూ కటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టేశారు. దీంతో ఇది చర్చానీయాంశం అయింది. అదే సమయంలో కన్నా పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో భేటీ అవడం కూడా గమనించదగ్గ అంశంగా ఉంది. కొన్ని రోజుల క్రితం సోనియాగాంధీని ఆయన కలిసి రాగానే ఆయన సీమాంధ్ర ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని ప్రచారం మొదలయింది. ఆయన పదవికి ఆశపడి అధిష్టానం ఆదేశాల మేరకు విభజనకు మొగ్గు చూపుతున్నాడని ఆరోపణలు మొదలయ్యాయి. అయితే అలాంటిది ఏమీ లేదని, తాను ముఖ్యమంత్రి రేసులో లేనని కన్నా తేల్చిచెప్పారు. ఆయన అభిమానులు త్వరలో కాబోయే ముఖ్యమంత్రి అని బోర్డులు పెట్టడం విశేషం.

ప్రిద్వీ షా భారత్ క్రికెట్ కి మరో సచిన్ అవుతాడా

  ‘ప్రిద్వీషా(14) బహుశః ఈ పేరు ఇంతవరకు ఎవరూ విని ఉండకపోవచ్చును. ముంబైలోని రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ అనే పాటశాలలో చదువుతున్నఈ బుడతడు మొన్నమంగళ బుధవారాలలోజరిగిన ఇంటర్ స్కూల్ క్రికెట్ పోటీలలో ప్రత్యర్ధి జట్టు సెయింట్ ఫ్రాన్సిస్ డీ’ అస్సిసీ స్కూలు జట్టుపై ఏకంగా 546 పరుగులు సాధించి దేశంలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.   తన స్కూల్ టీంకి కెప్టెన్ కూడా అయిన ప్రిద్వీ షా మొదటి రోజు ఆటలో 166 బాల్స్ కి 257 పరుగులు తీయగా మరునాడు జరిగిన మ్యాచులో ఏకంగా 289 పరుగులు తీసి ఒక సరికొత్త రికార్డ్ సృష్టించి ప్రతిష్టాత్మకమయిన హరీస్ షీల్డ్ తన టీముకి సాధించిపెట్టాడు. రెండు రోజుల మ్యాచులో ప్రిద్వీషా 85 బౌండరీలు, ఐదు సిక్సర్లు తీసి తన సత్తా చాటుకొన్నాడు.   ఇదివరకు అంటే 1933-34లో ముంబైలో సి.ఐ.రైల్వే మరియు సెయింట్ జేవియర్ కాలేజి మధ్య జరిగిన మ్యాచులో దాదాబాయి హవేవాల చేసిన 515 పరుగులు అత్యధిక స్కోరుగా రికార్డు నెలకొని ఉంది. దానిని సచిన్ టెండూల్కర్ ఇదే హారిస్ షీల్డ్ కోసం జరిగిన పోటీలలో వినోద్ కాంబ్లీ తో కలిసి 664 పరుగులు తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ తరువాత నుండే అతను జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.   మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత సచిన్ టెండూల్కర్ కి సరిసమానమయిన రికార్డుని ప్రిద్వీ షా చేయడం చూస్తే భారత్ క్రికెట్ కు మరో సచిన్ దొరికాడనే నమ్మకం కలుగుతోంది. వీలయినన్ని ఎక్కువ పరుగులు తీయడమే నా ఏకైక లక్ష్యంగా బ్యాటింగ్ చేసి మా టీమ్ ని గెలిపించుకొన్నదుకు నాకు చాలా సంతోషంగా ఉందని ప్రిద్వీ షా మీడియాతో చెప్పాడు.

