మోడీని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్..
posted on Aug 27, 2016 @ 5:22PM
ప్రత్యేక హోదా విషయంపై ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ అటు కాంగ్రెస్ పైనా.. కేంద్ర ప్రభుత్వంపైన బాగానే సెటైర్లు వేశారు. కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు ఏపీని ఆడుకుంటున్నాయి.. అని అన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. కాంగ్రెస్ ఎంపీలు ఏపీ ప్రత్యేక హోదాపై అప్పట్లో ప్లీజ్ మేడమ్..ప్లీజ్ మేడమ్ అనేవాళ్లు.. ఇప్పుడు మాత్రం ప్లీజ్ సార్.. ప్లీజ్ సార్ అంటున్నారు అంతే తేడా అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అంతేనా బీజేపీ ఏం తక్కువ తినలేదు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటన లేకుండా నాన్చుతున్నారు అని అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా మా హక్కు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన గో సంరక్షణ గురించి కూడా ప్రస్తావించి మోడీపై కామెంట్లు విసిరారు. గో సంరక్షణపై చూపిస్తున్న ఇంట్రస్ట్ మోడీ ప్రత్యేక హోదాపై చూపించలేకపోతున్నారు.. గో సంరక్షణపై అంత దృష్టి ఉంటే.. బీజేపీ నేతలని, కార్యకర్తలను ఒక్కో గోవును పెంచుకోమనండి అని సూచించారు. ఇంకా మోడీ గారు మీరంటే నాకు చాలా అభిమానం.. గౌరవం ఉన్నాయి.. అలాగని ఏపీని తాకట్టు పెడితే ఊరుకునేంత గౌరవం లేదు.. మీ రాజకీయ అనుభవం ముందు నేను పోరాడలేను... కానీ ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మాత్రం పోరాటం తప్పదు..అని హెచ్చరించారు. సౌత్ లో ఉన్నాం.. కింద ఉన్నాం కదా అని కనిపించడం లేదా అని ప్రశ్నించారు.