జగన్ కు మమత బెనర్జీ హామి
posted on Nov 20, 2013 @ 5:23PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలన్నదే తన అభిలాష అని జగన్‌తో అన్నారు. జగన్ తనకు సోదరుడు లాంటివారని మమత పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించే దిశగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని, అందువల్ల బెయిల్ షరతులు సడలించాలని జగన్ కోర్టును కోరారు. ఆ మేరకు ముందుగా కోల్కతా, లక్నో నగరాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే.
దీంతో ముందుగా ఆయన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడ కూడా గూర్ఖాలాండ్ ఉద్యమం జోరుగా ఉండటం, విభజన యోచనను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో.. ఆంద్ర ప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా కూడా ఆమె మద్దతు పొందేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.