కిరణ్ టార్గెట్ స్పీకరా లేక టీ-బిల్లు అడ్డుకోవటమా

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్ కి వ్రాసినట్లు చెప్పబడుతున్న లేఖ గురించి వారిరువురూ ఇంతవరకు స్వయంగా స్పందించకపోయినా దానిపై పెద్ద రాజకీయ దుమారమే చెలరేగుతోంది. ముఖ్యమంత్రి తనను తాను గొప్ప సమైక్యవాదిగా నిరూపించుకొనే ఏ అవకాశం వదలకపోవడం మెచ్చుకోదగ్గదే కావచ్చు. కానీ అందుకు ఇతరులను బలిచేయాలనుకోవడమే చాలా తప్పు అని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.    నిజానికి ప్రభుత్వం జూన్ నెలలో శాసనసభ సమావేశాలు ముగిసిన వారంలోగా సభను ప్రోరోగ్ చేయమని అభ్యర్దిస్తూ స్పీకర్ కి లేఖవ్రాయవలసి ఉంటుంది. కానీ అలా చేయకుండా, ఇప్పుడు స్పీకర్ సంప్రదాయం ప్రకారం సభను వచ్చేనెలలో సమావేశపరిచేందుకు సిద్దపడుతున్నఈ తరుణంలో ముఖ్యమంత్రి సభను ప్రోరోగ్ (నిరవధిక వాయిదా) వేయమని కోరుతూ లేఖ వ్రాయడం తెలంగాణా బిల్లుపై చర్చను జాప్యం చేసేందుకే అయినప్పటికీ, అందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను బలిపశువుని చేయడంపై కాంగ్రెస్ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   స్పీకర్ ముఖ్యమంత్రి మాటను మన్నిస్తూ సభను వాయిదా వేయకపోయినట్లయితే ఆయన కూడా తెలంగాణా బిల్లుపై చర్చకు సహకరిస్తున్నారనే తప్పుడు సంకేతాలు ప్రజలలోకి వెళ్తాయని వారు అంటున్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రి, స్పీకర్ల మధ్య సభ నిర్వహణ తేదీల విషయంలో, కమిటీల విషయంలో విభేదాలు తలెత్తాయి. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి సమావేశాలను వాయిదా వేయమని అసందర్భ కోరిక కోరడం స్పీకర్ ని అప్రదిష్టపాలు జేయడానికేనని కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన కుర్చీపై కన్ను వేసిన బొత్సను, కన్నాలక్ష్మినారాయణను కూడా ముఖ్యమంత్రి వర్గం ఇదే విధంగా అభాసుపాలు చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.   అయితే ఈ వ్యవహారంలో స్పీకర్ కి మద్దతుగా మాట్లాడితే తమకీ కొత్త ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచనతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా స్పందిస్తున్నపటికీ, టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస శాసనసభ్యులు ఆయనకి అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి దీనిని నుండి ఆశించినది ఒకటయితే ఫలితాలు మరొకలా వస్తున్నాయి.

ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టు భిన్నాభిప్రాయాలు

  జస్టిస్ కళ్యాణ్ సేన్ గుప్త మరియు కె.సి.భానులతో కూడిన హైకోర్టు ధర్మాసనం, ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్దం అంటూ దాఖలయిన ప్రజహిత వాజ్యాలపై రెండు విభిన్నమయిన తీర్పులు నిన్న వెలువరించింది.   జస్టిస్ గుప్త పిటిషనుదారుల వాదనలతో ఏకీభవిస్తూ ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్దమేనని ప్రకటించడమే గాకుండా, సమ్మె వలన ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని ఉద్యోగుల వద్ద నుండి వసూలుచేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు.   అయితే జస్టిస్ భాను మాత్రం దీనితో విభేదించారు. ప్రజాహితం కోసం అంటూ వేసిన పిటిషను కేవలం రాజకీయ ప్రేరేపితమయినది గనుక అటువంటి పిటిషను ఆధారంగా సమ్మె చట్టబద్దమా కాదా? అనే సంగతి తేల్చడం కోర్టు పరిధిలోకి రాదని ప్రకటించారు. పిటిషనుదారులలో ఒకరు గతంలో ఇదేవిధంగా తెలంగాణా కోసం జరిగిన సకల జనులసమ్మెలో పాల్గొన్న విషయాన్ని జస్టిస్ భాను ఈ సందర్భంగా గుర్తుచేసారు.   ఒకే ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు ఒక వాజ్యంపై ఈవిధంగా రెండు విబిన్నమైన తీర్పులు ఇచ్చినందున, దీనిపై మూడవ న్యాయ మూర్తి అభిప్రాయం/తీర్పు తీసుకోవాలని ధర్మాసనం నిర్ణయించింది. అందువల్ల మొదటి న్యాయమూర్తి గుప్త ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలు మళ్ళీ మూడవ న్యాయమూర్తి తీర్పు వెలువరించేవరకు అమలులోకి రావని ధర్మాసనం ప్రకటించింది.

