తెలుగు సినిమాలో తొలి ఘట్టాలు!
తెలుగు సినిమా 1931లో పౌరాణిక గాథతో హెచ్.ఎం. రెడ్డి రూపొందించిన 'భక్త ప్రహ్లాద' చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత 1950-60 కాలంలో స్వర్ణయుగాన్ని చవిచూసింది. టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతూ, కథల విషయంలో కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రయాణిస్తూ వచ్చింది తెలుగు సినిమా. ఎందరో మహానటుల్నీ, దర్శకుల్నీ, నిర్మాతల్నీ, సంగీత దర్శకుల్నీ, గాయకుల్నీ, గొప్పగొప్ప ఇతర టెక్నీషియన్లనీ అందించింది.