మోడీని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్..

ప్రత్యేక హోదా విషయంపై ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ అటు కాంగ్రెస్ పైనా.. కేంద్ర ప్రభుత్వంపైన బాగానే సెటైర్లు వేశారు. కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు ఏపీని ఆడుకుంటున్నాయి.. అని అన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. కాంగ్రెస్ ఎంపీలు ఏపీ ప్రత్యేక హోదాపై అప్పట్లో ప్లీజ్ మేడమ్..ప్లీజ్ మేడమ్ అనేవాళ్లు.. ఇప్పుడు మాత్రం ప్లీజ్ సార్.. ప్లీజ్ సార్ అంటున్నారు అంతే తేడా అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అంతేనా బీజేపీ ఏం తక్కువ తినలేదు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటన లేకుండా నాన్చుతున్నారు అని అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా మా హక్కు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన గో సంరక్షణ గురించి కూడా ప్రస్తావించి మోడీపై కామెంట్లు విసిరారు. గో సంరక్షణపై చూపిస్తున్న ఇంట్రస్ట్ మోడీ ప్రత్యేక హోదాపై చూపించలేకపోతున్నారు.. గో సంరక్షణపై అంత దృష్టి ఉంటే.. బీజేపీ నేతలని, కార్యకర్తలను ఒక్కో గోవును పెంచుకోమనండి అని సూచించారు. ఇంకా మోడీ గారు మీరంటే నాకు చాలా అభిమానం.. గౌరవం ఉన్నాయి.. అలాగని ఏపీని తాకట్టు పెడితే ఊరుకునేంత గౌరవం లేదు.. మీ రాజకీయ అనుభవం ముందు నేను పోరాడలేను... కానీ ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మాత్రం పోరాటం తప్పదు..అని హెచ్చరించారు. సౌత్ లో ఉన్నాం.. కింద ఉన్నాం కదా అని కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

నేను టీడీపీ తొత్తును కాదు...

నేను టీడీపీ తొత్తును కాదు, ఆరోజు టీడీపీకి భుజం కాశాను.. చేతనైనంత సాయం చేశాను.. అప్పుడు నన్నూ, నా పార్టీని, నా కార్యకర్తలను మెచ్చుకున్నారు.. ఇప్పుడు తప్పులను చూపిస్తుంటే మాత్రం విమర్శిస్తున్నారు అని తిరుపతిలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. అంతేకాదు జనసేన కాదు మోడీ భజననేన అన్నారు.. కానీ ప్రజలకు, ప్రజా సమస్యలకు ఇది భజన సేన అని వ్యాఖ్యానించారు. తిట్టినా విమర్సించినా ప్రజల కోసం పడతాను.. నేను పార్టీలకు కాదు.. ప్రజలకు పక్షపాతిని.. సర్వమతాలు, కులాలు, ప్రాంతాలు నాకు ఒక్కటే.. అని అన్నారు. ఏదైనా అంటే పడతాను కాని.. నాకు కులం మాత్రం అంటించకండి.. ఒకవేళ నేను ఏం చేయలేని పరిస్థితి వస్తే క్షమాపణలు చెప్పుకుంటా.. దండం పెట్టి వదిలేస్తా అంతేకానీ... ప్రజల్ని మాత్రం మభ్యపెట్టను.. అబద్దాలు చెప్పను అని వెల్లడించారు.

నేను మాట్లాడే మూడు విషయాలు అవే..

  తిరుపతిలోని ఇందిరా మైదానంలో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం మొదలైంది. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఏం మాట్లాడినా ఆలోచించే మాట్లాడుతా..నాకు సినిమాలపై వ్యామోహం లేదు.. కానీ దేశం, సమాజంపై వ్యధ నాకు ఉంది అని అన్నారు. అంతేకాదు తాను ముఖ్యంగా మూడు విషయాల గురించి మాట్లాడటానికి వచ్చానని చెప్పారు. అవి   * జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఎదుర్కొన్న పరిస్థితుల గురించి * టీడీపీ పనితీరు గురించి.. టీడీపీ చేసిన పనుల గురించి * రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి ప్రత్యేక హోదా గురించి నాన్చుతూ తాత్సర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరు గురించి..

ఆ ఫోటో చూసి మంత్రిగారు ఎందుకు షాకయ్యారు?