ఎవరి భజన వారిదే

  తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం టీ-కాంగ్రెస్ నేతలు కూడా ఉడతా భక్తిగా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితంగా ముఖ్యమంత్రి పదవి కావాలనుకోవడం ఏమీ తప్పు కాదు. కొందరు సామాజిక న్యాయం ద్వారా అవుదామని ఆశిస్తుంటే, మరి కొందరు ఆత్మాభిమానంతో, వాళ్ళలో బాగా తెలివయిన వాళ్ళు అమ్మ దయతో అవుదామనుకొంటున్నారు. అయితే ఏ న్యాయనికయినా అమ్మ దయ తప్పనిసరిగా అవసరం గనుక అమ్మని ప్రసన్నం చేసుకొనేందుకు అమ్మకు జై! అంటూ అందరూ కలిసి యాత్రలు మొదలుపెట్టేసారు.   కానీ, కేసీఆర్ బూచిని చూపి అధిష్టానం పంపిన జైపాల్ రెడ్డి వారందరికంటే చాలా గట్టిగా తెలంగాణా గురించి మాట్లాడుతుంటే పాపం! ముఖ్యమంత్రి అయితే వేసుకోవచ్చునని ఎప్పుడో సూటు కూడా కుట్టించేసుకొన్న జానారెడ్డి, ముఖ్యమంత్రి అయితే తప్ప గడ్డం గీయనని అమ్మకి మొక్కుకొన్న దామోదరుడు, గీతక్కాయ్ వంటివారు బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉండిపోక తప్పడం లేదు.   ఇక్కడ వారందరితో కలిసి అమ్మ భజనలో పాల్గొంటున్నపటికీ, ప్రత్యేకం దర్శనం టికెట్స్ పట్టుకొని డిల్లీలో చక్కర్లు కొడుతున్న సర్వే సత్యనారాయణ ‘నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవలసిందే! అని అమ్మ ఆజ్ఞాపిస్తే కాదనే దైర్యం నాకెక్కడిది?” అని మీడియా ముందు బిక్క మొహం వేసుకొని తన మనసులో మాట చెప్పేసాడు.   అయితే, ఇంతమంది భక్తులలో అందరికీ ముఖ్యమంత్రి పదవులు ఈయలంటే తెలంగాణాని మరో పది రాష్ట్రాలుగా విడదీసినా సరిపోదు గనుక, ప్రస్తుతానికి జైపాల్ రెడ్డికే ఆ వరమేదో ఇచ్చేయవచ్చని సమాచారం. కానీ అప్పుడు ఈ సామాజిక న్యాయవాదులు, అత్మాభిమానులు ఏవిధంగా న్యాయం కోరుతారో చూడాలి.

జగమంత కుటుంబంలో షర్మిలమ్మకు చోటే లేదా?

