సచిన్ నాకు రెడ్ కలర్ కారు సెలక్ట్ చేశారు.. సింధూ
posted on Aug 27, 2016 @ 3:32PM
రియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన పి.వి సింధూకు తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చీఫ్ చాముండేశ్వరినాథ్ కారును స్పాన్సర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కారును క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ స్వయంగా తన చేతుల మీదగా సింధూకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా సింధూ మాట్లాడుతూ.. టెండూల్కర్ తన కోసం రెడ్ కలర్ కారు సెలెక్ట్ చేశారని తనకు తెలిసిందని చెప్పింది. సచిన్ చేతుల మీదుగా తాను బహుమతినందుకోనుండడం తనకు ఎంతో ఆనందం కలిగించే అంశమని.. అకాడమీలో బ్యాడ్మింటన్ సాధన చేయడానికి ఇకపై తాను ఆ కారులోనే వెళతానని ఆమె చెప్పింది. ప్రస్తుతం తాను బిర్యానీ, ఐస్‌క్రీంలు తింటూ హ్యాపీగా గడుపుతున్నట్లు పేర్కొంది. తన బ్రాండ్ విలువ అంశంపై తాను పట్టించుకోనని చెప్పింది. తన దృష్టంతా ఆటపైనే పెట్టనున్నట్లు తెలిపింది. రానున్న సిరీస్‌ల కోసం త్వరలోనే సాధన మొదలుపెట్టనున్నట్లు చెప్పింది.