ఒక్కోసారి వంద మాటలు చెప్పలేని విషయం ఓ ఫోటో చెబుతుంది. అందుకే, కెమెరా కనుగొన్న కొత్తలోంచీ ఇప్పటి సెల్ఫీల కాలం వరకూ ఫోటోకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా రోజు రోజుకి పెరుగుతోంది! ఏదో సరదాగా ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవటమే కాదు సీరియస్ గా ఫోటో జర్నలిజమ్ చేసేవారు కూడా వుంటారు. ఎందరో ప్రతిభావంతులైన ఫోటో జర్నలిస్టులు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సార్లు తమ ఫోటోలతో సంచలనాలు సృష్టించారు కూడా! ఈ మద్య అలాగే ఓ సంఘటన జరగింది మంత్రి కేటీఆర్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో... కేటీఆర్, ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ వాళ్లు ఏర్పాటు చేసిన అధికారిక ప్రొగ్రామ్ కి అటెండ్ అయ్యారు. అయితే, ఆయన అసోసియేషన్ వాళ్లు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా తిలకించారు. కాని, ఒక్క ఫోటో వద్ద మాత్రం కేటీఆర్ షాకైపోయి నిలబడిపోయారు. ఆ ఫోటోలో రంగరెడ్డి జిల్లా మన్సురాబాద్ లోని ఒక పాఠశాలలో వంద మంది అమ్మాయిలు టాయిలెట్ వద్ద క్యూ కట్టిన పరిస్థితి దర్శనమిచ్చింది! ఇంకా ఇలాంటి పరిస్థితులు వున్నాయా అంటూ నిర్ఘాంత పోయిన మంత్రి వెంటనే ఆ జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు!  గవర్నమెంట్ పాఠశాలల్లో టాయిలెట్ల లేమీ అంటూ మనం ఎన్నో సార్లు న్యూస్ పేపర్ రిపోర్ట్ లు చూస్తుంటాం. కాని, అలాంటి వంద రిపోర్టులు కూడా చేయలేని ఈ ఒక్క ఫోటో చేసింది!

మరికాసేపట్లో ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ సభ...

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో నిర్వహించనున్న బహిరంగ సభ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. తిరుమల నుండి పవన్ కళ్యాణ్ తిరుపతికి బయలుదేరారు. తిరుపతిలోని ఇందిరామైదానంలో సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. సభ ఇంకా ప్రారంభం కాకముందే అప్పుడే పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. దాదాపు ఐదువేల మంది నుండి పదివేల వరకూ అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు. మరోవైపు సభా ప్రాంగణంలో ఎనిమిది వేల మందిక‌న్నా ఎక్కువ ప‌ట్టే అవకాశం లేకపోవడంతో.. జనసేన కార్యకర్తలు కొంద‌రు అభిమానులను తిరిగి వెళ్లిపోవాల‌ని సూచిస్తున్నారు.   మరోవైపు ఈ సభలో పవన్ ఏ అంశాలపై మాట్లాడతారో అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు 45 నిమిషాల నుండి గంటసేపు సాగే ప్రసంగంలో ఆయన ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడతారని అంటున్నారు. మరి చూద్దాం పవన్ ఏ విషయాలపై మాట్లాడుతారో..

సచిన్ నాకు రెడ్ కలర్ కారు సెలక్ట్ చేశారు.. సింధూ

రియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన పి.వి సింధూకు తెలంగాణ బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ చీఫ్‌ చాముండేశ్వరినాథ్ కారును స్పాన్సర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కారును క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ స్వయంగా తన చేతుల మీదగా సింధూకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా సింధూ మాట్లాడుతూ.. టెండూల్కర్ తన కోసం రెడ్ కలర్ కారు సెలెక్ట్ చేశారని త‌న‌కు తెలిసిందని చెప్పింది. స‌చిన్ చేతుల మీదుగా తాను బ‌హుమ‌తినందుకోనుండ‌డం తనకు ఎంతో ఆనందం క‌లిగించే అంశమ‌ని.. అకాడమీలో బ్యాడ్మింట‌న్ సాధ‌న‌ చేయ‌డానికి ఇక‌పై తాను ఆ కారులోనే వెళ‌తాన‌ని ఆమె చెప్పింది. ప్రస్తుతం తాను బిర్యానీ, ఐస్‌క్రీంలు తింటూ హ్యాపీగా గ‌డుపుతున్నట్లు పేర్కొంది. త‌న‌ బ్రాండ్ విలువ అంశంపై తాను పట్టించుకోనని చెప్పింది. తన దృష్టంతా ఆటపైనే పెట్ట‌నున్న‌ట్లు తెలిపింది. రానున్న సిరీస్‌ల కోసం త్వ‌ర‌లోనే సాధ‌న మొదలుపెట్ట‌నున్న‌ట్లు చెప్పింది.

స్వామి గారి కొత్త అంశం.. ఈ యాంగిల్ కూడా ఉందా..!

  ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, లేకపోతే ఎవరో ఒకరి మీద కామెంట్లు చేసే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తాజాగా మరో విషయంపై స్పందించారు. అయితే అది నెగిటివ్ గా కాదులెండి పాజిటివ్ గానే.. అబ్బో స్వామి గారిలో ఈ యాంగిల్ కూడా ఉందనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. ఈమధ్య కార్పొరేట్ సంస్థలు కూడా జీతభత్యాలు ఇవ్వలేక వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో  'ఆస్క్ మీ' కూడా చేరిపోయింది. అస్క్ మీ లో మేజర్  వాటాను కలిగిన మలేషియా సంస్థ  చేతులెత్తేయడంతో ఉద్యోగులకు గత రెండు నెలలుగా జీతాలు అందని పరిస్థితి. దీంతో ఉద్యోగులను తొలగించేందుకు చూస్తున్నారు.   ఇక దీనిపై స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి.. ఈ విషయంపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి తపన్ కు లేఖ రాశారు. ఉద్యోగుల వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు. ఇది భవిష్యత్తులో కోర్టు విచారణకు రానున్నందున ఈ విషయంలో  అత్యవసర జోక్యం అవసరమని ఈ వ్యవహారాన్ని అత్యవసర కేసుగా పరిగణించాల్సిన అవసరముందని ఆయన హెచ్చరించారు. అంతేకాదు.. సంస్థ ను మూసివేయవద్దని కంపెనీ  డైరెక్టర్లను  కోరాలన్నారు. వేలమంది ఉద్యోగులను వదిలేయడం కాకుండా  ప్రభుత్వం  సహాయం చేయాలని కోరారు. మలేషియా  విదేశీ సంస్థ ఆస్ట్రో లిమిటెడ్ కు చెందిన  95శాతం వాటా కొనుగోలుకు సాయం  చేయాలని రాశారు.

ఆమెను అరెస్ట్ చేసి.. బాధ్య‌త‌ల నుంచి తొలగిస్తారు.. మోడీపై కేజ్రీవాల్

ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ స్వాతి మలివాల్‌ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. ఏసీబీ అధికారులు ఇటీవలే స్వాతి మలివాల్ ఆఫీస్ పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేజ్రీవాల్.. త‌మ ప్ర‌భుత్వ విష‌యాల్లో కేంద్రం ప‌దేప‌దే జోక్యం చేసుకుంటోంద‌ని అన్నారు. అంతేకాదు.. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేసి.. ఆమె నిర్వ‌ర్తిస్తోన్న బాధ్య‌త‌ల నుంచి తొలగిస్తారని కేజ్రీవాల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ ఇద్దరూ... స్వాతి మలివాల్‌ను తొలగించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నట్లు తెలుస్తోందని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

కలెక్టర్ కు గన్ గురిపెట్టిన మంత్రి..

  ఈమధ్య రాజకీయ నేతలు ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి. అధికారం ఉంది కదా అని తాము ఏం చేసినా సరిపోతుందిలే అని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మంత్రిగారు బుక్కయ్యారు. తమిళనాడు మాజీ మంత్రి ముల్లెవేందన్ తన పని చేయకపోవజంతో ఏకంగా తుపాకీని కలెక్టర్ కు గురిపెట్టాడు. వివరాల ప్రకారం.. ముల్లెవేందన్ తన తుపాకి అనుమతులను పొడిగించాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తన ధరఖాస్తును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తూ హఠాత్తుగా  సంచిలోంచి తుపాకిని తీసి కలెక్టర్ వివేకానందకు గురిపెట్టారు. దీంతో అక్కడ ఉన్నవారందరూ షాకయ్యారు. దీంతో వెంటనే తేరుకున్న కలెక్టర్ వెంటనే దాన్ని లోపల పెట్టాలని ఆదేశించడంతో ఆయన తుపాకిని లోపల పెట్టారు. కాగా ముల్లైవేందన్ ఇటీవలే డీఎంకే నుంచి తొలగించబడి డీఎండీకేలో కొనసాగుతున్నారు.

ఢాకా కేఫ్ సూత్రదారి హతం..

గత నెల 2న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలీ అర్టిసన్ రెస్టారెంట్‌పై దాడికి తెగబడి 22 మంది ప్రాణాలను బలిగొన్న ఘటనలో సూత్రధారి తమీమ్ అహ్మద్ చౌధురి హతమయ్యాడు. ఇవాళ ఉదయం ఢాకా శివార్లలోని నారాయణ్ గంజ్ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో తమీమ్ మరణించినట్టుగా భావిస్తున్నారు. నారాయణ్ గంజ్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్నన సమాచారంతో సైన్యం, భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో వారిపై భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా వారిలో తమీమ్ ఉన్నాడని సమాచారం. 