  జగనన్న వదిలేసిన బాణం మరి ఎక్కడ పడిపోయిందో గానీ ఈ మధ్యన ఎవరికీ కనబడలేదు. అతను వదిలిన ఆ బాణం లాంగ్ రేంజి మిసైల్లాగా ఏకంగా 3000కిమీ దూరం పయనించి, మరే లక్ష్యం చేదించిందో తెలియదు కానీ, గత కొన్ని రోజులుగా ఎవరికీ కనబడలేదు. హైదరాబాదులో జబర్దస్త్ గా నిర్వహించిన సమైక్య సభలోనయినా తన బాణం గొప్పదనం గురించి నలుగురికి చెపుతాడని జనాలందరూ భావించినప్పటికీ, ఓట్లు, సీట్ల బాధలో పడి పాపం! ఆ బాణం సంగతి మరిచిపోయాడు జగనన్న.   అయితే పెరటి మొక్క లాంటి షర్మిలమ్మను పట్టించుకోకపోయినా మమతలు కురిపించే దీదీ (అక్క) మమతా బెనర్జీని కలిసేందుకు కోర్టు అనుమతి తీసుకొని కోల్ కత వెళ్లి మరీ వెళ్లి కలిసారు.  ఆమెకు కూడా పక్కలో బల్లెంలా గోర్ఖాలాండ్ విభజన వాదులున్నందున, విభజన కష్టం అంటే ఏమిటో తెలుసు గనుక బ్రదర్ జగన్ పై మమతానురాగాలు కురిపిస్తూ “తమ పార్టీ కూడా రాష్ట్రాల విభజనకు వ్యతిరేఖమని” ప్రకటించారు.   ఇంతవరకు షర్మిలమ్మే లోకంగా బ్రతుకుతున్న జగనన్నయకి ఇప్పుడు కొత్తగా దొరికిన మమతక్కాయ్ ఊహించని విధంగా కురిపించిన మమతానురాగాలకి పొంగిపోతూ లక్నోలో ఉన్న అఖిలేష్ యాదవన్నయ్యనో, తమ్ముడ్నో వెతుకొంటూ బయలుదేరుతున్నాడు. ఆ సోదరుడు కూడా పక్కా సమైక్యవాదే కాకుండా తనలాగే సీబీఐతో నానా బాధలు పడుతున్నాడు గనుక బహుశః ఒకరి కష్టం మరొకరు బాగానే అర్ధం చేసుకోవచ్చును.   ఆ తరువాత చెన్నై వెళ్లి జయక్కాయ్ ని, ఓడిశాలో నవీన్ అన్నయని కూడా కలవాలని ఈ అపూర్వ సోదరుడు భావిస్తున్నారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిపోయిన జగమంత కుటుంబంలో చెల్లెమ్మ ఎక్కడా కనబడకపోయినా, నదులు, రాష్ట్రాలు దాటి మరీ కొత్త సోదర సోదరీ మణులను వెతుకొంటూ బ్రదర్ జగన్ పయనమవుతున్నారు.   ఈనాటి ఈ అనుబంధాలే రానున్న ఎన్నికల తరువాత పండంటి ఉమ్మడి కుటుంబం (తర్డ్ ఫ్రంట్)గా పెరిగితే చూడాలని జగనన్న తాపత్రయం. కానీ సీబీఐ కోర్టు మాత్రం అతని బాధను అర్ధం చేసుకోలేక అడిగినప్పుడల్లా అనుమతులు మంజూరు చేయడం కుదరదంటూ ఒకటే విసిగిస్తోంది.

జగన్ కు మమత బెనర్జీ హామి

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలన్నదే తన అభిలాష అని జగన్‌తో అన్నారు. జగన్ తనకు సోదరుడు లాంటివారని మమత పేర్కొన్నారు.   రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించే దిశగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని, అందువల్ల బెయిల్ షరతులు సడలించాలని జగన్ కోర్టును కోరారు. ఆ మేరకు ముందుగా కోల్కతా, లక్నో నగరాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ముందుగా ఆయన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడ కూడా గూర్ఖాలాండ్ ఉద్యమం జోరుగా ఉండటం, విభజన యోచనను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో.. ఆంద్ర ప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా కూడా ఆమె మద్దతు పొందేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.  

టిడిపి 'ప్రజాగర్జన' వాయిదా

      ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన బహిరంగ సభలు వాయిదా వేసినట్లు ఆ పార్టీ నేత కంభంపాటి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తుపాన్ వచ్చే అవకాశం ఉన్నందున్న ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి, ఆయన అనుమతితో ఈ మేరకు ప్రకటన చేస్తున్నట్లు కంభంపాటి వ్యాఖ్యానించారు. తిరిగి ఎప్పుడు ప్రారంభించేది త్వరలో తెలియజేస్తామని ఆయన అన్నారు. కాగా 2014 ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ రేపటి నుంచి ప్రజాగర్జన సభలను నిర్వహిస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

