English | Telugu
బాలయ్యతో నయన్, రకుల్!?
Updated : Jul 7, 2023
ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ.. 'భగవంత్ కేసరి'లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. విజయదశమి కానుకగా అక్టోబర్ ద్వితీయార్ధంలో థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇందులో బాలయ్య జంటగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కాగా, 'భగవంత్ కేసరి' విడుదలయ్యేలోపే.. బాలకృష్ణ మరో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నారు.
2023 సంక్రాంతి సెన్సేషన్ 'వాల్తేరు వీరయ్య'తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు బాబీ.. ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార, గ్లామర్ క్వీన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎంటర్టైన్ చేయనున్నారని టాక్. అదే గనుక నిజమైతే.. 'సింహా', 'శ్రీరామరాజ్యం', 'జైసింహా' తరువాత బాలయ్యకి జోడీగా నయన్ నటించే చిత్రమిదే అవుతుంది. అలాగే, 'ఎన్టీఆర్ కథానాయకుడు'లో అతిథిగా మెరిసిన రకుల్ కి బాలకృష్ణకి జంటగా కనిపించే ఫస్ట్ ఫిల్మ్ ఇదే అవుతుంది. త్వరలోనే బాలయ్య - బాబీ కాంబో మూవీలో నయన్, రకుల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.