అనంతలో బాంబు పేలుడు..

ఫ్యాక్షన్‌కు, వర్గపోరుకు కేరాఫ్ అడ్రస్ అనంతపురం జిల్లా. అయితే ఇదంతా గతం. ఇప్పుడు చాలా వరకు అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇవాళ అనంతపురంలో బాంబు పేలుడు కలకలం రేపింది. నగరంలోని తపోవనంలో కమలమ్మ అనే మహిళ చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇవాళ ఉదయం 9గంటల ప్రాంతంలో చెత్తకుప్పలో ప్లాస్టిక్ డబ్బా ఏరుకుని అందులో మట్టి తీసేందుకు డబ్బాను రాతిబండపై కొట్టింది. అది ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రగాయాలతో ఉన్న కమలమ్మను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రేపు ఒలింపిక్ స్టార్స్‌కు సచిన్ సన్మానం

ఇండియన్ క్రికెట్ దేవుడు, భారతరత్న సచిన్ టెండూల్కర్ రేపు భాగ్యనగరానికి రానున్నారు. రియో ఒలింపిక్స్‌లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన పీవీ సింధు, దీపా కర్మాకర్, సాక్షిమాలిక్, కోచ్‌ గోపిచంద్‌లను ఆయన సన్మానించనున్నారు. తెలంగాణ బ్మాడ్మింటన్ అసోసియేషన్, పలువురు వ్యాపారవేత్తలు ఒలింపిక్స్ స్టార్లకు ప్రకటించిన బీఎండబ్ల్యూ కార్లను సచిన్ అందజేయనున్నారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపిచంద్ బ్మాడ్మింటన్ అకాడమీలో జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలంగాణ బ్మాడ్మింటన్ అసోసియేషన్ తెలిపింది.

షీనా కేసు:రాహుల్ తో పీటర్ ఫోన్ సంభాషణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. షీనా కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ మరిన్ని వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. షీనా హత్య గురించి ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాకు ముందే తెలుసనని, షీనాను ప్రేమించిన పీటర్ కుమారుడు రాహుల్‌తో పీటర్ జరిపిన 20 ఫోన్ సంభాషణలను సీబీఐ సంపాదించింది. వీటిలో ఏడింటిని సీబీఐ మీడియాకు వివరించింది. షీనా హత్యకు గురైన తర్వాత, తనను వదిలి వెళ్లిందని రాహుల్ భావించాడు, పీటర్ అతను ఎలా సముదాయించాలని ప్రయత్నించాడో ఈ సంభాషణల్లో తేట తెల్లమైంది. అందులో ఒక కాల్‌లో ఆమె కనిపించకపోతే ఏమవుతుంది..? ఎందుకీ సోది అని పీటర్ అన్నట్లుగా ఉంది. మరో కాల్‌లో ఇక ఆమె గురించి పూర్తిగా వదిలెయ్ అని పీటర్ అన్నట్టు తెలుస్తోంది. ఇపుడు ఈ వ్యాఖ్యలు పెను సంచలనం కలిగిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అంశాలు ఇవేనా..!

  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు తిరుపతిలో బహిరంగ నిర్విహిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతిలో ఇందిరామైదానంలో జరగనున్న ఈ సభకు ఇప్పటి నుండే ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు సభలో పవన్ కళ్యాణ్ ఏ అంశాల గురించి మాట్లాడతారబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల నేపథ్యంలో మాత్రమే పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆ తరువాత ఇప్పటివరకూ ఏదో ఒకటి రెండు సమావేశాల్లో పాల్గొనిఉంటారు. అయితే ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణే సభలో ముఖ్యపాత్ర వహిస్తున్నారు కాబట్టి అటు అభిమానులే కాదు.. రాజకీయనాయకులు కూడా అంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై మాట్లాడుతారో అని కొంతమంది కొన్ని అంశాలు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. మరి అంశాలంటో చుద్దాం..   ఏపీకి ప్రత్యేక హోదాపై , బీజేపీ-టీడీపీల తీరుపై, కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వానికి సూచన, పవన్ యాంటీ-ఫ్యాన్స్ కు హితబోధ, ఏపీ, తెలంగాణలోని ప్రతిపక్షాలు పవన్ పై చేస్తున్న విమర్శలు మొదలైన అంశాలను పవన్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. మరి వీటిలో పవన్ ఏ అంశాలు ప్రస్తావిస్తారో చూద్దాం.