విభజనపై చివరి దాక అదే అయోమయం

  ఈరోజు కేంద్రమంత్రుల బృందం రాష్ట్ర విభజనపై తుది నివేదిక తయారుచేసేందుకు సమావేశమయ్యింది. రేపు మళ్ళీ మరో మారు సమావేశమయిన తరువాత తమ నివేదికకు తుది మెరుగులు దిద్ది, రేపే కేంద్రమంత్రి వర్గం చేతిలో పెట్టబోతున్నామని వారిలో ఒక సభ్యుడయిన జై రామ్ రమేష్ ప్రకటించారు. అయితే, మరి కొద్ది సేపటికే హోం మంత్రి షిండే మీడియా ముందుకు వచ్చి ఇటువంటి ముఖ్యమయిన అంశంపై ఇంత హడావుడిగా నివేదిక చుట్టబెట్టేసి, మంత్రి వర్గ సమావేశంలో ప్రవేశపెట్టడం మంచిది కాదని, అందువల్ల కనీసం మరో రెండు మూడు సార్లు సమావేశమయ్యి, అన్ని అంశాలపై మరింత లోతుగా చర్చించిన తరువాతనే మంత్రి వర్గ సమావేశంలో ప్రవేశపెడతామని ప్రకటించారు. రాష్ట్ర విభజనను పర్యవేక్షిస్తున్న ఒక మంత్రి 'రేపటితో సరి!' అంటుంటే మరొకరు 'లేదు! ఇంకా చర్చించవలసింది చాలా ఉందని చెప్పడం చూస్తే వారిలోనే ఈవిషయంపై సరయిన అవగాహన, ఏకాభిప్రాయం లేదని అర్ధం అవుతోంది. ఆర్ధిక శాఖ నుండి ఇంకా పూర్తి వివరాలు రాకపోవడం వలనే హోం మంత్రి షిండే మరి కొంత సమయం కొరుతునట్లు సమాచారం.   ఆవిధంగానయితే రాష్ట్ర విభజనపై నివేదిక మంత్రి వర్గం సమావేశంలో ఆమోదం పొంది రాష్ట్రపతి ద్వారా రాష్ట్ర శాసన సభకు చేరుకోవడానికి మరి కొంత ఆలస్యమవుతుందేమో? కానీ ఈ సారి పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టాలంటే ఈ ప్రక్రియలో ఎక్కడా ఆలస్యం జరుగకూడదు.   అక్కడ డిల్లీలో ఈ అయోమయం కొనసాగుతుంటే, ఇక్కడ రాష్ట్రంలో వచ్చే నెల నుండి మొదలు కావలసిన శాసనసభ సమావేశాలను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ని కోరినట్లు అందుకు ఆయన నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. శాసనసభ సమావేశాలను వాయిదా వేసినట్లయితే, తెలంగాణా బిల్లు సకాలంలో పార్లమెంటుకి చేర కుండా అడ్డుకోవచ్చునని, తద్వారా రాష్ట్ర విభజన జరుగకుండా ఆపవచ్చని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.   అయితే రాష్ట్ర విభజనకు రాష్ట్ర శాసనసభ ఆమోదం అవసరం లేదు గనుక, ఒకవేళ శాసనసభ సమావేశాలు జరుగకుండా వాయిదా వేసినట్లయితే, ఇక రాష్ట్ర విభజనపై సభలో చర్చించకుండానే నేరుగా పార్లమెంటుకి వెళ్ళిపోతుంది. గనుక రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాలు తప్పకుండా సకాలంలోనే జరుపవచ్చును.

రాష్ట్ర విభజన: సీఎం కిరణ్ ప్రోరోగ్ అస్త్రం..!

      రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. ప్రోరోగ్ ద్వారా అసెంబ్లీ భేటీకి అడ్డుకట్ట వేయడం ద్వారా విభజనను జాప్యం చేసే యోచనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో విభజన అంశం కొత్త మలుపు తిరిగెఅవకాశం కనిపిస్తోంది.   రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం తన తుది నివేదికను ఈనెల 21న కేంద్ర మంత్రి మండలికి సమర్పించనుంది. దానిలో అవసరమయితే మార్పులు చేర్పులు చేసి, ఈనెల 28లోగా రాష్ట్రపతికి పంపనున్నారు. ఆయన దానిని పరిశీలించిన తరువాత రాష్ట్ర శాసనసభ ఆమోదానికి పంపుతారు. ఈ లెక్క ప్రకారం చూస్తే తెలంగాణా బిల్లు ఈనెలాఖరుకి లేదా వచ్చే నెల మొదటి వారంలోగానీ రాష్ట్ర శాసనసభ ముందుకు రాబోతోందని అర్ధం అవుతోంది.     వచ్చేనెల 5న మొదలయ్యే శీతాకాల పార్లమెంటు సమావేశాలు, ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున కేవలం 20వరకే జరుగుతాయి. అందువల్ల రాష్ట్ర శాసనసభ సమావేశాలు వెంటనే జరుపకుండా పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు వాయిదా వేసినట్లయితే, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకోవచ్చునని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శాసనసభను ప్రోరోగ్ చేయాలని స్పీకర్ కు లేఖ రాసినా ఆయన జాప్యం చేశారంటూ కధనాలు వచ్చిన నేపధ్యంలో నాదెండ్ల మనోహర్ గవర్నర్ కు లేఖ రాస్తున్నారని సమాచారం. దీనివల్ల శాసనసభ ప్రోరోగ్ అవుతుంది. ప్రోరోగ్ కాకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు శాసనసభను పెట్టవచ్చు.   తెలంగాణా బిల్లుకి రాష్ట్ర శాసనసభ ఆమోదం అవసరం లేకపోయినా, రాజ్యాంగ పద్దతుల ప్రకారం సభలో కనీసం దానిపై చర్చజరగాలంటే సభ నిర్వహించి తీరాలి. కానీ ముఖ్యమంత్రి అభీష్టానికి విరుద్దంగా సభ నిర్వహించడం సాధ్యం కాకపోతే, తప్పని పరిస్థితుల్లో ఆయనను తొలగించి వేరొకరిని ఆ స్థానంలో నియమించయినా సరే ఈ ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది.

టిడిపి ‘ప్రజాగర్జన’

      రాష్ట్రంలో ఏప్రిల్ లో శాసనసభతో పాటు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను, కార్యకర్తలను సన్నద్దం చేస్తున్నారు. ఇక నుంచి ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. తిరుపతి నుంచి ఈ నెల 21న ప్రారంభించన్ను సభలకు ’ప్రజాగర్జన’ అని పేరు పెట్టారు.   చంద్రబాబు నాయుడు 'ప్రజాగర్జన' పేరుతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలలో బహిరంగసభలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్, జగన్ అవినీతి, కుట్రాలపై ఈ సభలలో నిప్పులు చేరగానున్నారు.  మరోవైపు కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ రెండో రోజు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.  కుప్పంలో జగన్మోహన్‌రెడ్డిని అడుగుపెట్టకుండా చూడాలని ప్రజలను కోరారు. కేసీఆర్, జగన్మోహన్‌రెడ్డితో కాంగ్రెస్‌కలిసి రాష్ట్రాన్ని భ్రస్టుపట్టించారని ఆరోపించారు. తమ రాజకీయ లబ్ధికోసం రాష్ర్ట ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాబు ధ్వజమెత్తారు.                

భద్రాచలమా...తెలంగాణా?

