భద్రాచలమా...తెలంగాణా?
posted on Nov 20, 2013 @ 10:57AM
భద్రాచలం కావాలో తెలంగాణ కావాలో తెలంగాణ ప్రాంత నాయకులు స్పష్టంగా తేల్చుకోవాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వీర్రాజు అన్నారు. భద్రాచలాన్ని తెలంగాణాకు కేటాయిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ఆంధ్రులు రాజధానులను కోల్పోవడం వల్ల ప్రతిసారి నష్టపోతున్నారన్నారు. గుంటూరులో జరిగిన సీమాంధ్ర బీజేపీ నేతల సమావేశంలో 13 జిల్లాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనలో భద్రాచలం సీమాంధ్రకే చెందాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యుడు హరిబాబు మాట్లాడుతూ భద్రాచలాన్ని తెలంగాణ ప్రాంతానికి కేటాయిస్తే రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఫలితంగా సీమాంధ్ర మొత్తం ఎడారిగా మారుతుందన్నారు. చారిత్రకంగా చూసినా 1820 నుంచి భద్రాచలం సీమాంధ్రలోనే ఉందన్నారు. అనేక రకాలుగా ఆంధ్రులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న తెలంగాణ ప్రాంత విభజన వాదులు పోలవరాన్ని అడ్డుకునే ప్రమాదం ఉందన్నారు.