      భద్రాచలం కావాలో తెలంగాణ కావాలో తెలంగాణ ప్రాంత నాయకులు స్పష్టంగా తేల్చుకోవాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వీర్రాజు అన్నారు. భద్రాచలాన్ని తెలంగాణాకు కేటాయిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ఆంధ్రులు రాజధానులను కోల్పోవడం వల్ల ప్రతిసారి నష్టపోతున్నారన్నారు. గుంటూరులో జరిగిన సీమాంధ్ర బీజేపీ నేతల సమావేశంలో 13 జిల్లాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనలో భద్రాచలం సీమాంధ్రకే చెందాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు.   ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యుడు హరిబాబు మాట్లాడుతూ భద్రాచలాన్ని తెలంగాణ ప్రాంతానికి కేటాయిస్తే రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఫలితంగా సీమాంధ్ర మొత్తం ఎడారిగా మారుతుందన్నారు. చారిత్రకంగా చూసినా 1820 నుంచి భద్రాచలం సీమాంధ్రలోనే ఉందన్నారు. అనేక రకాలుగా ఆంధ్రులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న తెలంగాణ ప్రాంత విభజన వాదులు పోలవరాన్ని అడ్డుకునే ప్రమాదం ఉందన్నారు.

శాసనసభ సమావేశాలపై రాద్ధాంతం

  రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం తన తుది నివేదికను ఈనెల 21న కేంద్ర మంత్రి మండలికి సమర్పించనుంది. దానిలో అవసరమయితే మార్పులు చేర్పులు చేసి, ఈనెల 28లోగా రాష్ట్రపతికి పంపనున్నారు. ఆయన దానిని పరిశీలించిన తరువాత రాష్ట్ర శాసనసభ ఆమోదానికి పంపుతారు. ఈ లెక్క ప్రకారం చూస్తే తెలంగాణా బిల్లు ఈనెలాఖరుకి లేదా వచ్చే నెల మొదటి వారంలోగానీ రాష్ట్ర శాసనసభ ముందుకు రాబోతోందని అర్ధం అవుతోంది.   అయితే శాసనసభ సమావేశాల తేదీలపై ముఖ్యమంత్రి, స్పీకర్ విభేదిస్తున్నట్లు అప్పుడే మీడియాలో కొన్నివార్తలు కూడా మొదలయ్యాయి. వచ్చేనెల 5న మొదలయ్యే శీతాకాల పార్లమెంటు సమావేశాలు, ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున కేవలం 20వరకే జరుగుతాయి.   అందువల్ల రాష్ట్ర శాసనసభ సమావేశాలు వెంటనే జరుపకుండా పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు వాయిదా వేసినట్లయితే, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకోవచ్చునని ముఖ్యమంత్రి భావిస్తున్నందున, శాసనసభ సభను ప్రోరోగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ వ్రాస్తే దానిపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.   అయితే ఈవిషయంలో ముఖ్యమంత్రి నిర్ణయమే అంతిమ నిర్ణయం గనుక దానిని స్పీకర్ శిరసావహించవలసి ఉంటుంది. తెలంగాణా బిల్లుకి రాష్ట్ర శాసనసభ ఆమోదం అవసరం లేకపోయినా, రాజ్యాంగ పద్దతుల ప్రకారం సభలో కనీసం దానిపై చర్చజరగాలంటే సభ నిర్వహించి తీరాలి. కానీ ముఖ్యమంత్రి అభీష్టానికి విరుద్దంగా సభ నిర్వహించడం సాధ్యం కాకపోతే, తప్పని పరిస్థితుల్లో ఆయనను తొలగించి వేరొకరిని ఆ స్థానంలో నియమించయినా సరే ఈ ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది.   కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ తుది చర్చలో తను కూడా పాల్గొన్న తరువాతనే రాజీనామా చేద్దామని భావిస్తున్నందున బహుశః ఆయన వెనక్కి తగ్గి శాసన సభ సమావేశాలకు అంగీకరించవచ్చును. లేకుంటే ఆయన ఇంతకాలంగా చేస్తున్న వాదనలకు అర్ధం ఉండదు.

బలపడుతున్న టీడీపీ, బీజేపీల స్నేహబంధం!

      రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి దుర్మార్గాలకు వ్యతిరేకంగా పుట్టి తెలుగు ప్రజలకోసం పోరాడుతున్న టిడిపి పార్టీ. నరేంద్రమోడీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభంజనం సృష్టిస్తున్న పార్టీ భారతీయ జనతాపార్టీ. ఈ పార్టీల స్నేహబంధం బలపడడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే త్వరలోనే టీడీపీ-బీజేపీ జట్టు కట్టడం ఖాయమనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పుడు నరేంద్రమోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తెరమీదకి వచ్చాక తెలంగాణ విషయంలో బీజేపీ స్వరం మెల్లమెల్లగా మారుతోంది. రాష్ట్రంలో ఇతర పార్టీలో ఇంతవరకూ అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో మొదటి అడుగే తెలుగుదేశం పార్టీతో స్నేహం పెంచుకోవడం. బీజేపీ-టీడీపీ దోస్తీని కిషన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. అయినా ఆయన మాట చెల్లకుండా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కిషన్ రెడ్డి ఎంత వ్యతిరేకించినా బీజేపీ-టీడీపి బంధాన్ని బలపరచడానికి వెంకయ్యనాయుడు కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విషయంలో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిందిగా కేంద్ర నాయకత్వం నుంచి కిషన్ రెడ్డికి ఇప్పటికే ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే త్వరలో ఈ బంధం మరింత బలపడడం ఖాయం. 

అందరి బంధువయా.. భద్రాచల రామయ్యా!

      రాముడు: లక్షణా.. లక్ష్మణుడు: ఏంటన్నయ్యా? రాముడు: గోదావరి అవతల, గోదావరి ఇవతల ఏంటి హడావిడిగా వుంది? లక్ష్మణుడు:  రెండుపక్కల నుంచీ ‘భద్రాచలం మునగాల.. భద్రాచలం మునగాల’ అనే నినాదాలు వినిపిస్తున్నాయన్నయ్యా.. రాముడు: భద్రాచలం మునగాలా? ఇదెక్కడి కోరిక లక్ష్మణా.. ఇప్పటికే ప్రతి ఏడాదీ వరదలొచ్చినప్పడు భద్రాచలం ఎలాగూ మునిగిపోతోంది కదా.. మళ్ళీ ఇప్పడు ప్రత్యేకంగా భద్రాచలం మునగాలని కోరికెవరికి పుట్టింది? లక్ష్మణుడు: భద్రాచలం మునగాల అంటే అర్థం అది కాదన్నయ్యా.. భద్రాచలం అండ్ మునగాల అన్నమాట. రాముడు: ఓహో.. మనం ఉన్న భద్రాచలం, మన పక్కనే వున్న మునగాల గురించా.. లక్ష్మణుడు: అవునన్నయ్యా.. రాముడు: ఈ రెండు ఊళ్ళ పేర్ల గురించే ఎందుకలా నినాదాలు వినిపిన్నాయి? లక్ష్మణుడు: అదే అన్నయ్యా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని ఇటలీ సోనియాగాంధీ డిసైడ్ చేసింది కదా.. భద్రాచలం, మునగాల మాదంటే మాదంటూ తెలంగాణ, సీమాంధ్ర వాళ్ళు గొడవలు పడుతున్నారన్నమాట.. రాముడు: అదేంటి లక్ష్మణా.. మనిద్దరిలా అంటే రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్ముల్లా కలసిమెలసి వుండే వీళ్ళమధ్య విభేదాలు ఎందుకొచ్చాయో... లక్ష్మణుడు: విభజనవాదులని ఉన్నార్లే అన్నయ్యా.. వాళ్ళు కట్టుకున్న పుణ్యమిది. రాముడు: భద్రాచలం మునగాల.. భద్రాచలం మునగాల అంటూ చివరికి ఇద్దరూ మునిగిపోతారేమో! లక్ష్మణుడు: బాగాచెప్పావన్నయ్యా.. రాముడు: వీళ్ళు భలేవాళ్ళు లక్ష్మణా.. మనం కావాలని ఇద్దరూ కోరుకుంటున్నారుగానీ, మనలాగా కలసిమెలసి వుండాలని మాత్రం అనుకోవడం లేదు.. లక్ష్మణుడు: అవునన్నయ్యా.. అది సరేగానీ, నువ్వు వీళ్ళిద్దరిలో ఎవరివైపు వుండాలని అనుకుంటున్నావన్నయ్యా? రాముడు: నేను భద్రాచల రాముణ్ణి.. అందరి బంధువుని!